JanaSena ITWing

1.3K posts

JanaSena ITWing banner
JanaSena ITWing

JanaSena ITWing

@ITWingJSP

JanaSenaParty IT-Wing leads digital campaigns, boosts social media presence, spreads ideology, counters misinformation, and connects people through technology.

Vijayawada, Andhrapradesh Katılım Eylül 2025
8 Takip Edilen540 Takipçiler
JanaSena ITWing retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
JanaSena Party tweet mediaJanaSena Party tweet mediaJanaSena Party tweet mediaJanaSena Party tweet media
ZXX
1
128
381
4.9K
JanaSena ITWing retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
నా సంపద.. సంపాదన… సాధక్, ఉద్యమిలే * క్రమశిక్షణగల సమూహాన్ని తయారు చేసుకున్నాం * ⁠పార్టీ నిర్మాణ ప్రక్రియలో 25 పార్లమెంటు నియోజకవర్గాలకు ప్రత్యేక బాధ్యతలు * కమిటీల ముందుకు మీ పని తీరును ప్రతిబింబించే వివరాలు అందజేయండి * కాపు నాయకుల పేరుతో పదేపదే నాపై నిందలు వేస్తే ఇక ఉపేక్షించేది లేదు * నాకు కులం ముఖ్యం కాదు.. పార్టీ గురించి నిలబడిన వాళ్లే ముఖ్యం * అభాండాలు.. అన్యాయాల మీద జనసేనది రాజీలేని పోరాటం * ఇక నుంచి పార్టీపై జరిగే విష ప్రచారానికి గట్టిగా బదులివ్వాలి * రాజమహేంద్రవరంలో సాధక్ ల సమావేశంలో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రివర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు
JanaSena Party tweet mediaJanaSena Party tweet mediaJanaSena Party tweet mediaJanaSena Party tweet media
తెలుగు
8
481
1.6K
11.9K
JanaSena ITWing retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
ఎవ్వరు చూడని, పట్టించుకోని ఒక ప్రజా సమస్యను పట్టించుకోవడమే జనసేన ప్రత్యేకత
తెలుగు
6
342
869
5.6K
JanaSena ITWing retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
క్రమశిక్షణతో కూడిన బలమైన పార్టీ వ్యవస్థను నిర్మించడమే లక్ష్యంగా..
తెలుగు
4
331
913
5.4K
JanaSena ITWing retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
'ఉద్యమి, సాధక్, ప్రదాత'
తెలుగు
5
333
876
5.6K
JanaSena ITWing retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
వ్యక్తిగత ఎదుగుదల కంటే దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం!
తెలుగు
5
344
966
5.9K
JanaSena ITWing retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
మీడియా సంస్థలు ప్రజల విజ్ఞానం పెంపొందించాల్సింది పోయి ఇవ్వేనా చర్చించేది, విశ్లేషించేది?
తెలుగు
13
520
1.3K
9.6K
JanaSena ITWing retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
'నన్ను విమర్శించే కాపు నాయకులకు..'
తెలుగు
16
879
2.5K
17.4K
JanaSena ITWing retweetledi
JanaSena Shatagni
JanaSena Shatagni@JSPShatagniTeam·
సగటు మనిషి బాగుండాలి, నా దేశం, సమాజ శ్రేయస్సు కోసం మన ప్రయత్నం మనం చెయ్యాలి అనే బాధ్యత లేకుంటే చాలా మందిలా సుఖంగా బతికేయొచ్చు కదా., నాకు ఎంత ఇష్టం ఎంత ప్రేమ లేకపోతే రాజకీయాలకు వచ్చి ఇంత ఒత్తిడి తీసుకుంటాను! - రాజమండ్రి సాధక్ ఆత్మీయ సమావేశంలో గౌ|| ఉపముఖ్యమంత్రి, జనసేనాని శ్రీ @PawanKalyan గారు.
