
రంపచోడవరం అడవుల్లో వన్యప్రాణుల రక్షణ కోసం ప్రాణాల్ని పణంగా పెట్టి పనిచేసిన అటవీ సిబ్బందికి అభినందనలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి @PawanKalyan గారు. మూడు రోజుల పాటు కఠిన పరిస్థితుల్లో శ్రమించి 242 ఉచ్చులు, 10 ఫుట్ ట్రాప్‌లు, 10 కిలోమీటర్ల అక్రమ కరెంటు తీగలను తొలగించడం వారి అంకితభావానికి నిదర్శనం. “వేటగాళ్ల నుంచి వన్యప్రాణులను రక్షించడం కూడా ఒక రెస్క్యూ ఆపరేషన్‌తో సమానం” అని పేర్కొంటూ అడవులు, జీవ వైవిధ్యం, వన్యప్రాణుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు. @HANUMAN_APGOV !! @APDeputyCMO





























