Sriganesh

944 posts

Sriganesh banner
Sriganesh

Sriganesh

@mlasriganesh

MLA Secunderabad Cantonment Assembly Constituency Chairman Sri Ganesh Foundation

가입일 Kasım 2024
9 팔로잉284 팔로워
Sriganesh
Sriganesh@mlasriganesh·
డబుల్ బెడ్రూం ఇళ్ళ పట్టాలు అందుకున్న లబ్ధిదారుల కళ్ళలో ఆనందం, మారేడ్ పల్లి ప్రాంతంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ళ నిర్మాణానికి తమ స్వంత ఇళ్ళను ఇచ్చి ఎన్నో ఏళ్ళుగా కిరాయి ఇళ్ళలో ఉంటూ అద్దెలు కట్టలేక నానా అవస్థలు పడుతూ తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న అ కుటుంబాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో నేను ఎమ్మెల్యేగా గెలిచినప్పటినుంచి అధికారులతో నిత్యం మాట్లాడుతూ, గౌరవ ముఖ్యమంత్రి , రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి వర్యులు, ఇంఛార్జ్ మంత్రి వర్యుల దృష్టికి పలుమార్లు తీసుకువెళ్లి రెండు రోజుల క్రితం వారికి పట్టాలను అందించగా ఆనందంతో ఈరోజు లబ్దిదారులు, వారి కుటుంబ సభ్యులు నా నివాసానికి వచ్చి కృతజ్ఞతలు తెలపడంతో ఈ ఇళ్ళు మీ ఆస్తి అని, మీ కన్నీళ్ళను చూసిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సమస్యపై దృష్టి కేంద్రీకరించి పరిష్కరించిందని , మీ కళ్ళల్లో ఆనందమే నా ధ్యేయమని చెప్పడం జరిగింది. #mlasriganesh #Cantonment #MondaDivision #SriGanesh
Sriganesh tweet mediaSriganesh tweet mediaSriganesh tweet mediaSriganesh tweet media
తెలుగు
0
0
0
4
Sriganesh
Sriganesh@mlasriganesh·
పనితీరు ఆధారంగా పదవులు వరిస్తాయి, సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ నూతన కమిటీలో ఉపాధ్యక్షులుగా ఆవుల బాలరాజు యాదవ్, జనరల్ సెక్రటరీలుగా బంగారు సదానంద్, గోన శాంసన్ రాజు గార్లు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీచే నియమించబడటంతో ఈరోజు వారు నన్ను నా నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలపడంతో వారికి శుభాకాంక్షలు, అభినందనలు తెలిపి పార్టీలో కష్టపడి పనిచేస్తే పదవులు వాటంతటవే వస్తాయని, పదవులు అలంకారం కాదని, మీ బాధ్యత మరింత పెరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్ళాలని, ఈ పదవులను కార్యకర్తల శ్రేయస్సు, పార్టీ అభివృద్ధికి ఉపయోగించినపుడే మీకు మరింత పేరు ప్రఖ్యాతులు వచ్చి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు వరిస్తాయని చెప్పడం జరిగింది. #mlasriganesh #Cantonment #SriGanesh
Sriganesh tweet mediaSriganesh tweet mediaSriganesh tweet mediaSriganesh tweet media
తెలుగు
0
0
1
14
Sriganesh
Sriganesh@mlasriganesh·
కంటోన్మెంట్ లో నెరవేరిన పేదల సొంతింటి కల, మారేడ్ పల్లి, సిల్వర్ కాంపౌండ్ ప్రాంతాలలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ళను ఈరోజు గౌరవ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మరియు జిల్లా ఇంఛార్జ్ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, మరియు రెవెన్యూ, హౌసింగ్ అధికారులతో కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది తమ సొంత స్థలాలను ప్రభుత్వానికి డబుల్ బెడ్రూం ఇళ్ళ నిర్మాణం కోసం ఇచ్చి ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న పేద ప్రజలకు నా చేతుల మీదుగా ఇళ్ళను పంపిణీ చేయడం ఆనందంగా ఉంది. పేద ప్రజలు ఇంటి పట్టాలు అందుకుంటున్న సమయంలో వారి కళ్ళల్లో ఆనందాన్ని చూసిన నేను కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తుందని చెప్పడం జరిగింది. #mlasriganesh #Cantonment #sriganesh #MondaDivision
