FactCheck.AP.Gov.in

1.3K posts

FactCheck.AP.Gov.in banner
FactCheck.AP.Gov.in

FactCheck.AP.Gov.in

@FactCheckAPGov

Official Account of Fact Check Wing of Government of Andhra Pradesh. Report any misleading post/tweet at [email protected]

शामिल हुए Aralık 2020
36 फ़ॉलोइंग29.9K फ़ॉलोवर्स
FactCheck.AP.Gov.in
FactCheck.AP.Gov.in@FactCheckAPGov·
నూతన రహదారుల నాణ్యతకు సంబంధించి ప్రజల్లో అపోహ కలిగే విధంగా కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ప్రాంతంలో ఇటీవల వేసిన తారు రోడ్డు నాణ్యతపై ఉద్దేశపూర్వకంగా ఒక వీడియో తీసి సామాజిక మాధ్యమాలలో కొందరు సర్క్యులేట్ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వాస్తవ విషయం ఏమిటంటే నూతనంగా నిర్మించిన ఆ రోడ్డుకు సంబంధించిన బిల్లులను కాంట్రాక్టర్ కు చెల్లించే ముందు నాణ్యతా పరీక్షలు నిర్వహించడం జరిగింది. నాణ్యతా పరీక్షలు నిర్వహించేందుకు రోడ్డు మధ్యలో గుంత తీస్తారు. నాణ్యతా పరీక్షలు పూర్తి అయిన తర్వాత ఆ గుంతలను తాత్కాలికంగా పూడుస్తారు. ఇదే అదనుగా భావించిన కొందరు తాత్కాలికంగా పూడ్చిన ఆ గుంతను, అందులోని మెటీరియల్ ను చూపించి నాణ్యతపై అపోహలు కలిగే విధంగా వీడియో చిత్రీకరించారు. రహదారులు మాత్రమే కాకుండా ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో పారదర్శకత, ఉన్నత ప్రమాణాల పట్ల నిబద్ధతతో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. రాష్ట్రంలోని సామాజిక తనిఖీ వ్యవస్థ వరుసగా రెండో సంవత్సరం కూడా దేశంలోనే మొదటి స్థానంలో నిలిచి, శాతం వంద తనిఖీలు, పర్యవేక్షణ సాగిస్తున్నదని స్పష్టం చేస్తున్నాం. అపోహలు సృష్టించే విధంగా తప్పుడు ప్రచారం చేసేవారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించడమైనది. #FactCheck #AndhraPradesh
తెలుగు
7
448
926
17.8K
FactCheck.AP.Gov.in
FactCheck.AP.Gov.in@FactCheckAPGov·
తిరుపతి జిల్లా, సూళ్లూరుపేట నియోజకవర్గం, నాయుడుపేటలో టిడ్కో ఇళ్ల గృహ ప్రవేశాల కార్యక్రమం సందర్భంగా ముక్కర అంబిక అనే లబ్దిదారు ఇంటికి వెళ్లి అక్కడ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన అనంతరం వారి కష్ట సుఖాలు అడిగి తెలుసుకునే క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు వారికి కొన్ని హామీలు ఇచ్చారు. అంబిక భర్త ఆటో డ్రైవర్ కావడంతో ఆయనకు బ్యాటరీ ఆటో కొనిపెట్టాల్సిందిగా జిల్లా కలెక్టర్ కు ఆదేశాలిచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి ఆ ఇంటి నుంచి బయటకు వచ్చిన వెంటనే ఎదురుగా ఉన్న ఇంటి గడప వద్ద ఉన్న మరొక మహిళ తన కుమారుడి ఉద్యోగం విషయం ప్రస్తావించారు. గౌరవ ముఖ్యమంత్రి అంబిక భర్త కు బ్యాటరీ ఆటో కొనిపెట్టాలి అని ఇచ్చిన ఆదేశాలను ఆ మహిళ అడిగిన విషయానికి జత చేసి ‘‘చదువుకున్న వ్యక్తికి ఆటో కొనిపెడతారట’’ అంటూ సోషల్ మీడియాలో అపహాస్యం చేసే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వీడియోలను తప్పుడు అర్ధం వచ్చేలా ఎడిట్ చేసి ప్రచారం చేయడం చట్టరీత్యా నేరం. ఇలాంటి ప్రయత్నాలు చేసేవారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. #FactCheck #AndhraPradesh
తెలుగు
2
58
148
4.6K
FactCheck.AP.Gov.in
FactCheck.AP.Gov.in@FactCheckAPGov·
