FactCheck_Telangana

398 posts

FactCheck_Telangana banner
FactCheck_Telangana

FactCheck_Telangana

@FactCheck_TG

Fact-checking misinformation on Telangana, and the State Government's initiatives.

Hyderabad, India 加入时间 Nisan 2022
19 关注10.9K 粉丝
FactCheck_Telangana
FactCheck_Telangana@FactCheck_TG·
అధికారిక ప్రకటన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హైడ్రా (HYDRAA) అధికారులకు, తెలంగాణ హై కోర్టు నోటీసులు జారీ చేసింది అంటూ, సామాజిక మాధ్యమాలలో ఒక ఫేక్ నోటీసు ప్రచారంలో ఉంది. ఈ నోటీసు నకిలీది. దీనిని కావాలనే ఉద్దేశపూర్వకంగా, తప్పుదోవ పట్టించేవిధంగా తయారు చేసారు. ఈ విషయం గురించి, హైడ్రా (HYDRAA) కూడా తమ అధికారిక ప్రకటనలో, ఈ నోటీసు నకిలీది అని తేల్చిచెప్పింది. ఆ నోటీసుకు ఎలాంటి అధికారిక విలువ లేదని స్పష్టం చేసింది. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ➤ ప్రచారం లో ఉన్న నోటీసును హైకోర్టు జారీ చేయలేదు. ➤ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి దీనిని ఎవరో సృష్టించారు. ➤ ఇలాంటి ఫేక్ నోటీసులను సృష్టించడాన్ని, ప్రచారం చేయడాన్ని హైడ్రా తీవ్రంగా ఖండించింది. అధికారిక చర్యలు ➤ ఈ నోటీసు విషయమై, అధికారికంగా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ➤ సైబర్ పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. రాజ్యాంగబద్దమైన లేదా ప్రభుత్వ అధికారిక సంస్థల పేరు మీద, ఇలాంటి ఫేక్ నోటీసులు జారీ చేయడం అనేది చట్టరిత్యా నేరం. ప్రజలు ఇలాంటి తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని, కేవలం అధికారిక వెబ్సైట్ల ద్వారా వెలువడిన సమాచారాన్ని మాత్రమే నమ్మాలని తెలియజేస్తున్నాము. ప్రభుత్వ ధ్రువీకరణ లేని సమాచారాన్ని షేర్ చేయకండి. తెలంగాణ ప్రభుత్వం
FactCheck_Telangana tweet media
తెలుగు
0
3
6
928
FactCheck_Telangana
FactCheck_Telangana@FactCheck_TG·
📢 OFFICIAL CLARIFICATION ━━━━━━━━━━━━━━━━━━━━ Certain media reports and social media posts are circulating a purported notice in the name of the High Court for the State of Telangana, claiming that the Hon’ble Chief Minister Shri A. Revanth Reddy and HYDRAA officials have been directed to appear before the Court. ❌ This notice is FAKE. The Hyderabad Disaster Response and Asset Protection Agency (HYDRAA) has categorically clarified that the document being circulated is fabricated and has no authenticity. ➤ The alleged notice circulating on social media is not issued by the Hon’ble High Court. ➤ It is a forged document created to mislead the public. ➤ HYDRAA has strongly condemned the creation and circulation of such fake notices. ⚖️ Action Initiated ➤ A formal complaint has been lodged with Cyber Crime Police regarding the circulation of this fake notice. ➤ Cyber Police have initiated an investigation into the matter. The creation and dissemination of fake documents in the name of constitutional institutions is a serious offence. Citizens are advised to verify information through official sources and refrain from sharing unverified content. ━━━━━━━━━━━━━━━━━━━━ Government of Telangana ━━━━━━━━━━━━━━━━━━━━
FactCheck_Telangana tweet media
English
0
2
2
340
FactCheck_Telangana
FactCheck_Telangana@FactCheck_TG·
అధికారిక వివరణ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల విడుదలను ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేస్తున్నారంటూ, సామాజిక మాధ్యమాలలో కొన్ని తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్నాయి. కానీ, ఇందులో ఎటువంటి వాస్తవము లేదు. ఇంటర్మీడియట్ ఫలితాల ప్రకటన నిర్ణీత షెడ్యూల్ ప్రకారం జరుగుతుందని, తెలంగాణ ప్రభుత్వ విద్యాశాఖ స్పష్టం చేసింది. ఇంతకుముందు కూడా ఎప్పుడు ఏప్రిల్ మొదటి వారంలో ఫలితాలు విడుదల కాలేదు. గతంలో ఫలితాలు విడుదలైన తేదీలు: ➤ 2014 – మే 3 ➤ 2015 – ఏప్రిల్ 22 ➤ 2016 – ఏప్రిల్ 22 ➤ 2017 – ఏప్రిల్ 16 ➤ 2018 – ఏప్రిల్ 13 ➤ 2019 – ఏప్రిల్ 18 ➤ 2020 – జూన్ 18 (కోవిడ్ కారణంగా అందరినీ పాస్ చేయటం జరిగింది) ➤ 2021 – జూన్ 28 (కోవిడ్ కారణంగా అందరినీ పాస్ చేయటం జరిగింది) ➤ 2022 – జూన్ 28 ➤ 2023 – మే 9 ➤ 2024 – ఏప్రిల్ 24 ➤ 2025 – ఏప్రిల్ 22 ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, జవాబు పత్రాల మూల్యాంకనం, ఇతర అంశాలను బట్టి ఫలితాల విడుదల అయ్యే తేదీలు ప్రతి ఏటా మారుతుంటాయి. అదే విధంగా, ఈ సంవత్సరం కూడా కొనసాగుతుంది. మూల్యాంకన సమయాన్ని బట్టి, ఫలితాల విడుదల ప్రకటన చేస్తారు. ఇంటర్మీడియట్ ఫలితాల విషయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా విద్యాశాఖ ఇచ్చే అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని కోరుతున్నాము. సామాజిక మాధ్యమాలలో ప్రచారమయ్యే తప్పుడు వార్తలను నమ్మవద్దు. విద్యాశాఖ తెలంగాణ ప్రభుత్వం