Sriganesh tweet mediaSriganesh tweet mediaSriganesh tweet mediaSriganesh tweet media
తెలుగు
0
0
1
11
Sriganesh
Sriganesh@mlasriganesh·
ఈరోజు నియోజకవర్గం లోని పలు కుటుంబాల వివాహ వేడుకలకు హాజరై వివాహం చేసుకుంటున్న నూతన వధూవరులను నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో కలిసి మెలిసి జీవించాలని ఆశీర్వదించి వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. #mlasriganesh #mlasriganesh #sriganesh
Sriganesh tweet mediaSriganesh tweet media
తెలుగు
0
0
1
13
Sriganesh
Sriganesh@mlasriganesh·
నియోజకవర్గం లోని వార్డు 3 అన్న నగర్ లో నెలకొన్న మంచినీటి సమస్యను ఆ ప్రాంత వాసులు, 108 బజార్ లోని మహిళలు తమ ప్రాంతంలో నెలకొన్న సమస్యలను ఈరోజు నా నివాసంలో నన్ను కలసి నా దృష్టికి తీసుకురావడంతో సంబంధిత కంటోన్మెంట్ బోర్డు అధికారులతో మాట్లాడి త్వరితగతిన వాటిని పరిష్కరించాలని చెప్పాను అలాగే పలువురు తమ కుటుంబ శుభకార్యాలకు ఆహ్వానాలు అందించడంతో వాటిని స్వీకరించడం జరిగింది. #mlasriganesh #Cantonment #sriganesh
Sriganesh tweet mediaSriganesh tweet mediaSriganesh tweet mediaSriganesh tweet media
తెలుగు
0
0
0
7
Sriganesh
Sriganesh@mlasriganesh·
సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్స్ లో ఈరోజు నిర్వహించిన తపస్య డిగ్రీ కళాశాల 3 వ వార్షికోత్సవ వేడుకలకు కళాశాల యాజమాన్యం ఆహ్వానం మేరకు ముఖ్య అతిధిగా హాజరై కళాశాల విద్యార్ధినీ, విద్యార్ధులకు, యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపి, విద్యార్ధి దశలో కష్టపడి చదివితే ఉన్నత స్థాయికి చేరవచ్చని, ఉద్యోగాలు చేసే స్థాయి నుంచి ఉద్యోగాలు సృష్టించే స్థాయికి ప్రతి ఒక్కరూ చేరాలని, ప్రతి ఒక్కరూ తమకు ఇష్టమైన రంగంలోకి ప్రవేశించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని చెప్పడం జరిగింది. #mlasriganesh #Cantonment #sriganesh
Sriganesh tweet mediaSriganesh tweet mediaSriganesh tweet mediaSriganesh tweet media
తెలుగు
0
0
0
10
Sriganesh
Sriganesh@mlasriganesh·
26 కుటుంబాలకు కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ, నియోజకవర్గం లోని సికింద్రాబాద్ మండలానికి చెందిన 26 కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 1,00,116/- చొప్పున ప్రభుత్వం నుంచి మంజూరు అయిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పికెట్ లోని నా క్యాంపు కార్యాలయంలో తహసీల్దార్ పాండు నాయక్ గారితో పాటు కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేశాను గత ప్రభుత్వంలో చెక్కుల పంపిణీ ఆలస్యం అయి ఆడ పిల్లల పెళ్ళిళ్ళు చేసిన పేద కుటుంబాలు ఆర్ధికంగా ఇబ్బందులు పడేవని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కుటుంబాలకు ఆర్ధిక భరోసా ఉండేలా కేవలం 6 నెలల లోపు చెక్కుల పంపిణీ చేస్తుందని, దీనితో పాటు ఉచిత బస్సు ప్రయాణం, సన్నబియ్యం, 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ పథకాలను పకడ్బందీగా అమలు చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి మీ ఆశీస్సులు అందించాలని లబ్దిదారులకు చెప్పడం జరిగింది. #mlasriganesh #Cantonment #SriGanesh
Sriganesh tweet mediaSriganesh tweet mediaSriganesh tweet media
తెలుగు
0
0
0
10
Sriganesh
Sriganesh@mlasriganesh·
