Gudem Mahipal Reddy

2.8K posts

Gudem Mahipal Reddy

Gudem Mahipal Reddy

@GMRMLAPTC

Official Account of Gudem Mahipal Reddy - Hattrick MLA of Patancheru Constituency, Hyderabad, Telangana.

Patancheru, Hyderabad شامل ہوئے Aralık 2019
29 فالونگ13K فالوورز
Gudem Mahipal Reddy
Gudem Mahipal Reddy@GMRMLAPTC·
మానవ సేవయే మాధవ సేవ ప్రజల దాహార్తిని తీర్చడం అభినందనీయం శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ పటాన్చెరు మానవసేవయే మాధవసేవ అని, వేసవికాలంలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు శ్రీ భగవాన్ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం పటాన్చెరు బస్టాండ్ లో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ప్రశంసించారు. ఆదివారం ఉదయం స్థానిక నాయకులతో కలిసి చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సత్య సాయి బాబా సేవా సమితి ఆధ్వర్యంలో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో పాటు భక్తి భావాన్ని పెంపొందించేలా కార్యక్రమాలు రూపొందించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం మార్కెట్ రోడ్డులో మురళి కిరాణా యాజమాన్యం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సైతం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, సీనియర్ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, రామిరెడ్డి, రాజు, రామ్మోహన్ మల్లేష్, అజ్మత్, సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.
Gudem Mahipal Reddy tweet media
తెలుగు
0
1
8
97
Gudem Mahipal Reddy
Gudem Mahipal Reddy@GMRMLAPTC·
మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయాలు సదా ఆచరణీయం.. పూలే కు ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే జిఎంఆర్ పటాన్చెరు మహాత్మ జ్యోతిరావు పూలే గొప్ప సంఘ సంస్కర్తని, ఆయన యొక్క ఆలోచనలు, ఆశయాలను ప్రతి ఒక్కరు కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతిని పురస్కరించుకుని పటాన్చెరు పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పూలే చిత్ర పటానికి ఎమ్మెల్యే జిఎంఆర్ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. సమాజంలో అట్టడుగు వర్గాల వారిని చైతన్య పరచడంలో పాటు వెనుకబడిన వర్గాల బాలికల కోసం పాఠశాలను ఏర్పాటు చేసి విద్యను ప్రోత్సహించిన మహోన్నత వ్యక్తి పూలే అని కొనియాడారు. మహనీయుల స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించాలన్న సమున్నత లక్ష్యంతో నియోజకవర్గ వ్యాప్తంగా మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శివానందం, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, సీనియర్ నాయకులు రుద్రారం శంకర్, వెంకటేష్, శ్రీరాములు, చంద్రశేఖర్, వివిధ దళిత సంఘాల ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Gudem Mahipal Reddy tweet mediaGudem Mahipal Reddy tweet mediaGudem Mahipal Reddy tweet media
తెలుగు
0
3
19
141
Gudem Mahipal Reddy
Gudem Mahipal Reddy@GMRMLAPTC·
నూతన కాలనీలకు మంచి నీరు అందించండి జలమండలి ఎండి అశోక్ రెడ్డిని కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ పటాన్చెరు పటాన్చెరు నియోజకవర్గంలోని జలమండలి పరిధిలోగల నూతన కాలనీలకు సైతం రక్షిత మంచినీరు అందించేందుకు నిధులు కేటాయించాలని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి జలమండలి ఎండి అశోక్ రెడ్డిని కోరారు. గురువారం హైదరాబాద్ లోని జలమండలి కార్యాలయంలో ఎండి అశోక్ రెడ్డి ని కలిసి వివిధ అంశాలపై చర్చించారు. ప్రధానంగా అమీన్పూర్ డివిజన్ పరిధిలోని కిష్టారెడ్డిపేట గ్రామం, రాజరాజేశ్వరి కాలనీ ఫేజ్ 2, సృజన లక్ష్మీ కాలనీ ఫేజ్ 4, టైలర్స్ కాలనీ, లింగమయ్య కాలనీ, కె ఎస్ ఆర్ కాలనీలలో మంచినీటి సరఫరా లేకపోవడంతో ప్రజల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుత వేసవి కాలంలో ప్రతి రోజు ట్యాంకర్లను ఆశ్రయించాల్సి వస్తుందని తెలిపారు. పైన పేర్కొన్న కాలనీలలో నూతన పైపులైన్ల ఏర్పాటు కోసం ఇప్పటికే ప్రతిపాదనలు తయారు చేయడం జరిగిందని.. రెండు కోట్ల నిధులు మంజూరు చేస్తే నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ఎండి అశోక్ రెడ్డి.. అతి త్వరలో నిధుల మంజూరుకు ఆదేశాలు జారీ చేస్తామని తెలిపినట్లు ఎమ్మెల్యే జిఎంఆర్ పేర్కొన్నారు.
