Telugu Box office
191.8K posts

Telugu Box office
@TCinemaFun
Follow us for the best film updates & content +SRH









ఉదాహరణకు కేపీహెచ్‌బీ భ్రమరాంబ & మల్లికార్జున థియేటర్లలో షోకి 30 నిమిషాల ముందు ఆన్‌లైన్ బుకింగ్ క్లోజ్ చేస్తారు. ఉదాహరణకు 6:30 PM షో అయితే, 6:00 PMకే ఆన్‌లైన్ సేల్స్ ఆగిపోతాయి. ఆ తర్వాత షో మొదలయ్యే వరకు, కొన్ని సందర్భాల్లో షో ప్రారంభమైన తర్వాత కూడా కేవలం ఆఫ్‌లైన్ టికెట్లే అమ్ముతారు. మరి ఆ సమయంలో కౌంటర్ ద్వారా అమ్ముడైన టికెట్లను ఈ బాక్సాఫీస్ పేజీలు, ట్రాకింగ్ వెబ్‌సైట్లు ఎలా లెక్కిస్తున్నాయి? ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... వాళ్లకు నచ్చిన సినిమాకి ఒక రకంగా, నచ్చని సినిమాకి మరో రకంగా లెక్కలు వేస్తున్నట్లు కనిపిస్తోంది. నిన్న ట్రాక్డ్ గ్రాస్ ₹4 కోట్లు ఉంటే, ఫైనల్ కలెక్షన్స్ కూడా దాదాపు ₹4 కోట్లుగానే చూపించారు. మరి ఆఫ్‌లైన్ సేల్స్ ఎక్కడికి పోయాయి? వాటిని అసలు పరిగణనలోకి తీసుకుంటున్నారా లేదా?@TBO_Updates @TrackTwood @T2BLive @AndhraBoxOffice నోట్: ఇలా తెలుగు రాష్ట్రాల్లో చాలా థియేటర్లు ఉన్నాయి చాలావరకు థియేటర్స్ లో షో మొదలు అయ్యాక కూడా కౌంటర్ లో టికెట్ లు అమ్ముతారు.


Nizam టెరిటరీ విషయానికి వస్తే, ఏదైతే ఆన్‌లైన్ ట్రాక్డ్ గ్రాస్ ఉంటుందో దాదాపు దానికే కొంత నంబర్ కలిపి షేర్ క్యాలిక్యులేట్ చేస్తున్నారు. ఆఫ్‌లైన్‌ను అక్యురేట్‌గా కన్సిడర్ చేయడం లేదు. అందుకేనేమో నంబర్లు వాస్తవానికి చాలా దూరంగా ఉంటున్నాయి. తెలంగాణ జిల్లాల్లో కౌంటర్ సేల్స్ బాగానే ఉన్నాయి. ఒక చిన్న ఉదాహరణ, మా ఏరియాలోని ఒక థియేటర్‌లో రెండు షోలకు కలిపి ఆన్‌లైన్‌లో(District) 160(85+75) టికెట్లు బుక్ అయ్యాయి. అదే థియేటర్‌లో అదే షోలకు కౌంటర్ ద్వారా ఆఫ్‌లైన్‌లో 220(124+96) టికెట్లు సేల్ చేసారు. సో ఇక్కడ పెద్ద నంబర్ అయిన ఆ 220 టికెట్ల కలెక్షన్స్ ఎక్కడికి వెళ్తున్నాయి? ఇలాంటి థియేటర్లు చాలా ఉన్నాయి. మేము చెప్పిన ఈ ఉదాహరణ కూడా మేము డైరెక్ట్‌గా థియేటర్‌కి వెళ్లి తీసుకున్న డేటా ఆధారంగానే చెప్తున్నాం. #PEDDI

