నెహ్రూ నగర్ పార్క్ ను మోడల్ పార్క్ గా అభివృద్ధి చెసుకుందాం: నియోజకవర్గం లోని మోండా డివిజన్ పరిధిలోని వెస్ట్ మారేడ్ పల్లి నెహ్రూ నగర్ లో ఉన్న నెహ్రూ పార్క్ ను అభివృద్ధి చేయాలని ఇటీవల కాలనీ అసోసియేషన్ సభ్యులు నన్ను కలసి వినతి పత్రం అందజేయడంతో త్వరలోనే పార్క్ ను సందర్శిస్తానని వారికి చెప్పాను. వారికిచ్చిన హామీ మేరకు ఈరోజు కాలనీ అసోసియేషన్ సభ్యులు, అధికారులు,డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పార్క్ ను సందర్శించి పార్క్ లో ఉన్న అసంపూర్తి నిర్మాణాలను పరిశీలించాను. దంగల్ పేరుతో నిర్మాణం చేపట్టి ఏళ్ళ నుంచి ఎవరికీ ఉపయోగం లేకుండా చేశారని కాలానుగుణంగా మారాలని ఆ నిర్మాణాలను తొలగించి ప్రస్తుత యువతరానికి మంచి క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయాలని, ఇండోర్ గేమ్స్ కు ప్రాధాన్యం ఇచ్చి పోటీలకు విద్యార్థులు, యువతను సిద్ధం చేయాలని, పార్క్ ను కూడా ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా తయారు చేయాలని అధికారులను ఆదేశించడంతో కాలనీ వాసులు సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. #mlasriganesh #Cantonment #sriganesh #MondaDivision
Sriganesh tweet mediaSriganesh tweet mediaSriganesh tweet media
తెలుగు
0
0
0
10
Sriganesh
Sriganesh@mlasriganesh·
టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు సింగిరెడ్డి హరి వర్ధన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు కండ్లకోయ నిమ్మల కన్వెన్షన్ లో నిర్వహించిన వారి జన్మదిన వేడుకలకు హాజరై వారు భవిష్యత్తులో ఉన్నత పదవులు అలంకరించాలని, వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించాడం జరిగింది. #mlasriganesh #Cantonment #sriganesh
Sriganesh tweet mediaSriganesh tweet mediaSriganesh tweet media
తెలుగు
0
0
0
10
Sriganesh
Sriganesh@mlasriganesh·
జూబ్లీ బస్ స్టేషన్ ప్రాంతంలో చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వ్యాపారుల దుకాణాలను కంటోన్మెంట్ బోర్డు అధికారులు గతంలో తొలగించారు. ఆ స్థలంలో నూతన కాంప్లెక్స్ నిర్మించి, తిరిగి వారికే కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అయితే, ఇంతవరకు నిర్మాణ పనులు మొదలుపెట్టకపోవడంతో ఆ వ్యాపారుల జీవనోపాధి దెబ్బతిని, వారి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాయి. బాధిత కుటుంబాల అభ్యర్థన మేరకు ఈరోజు దుకాణాలను కూల్చివేసిన ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది. కంటోన్మెంట్ బోర్డు నూతన కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టే వరకు, అదే స్థలంలో తాత్కాలికంగా దుకాణాలను ఏర్పాటు చేసుకునే వెసులుబాటు కల్పించాలని కంటోన్మెంట్ సీఈఓతో మాట్లాడతానని వారికి హామీ ఇచ్చాను. అదేవిధంగా, ట్రాఫిక్‌కు ఎటువంటి అంతరాయం కలగకుండా వ్యాపారాలు చేసుకునేలా ట్రాఫిక్ అధికారులతో కూడా సంప్రదిస్తానని బాధితులకు భరోసా ఇవ్వడం జరిగింది. #mlasriganesh #Cantonment #sriganesh
Sriganesh tweet mediaSriganesh tweet media
తెలుగు
0
0
0
18
Sriganesh
Sriganesh@mlasriganesh·
బోర్డు సమావేశం కేవలం టి పి టి ఛార్జీలపై కాకుండా కేంద్రం నుంచి రావాల్సిన సర్వీస్ ఛార్జీలపై కూడా పెట్టాలి: ఈరోజు నిర్వహించిన కంటోన్మెంట్ బోర్డు సమావేశంలో పాల్గొని బోర్డు సమావేశం కేవలం రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన టి పి టి ఛార్జీలపై మాత్రమే కాకుండా కేంద్రం నుండి రావాల్సిన సర్వీస్ ఛార్జీలపై కూడా పెడితే బాగుంటుందని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న రిజిస్ట్రేషన్ చార్జీల కంటే బోర్డు 3.5% ఎక్కువగా వసూలు చేస్తుందని, ముందు దానిని రద్దుచేయాలని, కంటోన్మెంట్ బోర్డు రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం అయితే ప్రజలు 3.5% ఎక్కువ చెల్లించాల్సిన అవసరం ఉండదని, రాష్ట్ర ప్రభుత్వం టి పి టి ఛార్జీలను విడుదల చేయడానికి సిద్ధంగా ఉందని, కేంద్రం నుండి రావాల్సిన 1200 కోట్ల రూపాయల సర్వీస్ ఛార్జీలను కూడా త్వరగా వచ్చేలా చేసి కంటోన్మెంట్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పడం జరిగింది. #mlasriganesh #Cantonment #SriGanesh