Gudem Mahipal Reddy tweet media
తెలుగు
0
2
7
147
Gudem Mahipal Reddy
Gudem Mahipal Reddy@GMRMLAPTC·
· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా.. · సి ఎస్ ఆర్ నిధుల తరలింపు పైన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం.. స్థానిక పరిశ్రమల CSR నిధులు స్థానిక అభివృద్ధి పనులకు కేటాయించాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్యకు వినతి.. నిధులు కేటాయించని పక్షంలో ప్రజా ఉద్యమం.. సంగారెడ్డి.. ఆసియాలోని అతిపెద్ద పారిశ్రామిక వాడగా పేరుందిన పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని పరిశ్రమల సిఎస్ఆర్ నిధులను స్థానిక అభివృద్ధి పనుల కోసం కేటాయించాలని పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం జిల్లా కలెక్టర్ ప్రావిణ్యకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. పచ్చటి పొలాలు.. మూడు పంటలు పండే భూములు.. స్వచ్ఛమైన గాలి.. అందమైన తమ పల్లెల పరిధిలో అభివృద్ధి కోసం నూతన పరిశ్రమలు ఏర్పాటు అయితే తమ గ్రామాలు అభివృద్ధి చెందడంతో పాటు స్థానికంగా ఉపాధి లభిస్తుందన్న కొంగత్త ఆశలతో పటాన్చెరు నియోజకవర్గ ప్రజలు 70వ దశకంలో పరిశ్రమల ఏర్పాటునకు స్వాగతం పలికారు అన్నారు. పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ఇస్నాపూర్, పాశమైలారం, పటాన్చెరు, జిన్నారం మండల పరిధిలోని గడ్డపోతారం, కాజీపల్లి, కిష్టాయపల్లి, బొల్లారం, గుమ్మడిదల మండల పరిధిలోని బొంతపల్లి, గుమ్మడిదల, అమీన్పూర్ మండల పరిధిలోని సుల్తాన్పూర్, గండి గూడెం, దయరా గ్రామాల పరిధిలో వివిధ రంగాలకు చెందిన పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ప్రధానంగా బల్క్ డ్రగ్స్ పరిశ్రమలతో పాటు కెమికల్స్, మెడిసిన్స్, పెస్టిసైడ్స్ కంపెనీలు ఏర్పాటయ్యాయని తెలిపారు. పటాన్చెరు నియోజకవర్గ కాలుష్య పరిస్థితులపై సుప్రీంకోర్టు సైతం జస్టిస్ మిగతా కమిషన్ ఏర్పాటు చేసి.. ప్రత్యేక నివేదిక తప్పించుకుంది. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ రంగరాజన్ సైతం స్వయంగా నియోజకవర్గంలో పర్యటించి కాలుష్య పరిస్థితులను తెలుసుకున్నారని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2016లో చెన్నైలోని జాతీయ హరిత ట్రిబ్యునల్ కాలుష్య నివారణ అంశంపై కీలక ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. కాలుష్యం మూలంగా వ్యాధులకు గురవుతున్న ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి తో పాటు.. ఇస్నాపూర్ పెద్ద చెరువు, గండిగూడెం, ఆసాని కుంట, కిష్టారెడ్డిపేట చెరువుల పరిధిలో సీవరేజ్ ట్రీట్మెంట్ సైతం ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని బల్క్ డ్రగ్స్ పరిశ్రమలు ప్రతి సంవత్సరం తమ లాభాల్లో 0.5 శాతం డబ్బులు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని ప్రత్యేక అకౌంట్లో జమ చేసి.. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్వహణకు ఆదేశాలు సైతం జారీ చేసిందన్నారు. 2023 లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని వివిధ పరిశ్రమలు అందిస్తున్న సి.ఎస్.