FactCheck_Telangana tweet media
తెలుగు
2
2
4
1.2K
FactCheck_Telangana
FactCheck_Telangana@FactCheck_TG·
📢 OFFICIAL CLARIFICATION ━━━━━━━━━━━━━━━━━━━━ Certain posts circulating on social media regarding the announcement of Intermediate examination results are factually incorrect and misleading. The Education Department, Government of Telangana, clarifies that the timeline for declaration of Intermediate results follows an established schedule, and there is no deviation from standard practice. 📊 Previous Years’ Result Announcement Dates ➤ 2014 – May 3 ➤ 2015 – April 22 ➤ 2016 – April 22 ➤ 2017 – April 16 ➤ 2018 – April 13 ➤ 2019 – April 18 ➤ 2020 – June 18 (All Pass – COVID) ➤ 2021 – June 28 (All Pass – COVID) ➤ 2022 – June 28 ➤ 2023 – May 9 ➤ 2024 – April 24 ➤ 2025 – April 22 ➤ The result declaration dates vary each year depending on evaluation timelines and administrative processes. ➤ The current schedule is consistent with past trends. The process of evaluation and result preparation is being carried out as per due procedure. Students and parents are advised to rely only on official updates from the Education Department regarding Intermediate results. ━━━━━━━━━━━━━━━━━━━━ Education Department Government of Telangana ━━━━━━━━━━━━━━━━━━━━
FactCheck_Telangana tweet media
English
1
5
6
6.4K
FactCheck_Telangana
FactCheck_Telangana@FactCheck_TG·
అధికారిక ప్రకటన హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులో కీలక ముందడుగు పడింది. బేగంపేట విమానాశ్రయం రన్‌వే కింద భూగర్భ (అండర్ గ్రౌండ్) అండర్‌పాస్ నిర్మించేందుకు 'ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా' (AAI) పచ్చజెండా ఊపింది. కీలక అంశాలు: ➤ ఆమోదం పొందిన డిజైన్ ప్రకారం, రన్‌వే కింద 600 మీటర్ల పొడవుతో ఆరు లేన్ల అండర్‌పాస్‌ను నిర్మిస్తారు. ➤ ప్యారడైజ్ జంక్షన్ నుండి మిలిటరీ డైరీ ఫామ్ రోడ్ (NH-44) వరకు నిర్మించ తలపెట్టిన 5.4 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్‌లో ఈ అండర్‌పాస్ అంతర్భాగం. ప్రాజెక్ట్ సంబంధించిన వివరాలు: ➤ ఈ కారిడార్ సికింద్రాబాద్, తాడ్‌బండ్ మరియు బోయిన్‌పల్లి మీదుగా వెళ్లి డైరీ ఫామ్ రోడ్ వద్ద ముగుస్తుంది. ➤ విమానాశ్రయం రన్‌వేకు దగ్గర్లో ఫ్లైఓవర్ తరహా (ఎలివేటెడ్) నిర్మాణాలు చేపట్టడం నిబంధనల ప్రకారం సాధ్యం కాదు. కాబట్టి, దానికి ప్రత్యామ్నాయంగా ఈ అండర్‌పాస్‌ను డిజైన్ చేశారు. ఇలా డిజైన్ చేయడం వల్ల తాడ్‌బండ్ వద్ద ఉన్న ప్రమాదకరమైన మలుపులను నివారించి, వాహనాలు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సాఫీగా వెళ్లేందుకు వీలవుతుంది.. దీనికోసం భూసేకరణ & అమలు: ➤ ఈ ఒక్క కారిడార్ కోసమే 42 ఎకరాల రక్షణ శాఖ (డిఫెన్స్) భూమితో పాటు, 13 ఎకరాల ప్రైవేట్ భూమిని సేకరిస్తున్నారు. ➤ HMDA ప్రస్తుతం నగరంలో రెండు ప్రధాన కారిడార్లను నిర్మిస్తోంది: * ప్యారడైజ్ జంక్షన్ – శామీర్‌పేట * ప్యారడైజ్ జంక్షన్ – డైరీ ఫామ్ రోడ్ ➤ బేగంపేట ఎయిర్‌పోర్ట్ అండర్‌పాస్ నిర్మాణం ఇందులో రెండోదైన 'ప్యారడైజ్ – డైరీ ఫామ్ రోడ్' కారిడార్ పరిధిలోకి వస్తుంది. మొత్తంగా రెండు ఈ ప్రాజెక్టులకు కలిపి అవసరమైన భూమి: * 114 ఎకరాల రక్షణ శాఖ (డిఫెన్స్) భూమి * 78 ఎకరాల ప్రైవేట్ భూమి ప్రాజెక్టు నిధుల కేటాయింపు: ఈ భారీ ప్రాజెక్టుకు 'న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్' (NDB) నిధులు సమకూరుస్తోంది. ప్రాథమిక నివేదిక అంచనాల ప్రకారం నిధుల వివరాలు ఇలా ఉన్నాయి: * మొత్తం ప్రాజెక్టు వ్యయం: ₹5,106 కోట్లు * NDB వాటా (సుమారు 70%): ₹3,574 కోట్లు * రాష్ట్ర ప్రభుత్వ వాటా: ₹1,532 కోట్లు హైదరాబాద్‌లో నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ కష్టాలను తీర్చి, రవాణా సదుపాయాలను మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా, అవసరమైన అన్ని అనుమతులతో ప్రభుత్వం ఈ ప్రాజెక్టును శరవేగంగా ముందుకు తీసుకెళ్తోంది.
