Telangana Digital Media Wing

10.1K posts

Telangana Digital Media Wing banner
Telangana Digital Media Wing

Telangana Digital Media Wing

@DigitalMediaTG

Digital Media Wing, Education Dept., Govt. of Telangana

Katılım Mart 2020
80 Takip Edilen63.1K Takipçiler
Telangana Digital Media Wing retweetledi
Telangana CMO
Telangana CMO@TelanganaCMO·
LIVE: Hon'ble Chief Minister Sri A. Revanth Reddy Participates in the Inauguration of the Amara Raja Cell Manufacturing Facility, Visits the Plant and Addresses a Meeting at Amara Raja Giga Corridor, Divitipally, Mahabubnagar District x.com/i/broadcasts/1…
English
4
25
52
11K
Telangana Digital Media Wing retweetledi
Telangana CMO
Telangana CMO@TelanganaCMO·
LIVE: Hon'ble Chief Minister Sri A. Revanth Reddy Participates in Groundbreaking Ceremony of Amazon Data Centre at Bharat Future City, Ranga Reddy District | AWS x.com/i/broadcasts/1…
English
3
23
44
10.5K
Telangana Digital Media Wing
Telangana Digital Media Wing@DigitalMediaTG·
✅ నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా ధ్యేయంగా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉప కేంద్రాలను నిర్మిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఈరోజు అలంపూర్ నియోజకవర్గంలోని జులేకల్, పచ్చర్ల, పుల్లూరు, మేడికొండ ప్రాంతాల్లో నిర్మించిన 33/11 కెవి ఉపకేంద్రాలను ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖల మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు, మత్స్య, పశుసంవర్ధక, క్రీడల శాఖల మంత్రి శ్రీ వాకిటి శ్రీహరితో కలిసి డిప్యూటీ సీఎం శ్రీ మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించారు. ✅ దానితోపాటు ఎర్రవల్లి మండల కేంద్రం వద్ద రూ.155 కోట్ల నిధులతో 220/132/33 కెవి ఉపకేంద్రం నిర్మాణానికి కూడా డిప్యూటీ సీఎం ఇక్కడే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులకు ట్రాన్స్ఫార్మర్లను పంపిణీ చేశారు. అనంతరం సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రసంగించారు. జోగులాంబ గద్వాల జిల్లా వ్యాప్తంగా మంగళవారం రూ.376.25 కోట్ల విలువైన విద్యుత్ ఉప కేంద్రాల ప్రారంభోత్సవాలు చేయడం జరిగిందని డిప్యూటీ సీఎం అన్నారు. ✅ కార్యక్రమంలో ఎంపీ మల్లు రవి, ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ, షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, గొర్రెలు, మేకలు అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ సరిత, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, డీసీసీ అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి, ట్రాన్స్కో సీఎండి కృష్ణ భాస్కర్, టీజీ ఎస్పీడీసీఎల్ సిఎండి జితేష్ వి పాటిల్, సంస్థ డైరెక్టర్లు శివాజీ, నరసింహులు, రూరల్ జోన్ సీఈ బాలస్వామి తదితరులు పాల్గొన్నారు. #BhattiVikramarka #TelanganaPower #PoweringTelangana #TelanganaDevelopment #JogulambaGadwal #PrajaPalana #InfrastructureDevelopment @TelanganaCMO @revanth_anumula @Bhatti_Mallu @jupallyk_rao @Vakiti_srihari
Telangana Digital Media Wing tweet mediaTelangana Digital Media Wing tweet mediaTelangana Digital Media Wing tweet mediaTelangana Digital Media Wing tweet media
తెలుగు
0
2
6
604
Telangana Digital Media Wing
Telangana Digital Media Wing@DigitalMediaTG·