ఆర్ నిధులను స్థానికంగా ఖర్చు చేయకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారని వివరించారు. నీళ్లు నిధులు నియామకాలు అన్న అంశంతో ఏర్పాటైన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో.. స్థానిక నిధులు స్థానికంగా ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు . ప్రతి రోజు కాలుష్య జలాలు.. విష వాయువులతో జీవనం కొనసాగిస్తున్న పటాన్చెరు నియోజకవర్గ ప్రజలకు పరిశ్రమలు అందిస్తున్న సి ఎస్ ఆర్ నిధుల ద్వారా వివిధ అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నాము. గత రెండున్నర సంవత్సరాలుగా సి ఎస్ ఆర్ నిధులు లేకపోవడం మూలంగా అభివృద్ధి కుంటూ పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై ప్రభుత్వం వెంటనే స్పందించి పటాన్చెరు నియోజకవర్గం నుండి చెల్లిస్తున్న సి ఎస్ ఆర్ నిధులను స్థానికంగా ఖర్చు పెట్టాలని.. లేని పక్షంలో ప్రజల నిరసనను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గుమ్మడిదల మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్, జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, మాజీ జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, దశరథ్ రెడ్డి, వెంకటేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
Gudem Mahipal Reddy tweet media
తెలుగు
1
4
19
230
Gudem Mahipal Reddy
Gudem Mahipal Reddy@GMRMLAPTC·
గుమ్మడిదల సర్వే నెంబర్ 109 రైతులకు వంద గజాల స్థలం ఇవ్వాల్సిందే.. అన్నారం రైతుల భూములు లాక్కుంటే ఉద్యమమే.. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి.. పటాన్చెరు రైతు ప్రభుత్వం అంటూ ప్రగల్బాలు పలుకుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. గుమ్మడిదల, అన్నారం రైతుల విషయంలో పక్షపాత వైఖరిని అవలంబిస్తూ.. వారి పాలిట ఆశనిపాతంగా మారుతోందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి విమర్శించారు. గుమ్మడిదల మున్సిపల్ కేంద్రంలోని సర్వే నంబర్ 109 లో గల 140 మంది రైతులకు సంబంధించిన 160 ఎకరాలను గత సంవత్సరం TGIIC కి ప్రభుత్వం కేటాయించింది. ఆ సమయంలో నష్టపరిహారంతో పాటు 100 గజాల ఇళ్ల స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చిన.. నేటి వరకు అమలుకావడం లేదంటూ మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో రైతులు మంగళవారం పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ భూములు సేకరించే సమయంలో అప్పటి కలెక్టర్ ఇచ్చిన హామీ మేరకు భూములు కోల్పోయిన 140 మంది రైతులకు 100 గజాలు చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించాల్సిందేనని అన్నారు. ఇళ్ల స్థలాల కోసం 5 ఎకరాలు సైతం ప్రత్యేకంగా కేటాయించారని రైతులు ఎమ్మెల్యే జిఎంఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్ తో చర్చించి.. ప్రతి రైతుకి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. అదే విధంగా అన్నారం పరిధిలోని సర్వేనెంబర్ 261లో 117 మంది పేద రైతులకు సంబంధించిన 117 ఎకరాల అసైన్డ్ భూములను పరిశ్రమలకు కేటాయించే నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజా ఉద్యమాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గుమ్మడిదల మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్, సీనియర్ నాయకులు వెంకటేష్ గౌడ్, షేక్ హుస్సేన్, రైతులు పాల్గొన్నారు.