FactCheck_Telangana tweet media
తెలుగు
15
7
16
34.4K
FactCheck_Telangana
FactCheck_Telangana@FactCheck_TG·
📢 OFFICIAL CONFIRMATION ━━━━━━━━━━━━━━━━━━━━ Issued by Hyderabad Metropolitan Development Authority (HMDA) The Airports Authority of India (AAI) has conveyed its approval for the construction of an underground underpass beneath the Begumpet Airport runway, clearing a key requirement for the proposed elevated corridor project. ➤ The approved plan includes a 600-metre, six-lane underpass beneath the runway. ➤ This underpass is part of the 5.4-km elevated corridor from Paradise Junction to Military Dairy Farm Road (NH-44). 🛣️ Project Details ➤ The corridor will pass through Secunderabad, Tadbund, and Bowenpally, and terminate at Dairy Farm Road. ➤ An underground underpass has been planned as an elevated structure is not feasible near the airport runway. ➤ This design also helps avoid sharp turns in the Tadbund stretch, ensuring smoother traffic 📌 Land & Implementation ➤ Land acquisition for this corridor includes: • 42 acres of defence land • 13 acres of private land ➤ The Hyderabad Metropolitan Development Authority (HMDA) is executing two major corridors: • Paradise Junction – Shamirpet • Paradise Junction – Dairy Farm Road ➤ The Begumpet airport underpass is part of the Paradise–Dairy Farm Road corridor. ➤ Overall, these projects involve: • 114 acres of defence land • 78 acres of private land Project Funding ➤ The New Development Bank (NDB) will fund the project. ➤ Total Project Cost: ₹5,106 Crores ➤ NDB Contribution: ₹3,574 Crores (approximately 70%) ➤ State Government Share: ₹1,532 Crores ➤ The funding details are based on the preliminary project proposal report. The project is being taken forward with necessary approvals and planning to improve urban connectivity and ease traffic movement in Hyderabad.
FactCheck_Telangana tweet media
English
8
12
21
5K
FactCheck_Telangana
FactCheck_Telangana@FactCheck_TG·
అధికారిక వివరణ: మూసీ నది పునరుజ్జీవన కార్యక్రమంపై వస్తున్న తప్పుడు వార్తలను, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నేతృత్వంలో నడుస్తున్న, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ కార్యక్రమం మొత్తంలో అనేక దశలు ఉన్నాయని, అందులో వివిధ ప్రాజెక్టులు ఉంటాయని స్పష్టత ఇచ్చింది: ➤ గతంలో వెల్లడించినట్టుగా, గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ పనులు ప్రణాళిక ప్రకారమే సాగుతాయి. ఇందులో ఎలాంటి మార్పు లేదు. ➤ శివాలయం, శివుని విగ్రహ నిర్మాణం అనేది ప్రాజెక్టులో అదనంగా చేర్చిన అంశాలే తప్ప, పాత ప్రణాళికలకు బదులుగా చేర్చిన అంశాలు కావు. భవిష్యత్తులో మరిన్ని కొత్త అంశాలను కూడా ఈ ప్రాజెక్టులో ప్రకటించడం జరుగుతుంది. ➤ మూసీ నది పరివాహక ప్రాంతాన్ని ఒక గొప్ప సాంస్కృతిక, ఆధ్యాత్మిక కేంద్రంగాను, ప్రజలకు ఉపయోగ పడే విధంగాను తీర్చి దిద్దటమే, ఈ ప్రాజెక్టు లక్ష్యాలు. ➤ మూసీ నది పునరుజ్జీవన కార్యక్రమంలో భాగంగా, ఇకపై కూడా వివిధ ప్రాజెక్టులను దశలవారీగా చేపట్టే అవకాశం ఉంది. మొత్తం ప్రాజెక్టు ముందుగా నిర్ణయించిన ప్రణాళిక ప్రకారమే పారదర్శకంగా అమలవుతోంది. ప్రజలు సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, కేవలం అధికారిక సమాచారాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది.