పేదల సేవలో కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు చేసిన ప్రసంగాన్ని కట్ చేసి, తప్పుగా ఎడిట్ చేసి కొన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ లలో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి ఫేక్ వీడియోలు ప్రచారం చేయడం చట్టరీత్యా నేరం. సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడమైనది. ప్రజలు ఎవరూ ఈ తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దు. #FactCheck #AndhraPradesh
తెలుగు
4
29
77
2K
FactCheck.AP.Gov.in
FactCheck.AP.Gov.in@FactCheckAPGov·
🚨Fake News Alert🚨 ప్రభుత్వ కార్యాలయాల్లో ఈనాడు పత్రిక మాత్రమే ఉండాలి అంటూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇచ్చినట్లు కొందరు తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి అలాంటి ఉత్తర్వులు ఎవరు ఇవ్వలేదు, ఇలాంటి అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాము. #FactCheck #AndhraPradesh
FactCheck.AP.Gov.in tweet media
తెలుగు
7
48
99
3K
FactCheck.AP.Gov.in
FactCheck.AP.Gov.in@FactCheckAPGov·
మార్కాపురం జిల్లా, రాయవరం సమీపంలో దురదృష్టవశాత్తూ జరిగిన రోడ్డు ప్రమాద స్థలానికి అంబులెన్సులు సకాలంలో రాలేదని కొందరు చేస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు. ఆప్తులైన వారిని కోల్పోయి ఎంతో ఆవేదన చెందుతున్న వారి మాటలను దురుద్దేశంతో కొందరు ప్రచారం చేస్తున్నారు. వాస్తవం ఏమిటంటే 26.03.2026న తెల్లవారుజామున 5.59 నిమిషాలకు ఈ ప్రమాదం గురించిన తొలి ఫోన్ కాల్ నెంబర్ 8688XXXXXX నుంచి వచ్చింది. ఆ తర్వాత 6.01కి 9848XXXXXX నెంబర్ నుంచి, 6.06 కి నెంబర్ 6281XXXXXX నుంచి అదే ప్రమాదంపై ఫోన్ కాల్ వచ్చింది. నెంబర్ 6281XXXXXX నుంచి మరో కాల్ కూడా వచ్చింది. తొలి కాల్ వచ్చిన 16 నిమిషాలలో మొదటి అంబులెన్సు ప్రమాద స్థలానికి చేరుకున్నది. 24వ నిమిషానికి రెండో అంబులెన్సు, 29వ నిమిషానికి మూడో అంబులెన్సు ప్రమాద స్థలానికి చేరుకున్నాయి. తొలి అంబులెన్సులో 10 మందిని, రెండో అంబులెన్సులో 6 గురిని, మూడో అంబులెన్సులో 8 మందిని మొత్తం 24 మంది క్షతగాత్రులకు ప్రాధమిక వైద్యం అందించి వారి ఆరోగ్యాన్ని స్ధిరపరచి మార్కాపూర్ జిల్లా జనరల్ ఆసుపత్రికి చేర్చడం జరిగింది. అత్యంత సమర్ధంగా పని చేస్తున్న అంబులెన్సు వ్యవస్థ పై అపోహలు తలెత్తే విధంగా తప్పుడు ప్రచారాలు చేయడం వాంఛనీయం కాదు. #FactCheck #AndhraPradesh
తెలుగు
39
215
547
25.6K
FactCheck.AP.Gov.in
FactCheck.AP.Gov.in@FactCheckAPGov·
మార్కాపురం జిల్లా, రాయవరం సమీపంలో దురదృష్టవశాత్తూ జరిగిన రోడ్డు ప్రమాద స్థలానికి అంబులెన్సులు సకాలంలో రాలేదని కొందరు చేస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు. ఆప్తులైన వారిని కోల్పోయి ఎంతో ఆవేదన చెందుతున్న వారి మాటలను దురుద్దేశంతో కొందరు ప్రచారం చేస్తున్నారు. వాస్తవం ఏమిటంటే 26.03.2026న తెల్లవారుజామున 5.59 నిమిషాలకు ఈ ప్రమాదం గురించిన తొలి ఫోన్ కాల్ నెంబర్ 8688XXXXXX నుంచి వచ్చింది. ఆ తర్వాత 6.01కి 9848XXXXXX నెంబర్ నుంచి, 6.06 కి నెంబర్ 6281XXXXXX నుంచి అదే ప్రమాదంపై ఫోన్ కాల్ వచ్చింది. నెంబర్ 6281XXXXXX నుంచి మరో కాల్ కూడా వచ్చింది. తొలి కాల్ వచ్చిన 16 నిమిషాలలో మొదటి అంబులెన్సు ప్రమాద స్థలానికి చేరుకున్నది. 