✳️ గ్రామీణ ప్రాంతాలల్లో ఇందిరమ్మ ఇండ్లతో పేద కుటుంబాల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజా ప్రభుత్వం ఇప్పుడు అదే సంకల్పంతో 'క్యూర్' పరిధిలోని పేదల సొంతింటి స్వప్నాన్ని నిజం చేసేందుకు మరో చారిత్రాత్మక అడుగు వేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార & పౌరసంబంధాల శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ✳️ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా 'క్యూర్' పరిధిలో దశల వారీగా లక్ష ఎల్.ఐ.జి. 'ఇందిరమ్మ ఇండ్ల'ను నిర్మించబోతున్నామని, ఇందుకు సంబంధించి ఇప్పటికే పరిపాలనా అనుమతులు కూడా ఇవ్వడం జరిగిందని మంత్రి అన్నారు. ఈరోజు సచివాలయంలోని తన కార్యాలయంలో 'క్యూర్' పరిధిలో ఎల్‌ఐజీ 'ఇందిరమ్మ ఇండ్ల'పై హౌసింగ్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ✳️ ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈ నెల 20వ తేదీన 'క్యూర్' పరిధిలో 'ఇందిరమ్మ ఎల్‌ఐజీ ఇండ్ల' పథకానికి శ్రీకారం చుడుతున్నామని ప్రకటించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఇన్‌చార్జి మంత్రులు శ్రీ పొన్నం ప్రభాకర్, శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు, హైదరాబాద్ జిల్లా మంత్రి శ్రీ మహ్మద్ అజారుద్దీన్‌తో కలిసి పథకానికి సంబంధించిన విధివిధానాలను, దరఖాస్తుల ఆహ్వానం, అర్హతలు, టెండర్ల ప్రక్రియ, అమలు విధానం తదితర పూర్తి మార్గదర్శకాలను ప్రకటిస్తామని వివరించారు. ✳️ 2026-27 ఆర్థిక సంవత్సరంలో 'క్యూర్' పరిధిలో లక్ష 'ఇందిరమ్మ ఎల్‌ఐజీ ఇండ్ల' నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, తొలి దశలో పైలట్ ప్రాజెక్టుగా ప్రతి నియోజకవర్గానికి కనీసం 500 చొప్పున ఆయా స్థానిక పరిస్థితులనుబట్టి అవసరమైన చోట వెయ్యి వరకు నిర్మిస్తామని తెలిపారు. ✳️ 'క్యూర్' పరిధిలో హైదరాబాద్, సైబరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నియోజకవర్గాలల్లో స్థలాలను గుర్తించడం జరిగిందని, ఈ స్థలాలను ఇప్పటికే హౌసింగ్ విభాగం పొజిషన్ లోకి తీసుకుందని, ఎక్కడ ఎన్ని ఇండ్లు, ఎన్ని అంతస్తులు నిర్మించాలి, ఒక్కో ప్లాట్ విస్తీర్ణం, బిల్డింగ్ డిజైన్ లను సీఎం శ్రీ రేవంత్ రెడ్డితో చర్చించి రెండు, మూడు రోజులల్లో తుది రూపు ఇస్తామని మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. #IndirammaIndlu #CUREHousing #CMRevanthReddy #PonguletiSrinivasReddy #HousingForAll #TelanganaDevelopment @TelanganaCMO @revanth_anumula @INC_Ponguleti
Telangana Digital Media Wing tweet media
తెలుగు
0
1
2
558
Telangana Digital Media Wing retweetledi
Damodar Raja Narasimha
Damodar Raja Narasimha@DamodarCilarapu·
❇️ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహా రాష్ట్రంలోని అన్ని గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ వైద్య సేవలను మరింత బలోపేతం చేయడం నా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. అందుకే ట్రైబల్ ఏరియాల్లోని ప్రభుత్వ హాస్పిటళ్ల అభివృద్ధికి ప్రత్యేక కొత్త పాలసీని తీసుకొస్తున్నాం. ❇️ ఐటీడీఏల పరిధిలో ఉన్న అన్ని ఏరియా హాస్పిటళ్లలో దశలవారీగా సీటీ స్కాన్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తాం. గిరిజన ప్రాంతాల్లో హాస్పిటళ్ల అభివృద్ధి విషయంలో కేవలం జనాభానే కాకుండా, ప్రజలు వైద్య సేవలు పొందేందుకు ప్రయాణించాల్సిన దూరాన్ని కూడా ప్రధాన ప్రమాణంగా తీసుకుంటాం. అవసరమైన చోట కొత్త సబ్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీలు) మంజూరు చేస్తాం. అలాగే ప్రస్తుతం ఉన్న పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా హాస్పిటళ్లను అవసరాన్ని బట్టి అప్‌గ్రేడ్ చేస్తాం. ❇️ ఈ అంశాలపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన గౌరవ ఎమ్మెల్యేలు, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సచివాలయంలో సమగ్ర సమీక్ష నిర్వహించాను. ప్రజలకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించాం. ❇️ సమీక్ష సందర్భంగా ఎమ్మెల్యేలు జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో గత రెండున్నర సంవత్సరాల్లో వైద్య సేవలు గణనీయంగా మెరుగుపడ్డాయని తెలిపారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నివారణకు ముందస్తు ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం, అవసరమైన