FactCheck_Telangana tweet media
తెలుగు
2
3
3
4K
FactCheck_Telangana
FactCheck_Telangana@FactCheck_TG·
The Telangana State Government, led by Shri A. Revanth Reddy, has emphatically dismissed all fake news about changes in the Musi River rejuvenation programme. The overall programme has several phases and projects as part of it. ➤ The Gandhi Sarovar project component of Phase 1 will continue as per plans publicly shared. ➤ The Lord Shiva temple is an additional component, and many more elements will be unveiled in the times ahead. ➤ The proposed development of a temple and Shiva statue is an additional component and not a replacement. ➤ These elements are part of a broader vision to develop the Musi riverfront as a cultural, spiritual, and public space. ➤ Multiple components may be taken up in phases as part of the overall river rejuvenation initiative. The project continues to be implemented as per the planned framework. Citizens are advised to rely only on official communications for accurate information.
FactCheck_Telangana tweet media
English
0
5
7
3.7K
FactCheck_Telangana
FactCheck_Telangana@FactCheck_TG·
అధికారిక వివరణ: కాజాగూడ - మణికొండ నుండి హైటెక్ సిటీ వరకు చెట్ల తొలగిస్తున్న నేపధ్యంలో, సామాజిక మాధ్యమాలలో కొంత చర్చ జరుగుతోంది. ఈ విషయం గురించి, అపోహలను తొలగిస్తూ, సైబరాబాద్ మునిసిపల్ కార్యాలయం స్పష్టత ఇవ్వాలనుకుంటుంది. ➤ కాజాగూడ ప్రాంతంలో ఒక ప్రాజెక్టు నిమిత్తం, సుమారు 300 చెట్లను తొలగించేందుకు 'ట్రీ ప్రొటెక్షన్ కమిటీ' నుండి ముందుగానే అనుమతి తీసుకోవడం జరిగింది. ➤ కేవలం ప్రభుత్వం చేపట్టిన H-City ప్రాజెక్టులో భాగంగా మాత్రమే, ఈ చెట్లను తొలగిస్తున్నారు. ➤ ఈ చెట్ల తొలగింపుకు, ఎలాంటి ప్రైవేట్ అపార్ట్‌మెంట్ నిర్మాణాలతో సంబంధం లేదు. ➤ పనులు ప్రారంభించడానికి ముందే, గతంలో GHMC నిబంధనల ప్రకారం కావాల్సిన అన్ని రకాల అనుమతులను తీసుకోవడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ మొత్తం ప్రభుత్వ నిబంధనల ప్రకారమే జరుగుతోంది. కాబట్టి, ప్రజలు సామాజిక మాధ్యమాలలో వచ్చే తప్పుడు వార్తలను నమ్మవద్దని, కేవలం అధికారిక సమాచారాన్ని మాత్రమే గమనించాలని కోరుతున్నాము. సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ కార్యాలయం
FactCheck_Telangana tweet media
తెలుగు
0
5
11
3.1K
FactCheck_Telangana
FactCheck_Telangana@FactCheck_TG·
📢 OFFICIAL CLARIFICATION ━━━━━━━━━━━━━━━━━━━━ Posts circulating on social media regarding tree cutting in the Kajaguda–Manikonda to Hitech City stretch have led to avoidable misinterpretation, clarifies the Office of the Cyberabad Municipal Commissioner. ➤ Permission for the removal of approximately 300 trees in the Kajaguda area was granted by the Tree Protection Committee. ➤ The activity is being carried out as part of an ongoing GHMC infrastructure project under the State-led ‘H-City’ initiative. ➤ The tree cutting is not related to any private apartment development. ➤ All required approvals and clearances were obtained prior to commencement of the work. The project is being executed in accordance with established procedures and regulatory approvals. Citizens are advised to rely on official information for accurate updates. ━━━━━━━━━━━━━━━━━━━━ Office of the Cyberabad Municipal Commissioner ━━━━━━━━━━━━━━━━━━━━
FactCheck_Telangana tweet media
English
16
17
38
146.9K
FactCheck_Telangana
FactCheck_Telangana@FactCheck_TG·
అధికారిక వివరణ ఉగాది, రంజాన్ పండుగల నేపథ్యంలో ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 17, 18 అలాగే 23 తేదీలలో పెరిగిన ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని TGSRTC ప్రత్యేక బస్సులను నడుపుతోంది. రద్దీ సమయాల్లో ప్రయాణికులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తమ స్వంత గ్రామాలకు చేరుకునేలా ఈ సర్వీసులను ప్రవేశపెట్టారు. ప్రత్యేక బస్సుల టికెట్ల ధరల వివరాలు ➤ ప్రభుత్వ ఉత్తర్వు (GO) నం.16 (2003) ప్రకారం... డీజిల్, నిర్వహణ ఖర్చుల దృష్ట్యా ప్రత్యేక బస్సుల ఛార్జీలను సవరించే అధికారం TGSRTCకి ఉంది. ➤ ఈ నిబంధన మేరకు పండుగలూ, ప్రత్యేక సందర్భాల్లో ప్రత్యేక బస్సుల ఛార్జీలను 1.5 రెట్లు అంటే గరిష్టంగా 50% వరకు పెంచవచ్చు. ➤ దీని ప్రకారం కేవలం ప్రత్యేక బస్సులకు మాత్రమే అత్యధిక రద్దీ ఉండే తేదీలలో అంటే 17, 18, 23 తేదీలలో మాత్రమే సవరించిన ఛార్జీలు వర్తిస్తాయి. ➤ సాధారణ బస్సు సర్వీసుల లో యధావిధిగా ఎప్పటిలాగే సాధారణ ఛార్జీలే ఉంటాయి. ప్రయాణికుల కోసం ఏర్పాట్లు ➤ ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు ఈ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. ➤ తిరుగు ప్రయాణాల్లో ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ, రద్దీ ఎక్కువగా ఉన్న రూట్లలో బస్సులు అందుబాటులోకి ఉంచి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. ➤ అలాగే ప్రయాణికులు ముందస్తుగా టిక్కెట్లు బుక్ చేసుకోవాలని సూచించడమైనది. మహాలక్ష్మి పథకం యధావిధిగా కొనసాగింపు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఈ క్రింది బస్సులలో యధావిధిగా కొనసాగుతుంది: •పల్లె వెలుగు •ఎక్స్‌ప్రెస్ •సిటీ ఆర్డినరీ •మెట్రో ఎక్స్‌ప్రెస్ సూచన పండుగ సర్వీసులు, ఛార్జీల గురించి ఖచ్చితమైన సమాచారం కోసం ప్రయాణికులు అధికారిక TGSRTC ప్రకటనలను మాత్రమే అనుసరించాలని కోరడమైనది. - PRO, TGSRTC.