తెలుగు
0
0
0
9
Sriganesh
Sriganesh@mlasriganesh·
ఉచిత వైద్య శిబిరం ప్రారంభం, నియోజకవర్గం లోని మోండా డివిజన్ పరిధిలోని చాపల బావి ప్రాంతంలోని సెకండ్ బజార్ లో డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చిర్రబోయిన బద్రీనాథ్ యాదవ్ గారి ఆధ్వర్యంలో బిగ్ టివి, మెడీకవర్ హాస్పటల్, లయన్స్ క్లబ్ ఐ హాస్పటల్ ల సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించాను ప్రైవేటు హాస్పటల్స్ కు వెళ్లి ఖర్చు భరించలేని పేద ప్రజలకు ఉచిత వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, ఇక్కడ ఉచితంగా పరీక్షలు చేసి అవసరమైన మందులు కూడా అందిస్తారని, గత 15 ఏళ్ళుగా శ్రీగణేష్ ఫౌండేషన్ ద్వారా ఇలాంటి కార్యక్రమాలను ఎన్నో చేపట్టానని, సామాజిక బాధ్యతతో అందరూ ఇటువంటి కార్యక్రమాలను చేపట్టాలని, ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన బద్రీనాథ్ యాదవ్ గారిని ఈ సందర్భంగా మనస్పూర్తిగా అభినందిస్తున్నాని చెప్పడం జరిగింది. #mlasriganesh #Cantonment
Sriganesh tweet mediaSriganesh tweet media
తెలుగు
0
0
0
13
Sriganesh
Sriganesh@mlasriganesh·
నియోజకవర్గంలో బాబూ జగ్జీవన్ రామ్ 119 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాలంరాయి చౌరస్తాలో నిర్వహించిన జయంతి వేడుకలలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హన్మంతరావు, రాష్ట్ర విత్తనాభివృధ్ధి సంస్థ ఛైర్మన్ అన్వేష్ రెడ్డి గార్లతో కలసి పాల్గొని జగ్జీవన్ రామ్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించాను. అలాగే నియోజకవర్గంలో పలు చోట్ల వారి విగ్రహాలకు పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించాను. బాబూ జగ్జీవన్ రామ్ గారు అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆజన్మాంతం పనిచేసిన ధీరుడని, అంటరాని తనానికి వ్యతిరేకంగా విద్యార్థి దశ నుంచే ఉద్యమాలు చేసి జన చైతన్యం తెచ్చిన సామాజిక సంస్కర్తని ,దేశ ఉప ప్రధానిగా, సుదీర్ఘకాలం పార్లమెంటేరియన్ గా పనిచేసి చట్టసభల్లో తన సత్తా చూపిన ఆయన ఆఖరి క్షణం వరకు దళిత జాతి సముధ్ధరణ కోసమే పరితపించారని వారి సేవలను ఈ సందర్భంగా స్మరించుకోవడం జరిగింది. #mlasriganesh #Cantonment #mlasriganesh #Cantonment
Sriganesh tweet mediaSriganesh tweet mediaSriganesh tweet mediaSriganesh tweet media
తెలుగు
0
0
0
9
Sriganesh
Sriganesh@mlasriganesh·
వైద్య చికిత్స కోసం 8 లక్షల 50 వేల రూపాయల విలువైన LOC ల అందజేత, నిమ్స్ హాస్పటల్ లో చికిత్స కోసం నియోజకవర్గం లోని బాలంరాయి లోని అన్ననగర్ ప్రాంతానికి చెందిన వరడోలు యాదగిరి గారికి 4 లక్షలు, రసూల్ పుర గన్ బజార్ కు చెందిన శివం భరత్ గారికి 2 లక్షలు, ఓల్డ్ బోయిన్ పల్లి సమతా నగర్ కు చెందిన మొహమ్మద్ సలీం గారికి 2 లక్షల 50 వేల రూపాయలు మొత్తం 8 లక్షల 50 వేల రూపాయల విలువైన LOC లు ప్రభుత్వం నుంచి మంజూరు కావడంతో ఈరోజు నా కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యులకు అందజేసి వారు త్వరగా కోలుకుని తిరిగి ఆరోగ్యకరమైన జీవనం కొనసాగించాలని మనసారా కోరుకోవడం జరిగింది. #mlasriganesh #Cantonment #cmrevanthreddy
Sriganesh tweet mediaSriganesh tweet mediaSriganesh tweet media
తెలుగు
0
0
0
9
Sriganesh