మందులు అందుబాటులో ఉంచడం, ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టడం వంటి చర్యలను వారు అభినందించారు. ❇️ కొత్తగూడెం మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని, ఎంసీహెచ్‌కు ప్రత్యేక ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్‌ను నియమించాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహించే కొందరు డాక్టర్లు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు కోరారు. అలాగే ప్రతి మండలానికి ఒక అంబులెన్స్, కొత్తగా నాలుగు డయాలసిస్ సెంటర్లు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా హాస్పిటళ్లకు అదనపు అంబులెన్స్‌లు, సీటీ స్కాన్ యంత్రాలు, 24 గంటల వైద్య సేవల కోసం పీహెచ్‌సీల అప్‌గ్రేడేషన్, జనరేటర్ల ఏర్పాటు వంటి అంశాలను నా దృష్టికి తీసుకొచ్చారు. ❇️ రాష్ట్రంలోని అత్యంత మారుమూల గిరిజన ప్రాంతాల్లో నివసించే ప్రతి కుటుంబానికి కూడా పట్టణ ప్రాంతాల్లో లభించే స్థాయిలోనే వైద్య సేవలు అందించాలన్నదే నా సంకల్పం. అడవులు, కొండలు, రవాణా సమస్యలు ప్రజలకు వైద్య సేవలు అందడంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డంకి కాకూడదు. అందుకే ఇప్పటికే ఐటీడీఏ పీవోలతో సమావేశం నిర్వహించి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాం. ❇️ వర్షాకాలంలో మలేరియా, డెంగీ, వైరల్ జ్వరాలు, డయేరియా వంటి సీజనల్ వ్యాధులను నియంత్రించేందుకు ముందస్తు చర్యలు చేపట్టాం. కొత్తగూడెం జిల్లాలో ప్రతి మండలానికి ఒక అంబులెన్స్‌ను మంజూరు చేశాం. త్వరలోనే సీహెచ్‌సీలు, ఏరియా హాస్పిటళ్లకు అనుబంధంగా మరిన్ని అంబులెన్స్‌లను అందుబాటులోకి తీసుకొస్తాం. ❇️ జిల్లాలో ఇప్పటికే ఉన్న 7 డయాలసిస్ కేంద్రాలకు అదనంగా మరో 4 కేంద్రాలను మంజూరు చేశాం. ప్రతి రోగి కేవలం 20 నిమిషాల ప్రయాణంతో డయాలసిస్ సేవలు పొందేలా రాష్ట్రవ్యాప్తంగా డయాలసిస్ నెట్‌వర్క్‌ను విస్తరిస్తున్నాం. భద్రాచలం, అశ్వారావుపేట, ఎల్లందు సహా అన్ని ఏజెన్సీ ప్రాంతాల ఏరియా హాస్పిటళ్లలో దశలవారీగా సీటీ స్కాన్ సేవలను ప్రారంభిస్తాం. ❇️ ఎమ్మెల్యేలు చేసిన విజ్ఞప్తి మేరకు కొత్తగూడెం జిల్లా సహా అటవీ ప్రాంతాల్లోని అన్ని పీహెచ్‌సీల్లో జనరేటర్లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించాను. పట్వారిగూడెం, అన్నపెరటిపల్లి పీహెచ్‌సీలను అప్‌గ్రేడ్ చేస్తాం. గండుగులపల్లిలో కొత్త సబ్ సెంటర్ ఏర్పాటు చేస్తాం. కొమురారం ఆస్పత్రిని అప్‌గ్రేడ్ చేయడంతో పాటు ఎల్లందు ఆస్పత్రిలో కొత్త ఐసీయూను అందుబాటులోకి తీసుకొస్తాం. ❇️ ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్న డాక్టర్లు, సిబ్బందిలో ఎవరైనా భద్రాచలం, అశ్వారావుపేట వంటి గిరిజన ప్రాంతాల్లో సేవలందించేందుకు ముందుకు వస్తే వారికి అక్కడే పోస్టింగ్స్ ఇవ్వాలని అధికారులకు సూచించాను. అదే సమయంలో విధుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించే డాక్టర్లు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను. కొత్తగూడెం ఎంసీహెచ్‌లో డాక్టర్లు, సిబ్బంది హాజరును పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారిని నియమించాలని కూడా ఆదేశించాను. ❇️ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్లు, సిబ్బంది హాజరు పర్యవేక్షణ కోసం ఆధునిక కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నాం. ప్రజాప్రతినిధులు తరచూ ప్రభుత్వ ఆస్పత్రులను సందర్శించి సమస్యలను నా దృష్టికి తీసుకురావాలని కోరాను. ❇️ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహా రు చేశాం. త్వరలోనే సీహెచ్‌సీలు, ఏరియా హాస్పిటళ్లకు అనుబంధంగా మరిన్ని అంబులెన్స్‌లను అందుబాటులోకి తీసుకొస్తాం. @TelanganaHealth @TelanganaCMO @IPRTelangana @DigitalMediaTG @INCTelangana
Damodar Raja Narasimha tweet mediaDamodar Raja Narasimha tweet mediaDamodar Raja Narasimha tweet mediaDamodar Raja Narasimha tweet media
తెలుగు
2
11
29
763