Telugu Scribe@TeluguScribe

ఉగాది, రంజాన్ పండుగల పూట ప్రజలను దోచుకునేందుకు సిద్ధమైన తెలంగాణ ఆర్టీసీ 19వ తేదీన ఉగాది, 21వ తేదీన రంజన్ పండుగలు ఉన్నందున, ప్రయాణికుల నుండి 50% అధిక ఛార్జీలు వసూలు చేయనున్న ఆర్టీసీ 17, 18 తేదీల్లో ప్రజలు ఊర్లకు వెళ్లనున్న రోజుల్లో, అలాగే 23వ తిరుగు ప్రయాణాలు ఎక్కువగా ఉండే రోజుల్లో స్పెషల్ బస్సులు నడిపి 50% అధిక ఛార్జీలు వసూలు చేసేందుకు ఆర్టీసీ నిర్ణయం

తెలుగు
4
1
5
2.3K
FactCheck_Telangana
FactCheck_Telangana@FactCheck_TG·
📢 OFFICIAL CLARIFICATION ━━━━━━━━━━━━━━━━━━━━ In view of the Ugadi and Ramzan festivals, the Telangana State Road Transport Corporation (TGSRTC) has made comprehensive arrangements to facilitate safe and convenient travel for passengers. ➤ TGSRTC is operating special buses during the festive period to manage the increased passenger demand on 17th, 18th, and 23rd of this month. ➤ These services are introduced to ensure that passengers can travel to and from their hometowns without inconvenience during peak rush days. 📌 Fare Structure for Special Buses ➤ As per Government Order (GO) No. 16 (2003), TGSRTC is permitted to revise fares for special buses to cover diesel and operational costs. ➤ Under this provision, fares for special buses may be increased up to 1.5 times (maximum 50%) during festivals and special occasions. ➤ Accordingly, the revised fares are being applied only to special buses, and only on peak travel dates (17th, 18th, and 23rd). ➤ Regular bus services will continue to operate at normal fares. 🚌 Passenger Convenience Measures ➤ Special buses are operated to handle high demand and ensure availability of transport. ➤ Even during return journeys with low occupancy, buses are repositioned to high-demand routes to avoid inconvenience. ➤ Passengers are advised to book tickets in advance through official channels. 👩‍🦰 Mahalakshmi Scheme Continues ➤ Under the Mahalakshmi scheme, free travel for women will continue as usual in: * Palle Velugu * Express * City Ordinary * Metro Express buses 📌 Advisory Passengers are advised to rely only on official TGSRTC communications for accurate information regarding festival services and fares. ━━━━━━━━━━━━━━━━━━━━ PRO, TGSRTC
Telugu Scribe@TeluguScribe

ఉగాది, రంజాన్ పండుగల పూట ప్రజలను దోచుకునేందుకు సిద్ధమైన తెలంగాణ ఆర్టీసీ 19వ తేదీన ఉగాది, 21వ తేదీన రంజన్ పండుగలు ఉన్నందున, ప్రయాణికుల నుండి 50% అధిక ఛార్జీలు వసూలు చేయనున్న ఆర్టీసీ 17, 18 తేదీల్లో ప్రజలు ఊర్లకు వెళ్లనున్న రోజుల్లో, అలాగే 23వ తిరుగు ప్రయాణాలు ఎక్కువగా ఉండే రోజుల్లో స్పెషల్ బస్సులు నడిపి 50% అధిక ఛార్జీలు వసూలు చేసేందుకు ఆర్టీసీ నిర్ణయం

English
3
5
7
2.2K
FactCheck_Telangana
FactCheck_Telangana@FactCheck_TG·