24వ నిమిషానికి రెండో అంబులెన్సు, 29వ నిమిషానికి మూడో అంబులెన్సు ప్రమాద స్థలానికి చేరుకున్నాయి. తొలి అంబులెన్సులో 10 మందిని, రెండో అంబులెన్సులో 6 గురిని, మూడో అంబులెన్సులో 8 మందిని మొత్తం 24 మంది క్షతగాత్రులకు ప్రాధమిక వైద్యం అందించి వారి ఆరోగ్యాన్ని స్ధిరపరచి మార్కాపూర్ జిల్లా జనరల్ ఆసుపత్రికి చేర్చడం జరిగింది. అత్యంత సమర్ధంగా పని చేస్తున్న అంబులెన్సు వ్యవస్థ పై అపోహలు తలెత్తే విధంగా తప్పుడు ప్రచారాలు చేయడం వాంఛనీయం కాదు. #FactCheck #AndhraPradesh
తెలుగు
27
136
320
34.4K
FactCheck.AP.Gov.in
FactCheck.AP.Gov.in@FactCheckAPGov·
🚨Fake News Alert🚨 విశాఖపట్నంలో 950 బినామీ కంపెనీలకు 99 పైసలకే ప్రభుత్వ భూములు కేటాయించారని కొందరు చేస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు. అభూతకల్పనలతో ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయడానికి చేస్తున్న విఫలయత్నం ఇది. వాస్తవానికి ప్రభుత్వం 99 పైసలకు లేదా ఒక్క రూపాయికి భూములు కేటాయించింది ప్రతిష్టాత్మకమైన 6 కంపెనీలకు మాత్రమే. వివరాలు ఇవి: S.No: 1 జీవో నెం: MS-7 తేదీ 21/04/2025 కంపెనీ పేరు: Tata Consultancy Services Limited పెట్టుబడి: రూ. 1,370.00 కోట్లు ఉద్యోగ కల్పన: 12,000 కేటాయించిన భూ విస్తీర్ణం: 21.16 ఎకరాలు భూమి ధర: 0.99 S.No: 2 జీవో నెం : MS-21 తేదీ 01/07/2025 కంపెనీ పేరు : Cognizant Technology Solutions India Pvt Ltd పెట్టుబడి: రూ. 1,582.98 కోట్లు ఉద్యోగ కల్పన: 8,000 కేటాయించిన భూ విస్తీర్ణం : 22.19 ఎకరాలు భూమి ధర: 0.99 S.No: 3 జీవో నెం: MS-26 తేదీ 01/08/2025 కంపెనీ పేరు : ANSR Global Corporation Private Limited పెట్టుబడి: రూ. 1,000.00 కోట్ల ఉద్యోగ కల్పన: 10,000 కేటాయించిన భూ విస్తీర్ణం : 10.29 ఎకరాలు భూమి ధర: 0.99 S.No: 4 జీవో నెం: MS-56 తేదీ 12/11/2025 కంపెనీ పేరు : K Raheja Corp Real Estate Private Limited పెట్టుబడి: రూ. 2,172.00 కోట్లు ఉద్యోగ కల్పన: 9,681 కేటాయించిన భూ విస్తీర్ణం : 27.10 ఎకరాలు భూమి ధర: 0.99 S.No: 5 జీవో నెం: MS-61 తేదీ 12/11/2025 కంపెనీ పేరు : Motherson Group పెట్టుబడి: రూ. 109.73 కోట్లు ఉద్యోగ కల్పన: 700 కేటాయించిన భూ విస్తీర్ణం : 3.55 ఎకరాలు భూమి ధర : 0.99 S.No: 6 జీవో నెం: MS-5 తేదీ 27/02/2026 కంపెనీ పేరు : Advanced System In Package Technologies Private Limited పెట్టుబడి: రూ. 2,387.81 కోట్లు ఉద్యోగ కల్పన: 1,000 కేటాయించిన భూ విస్తీర్ణం : 30.00 ఎకరాలు భూమి ధర: రూ.1 ఎకరాకు (సెమీకండక్టర్ పరిశ్రమను ప్రోత్సహించడానికి కేంద్ర మంత్రి వర్గం ఆమోదించింది. దానికి సహకారంగా రాష్ట్రప్రభుత్వం భూకేటాయింపు జరిపింది) పైన పేర్కొన్న కంపెనీలకు మాత్రమే 99 పైసలకు లేదా ఒక్క రూపాయికి భూములు కేటాయించడం జరిగింది. టీసీఎస్, కాగ్నిజెంట్, ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్, రహేజా, మదర్సన్ గ్రూప్ ప్రఖ్యాత సంస్థలు. ఇవి ఏర్పాటు కావడం ద్వారా ఉద్యోగ కల్పన వివరాలు కూడా ఇక్కడ పొందు పరచడం జరిగింది. ఇదే అంశంపై కొందరు వ్యక్తులు గౌరవ హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం వేసినప్పుడు న్యాయస్థానం ప్రభుత్వ కేటాయింపులను తప్పు పట్టలేదు. పైగా సమర్థించింది. న్యాయస్థానాలలో కేసు వీగిపోయిన తర్వాత పబ్లిక్ ప్లాట్ ఫారం లో ఈ విధంగా అవాస్తవాలు ప్రచారం చేయడం వాంఛనీయం కాదు. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని కోరడమైనది. #FactCheck #AndhraPradesh