తెలుగు
0
148
409
4.3K
JanaSena ITWing retweetledi
Deputy CMO, Andhra Pradesh
కలుషిత జలాలు గోదావరిలో కలిపేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు? - గలగలా గోదారి… అని గీతం ఆలపిస్తాము… ఇంత కాలుష్యం ఉంటే ఏమని ఆలపించాలి? * ఆంధ్ర పేపర్ మిల్స్ యాజమాన్యానికి నోటీసులు ఎందుకు ఇవ్వలేదు? * రూ. 13 కోట్ల బకాయిలను రాబట్టలేరా? * ప్రజల ముందు సమాధానం చెప్పాల్సింది మేము * ⁠పుష్కరాల్లో పన్నీరు స్నానం చేయించక్కర్లేదు… కెమికల్ స్నానం చేయించకూడదు కదా * ఇంతటి కీలక సమస్యలను నా దృష్టికి తీసుకురండి క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటాం * ఆంధ్ర పేపర్ మిల్స్ పరిశ్రమ కాలుష్యాన్ని ప్రత్యక్షంగా… తూర్పులంక లాగూన్స్ వరకు వెళ్లి మరీ పరిశీలించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు ‘మా తెలుగుతల్లికి.. రాష్ట్ర గీతంలో గల గలా గోదారి అని గుండెల నిండా ఆర్తితో ఆలపిస్తాం.. ఇక్కడకు వచ్చి చూస్తే గోదావరి వెలవెలబోతూ.. కాలుష్యంతో నిండిపోతూ కనిపిస్తోంది. ఏమని ఆలపించాలి. ఇంతటి కాలుష్యం కలుస్తున్న నీటిలో మన పిల్లలను స్నానం చేయించే సాహసం చేస్తామా..? ఇంత దారుణంగా కలుషిత జలాలు గోదావరిలోకి ప్రత్యక్షంగా కలుస్తున్నా అధికారులు ఇంకా మీనమేషాలు ఎందుకు లెక్కిస్తున్నారు?’ అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశ్రామిక అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది… పరిశ్రమలను ప్రోత్సహించాలని రాయితీ ధరలకు భూములను కేటాయిస్తున్నాం.. ప్రభుత్వం ఎంత సహకరిస్తున్నా, పరిశ్రమలకు కనీసం పర్యావరణ స్పృహ లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. రాజమహేంద్రవరం ఆంధ్ర పేపర్ మిల్స్ లిమిటెడ్ పరిశ్రమ గోదావరిలోకి వదులుతున్న కాలుష్య జలాలను శ్రీ పవన్ కళ్యాణ్ గారు మంగళవారం ఉదయం ప్రత్యక్షంగా పరిశీలించారు. కలుషిత నీటిని శుద్ధి చేసి గోదావరిలోకి విడుదల చేయాలి. తూర్పు లంకలోని లాగూన్స్ (మడుగులు)లో వీటిని వదులుతారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉదయాన్నే వెంకట నగరం ఘాట్ నుంచి పడవలో లాగూన్స్ వరకూ వెళ్లి ప్రత్యక్ష పరిశీలన చేశారు. కాలుష్య నియంత్రణ మండలి మొబైల్ కిట్లతో నీటిలో కాలుష్య కారకాలు ఎంత ఉన్నాయి అన్నది అక్కడికక్కడే పరీక్షలు చేయించారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తూ- ప్రత్యక్షంగా గోదావరిలోకి కాలుష్య జలాలు ఈ స్థాయిలో కలుస్తున్నా ఇప్పటి వరకు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఎందుకు స్పందించలేదని, కనీసం నోటీసులు ఎందుకు ఇవ్వలేదని కాలుష్య నియంత్రణ మండలి ఈఈ శ్రీ శంకర్ నాయక్ ను ప్రశ్నించారు. ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి కాలుష్య శుద్ధి ఎలా జరుగుతుంది అన్న వివరాలు తెలుసుకుంటున్నారా? క్షేత్రస్థాయిలోకి వచ్చి ఈ మడుగులను ఎన్నిసార్లు పరిశీలించారు అని ప్రశ్నించారు. గోదావరి మధ్యలోని తూర్పులంకలో అతి పెద్ద మడుగులలో కాలుష్య కారకాలు ఉన్న నీటిని నిల్వ చేసి తర్వాత, గోదావరిలోకి ఇంకిపోయేలా చేయడం ఏమిటన్నారు. మడుగుల్లోని నీరు మొబైల్ కిట్ లో మరోసారి పరీక్షలు చేయించారు. అక్కడ గుర్రపు డెక్క భారీగా పేరుకొని ఉందంటే కచ్చితంగా జలాలు కలుషితం అయినట్లే కదా అన్నారు. * పెండింగ్ బకాయి రాబట్టలేరా? కూటమి ప్రభుత్వం పరిశ్రమలకు స్నేహపూర్వక భాగస్వామిగా ఉంటుంది. రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు వస్తే, యువతకు ఉపాధి దొరుకుతుందని, రాష్ట్ర ప్రగతి పరుగులు పెడుతుందని భావిస్తాం. అయితే ఇంత స్నేహపూర్వక వాతావరణంలో రాయితీలపై భూములు కేటాయిస్తున్నా సరే పరిశ్రమలు కాలుష్యం నివారణ విషయంలో సరైన దృష్టి పెట్టడం లేదు అనిపిస్తుంది. గాలి, నీరు కాలుష్యం విషయంలో ప్రతి పరిశ్రమ కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. ఆంధ్ర పేపర్ మిల్స్ యాజమాన్యం ప్రభుత్వానికి పన్నులు రూపేణా చెల్లించాల్సిన రూ. 13 కోట్ల బకాయిలను వెంటనే రాబట్టేలా జిల్లా యంత్రాంగం పనిచేయాలి. ప్రభుత్వం నుంచి రాయితీలు పొందుతూ బకాయిలు కట్టకపోతే ఎలా? దీనిపై సీరియస్ గా స్పందించండి. అలాగే ప్రతి ఏటా కాలుష్య నియంత్రణకు యాజమాన్యం ఎంత మేర చిత్తశుద్ధితో చర్యలు తీసుకుంటుందో..? పరిశీలించండి. ఇంత దారుణంగా కళ్ళముందే కాలుష్యం జరుగుతున్న ఇప్పటివరకు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు యాజమాన్యానికి ఎందుకు నోటీసు ఇవ్వలేదో కూడా నివేదిక ఇవ్వండి అని ఆదేశించారు. (1/2)
Deputy CMO, Andhra Pradesh tweet mediaDeputy CMO, Andhra Pradesh tweet mediaDeputy CMO, Andhra Pradesh tweet mediaDeputy CMO, Andhra Pradesh tweet media
తెలుగు
19
569
1.9K
95K
JanaSena ITWing retweetledi
JanaSena Shatagni
JanaSena Shatagni@JSPShatagniTeam·
"Pro-industry" is not meant to destroy people's health.