Gudem Mahipal Reddy tweet mediaGudem Mahipal Reddy tweet mediaGudem Mahipal Reddy tweet mediaGudem Mahipal Reddy tweet media
తెలుగు
0
1
18
273
Gudem Mahipal Reddy
Gudem Mahipal Reddy@GMRMLAPTC·
మూడు కోట్ల 25 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే జిఎంఆర్.. అమీన్పూర్ అమీన్పూర్ డివిజన్ పరిధిలోని సాయి అంబికా కాలనీ నుండి ఐలాపూర్ తాండ వరకు, లాలా బాయి కాలనీ నుండి బొల్లారం ఇండస్ట్రియల్ ఏరియా వరకు మూడు కోట్ల 25 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సిసి రోడ్డు మరియు బిటి రోడ్డు నిర్మాణ పనులకు సోమవారం ఉదయం శంకుస్థాపన చేసిన పటాన్చెరు శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు. నూతన రహదారుల నిర్మాణం ద్వారా ఆయా కాలనీల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. నిర్దేశించిన గడువులోగా రహదారుల నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, ఈఈ సురేష్, మాజీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Gudem Mahipal Reddy tweet mediaGudem Mahipal Reddy tweet mediaGudem Mahipal Reddy tweet mediaGudem Mahipal Reddy tweet media
తెలుగు
0
2
22
258
Gudem Mahipal Reddy
Gudem Mahipal Reddy@GMRMLAPTC·
కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముత్తంగి డివిజన్ పరిధిలోని న్యూ టౌన్, డి ఎన్ కాలనీలలో పర్యటన పటాన్చెరు ఇటీవల జిహెచ్ఎంసిలో విలీనమైన ముత్తంగి డివిజన్ పరిధిలోని ప్రతి వార్డులో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శనివారం ఉదయం ముత్తంగి డివిజన్ పరిధిలోని డిఎన్ కాలనీ, న్యూటౌన్ కాలనీలలో ఎమ్మెల్యే జిఎంఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులతో సమావేశమై.. వారు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ప్రధానంగా కాలనీలు ఏర్పడినప్పుడు నిర్మించిన సిసి రోడ్లు, అంతర్గత మురికినీటి కాలువలు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్నాయని.. వెంటనే వాటిని ఆధునికరించాలని వారు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత జనాభాకు అనుగుణంగా సీసీ రోడ్లు, యుజిడిల నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని.. వెంటనే నిధులు మంజూరు చేస్తామని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్నామని తెలిపారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇటీవల జిహెచ్ఎంసిలో విలీనమైన ముత్తంగి పరిధిలోని ప్రతి కాలనీలో నూతన అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు డిప్యూటీ కమిషనర్ జ్యోతి రెడ్డి, ఈఈ సురేష్, మాజీ జెడ్పిటిసి శ్రీకాంత్ గౌడ్, మాజీ సర్పంచ్ ఉపేందర్, సీనియర్ నాయకులు సిల్వెరి శ్రీనివాస్, శ్రీనివాస్ గుప్తా, కుమార్ గౌడ్, మేరాజ్ ఖాన్, కిట్టు, సందీప్, రామకృష్ణ, అబేద్, యాదగిరి, బాబుల్ రెడ్డి, కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.
Gudem Mahipal Reddy tweet media
తెలుగు
0
2
23
372
Gudem Mahipal Reddy
Gudem Mahipal Reddy@GMRMLAPTC·
నిరుపేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిది ఎమ్మెల్యే జిఎంఆర్ 30 లక్షల రూపాయల విలువైన సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ పటాన్చెరు పేద మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య చికిత్స అందించడంలో ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తోందని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో.. నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలు, మున్సిపాలిటీలు, డివిజన్లకు సంబంధించిన 75 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ద్వారా మంజూరైన 30 లక్షల 67 వేల రూపాయల విలువైన చెక్కులను ఎమ్మెల్యే జిఎంఆర్ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో మెరుగైన వైద్య సహాయం అందించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తుందని ఆయన అన్నారు. నియోజకవర్గంలో అర్హులైన లబ్ధిదారులకు పూర్తి పారదర్శకతతో ప్రభుత్వ పథకాలు అందజేస్తున్నామని తెలిపారు.
Gudem Mahipal Reddy tweet media