Sriganesh@mlasriganesh·
తెలంగాణ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించినందుకు గాను, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారికి మరియు కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ.. ఈరోజు తెలంగాణ లీగల్ సెల్ స్టూడెంట్స్ అసోసియేషన్ సభ్యులు నన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా, అడ్వకేట్స్ ప్రొటెక్షన్‌తో పాటు జూనియర్ లాయర్లకు స్టైఫండ్ అందించడం మరియు 'లా అకాడమీ'ని ఏర్పాటు చేయడం కూడా ప్రభుత్వ ఆలోచనలో ఉందని వారికి తెలిపాను. ఈ బిల్లు ద్వారా న్యాయవాదుల సంక్షేమం పట్ల మా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని చాటుకున్నామని తెలియజేస్తూ, అసోసియేషన్ సభ్యులకు నా అభినందనలు తెలియజేశాను #mlasriganesh #Cantonment
Sriganesh tweet mediaSriganesh tweet mediaSriganesh tweet media
తెలుగు
0
0
0
10
Sriganesh
Sriganesh@mlasriganesh·
నా అనుచరుడు లిఖేష్ యాదవ్ వివాహం ప్రియాంక తో ఈరోజు ఉప్పర్ పల్లి లోని యస్ పి ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించారు. ఈ వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి, నిండు నూరేళ్లు కలిసి మెలిసి జీవించి, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని దీవించి, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు అందజేయడం జరిగింది. #mlasriganesh #Cantonment
Sriganesh tweet media
తెలుగు
0
0
0
12
Sriganesh
Sriganesh@mlasriganesh·
యేసుక్రీస్తు యొక్క త్యాగపూరితమైన ప్రేమ మరియు విమోచన కృపను ధ్యానిస్తూ ప్రగాఢమైన భక్తి శ్రద్ధలతో లైఫ్ ఛేంజింగ్ రివైవల్ చర్చ్ - పి.జే స్టీఫెన్ పాల్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ లోని కే జే ఆర్ గార్డెన్స్ నుండి ప్రారంభమైన శాంతి ర్యాలీలో పాల్గొని, తదనంతరం నిర్వహించిన గుడ్ ఫ్రైడే ఆరాధనలో పాల్గొన్నాను. సిలువపై యేసు క్రీస్తు ప్రభువు చేసిన త్యాగంలో మూర్తీభవించిన ప్రేమ, నిరీక్షణ, క్షమాపణ, శాంతి వంటి విలువలను శాంతి ర్యాలీలో పాల్గొన్న వారికి వివరించి ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో ఆ విలువలను పాటిస్తూ ఆధ్యాత్మిక చింతనతో జీవనం కొనసాగించాలని చెప్పడం జరిగింది. #mlasriganesh #Cantonment #GoodFriday
Sriganesh tweet mediaSriganesh tweet mediaSriganesh tweet media
తెలుగు
0
0
0
20
Sriganesh
Sriganesh@mlasriganesh·
తాడు బందు వీరాంజనేయస్వామి దేవాలయంతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా వైభవోపేతంగా జరిగిన హనుమాన్ జయంతి వేడుకలకు పలు చోట్ల హాజరై దేవాలయాలలో ప్రత్యేక పూజలు చేసి, ఆన్నదానాలను, హనుమాన్ ర్యాలీలను ప్రారంభించి స్వామివారి అనుగ్రహంతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్ధించడం జరిగింది. #mlasriganesh #Cantonment #hanumanjayanti
Sriganesh tweet mediaSriganesh tweet mediaSriganesh tweet mediaSriganesh tweet media
తెలుగు
0
0
0
10
Sriganesh
Sriganesh@mlasriganesh·
అయ్యప్ప స్వామి జన్మదినం సందర్భంగా ఈరోజు బొల్లారం లోని అయ్యప్ప స్వామి దేవాలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమాలలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసి స్వామి వారి అనుగ్రహంతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ప్రార్ధించి దేవాలయంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. #mlasriganesh #Cantonment
Sriganesh tweet mediaSriganesh tweet mediaSriganesh tweet mediaSriganesh tweet media
తెలుగు
0
0
0
11