అధికారిక వివరణ ఈరోజు నుండి SSC పరీక్షలు మొదలైన తరుణంలో, కూకట్పల్లిలోని న్యూ ఎరా హైస్కూల్ లో చదువుతున్న విద్యార్థులకు అదే పాఠశాల పరీక్ష కేంద్రంగా కేటాయించబడింది. ఈ విషయం గురించి కొన్ని వార్తా కథనాలు పూర్తి అవగాహనా లేకుండా ప్రచురించడంతో అనవసరమైన గందరగోళం ఏర్పడింది. విషయం ఏమిటంటే, SSC పరీక్షల నిబంధనల ప్రకారమే, ఇటువంటి, సెల్ఫ్ సెంటర్ కేటాయింపు జరిగిందని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేస్తోంది. సెల్ఫ్ సెంటర్ విధానం ➤ విద్యార్థులు ఎక్కువగా ఉండి, అందుబాటులో ఉన్న కేంద్రాలు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో, ఒకే పాఠశాలకు చెందిన విద్యార్థులకు అదే కేంద్రం రావటం సహజం. ➤ అలా ఉన్న విద్యార్థులు పక్కపక్కన కూర్చోకుండా, జంబ్లింగ్ విధానం ద్వారా వారిని వేర్వేరు చోట్ల కూర్చోబెడతారు. ➤ కానీ, ఆ పాఠశాలకు చెందిన సిబ్బందిని మాత్రం, పరీక్ష విధులు నిర్వహించే విధంగా నియమించారు. ➤ పరీక్షలను సక్రమంగా నిర్వహించడానికి, పారదర్శకత ఉండటానికి, వేరే పాఠశాలకు సంబందించిన సిబ్బందిని నియమిస్తారు. పరీక్షా కేంద్రాల వెసులుబాటును బట్టి, గతంలో కూడా కొన్ని పాఠశాలలకు 'సెల్ఫ్ సెంటర్' కేటాయించినట్లు విద్యాశాఖ గుర్తించింది. ఇది తరచుగా జరిగే సహజమైన ప్రక్రియ. గత నాలుగేళ్లలో సెల్ఫ్ సెంటర్లు పొందిన పాఠశాలల వివరాలు: ➤ SSC మే 2022 – 249 ➤ SSC ఏప్రిల్ 2023 – 225 ➤ SSC మార్చి 2024 – 202 ➤ SSC మార్చి 2025 – 269 రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని విద్యాశాఖ తెలియజేసింది. పరీక్షా విధానం గురించి ఎటువంటి సందేహాలున్నా, విద్యాశాఖ ఇచ్చే అధికారిక సమాచారాన్ని మాత్రమే ప్రజలు నమ్మాలి. అసత్య ప్రచారాలను, తప్పుదోవ పట్టించే సమాచారాన్ని ప్రజలు నమ్మకూడదు.
FactCheck_Telangana tweet media
తెలుగు
2
7
17
2.1K
FactCheck_Telangana
FactCheck_Telangana@FactCheck_TG·
📢 OFFICIAL CLARIFICATION ━━━━━━━━━━━━━━━━━━━━ Certain news reports regarding the allotment of an examination centre to students of New Era High School, Kukatpally, in the ongoing SSC examinations have led to avoidable misinterpretation. The Directorate of Government Examinations, ministry of Secondary Education, clarifies that the centre allotment has been carried out strictly as per established examination procedures. ➤ In examination zones where the number of candidates is high and the number of available centres is limited, some students from the same school may be allotted the same examination centre. ➤ All candidates are allotted centres through a randomized process to ensure effective jumbling of students. ➤ No staff members from the same school are appointed as centre staff for examination duties. ➤ All examination personnel are deputed from other schools to ensure impartial and transparent conduct of the examinations. The department also noted that self-centre allotment has occurred in previous SSC examinations as well, depending on the availability of centres in a particular examination zone. 📊 Self-centred schools in the past four years: ➤ SSC May 2022 – 249 ➤ SSC April 2023 – 225 ➤ SSC March 2024 – 202 ➤ SSC March 2025 – 269 The department reiterates that all necessary safeguards are in place to ensure the fair and transparent conduct of SSC examinations across the State. Citizens are advised to rely only on official information issued by the School Education Department regarding examination procedures.