తెలుగు
1
1
9
170
Gudem Mahipal Reddy
Gudem Mahipal Reddy@GMRMLAPTC·
విలీన గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి కృషి.. నూతన డివిజన్ల ఏర్పాటు తథ్యం.. మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత.. సుల్తాన్పూర్ లో కోటి రూపాయలతో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణం.. వడకపల్లిలో 9.80 కోట్ల రూపాయలతో రాక్ పార్క్.. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అమీన్పూర్ అమీన్పూర్ డివిజన్ పరిధిలోని వడకపల్లి, కిష్టారెడ్డిపేట, ఐలాపూర్, సుల్తాన్పూర్, దయార, పటేల్ గూడ, ఐలాపూర్ తండా, జానకంపేట గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఉదయం అమీన్పూర్ డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్, ఇంజనీరింగ్ ఈఈ సురేష్, మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి లతో కలిసి విలీన గ్రామాలలో ఎమ్మెల్యే జిఎంఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా పెండింగ్ పనులు, నూతనంగా చేపట్టబోయే అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎనిమిది గ్రామాల పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. కిష్టారెడ్డిపేట గ్రామ పరిధిలోనీ జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవన నిర్మాణ పనులు నత్త నడక కొనసాగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే లోపు పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వడక పల్లి గ్రామంలో గల పురాతన కోటను అభివృద్ధిపరిచేందుకు హెచ్ఎండిఏ నిధులు మంజూరు చేసిందని తెలిపారు. 9 కోట్ల 80 లక్షల రూపాయలతో కోట చుట్టూ రాక్ పార్కు అభివృద్ధి చేసేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. పూర్తిస్థాయిలో సర్వే నిర్వహించి.. అతి త్వరలో పార్కు నిర్మాణానికి శంకుస్థాపన చేయబోతున్నట్లు తెలిపారు. సుల్తాన్పూర్ గ్రామంలో మోల్డ్ టెక్ పరిశ్రమ సహకారంతో ఒక కోటి రూపాయలతో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయబోతున్నట్లు తెలిపారు. సుల్తాన్పూర్ లో నూతనంగా నిర్మించిన ఫంక్షన్ హాల్, మల్లన్న దేవాలయాన్ని అతి త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలో జనాభాకు అనుగుణంగా మరో ఐదు డివిజన్లు ఏర్పాటు చేయాలని ఇప్పటికే ప్రభుత్వానికి విన్నవించడం జరిగిందని తెలిపారు. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆయన ఆశభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అందించే నిధులతో పాటు సి ఎస్ ఆర్ నిధులతో అభివృద్ధిని పరుగులు పెట్టించబోతున్నట్లు తెలిపారు. అనంతరం దయరా గ్రామంలో యూత్ బిల్డింగ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సత్యనారాయణ, రాజు, కృష్ణ, పాండు, శ్రీకాంత్, మల్లేష్, భాస్కర్ గౌడ్, మల్లేష్, శ్రీకాంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Gudem Mahipal Reddy tweet mediaGudem Mahipal Reddy tweet media
తెలుగు
0
2
21
396
Gudem Mahipal Reddy
Gudem Mahipal Reddy@GMRMLAPTC·
పటాన్చెరులో శోభాయమానంగా హనుమాన్ జయంతి వేడుకలు.. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే జిఎంఆర్.. పటాన్చెరు పటాన్చెరు పట్టణంలో హనుమాన్ జయంతి వేడుకలు శోభాయమానంగా జరుగుతున్నాయి. గురువారం హనుమాన్ జయంతిని పురస్కరించుకొని పటాన్చెరు డివిజన్ పరిధిలోని గౌతమ్ నగర్, మహాదేవుని ఆలయం, చైతన్య నగర్, నర్ర బస్తి, శాంతినగర్, జెపి కాలనీ పంచముఖి హనుమాన్ దేవాలయాలలో నిర్వహించిన హనుమాన్ జయంతి వేడుకలలో ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొని స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందువులందరూ సనాతన ధర్మాన్ని ఆచరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు.. భారతీయ పురాణాలలో అపారమైన భక్తి, శక్తి, ధైర్యానికి ప్రతీకగా నిలిచిన హనుమంతుని జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయంగా నిలుస్తుందని అన్నారు. నేటితరం యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు. అనంతరం పంచముఖి హనుమాన్ దేవాలయం వద్ద వీర హనుమాన్ శోభాయాత్రను జెండా ఊపి ప్రారంభించారు.
Gudem Mahipal Reddy tweet mediaGudem Mahipal Reddy tweet mediaGudem Mahipal Reddy tweet media
తెలుగు
0
2
30
432
Gudem Mahipal Reddy
Gudem Mahipal Reddy@GMRMLAPTC·
పటాన్చెరు శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి ప్రెస్ మీట్ కామెంట్స్.. హరీష్ రావును విమర్శించే స్థాయి నీదా వసూల్ రాజా.. అభివృద్ధి నినాదం మాది.. అవినీతి చరిత్ర నీది.. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బుల్లెట్ దించిన బుద్ధి రాలేదు.. మంత్రి కుమార్తె వివాహం ఖర్చుల పేరుతో కోట్ల రూపాయల వసూళ్లు నిజం కాదా.. సొంత కుటుంబాన్ని ద్రోహం చేసిన చరిత్ర నీది.. నీ స్వార్థం కోసం కన్న తల్లిని సైతం పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కించావు కదా.. మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని అమ్ముకున్నది నిజం కాదా.. ఎన్నికలు వస్తే నీకు పండగే కదా.. రేటు కట్టి మరీ బీఫాంలు అమ్ముకోవడం మీకు అలవాటే కదా.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే గల్లికో కలెక్షన్ ఏజెంట్ పెట్టి వసూలు చేయడం అబద్ధమా.. గత రెండున్నర సంవత్సరాలలో నీ వసూల్ చిట్టా విప్పమంటావా కాటా. అమీన్పూర్ సర్పంచ్ గా ప్రజలు నమ్మి గెలిపిస్తే.. రెండేళ్లలో రిమూవ్ అయ్యావు.. గుర్తులేదా.. ఒక సర్పంచ్ పదవిని పూర్తి కాలం పనిచేయలేని అసమర్థుడు కాటా శ్రీనివాస్ గౌడ్.. నమ్ముకున్న ప్రజల కోసం వందల ఎకరాలు అమ్ముకున్న చరిత్ర నాది.. గజం భూమి కబ్జా చేసినట్లు నిరూపిస్తే బహిరంగ విచారణకు సిద్ధం.. మైనింగ్ కేసులపై పూర్తి వివరణ 2012 లో పటాన్చెరు మండల రెవెన్యూ పరిధిలోని లకడారం గ్రామంలో సర్వే నంబర్ 738 లో సంతోష్ సాండ్ అండ్ గ్రానైట్ సప్లై పేరుతో No.439/QL/2010 ప్రభుత్వ ప్రొసీడింగ్స్ తో 2012 లో 15 సంవత్సరాల లీజు తో ప్రారంభించడం జరిగింది. మా సంస్థకు క్వారీ కేటాయించిన భూమిలో అప్పటికే ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ సంస్థ జాతీయ రహదారి కోసం పెద్ద ఎత్తున మైనింగ్ చేయడం జరిగింది. అప్పట్లోనే ఈ విషయాన్ని సంబంధిత మైనింగ్ శాఖ అధికారుల సైతం తెలపడం జరిగింది. అనంతరం ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా క్వారీని నడపడం జరిగింది. 2023 సంవత్సరంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 2024 లో కేవలం రాజకీయ కక్షతో అనుమతికి మించి మైనింగ్ చేస్తున్నారంటూ నిబంధనలకు విరుద్ధంగా సీజ్ చేయడం జరిగింది. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 520 కి క్రషర్ క్వారీలకు సైతం నోటీసులు అందించారు. కేవలం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోదరుడి క్వారీ అన్న కక్షతో నిబంధనలను తుంగలో తొక్కి.. క్వారీ ప్రతినిధులు లేకుండానే.. అడ్డగోలుగా సర్వే నిర్వహించి 300 కోట్ల రూపాయల జరిమానా విధించింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఈ అంశంపై ఫిజికల్ గా రీ సర్వే నిర్వహించాలని రాష్ట్ర హైకోర్టుకి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సైతం విజ్ఞప్తి చేయడం జరిగింది. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం రీ సర్వే చేయాలని ఆదేశాలు జారీ చేసిన.. నేటి వరకు రీ సర్వే చేయలేదంటే దాని వెనక ఎవరు ఉన్నారో ప్రజలు అర్థం చేసుకోవచ్చు. పటాన్చెరు రెవెన్యూ పరిధిలోని పోచారం సర్వే నంబర్ 62 లో గల 5 ఎకరాలకు సంబంధించిన పూర్తి వివరాలు. 1.1974 సంవత్సరంలో వెంకటేశ్వర్లు అనే స్వాతంత్ర సమరయోధుడికి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం స్వాతంత్ర సమరయోధుని కోటా కింద పోచారం పరిధిలోని సర్వే నంబర్ 62లో 5 ఎకరాలు కేటాయించడం జరిగింది. 2.1997 సంవత్సరంలో వెంకటేశ్వరరావు గారు తన ఐదు ఎకరాలను శంకర్ లాల్ గారికి విక్రయించడం జరిగింది. 3.1998 నుండి శంకర్ లాల్ గారు ఈ ఐదు ఎకరాలను వివిధ వ్యక్తులకు విక్రయించడం జరిగింది. ఈ భూమికి సంబంధించి మాకు గాని మా కుటుంబ సభ్యుల గాని ఎటువంటి సంబంధం లేదు. మరోసారి ఈ అంశంపై వివాదాస్పద ఆరోపణలు చేస్తే పరువు నష్టం దావా వేయడం జరుగుతుంది. @BRSparty @BRSHarish
Gudem Mahipal Reddy tweet mediaGudem Mahipal Reddy tweet mediaGudem Mahipal Reddy tweet mediaGudem Mahipal Reddy tweet media
తెలుగు
6
32
358
27.1K
Gudem Mahipal Reddy
Gudem Mahipal Reddy@GMRMLAPTC·