FactCheck.AP.Gov.in tweet media
తెలుగు
5
32
64
2.8K
FactCheck.AP.Gov.in
FactCheck.AP.Gov.in@FactCheckAPGov·
రాష్ట్రంలోని హార్బర్లను ప్రభుత్వం ప్రయివేటు పరం చేస్తున్నదని కొందరు చేస్తున్న ప్రచారం లో ఎలాంటి వాస్తవం లేదు. ముఖ్యంగా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌పై జరుగుతున్న ఈ అసత్య ప్రచారాన్ని మంత్రి వర్గ సమావేశం అనంతరం మంత్రులు శ్రీ బీసీ జనార్ధన్ రెడ్డి, శ్రీ కొల్లు రవీంద్ర తీవ్రంగా ఖండించారు. జువ్వలదిన్నెలో మత్స్యకారులకు ఫిషింగ్ హార్బర్ అలాగే ఉంటుందని మంత్రులు స్పష్టంగా చెప్పారు. ప్రస్తుతం మత్స్యకారుల బోట్లు యథాతథంగా తిరుగుతున్నాయి. సాగర్ డిఫెన్స్ ప్రాజెక్టు వల్ల మత్య్యకారులకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. సాగర్ డిఫెన్స్ ప్రాజెక్టుకు అనుసంధానిస్తూ మరిన్ని పరిశ్రమలు వస్తాయి. కొందరు కావాలని చేస్తున్న ఈ దుష్ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దు. #FactCheck #AndhraPradesh
FactCheck.AP.Gov.in tweet media
తెలుగు
2
26
51
2K
FactCheck.AP.Gov.in
FactCheck.AP.Gov.in@FactCheckAPGov·
‘తిరుమల లడ్డూ అంశంపై సుప్రీంకోర్టు ఫైర్’ అనే థంబ్ నెయిల్ తో కొందరు సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం వాస్తవాలను వక్రీకరించేదిగా ఉన్నది. సుప్రీంకోర్టు లో కేసు ప్రొసీడింగ్స్ ను కూడా వక్రీకరించి ప్రచారం చేయడం దురదృష్టకరం. ‘తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని చెప్పడానికి మీరు నిపుణులా?’ అని గౌరవ న్యాయమూర్తి ప్రశ్నించినట్లు కొందరు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి Manur Srinivas V. State of Andhra Pradesh (W.P.(C) No.279/2026 కేసులో పిటిషనర్ తరపు న్యాయవాది కేసు పూర్వాపరాలు చెబుతూ జంతు కొవ్వు విషయం ప్రస్తావించగానే ‘ఆ విషయాలను మిమ్మల్ని ఎవరు అడుగుతున్నారు? మీరు అందులో నిపుణుడు ఎప్పుడు అయ్యారు? ఇవన్నీ మాకు చెప్పమని మీకు చెబుతున్నది ఎవరు? ఇవన్నీ మీరు వెళ్లి దర్యాప్తు సంస్థతో చెప్పండి… యానిమల్ ఫాట్ ఉందో లేదో.. టాయిలెట్ క్లీనర్ వాడారో లేదో… సిట్ యానిమల్ ఫాట్ లేదని చెప్పినందున మీరు దాఖలు చేసిన పిటిషన్ లో మీరు చెబుతున్న విషయాలు సీబీఐకి చెప్పండి. ఈ కోర్టు ఈ విషయాన్ని సీబీఐకి అప్పగించేసింది. కేసును తార్కిక ముగింపునకు తీసుకువచ్చేందుకు సీబీఐ తన దర్యాప్తు నివేదిక దాఖలు చేసిన తర్వాత మేం తర్వాతి చర్యలు తీసుకుంటాం’ అని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. తర్వాత ఆ పిటిషన్ ను డిస్మిస్ చేసింది. వాస్తవాలు ఈ విధంగా ఉండగా వక్రీకరించి వేరే అర్ధం వచ్చే విధంగా వార్తలు ప్రసారం చేయడం, ప్రచారం చేయడం సబబు కాదు. #FactCheck #AndhraPradesh
తెలుగు
5
43
124
7.7K
FactCheck.AP.Gov.in
FactCheck.AP.Gov.in@FactCheckAPGov·