FactCheck_Telangana tweet media
English
1
5
10
1.4K
FactCheck_Telangana
FactCheck_Telangana@FactCheck_TG·
అధికారిక వివరణ తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రులలో మందుల సరఫరా ఎప్పటిలాగా సజావుగా సాగుతోంది. ఎక్కడా కూడా ఎటువంటి మందుల కొరత లేదని ఆరోగ్య శాఖ అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రాథమిక, ద్వితీయ, తృతీయ స్థాయి ప్రభుత్వ ఆసుపత్రులకు అవసరమైన మందులను దాదాపుగా, 'తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్' (TGMSIDC) ద్వారా ప్రభుత్వం అందజేస్తుంది. ➤ సాధారణంగా వాడే మందులు, అత్యవసర మందులన్నీ కూడా ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్నాయి. ➤ ప్రభుత్వ ఆసుపత్రులలో ఎటువంటి మందుల కొరత లేదు. కానీ, కొందరు కాంట్రాక్టర్లు తమ పెండింగ్ బిల్లులను రాబట్టుకోవడానికి, ప్రభుత్వం పై ఒత్తిడి పెంచడానికి, కొన్ని చోట్ల సరఫరా నిలిపివేస్తామంటూ హెచ్చరికలు జారీ చేసారు. ఈ కథనాల నుండే, తప్పుడు సమాచారం వ్యాప్తి చెంది ఉండవచ్చని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ➤ ఒకవేళ ఏదైనా ఆసుపత్రికి అరుదైన మందులు అవసరమైతే, కొంత మంది సరఫరాదారులు నిరాకరించిన కూడా, అనేక ఇతర సరఫరాదారులు ప్రభుత్వానికి అందుబాటులో ఉన్నారు. ➤ ఇలాంటి పరిస్థుతులలో వినియోగించుకోవడానికి, ఆసుపత్రి సూపరింటెండెంట్లకు ప్రత్యేక నిధులు ఉన్నాయి. వారు ఈ నిధులను ఉపయోగించి వెంటనే మందులను కొనుగోలు చేసే అధికారం ఉంటుంది. ➤ ఈ నిధులను 'హాస్పిటల్ డెవలప్‌మెంట్ ఫండ్స్' నుండి తీసుకోవచ్చు. తెలంగాణలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులు సంఖ్య: ➤ ప్రాథమిక స్థాయి ఆసుపత్రులు: 5,000 పైగా ➤ ద్వితీయ స్థాయి ఆసుపత్రులు: 184 ➤ తృతీయ స్థాయి ఆసుపత్రులు: 49 తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రులలో మందుల సరఫరా ఎప్పటిలాగానే, సాధారణంగా ఉంది. ఆసుపత్రికి వచ్చే వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మందులు అందుబాటులో ఉన్నాయని ఆరోగ్య శాఖ మరోసారి స్పష్టం చేసింది. తప్పుడు సమాచారాన్ని, ఫేక్ న్యూస్ ను, ఉద్దేశ పూర్వకంగా చేసే దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దు. ఆరోగ్య శాఖ తెలంగాణ ప్రభుత్వం
FactCheck_Telangana tweet media
తెలుగు
6
1
8
26.8K
FactCheck_Telangana
FactCheck_Telangana@FactCheck_TG·
📢 OFFICIAL STATEMENT ━━━━━━━━━━━━━━━━━━━━ Officials of the Health Department, Government of Telangana, have clarified that medicine supplies to government hospitals across the State are functioning normally, and there is no shortage or disruption in the availability of medicines. Medicines to tertiary, secondary, and primary level government hospitals across the State are largely supplied through the Telangana State Medical Services & Infrastructure Development Corporation (TGMSIDC). ➤ All emergency and non-emergency medicines are available at hospital levels. ➤ There is no shortage or scarcity of medicines in government hospitals. Officials stated that the reports about supply being halted may relate to isolated actions by a few vendors attempting to put pressure on the government regarding small pending bills or procurement preferences. ➤ In cases where a hospital requires a specific or rare medicine, multiple suppliers are available to ensure timely supply. ➤ Hospital Superintendents are also authorised to utilise special funds allocated to hospitals to procure medicines whenever required. ➤ Dedicated Hospital Development Funds are available for such urgent procurement. 📊 Government Hospitals in Telangana ➤ Primary Level Hospitals: 5,000+ ➤ Secondary Level Hospitals: 184 ➤ Tertiary Level Hospitals: 49 The Health Department reiterates that medicine supplies to government hospitals across Telangana are functioning normally, and there is no disruption in availability of medicines for patients. ━━━━━━━━━━━━━━━━━━━━ Health Department Government of Telangana
FactCheck_Telangana tweet media
English
0
2
6
914
FactCheck_Telangana
FactCheck_Telangana@FactCheck_TG·