రామేశ్వరంబండ సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి రామేశ్వరంబండ జిహెచ్ఎంసి ఇంద్రపురి కాలనీలో సిసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన పటాన్చెరు ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని రామేశ్వరంబండ సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం సాయంత్రం రామేశ్వరంబండ పరిధిలోని ఇంద్రపురి కాలనీలో పది లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో రామేశ్వరంబండ పరిధిలోని నాలుగు వార్డుల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు భారీ విజయాన్ని అందించడం పట్ల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ప్రతి హామీ నెరవేర్చేందుకు ప్రణాళిక బద్దంగా నిధులు కేటాయించడంతోపాటు నిర్దేశించిన లక్ష్యంలోగా పనులు పూర్తి చేస్తామని తెలిపారు. రాబోయే రోజుల్లోనూ మరిన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పూర్తి పారదర్శకతతో ప్రభుత్వ పథకాలు అందజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ప్రమీల, మున్సిపల్ కమిషనర్ అజయ్ రెడ్డి, వైస్ చైర్మన్ హరీష్ రెడ్డి, కౌన్సిలర్లు అంతిరెడ్డి, రమేష్, వంకదోత్ రమేష్, మాజీ ప్రజా ప్రతినిధులు, కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Gudem Mahipal Reddy tweet mediaGudem Mahipal Reddy tweet mediaGudem Mahipal Reddy tweet mediaGudem Mahipal Reddy tweet media
తెలుగు
0
2
11
585
Gudem Mahipal Reddy
Gudem Mahipal Reddy@GMRMLAPTC·
శ్రీ కోదండ సీతారామచంద్ర స్వామి వారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి దంపతులు.. పటాన్చెరు శ్రీరామనవమి పర్వదినం పురస్కరించుకొని పటాన్చెరు డివిజన్ పరిధిలోని ప్రఖ్యాత శ్రీ కోదండ సీతారామచంద్రస్వామి ఆలయంలో నిర్వహించనున్న కళ్యాణ మహోత్సవం పురస్కరించుకొని పటాన్చెరు శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి యాదమ్మ దంపతులు స్వామి వారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. శుక్రవారం ఉదయం భాజా భజంత్రీలు, ఉత్సవ కమిటీ సభ్యులు, కుటుంబ సభ్యులతో కలిసి తమ నివాసం నుండి రామాలయం వరకు భక్తి భావంతో బయలుదేరి స్వామివార్లకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.. ఈ రోజు మధ్యాహ్నం అభిజిత్ లగ్నంలో సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నట్లు ఎమ్మెల్యే జి.ఎం.ఆర్ తెలిపారు. పటాన్చెరు నియోజకవర్గ ప్రజలందరికీ శ్రీరామనవమి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
Gudem Mahipal Reddy tweet mediaGudem Mahipal Reddy tweet mediaGudem Mahipal Reddy tweet mediaGudem Mahipal Reddy tweet media
తెలుగు
0
1
5
304
Gudem Mahipal Reddy
Gudem Mahipal Reddy@GMRMLAPTC·
అభివృద్ధిలో పరిశ్రమల భాగస్వామ్యం మరింత పెరగాలి పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి బొల్లారంలో..ఐటిసి పరిశ్రమ ఆధ్వర్యంలో పాఠశాలలకు కంప్యూటర్లు, బల్దియాకు ఆటోల పంపిణీ.. బొల్లారం పరిశ్రమలు తమ సామాజిక బాధ్యత (CSR) నిధుల ద్వారా గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి మరింత సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. గురువారం అమీన్పూర్ సర్కిల్ బొల్లారం డివిజన్ పరిధిలో ఐటీసీ పరిశ్రమ సౌజన్యంతో 32 లక్షల రూపాయలతో కొనుగోలు చేసిన కంప్యూటర్లు, చెత్త సేకరణ ఆటోలు, త్రీ చక్ర సైకిళ్ల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే జి.ఎం.ఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బొల్లారం పరిధిలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, తెలంగాణ మోడల్ స్కూల్ పాఠశాలలకు 15 కంప్యూటర్లు, రెండు ప్రింటర్లు, బొల్లారం మున్సిపల్ విభాగానికి 8 చెత్త సేకరణ ఆటోలు, దివ్యాంగుల కోసం 3 త్రి చక్ర సైకిళ్లను లను ఎమ్మెల్యే జిఎంఆర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐటీసీ కంపెనీ తన సామాజిక బాధ్యతలో భాగంగా పాఠశాలల అభివృద్ధికి, బొల్లారం డివిజన్ పరిధిలో పారిశుధ్యం పెంపొందించేందుకు సహకారం అందించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లోనూ మరిన్ని అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని కోరారు. పటాన్చెరు నియోజకవర్గంలో ప్రభుత్వం అందించే నిధులతో పాటు స్థానికంగా ఏర్పాటుచేసిన పరిశ్రమల సహకారంతో సిఎస్ఆర్ నిధులను అభివృద్ధి పనులకు కేటాయిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం, పరిశ్రమలు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు కలిసి పనిచేస్తే అభివృద్ధి సుసాధ్యం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అత్యున్నత ప్రమాణాలతో విద్యను అందిస్తున్నామని.. ప్రతి విద్యార్థి లక్ష్యంతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విజ్ఞప్తి చేశారు.