ఆంధ్రప్రదేశ్ పోలీసులు గో స్మగ్లర్ల నుంచి ముడుపులు తీసుకుంటున్నారని ఒక ఫొటోను, వీడియోను చూపిస్తూ కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ లో, ఒక న్యూస్ ఛానెల్ లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. వాస్తవాలను పరిశీలిస్తే వారు ప్రచారం చేస్తున్న ఫొటో, వీడియో, దానికి సంబంధించిన వార్త 09- 06- 2022 నాడు అన్ని జాతీయ, ప్రాంతీయ తెలుగు, ఇంగ్లీషు వార్తా పత్రికలలో వచ్చినది. 2022 వ సంవత్సరం జూన్ 6వ తేదీన అడ్డరోడ్డు నుంచి తుని వైపు వెళ్లే మార్గంలో నక్కపల్లి దుర్గాదేవి ఆలయానికి సమీపంలో హైవే పెట్రోలింగ్‌ సిబ్బంది నిలబడి, పశువుల రవాణా వాహనాల నుంచి డబ్బులు తీసుకుంటున్న వీడియా అది. అప్పటి వార్తకు సంబంధించిన ఫొటోను, వీడియోను ఇప్పుడు జరుగుతున్నట్లుగా ప్రచారం చేయడం నేరపూరిత చర్య. 09- 06- 2022 నాడు జరిగిన సంఘటనపై వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. source links: indiaxpressnews: tinyurl.com/35xyks9e Andhrajyothy : andhrajyothy.com/2022/andhra-pr… #FactCheck #AndhraPradesh
తెలుగు
13
93
192
10.4K
FactCheck.AP.Gov.in
FactCheck.AP.Gov.in@FactCheckAPGov·
Some social media handles and a news channel are extensively circulating a photo and a video, claiming that the Andhra Pradesh Police are accepting bribes from cattle smugglers. ​However, a verification of the facts reveals that the photo, video, and related news being circulated were actually published in all national, regional Telugu, and English newspapers on June 9, 2022. The video features Highway Patrol personnel standing near the Nakkapalli Durgadevi Temple on the route from Addaroad to Tuni on June 6, 2022, where they were seen taking money from cattle transport vehicles. ​Circulating a photo and video from a past incident as if it is happening now is a criminal act. Strict legal action will be taken against those who are distorting the facts and spreading false propaganda regarding the incident that occurred on June 9, 2022. source links: indiaxpressnews: tinyurl.com/35xyks9e Andhrajyothy : andhrajyothy.com/2022/andhra-pr… #FactCheck #AndhraPradesh
English
7
34
67
1.8K
FactCheck.AP.Gov.in
FactCheck.AP.Gov.in@FactCheckAPGov·
ఆంధ్రప్రదేశ్ లో హిందూ దేవాలయాల విధ్వంసం జరుగుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. అనంతపురం జిల్లా, గుంతకల్లు మండలం కసాపురం గ్రామంలోని శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి వారి దేవాలయ పునర్ నిర్మాణ కార్యక్రమం సందర్భంగా తీసిన వీడియోలతో ఈ తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారు. వాస్తవంగా జరిగింది ఏమిటంటే… దేవాలయ గర్భాలయం, విమానగోపురం, అర్థ మండపం డిపార్ట్మెంట్ ప్లాన్, ఎస్టిమేషన్ ప్రకారం రాయచూర్ కు చెందిన శ్రీ ఎస్. రాజేంద్రారెడ్డి, క్లోజ్డ్ మండపం చల్లా అంజనీ ప్రసాద్ (హైదరాబాద్) వారు తమ స్వంత ఖర్చుతో నిర్మాణం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి రాతి నిర్మాణపు పనులు 60% పూర్తి అయినందున దేవస్థానం వైదిక కమిటి సభ్యుల తీర్మానం, తిరుమల తిరుపతి దేవస్థానం పాంచరాత్ర ఆగమ సలహాదారులు లిఖిత పూర్వక సూచనల మేరకు దేవాదాయ శాఖ కమీషనర్ వారికి నివేదిక రూపంలో తెలియపరచి 28.02.2026 ఉదయం శాస్ట్రోక్తముగా స్థానిక శాసన సభ్యులు, కసాపురం గ్రామస్తులు, డిపార్ట్మెంట్ ఇంజనీర్లు, డిప్యూటీ స్థపతి, రెవిన్యూ, పోలీస్ వారి సమక్షంలో బాలాలయం ఏర్పాట్లు చేసి అదే రోజు మధ్యాహ్నం పై అధికారుల సమక్షంలో పంచనామా చేసి పాత ఆలయమును తొలగించారు. 