English
1
578
1.7K
12.7K
JanaSena ITWing retweetledi
JanaSena ITWing retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
ఈ రోజు నిర్వహించిన సమీక్ష, లాగూన్స్, ఆవ ఛానల్ పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
తెలుగు
5
379
1K
9.5K
JanaSena ITWing retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
బీసీలు బలహీనవర్గాలు కాదు... బలమైన వర్గాలు •విభేదాలు వీడి ఐక్యంగా నిలవాలి •51 శాతం జనాభా ఉన్నా ఎందుకు వెనుకబడుతున్నామనే ఆత్మ పరిశీలన బీసీ సంఘాలు చేసుకోవాలి •బీసీలు అధికారంలోకి వస్తే ఎంతో ఆనందిస్తాను •రాజమండ్రిలో బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులతో సమావేశమైన ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు ‘జనాభాపరంగా మెజారిటీ శాతాన్ని కలిగి ఉండి, ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తున్న బీసీలు బలహీన వర్గాలు కాదు. సమాజానికి వారే అత్యంత బలమైన వర్గాలు. బీసీలకు ఆర్థిక పరిపుష్టి లభించినప్పుడే నిజమైన రాజకీయ సాధికారత సిద్ధిస్తుంది. బీసీ సముదాయంలో ఉన్న అన్ని ఉప కులాలు, సామాజిక వర్గాలు విభేదాలను పక్కనబెట్టి ఐక్యంగా ముందుకు సాగాల’ని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని రాజమండ్రిలో కలిసి, వెనుకబడిన తరగతుల సంక్షేమం మరియు హక్కుల పరిరక్షణకు సంబంధించిన పలు కీలక డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ... “దేశ జనాభాలో 51 శాతానికి పైగా ఉన్న బీసీలు, అంతటి భారీ సంఖ్యాబలం ఉండి కూడా ఎందుకు బలమైన అధికారంలోకి రాలేకపోతున్నారో అన్ని బీసీ సంఘాలు తీవ్రంగా ఆలోచించాలి. బీసీ సామాజిక వర్గంలో ఎన్నో ఉప కులాలు ఉన్నాయి. వారిలో ఏ ఒక్కరికి పదవులు లేదా ఉన్నత అవకాశాలు వచ్చినా మన వాళ్లకే దక్కాయి అని సంతోషించే విశాల హృదయం అందరిలో రావాలి. అలా భావించినప్పుడే బీసీల మధ్య అంతర్గత కుమ్ములాటలు ముగుస్తాయి. మనలో ఒకరు ఎదుగుతుంటే మిగతావారు ప్రోత్సహించాల్సింది పోయి, కిందకు లాగాలని చూస్తే సమాజంలో బీసీలు ఎప్పటికీ ముందుకు వెళ్లరు. బీసీలు అన్ని రంగాల్లో ఎదగాలంటే ముందుగా తమలో ఉన్న లోపాలను సరిదిద్దుకోవాలని, ప్రతి ఒక్కరూ ఆత్మపరిశీలన చేసుకోవాలి. •తీర్మానాలతోనే ఐక్యత బీసీలు సంఘాలుగా బలమైన స్థానంలో ఉంటూ హక్కుల కోసం విజయవంతంగా పోరాటాలు చేస్తున్నప్పటికీ, రాజ్యాధికారం సాధించాలంటే ప్రతి సంఘం నుంచి చట్టబద్ధమైన తీర్మానాలు చేసుకోవడం అత్యంత అవసరం. కేవలం నినాదాలకే పరిమితం కాకుండా, ప్రతి ఉప కుల సంఘం తీర్మానాలు చేసుకుని తమ సంపూర్ణ ఐక్యతను చాటినప్పుడే ఇతరుల చేతుల్లో పావులుగా మారకుండా ఉంటారు. ఈ సత్యాన్ని గ్రహించి ప్రతి ఒక్కరూ భవిష్యత్తు కార్యాచరణ వైపు ముందడుగు వేయాలి. బీసీల అభివృద్ధి గురించి కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్వయంగా దేశ ప్రధాన మంత్రి గారే బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. దేశంలోని బీసీలందరూ బలంగా ఎదగాలని, అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని ఆయనకు కూడా బలమైన ఆకాంక్ష ఉంటుంది. కాబట్టి