అధికారిక వివరణ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) పరిధిలోని పారిశుధ్య వాహనాల గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం తప్పుదారి పట్టించేలా ఉందని GWMC కమిషనర్ కార్యాలయం స్పష్టం చేసింది. ➤ గ్రేటర్ వరంగల్‌లో పరిధిలోని ఏ చెత్త సేకరణ వాహనం కూడా సమ్మెలో లేదు. ➤ నగరవ్యాప్తంగా పారిశుధ్య సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ➤ గ్రేటర్ వరంగల్ పరిధిలో క్రమం తప్పకుండా చెత్తను సేకరించి, తరలించడానికి అన్ని GWMC వాహనాలు పని చేస్తున్నాయి. ➤ మున్సిపల్ కార్యకలాపాలకు ఆటంకం కలిగించేలా ఎలాంటి ఇంధన కొరత లేదు. ఇంధనం నింపుకోవడం కోసం వాహనాలు క్యూలో ఉన్నప్పుడు తీసిన వీడియోను ఇలా తప్పుగా ప్రచారం చేసి ఉండొచ్చని, ఇది ప్రతిరోజూ జరిగే సాధారణ ప్రక్రియేనని అధికారులు పేర్కొన్నారు. • ఒకవేళ నిజంగానే పారిశుధ్య వాహనాలు ఆగిపోయి ఉంటే, GWMC కార్యాలయానికి నగర పౌరుల నుండి ఎన్నో ఫిర్యాదులు వచ్చేవి మరియు కార్పొరేటర్లు కూడా ఈ సమస్యను లేవనెత్తేవారు. • పారిశుధ్య సేవలకు అంతరాయం ఏర్పడిందని ఈ ఉదయం నుండి మాకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. సరైన సమాచారం కోసం పౌరులు కేవలం అధికారిక ప్రకటనలను మాత్రమే నమ్మాలని, నిర్ధారించని సోషల్ మీడియా పోస్టులను చూసి మోసపోవద్దని సూచించడమైనది. కమిషనర్ కార్యాలయం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC)
FactCheck_Telangana tweet media
తెలుగు
0
1
2
799
FactCheck_Telangana
FactCheck_Telangana@FactCheck_TG·
📢 OFFICIAL CLARIFICATION ━━━━━━━━━━━━━━━━━━━━ Posts circulating on social media regarding sanitation vehicles in the Greater Warangal Municipal Corporation (GWMC) limits are misleading, the Office of the Commissioner, GWMC, has clarified. ➤ No garbage collection vehicle in Greater Warangal is on strike. ➤ Sanitation services across the city are functioning normally. ➤ All GWMC vehicles are operating to ensure regular garbage collection and clearance within the Greater Warangal limits. ➤ There is no shortage of fuel affecting municipal operations. Officials stated that the video being circulated may have been recorded while vehicles were lined up for refueling, which is a routine operational activity. ➤ If sanitation vehicles had actually stopped operating, the GWMC office would have received numerous complaints from citizens, and the issue would have been raised by corporators. ➤ No complaints have been received since this morning regarding any disruption in sanitation services. Citizens are advised to rely only on official communications for accurate information and not be misled by unverified social media posts. ━━━━━━━━━━━━━━━━━━━━ Office of the Commissioner Greater Warangal Municipal Corporation (GWMC) ━━━━━━━━━━━━━━━━━━━━
FactCheck_Telangana tweet media
English
4
8
13
22.2K
FactCheck_Telangana
FactCheck_Telangana@FactCheck_TG·
అధికారిక స్పష్టీకరణ మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్ట్, గాంధీ సరోవర్ కు సంబంధించిన ఖర్చుల గురించి తెలంగాణ ప్రభుత్వ వివరణ: ప్రాజెక్ట్ కు సంబందించిన అంచనా ఖర్చు మూసీ నది పునరుజ్జీవనం ప్రాజెక్ట్ నివేదిక ప్రకారం - మొదటి దశలో అంచనా వేసిన ఖర్చు ➤ మొత్తం ప్రాజెక్ట్ విలువ : ₹5,812.4 కోట్లు ప్రాజెక్ట్ మొదటి దశ లో విభాగాలు: ➤ జోన్ 1 (హిమాయత్ సాగర్ → గాంధీ సరోవర్): ₹1,684 కోట్లు ➤ జోన్ 2 (ఉస్మాన్ సాగర్ → గాంధీ సరోవర్): ₹1,992 కోట్లు ➤ పన్నులు & ఇతర నిబంధనలు: ₹1,596 కోట్లు ప్రాజెక్టులో భాగంగా ఉన్న గాంధీ సరోవర్ అంశాలు: ➤ గాంధీ విగ్రహం : ₹73.8 కోట్లు ➤ విగ్రహ పీఠం : ₹22.6 కోట్లు ➤ మ్యూజియం, విగ్రహ భవనం: ₹220 కోట్లు ➤ విద్యుత్, మెకానికల్ పనులు: ₹79 కోట్లు ఈ అంశాలన్నీ కూడా మొత్తం నదీ తీర అభివృద్ధి ప్రణాళికలో భాగం మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్ట్ మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్ట్ ఈ కింది అంశాలపై దృష్టి సారిస్తోంది: ➤ నదీ పర్యావరణ పునరుద్ధరణ ➤ మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణం ➤ వరద నిర్వహణ, డ్రైనేజీ మెరుగుదల ➤ నదీ తీరంలో బహిరంగ ప్రదేశాలు, సైక్లింగ్ ట్రాక్‌లు ➤ వంతెనలు, రిటైనింగ్ వాల్స్, ట్రంక్ సివరేజ్ లైన్ల వంటి అర్బన్ మౌలిక సదుపాయాలు ఈ ప్రాజెక్టును అత్యంత పారదర్శక విలువలతో, ఒక ప్రణాళికా బద్దంగా, వివిధ దశల వారీగా పూర్తి చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితి గాంధీ సరోవర్ అనేది మూసీ నది పునరుజ్జీవన కార్యక్రమంలో ఒక భాగం మాత్రమే. ఇందులో గాంధీ విగ్రహానికి సంబంధించి అంచనా వేసిన ఖర్చు ₹73.8 కోట్లు. మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టుకు సంబంధించి సరైన సమాచారం కోసం అధికారిక ప్రాజెక్ట్ పత్రాలను లేదా ప్రభుత్వ ప్రకటనలను మాత్రమే అధికారిక సమాచారంగా భావించాలి. తప్పుడు సమాచారాన్ని, ఫేక్ న్యూస్ ను, ఉద్దేశ్య పూర్వకంగా చేసే దుష్ప్రచారాన్ని నమ్మవద్దు.
FactCheck_Telangana tweet media
తెలుగు
1
8
15
51.7K