27.06.2026 న ఉత్తరాయణ పుణ్య కాలంలో నూతన దేవాలయ పునః ప్రతిష్ట చేసేందుకు ఆగమ సలహాదారులు, వైదిక సభ్యులు నిర్ణయించారు కూడా. వాస్తవాలు ఇలా ఉండగా తప్పుడు ప్రచారం చేయడం, సున్నితమైన మతపరమైన అంశాలలో ఆవేశకావేశాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం చట్టరీత్యా నేరం. #FactCheck #AndhraPradesh
తెలుగు
16
142
315
54.7K
FactCheck.AP.Gov.in
FactCheck.AP.Gov.in@FactCheckAPGov·
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు వారి కార్యాలయం(ఎపి సచివాలయం పబ్లిసిటీ సెల్)లో ఆఫీస్ సబార్డినేట్ గా పని చేస్తున్న ఎస్.అవినాష్ సింగ్ తనను తెలంగాణకు బదిలీ చేయకపోవడంతో ఆత్మహత్యా ప్రయత్నానికి పాల్పడినట్టు Telugu Feed(@ Telugu feedsite)అనే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనం పూర్తిగా నిరాధారమని, తాను ఎలాంటి ఆత్మహత్యా ప్రయత్నం చేయలేదని అవినాష్ సింగ్ స్వయంగా వీడియో ద్వారా తెలియజేశారు. కావున ఆ కథనం పూర్తిగా అసత్యం. అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాల మేరకు (కమీషనర్ గారి లేఖ తేదీ 19/02/2026), అంతరాష్ట్ర బదిలీల ప్రక్రియ ఇప్పటికే కొనసాగుతోంది. అవినాష్ సింగ్ పేరు తెలంగాణకు బదిలీ కోరుకుంటున్న ఉద్యోగుల జాబితాలో (క్రమ సంఖ్య 472) స్పష్టంగా ఉంది. దీనికి సంబంధించిన డేటాను అప్‌డేట్ చేసి, తదుపరి చర్యల కోసం తెలంగాణ ప్రభుత్వానికి పంపడం జరిగింది. బదిలీల ప్రక్రియ సజావుగానే సాగుతున్న సమయంలో... ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయడం కేవలం ప్రజలను మరియు తోటి ఉద్యోగులను గందరగోళానికి గురిచేయడమే. #FactCheck #AndhraPradesh
తెలుగు
2
31
61
2.8K
FactCheck.AP.Gov.in
FactCheck.AP.Gov.in@FactCheckAPGov·
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారంటూ కొందరు చేస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు. వాస్తవాలకు భిన్నంగా కేవలం అపోహలకు మాత్రమే తావిచ్చేలాగా వారు అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. 2024 జూన్ నుంచి APIIC నుంచి 69 పెద్ద పరిశ్రమలకు భూములు కేటాయించడమైనది. రూ.3.88 లక్షల కోట్ల పెట్టుబడితో, మొత్తం 1.82 లక్షల ఉద్యోగాల కల్పన చేసే సామర్ధ్యం ఉన్న కంపెనీలు ఇవి. APIIC స్థాపించిన నాటి నుంచి 25,231 పరిశ్రమలకు భూములు కేటాయిస్తే అందులో 3,584 పరిశ్రమలకు వివిధ కారణాలతో భూముల కేటాయింపు రద్దు చేసి భూములు వాపసు తీసుకోవడం జరిగింది. భూములు వాపసు తీసుకోవడానికి పలు రకాల కారణాలు ఉంటాయి. 2019- 24 మధ్య కాలంలో ఇలా భూములు వాపసు తీసుకున్న కంపెనీలు 8 వరకూ ఉన్నాయి. APIIC నుంచి భూములు తీసుకున్న కంపెనీలు తాము ఇచ్చిన నిర్మాణ, కంపెనీ ప్రారంభ షెడ్యూలు కు కట్టుబడి ఉండాలి. దీని కోసం జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వరకూ వివిధ స్థాయిలలో పూర్తి పర్యవేక్షణ ఉంటుంది. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) సమావేశాలలో ఈ ప్రోగ్రెస్ రిపోర్టులపై చర్చ జరుగుతుంది. మొత్తం APIIC చేసిన 69 భూ కేటాయింపులలో కేవలం 4 మాత్రమే ఇప్పుడు రద్దు అయ్యాయి. అదీ కూడా ఆయా కంపెనీల వారు నిర్దేశించిన సూత్రాలకు కట్టుబడి ఉండకపోవడం వల్లే జరిగింది. ఈ భూములను తక్షణమే పెట్టుబడులు పెట్టే వారికి బదలాయించడం జరుగుతుంది. హిందూస్థాన్ కోకా కోలా బెవరేజెస్ ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీకి అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో 50.03 ఎకరాలు కేటాయించగా వారు పలు కారణాల వల్ల ముందుకు వెళ్లలేకపోవడంతో భూ కేటాయింపు రద్దు చేయడమైనది. తమ పెట్టుబడులను వారు విజయనగరంలో ఏర్పాటు చేస్తున్న JSW Park కు తరలిస్తున్నారు. GINFRA ప్రిసిషన్స్ ప్రయివేట్ లిమిటెడ్ వారికి అనంతపురం జిల్లా తిమ్మసముద్రంలో 121.53 ఎకరాలు కేటాయించగా వివిధ అంతర్గత కారణాలతో వారు ముందుకు వెళ్లలేకపోయారు. దాంతో ఆ భూమిని అంతరిక్ష, రక్షణ రంగ ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు బదలాయించడం జరిగింది. ఆజాద్ ఇండియా మొబిలిటీ వారికి శ్రీసత్యసాయి జిల్లా గుడిపల్లిలో 36 ఎకరాలు కేటాయించగా వారు ఈఎండి మినహా భూ విలువను కూడా ప్రభుత్వానికి చెల్లించలేదు. దాంతో వారి భూ కేటాయింపు రద్దు చేసి APIICతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈఎండి నిబంధనల ప్రకారం తిరిగి చెల్లించాల్సి ఉంది. ఈఎండి కి ఎలాంటి వడ్డి చెల్లించడం లేదు. జూపిటర్ రెన్యువబుల్ ఎనర్జీ వారికి అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో 67 ఎకరాలు కేటాయించగా వారు తమ రెండో దశ విస్తరణకు అక్కడ అవకాశం లేనందున ప్రత్యామ్నాయ స్థలం కావాలని కోరడంతో కేటాయింపును రద్దు చేసి ప్రత్యామ్నాయ భూమి కోసం ప్రభుత్వం అన్వేషిస్తున్నది. మిథాని నాల్కో వారు నెల్లూరు లో తమ పెట్టుబడులను ఉపసంహరించుకున్నారనే దాంట్లో కూడా వాస్తవం లేదు. తమ జాయింట్ వెంచర్ కంపెనీ అయిన ఉత్కర్ష అల్యూమీనియం ధాతు నిగం ద్వారా వారు ముందుగా ఒప్పందం చేసుకున్న ఉత్పత్తులు కాకుండా వేరేవి చేయాలని భావిస్తున్నందున డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు సమర్పించాల్సి ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినందున ప్రభుత్వ పరంగా కూడా చర్చలు జరుగుతున్నాయి. వాస్తవాలు ఈ విధంగా ఉంటే తప్పుడు సమాచారంతో ప్రజలను తికమక పెట్టాలని చూడడం నేరపూరిత చర్య. #FactCheck #AndhraPradesh
FactCheck.AP.Gov.in tweet media
తెలుగు
1
30
41
1.6K
FactCheck.AP.Gov.in
FactCheck.AP.Gov.in@FactCheckAPGov·
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య అంటూ సోషల్ మీడియాలో కొందరు చేస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు. నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం ప్యాపిలి మండలం మాధవరం గ్రామానికి చెందిన దర్శినేని నాగకృష్ణ మరణించిన సంఘటనలో వాస్తవాలు ఈ విధంగా ఉన్నాయి. తల్లి పేరున ఉన్న 1.5 ఎకరాలలో నాగకృష్ణ వ్యవసాయం చేసుకుంటున్నాడు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. నాగకృష్ణ ముగ్గురు కుమార్తెలకు ‘తల్లికి వందనం’ కార్యక్రమం కింద ప్రభుత్వం నుంచి డబ్బులు కూడా అందాయి. కుమారుడు ఎల్ కేజీ కావడం వల్ల ‘తల్లికి వందనం’ డబ్బులు రాలేదు. అతను కొద్ది కాలం కిందట ఇల్లు నిర్మించుకున్నాడు. ఆ సమయంలో సుమారు రూ.10 లక్షలు అప్పు అయింది. అప్పుల వాళ్లు ఒత్తిడి చేయడం, ఉన్న పొలం అమ్మేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో నాగకృష్ణ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన ఆత్మహత్యకు వ్యవసాయనికి ఎలాంటి సంబంధంలేదు. తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి పంపి భయబ్రాంతులకు గురి చేయడం మంచిది కాదు. #FactCheck #AndhraPradesh
FactCheck.AP.Gov.in tweet media
తెలుగు
2
21
51
2K
FactCheck.AP.Gov.in
FactCheck.AP.Gov.in@FactCheckAPGov·
అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం మేళందొడ్డి గ్రామంలో 108 అంబులెన్స్‌ లేక ఎద్దుల బండిపై భార్యను ఆసుపత్రికి తీసుకెళ్లిన భర్త అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవం. 60 సంవత్సరాల నారాయణమ్మ వాంతులు విరేచనాలతో అస్వస్థతకు గురికాగా ఆమె భర్త రామయ్య అంబులెన్స్ కు ఫోన్ చేయకుండా తన సొంత ఎడ్ల బండి పై తన భార్య ను తీసుకుని 4 కి. మి దూరం లో ఉన్న ఆసుపత్రి కి తీసుకువచ్చాడు. అక్కడ వైద్యులు తక్షణ చికిత్స అందించారు. ఆమె కు ఉపశమనం కల్పించారు. అల్ట్రా సౌండ్ స్కానింగ్ లో ఆమె కు కడుపులో కణితి ఉన్నట్లు తెలిసింది. దాంతో ఆమె శారీరక పరిస్థితి కుదుట పడిన వెంటనే ఆపరేషన్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వైద్య సౌకర్యాల విషయంలో తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దు. #FactCheck #AndhraPradesh
తెలుగు
1
48
99
3.7K
FactCheck.AP.Gov.in
FactCheck.AP.Gov.in@FactCheckAPGov·
🚨 Fake Alert 🚨 తిరుమల క్యూలైన్ లో భక్తురాలు పాము కాటుకు గురి అయినట్లు కొందరు చేస్తున్న ప్రచారంలో నిజం లేదు. వాస్తవానికి జరిగింది ఏమిటంటే వరంగల్ కు చెందిన శరత్ బాబు, మౌనిక దంపతులు ఆదివారం (ఫిబ్రవరి 22, 2026) రాత్రి స్వామి దర్శనం కోసం టాక్సీలో ఎస్వీ మ్యూజియం వద్దకు వచ్చారు. ఆర్.బి. సెంటర్ పార్కింగ్ ఏరియా వద్దకు రాగానే తన కాలికి పసుపు రాసుకునే ఉద్దేశ్యంతో మౌనిక కారు నుంచి క్రిందకు దిగారు. ఆ సమయంలో తన కాలికి ఏదో తాకడంతో ఆమె భయంతో గట్టిగా అరిచారు. వెంటనే ఆమె భర్త శరత్ బాబు వెతికి చూడగా అక్కడ ఒక పాము పిల్ల కనిపించింది. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది మౌనికను తిరుమల లోని అశ్విని హాస్పిటల్ కు తీసుకువెళ్లారు. భక్తురాలిని పరిశీలించిన డాక్టర్లు ఆమె పాముకాటుకు గురి కాలేదని నిర్ధారించారు. అయినప్పటికీ భక్తురాలి క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ముందస్తు జాగ్రత్తగా ఆమెను తిరుపతిలోని స్విమ్స్ లో చేర్చడం జరిగింది. స్విమ్స్ డాక్టర్లు కూడా మౌనిక పాము కాటుకు గురికాలేదని చెప్పారు. పైగా విచారణలో అక్కడ కనిపించిన పాము విషరహిత సర్పంగా తేలింది. ఘటన జరిగిన వెంటనే టీటీడీ సిబ్బంది స్పందించిన తీరుకు ఆ దంపతులు కృతజ్ఞతలు తెలియజేసారు. సోమవారం ఉదయం ఆ దంపతులు స్వామిని దర్శించుకున్నారు. జరిగింది ఇది. కాబట్టి కొందరు చేస్తున్న ఫేక్ ప్రచారాలను భక్తులు నమ్మకండి. #FactCheck #AndhraPradesh
FactCheck.AP.Gov.in tweet mediaFactCheck.AP.Gov.in tweet media
తెలుగు
20
113
420
45K