బీసీలందరూ అంతర్గత విభేదాలు పక్కనబెట్టి, సంఘాల వారీగా ఏకగ్రీవ తీర్మానాలతో ఐక్యమై, తమ రాజకీయ హక్కులను సాధించుకోవాలి. •వృత్తి ఆధారిత కులాల డీఎన్ఏలోనే అద్భుత కళా నైపుణ్యం వృత్తి ఆధారిత కులాల్లో అద్భుతమైన నైపుణ్యం, కళాత్మకత దాగి ఉంటాయి. నా స్నేహితుడు శ్రీ ఆనందసాయిలో ఉన్న అద్భుతమైన నైపుణ్యాన్ని చూసి నేను ఆశ్చర్యపోయాను. విశ్వకర్మల కళాత్మకత చాలా గొప్పది. ఈ దేశంలో అద్భుతమైన గుడులు కట్టాలన్నా, జీవం ఉట్టిపడే శిల్పాలు చెక్కాలన్నా ఆ నాలుగు ఉప కులాల డీఎన్ఏ ద్వారానే సాధ్యమవుతుంది. జపాన్ దేశంలో కుమ్మరి వృత్తి చేసే వారికి సమాజంలో అత్యున్నతమైన గౌరవం ఇస్తారు. అదే తరహా గౌరవాన్ని ఇక్కడ అన్ని వృత్తి కులాల వారికి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. బీసీలకు ఉన్నతమైన రాజకీయ పదవులు దక్కాలంటే అందరూ ఏకాభిప్రాయానికి రావడం ఎంతో ముఖ్యం. బీసీల్లో ఏ కులానికి అన్యాయం జరిగినా అన్ని కులాలు ఒక్కటై గొంతు ఎత్తాలి. వృత్తి ఆధారిత కులాల పట్ల నాకు అపరిమితమైన గౌరవం ఉంది. ఆయా వర్గాల ఆత్మగౌరవం కోసం నిరంతరం పోరాడతాను. ప్రతి ఒక్క బీసీ కులంలోనూ ఒక అద్భుతమైన నిద్రాణమైన కళ దాగి ఉంది. దానిని గుర్తించి సరిగ్గా ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టించవచ్చు. ఇందుకోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కుల కార్పొరేషన్లు కేవలం నామమాత్రంగా కాకుండా, ఆయా కులాల్లో దాగి ఉన్న అసలైన స్కిల్స్ ఏమిటో గుర్తించే వేదికలుగా మారాలి. •మీ ఐక్యతే ... మీ విజయం దేశ జనాభాలో అత్యంత పటిష్టమైన ‘ఓట్ బ్యాంక్’ కలిగిన బీసీలు.. సంఘాలుగా కలిసి వస్తున్నప్పటికీ, ఎన్నికల సమయానికి ఓట్లుగా విడిపోవడం వల్లే రాజ్యాధికారానికి దూరమవుతున్నారు. బీసీ నాయకులు అధికారంలోకి వస్తే ఎంతో ఆనందిస్తాను. రామ్ మనోహర్ లోహియా తన 'క్యాస్ట్ ఆఫ్ ఇండియా' పుస్తకంలో రాసినట్లు.. అన్ని బీసీ కులాలు ఏకమై ఏకతాటిపైకి రాగలిగితే బీసీల విజయానికి ఎదురుండదు. ఇందుకోసం కేవలం నినాదాలు కాకుండా, అత్యంత క్రమశిక్షణతో కూడిన ఒక వ్యూహాత్మక ప్రణాళిక ప్రకారం ముందుకు సాగాల”ని చెప్పారు.
JanaSena Party tweet mediaJanaSena Party tweet mediaJanaSena Party tweet mediaJanaSena Party tweet media
తెలుగు
5
485
1.7K
19.7K
JanaSena ITWing retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
JanaSena Party tweet mediaJanaSena Party tweet mediaJanaSena Party tweet mediaJanaSena Party tweet media
ZXX
0
174
694
11.3K
JanaSena ITWing retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
శ్రీ @PawanKalyan గారితో సినీ నిర్మాతలు భేటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారితో మంగళవారం రాత్రి రాజమహేంద్రవరంలో పలువురు తెలుగు సినీ నిర్మాతలు భేటీ అయ్యారు. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధి, సంబంధిత విషయాలపై చర్చించారు. ఈ సమావేశంలో నిర్మాతలు శ్రీ వై. రవిశంకర్, శ్రీ సూర్యదేవర నాగవంశీ, శ్రీ సాహు గారపాటి, శ్రీ కిలారు వెంకట సతీష్, శ్రీ చెరుకూరి సుధాకర్ పాల్గొన్నారు.