Gudem Mahipal Reddy tweet media
తెలుగు
0
0
4
200
Gudem Mahipal Reddy
Gudem Mahipal Reddy@GMRMLAPTC·
గ్రామాల సమగ్ర అభివృద్ధి మా లక్ష్యం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మెదక్ ఎంపీ రఘునందన్ రావు తో కలిసి గుమ్మడిదల మండలంలో ఎన్ఆర్ఇజిఎస్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన గుమ్మడిదల గ్రామాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తూ.. నిధులు కేటాయిస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బుధవారం గుమ్మడిదల మండల పరిధిలోని వీరారెడ్డిపల్లి, రామిరెడ్డిబావి, కానుకుంట గ్రామాలలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన వివిధ అభివృద్ధి పనులకు మెదక్ ఎంపీ రఘునందన్ రావుతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత అందిస్తున్నామని తెలిపారు. గ్రామాలలో అంతర్గత రహదారులతో పాటు గ్రామాల మధ్య అనుసంధాన రోడ్లను నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం అందించే నిధులతో పాటు పరిశ్రమల భాగస్వామ్యంతో సిఎస్ఆర్ నిధులు సైతం అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తున్నామని తెలిపారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. @BRSparty
Gudem Mahipal Reddy tweet mediaGudem Mahipal Reddy tweet mediaGudem Mahipal Reddy tweet mediaGudem Mahipal Reddy tweet media
తెలుగు
0
0
3
171
Gudem Mahipal Reddy
Gudem Mahipal Reddy@GMRMLAPTC·
అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు.. నిరుపేదలకు సొంతింటి కలను సాకారం చేయడమే మా లక్ష్యం లబ్ధిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలి.. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్చెరు పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో అర్హులైన ప్రతి ఒక్కరికి సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని స్థానిక శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని లకడారం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు ప్రోసిడింగ్ పత్రాలతో పాటు.. గృహ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇల్లు లేని నిరుపేదలకు సొంత స్థలం ఉంటే ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తూ సొంతింటిని నిర్మించడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం లక్ష్యమని తెలిపారు. నియోజకవర్గం వ్యాప్తంగా 3500 ఇల్లు మంజూరు అయ్యాయని తెలిపారు. ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన వారిని గుర్తించి లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. పూర్తి పారదర్శకతతో రాజకీయాలకు అతీతంగా అర్హులకే వీటిని కేటాయించడం జరిగిందని స్పష్టం చేశారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని దుర్వినియోగం చేయకుండా ఇళ్లను నిర్మించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇళ్ల కోసం దళారులను ఆశ్రయించి మోసపోవద్దని కోరారు. ఇళ్ల నిర్మాణ దశకు అనుగుణంగా నిధులు విడుదల అవుతాయని తెలిపారు. నియోజకవర్గ పరిధిలో ఇల్లు లేని కుటుంబాలు వేల సంఖ్యలో ఉన్నాయని.. ఇందుకు అనుగుణంగా ఇళ్ల కేటాయింపును పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సుమలత, మున్సిపల్ కమిషనర్ వెంకట కిషన్, స్థానిక కౌన్సిలర్లు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Gudem Mahipal Reddy tweet mediaGudem Mahipal Reddy tweet mediaGudem Mahipal Reddy tweet mediaGudem Mahipal Reddy tweet media
తెలుగు
0
0
2
170