JanaSena Party tweet mediaJanaSena Party tweet media
తెలుగు
6
985
4.4K
36.5K
JanaSena ITWing retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో నువ్వు ఎలా గెలుస్తావో చూస్తాం అనేవాళ్లే ఎక్కువ. మనమంతా కులాలుగా విడిపోయి ఒక ఏకాభిప్రాయం లేకుండా ఉండిపోయాం. ఇన్ని వైరుధ్యాల మధ్య కూడా మనం నిలదొక్కుకున్నాం!
తెలుగు
4
374
1.1K
8.5K
JanaSena ITWing retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
పంచాయతీలు ఆర్థిక స్వావలంబన సాధించాలి * ఆన్లైన్ పన్నుల వసూళ్లతో విధానంతో పారదర్శకత పెరుగుతుంది * రాజవోలు గ్రామ పంచాయతీలో స్వయంగా ఆన్లైన్ పన్నుల విధానాన్ని పరిశీలించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు ‘సాంకేతికత వినియోగంతో పారదర్శకత పెరుగుతుంది. పంచాయతీ పన్నుల వసూలు ప్రక్రియ సరికొత్త మార్గంలో ముందుకు వెళ్లడం శుభపరిణామం’ అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు. గతంలో మాన్యువల్ పద్ధతిలో పన్ను వసూళ్లు ఉండేవని, దీన్ని పూర్తిగా మార్చి మొత్తం ఆన్లైన్ విధానం తీసుకు వచ్చామని చెప్పారు. పంచాయతీల్లో పన్నుల వసూళ్లకు నూతనంగా ప్రవేశపెట్టిన ఆన్లైన్ విధానాన్ని ఉప ముఖ్యమంత్రివర్యులు మంగళవారం స్వయంగా పరిశీలించారు. రాజమండ్రి రూరల్ మండలం, రాజవోలు గ్రామపంచాయతీ కార్యాలయానికి వెళ్లి అక్కడ జరుగుతున్న పన్నుల వసూలు విధానాన్ని పరిశీలించారు. పన్నులను ఆన్లైన్లో కడుతున్న వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ.. "కూటమి ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీతనంతో పని చేస్తుంది. ప్రజల నుంచి వసూలు చేసే ప్రతి పైసాను పారదర్శకంగా ఖర్చు చేస్తుంది. పంచాయతీలు స్వావలంబన సాధించాలంటే, ఆర్థికంగా వృద్ధి చెందాలి. స్వయంగా ఆదాయం ఆర్జించే స్థాయికి పంచాయతీలు రావాలి. ప్రతి అభివృద్ధి పనికి ప్రభుత్వం మీద ఆధారపడకుండా సొంతంగా అభివృద్ధి చేసుకునే దశకు పంచాయతీలు రావాలి. దీనికోసం ప్రభుత్వం తగిన విధంగా ప్రోత్సహిస్తోంది. నూతన విధానాలను పంచాయతీలు కూడా అందిపుచ్చుకొని, పన్నులు గ్రామ ప్రగతికి పునాదులు అనే విషయాన్ని ప్రజలకు తెలియజేయాలి" అన్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి వెంట మంత్రులు శ్రీ @mnadendla గారు, శ్రీ @kanduladurgesh గారు, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శ్రీ కాంతిలాల్ దండే గారు, పంచాయతీరాజ్ కమిషనర్ శ్రీ కృష్ణ తేజ గారు ఉన్నారు. *ఆవ ఛానెల్ పరిశీలన* రాజవోలు గ్రామపంచాయతీ నుంచి తిరిగి వస్తూ శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రిలో కీలకమైన ఆవాఎల్ చానల్ ను పరిశీలించారు. ఎస్టీపీ నుంచి వచ్చే ఈ ఛానెల్ పూర్తిగా వ్యర్ధాలతో నిండిపోయి ఉండటంపై శ్రీ పవన్ కళ్యాణ్ గారు అసహనం వ్యక్తం చేశారు. కలెక్టర్ శ్రీమతి కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ శ్రీ మేఘ స్వరూప్ లను పిలిచి కాలువలో వ్యర్ధాలు పేరుకుపోకుండా, ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యర్ధాలు నిలిచిపోకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పంచాయతీల్లో స్వచ్ఛరథాలు మాదిరిగా అర్బన్ ప్రాంతాల్లో కూడా ప్రత్యేకంగా ఏదైనా కార్యక్రమం నిర్వహించాలని చెప్పారు. భారీగా ప్లాస్టిక్ వ్యర్థాలు ఎందుకు పేరుకు పోతున్నాయనే విషయం మీదా, ఆ సమస్య మీద ప్రజల్లో అవగాహన కలిగించే కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని సూచించారు. దీనికి ప్రభుత్వం నుంచి తగిన సహకారం అందుతుందని, వెంటనే ఛానల్ సరిదిద్దే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. - గోదావరి పరీవాహకంలో కాలుష్య నివారణకు రూ.100 కోట్లు కృష్ణా, గోదావరి నదులను కాలుష్యం నుంచి రక్షించడానికి, వాటిని శుభ్రపరచడానికి మిషన్ క్లీన్ కృష్ణా, గోదావరి ప్రాజెక్టులు చేపట్టారు. అయితే అనుకున్నంత స్థాయిలో ఫలితాలు ఇవ్వలేదని గుర్తించారు. గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో నదీ జలాలు కాలుష్యం బారిన పడకుండా రూ.100 కోట్లను కేటాయిస్తున్నట్లు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. ఈ నిధుల ద్వారా మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలు నేరుగా కాలువల్లో కలకవకుండా నిరోధించడానికి ఉపయోగిస్తామని శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. నది, కాలువల్లోకి వెళ్లే మురికినీటిని శుద్ధి చేయడానికి ఎస్టీపీలను ఏర్పాటు చేయడం వంటి పనులను ఈ నిధులతో చేపట్టాలని నిర్ణయించారు. *వుడ్ బ్యాంక్ కోసం పంచాయతీరాజ్ - అటవీ శాఖ మధ్య అవగాహన ఒప్పందం* వుడ్ బ్యాంక్ కింద మొక్కలు కొనుగోలు చేయడానికి పంచాయతీరాజ్ - అటవీ శాఖల అవగాహన ఒప్పందం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.10 కోట్లను పంచాయతీరాజ్ శాఖ వారు అటవీ శాఖకు ఇస్తారు. అందుకు సంబంధించి అటవీ శాఖ కలపను త్వరగా ఇచ్చే మొక్కలను అందిస్తుంది. వాటితో పంచాయితీల్లో పల్లె వనాలు అభివృద్ధి చేస్తారు. అక్కడ వచ్చే కలపను అటవీ శాఖ కొనుగోలు చేసి వుడ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా అటు పంచాయతీలకు ఆదాయ ఆర్జన సాధ్యమవుతుంది, ఇటు పర్యావరణం మెరుగవుతుంది. ఇందుకు సంబంధించిన ఒప్పంద పత్రాలపై పీసీసీఎఫ్ శ్రీ చలపతి రావు, పి ఆర్ ఆర్డీ కమిషనర్ శ్రీ కృష్ణ తేజ సంతకాలు చేశారు.
JanaSena Party tweet mediaJanaSena Party tweet mediaJanaSena Party tweet mediaJanaSena Party tweet media
తెలుగు
2
327
972
10.6K
JanaSena ITWing retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
JanaSena Party tweet mediaJanaSena Party tweet mediaJanaSena Party tweet mediaJanaSena Party tweet media
ZXX
0
185
650
8.8K