
ఎబిఎన్ ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానల్ ఏపీ బ్యూరో రిపోర్టర్ కేసంనేని పూర్ణచంద్రరావు మృతి అత్యంత బాధాకరం. చిన్న వయసులోనే పూర్ణ అనారోగ్యంతో అందరికీ దూరమవ్వడం నన్ను ఎంతో కలిచివేస్తోంది. ఎబిఎన్ పూర్ణ పేరుతో అందరికీ సుపరిచితుడిగా, ఆత్మీయుడిగా ఉండే పూర్ణ మృతి తీవ్ర విచారకరం. ఎబిఎన్ ఛానల్ తరపున తెలుగుదేశం పార్టీ వార్తల కవరేజ్ విధులు నిర్వహించే పూర్ణ నాకు ఎంతో సన్నిహితంగా ఉండేవారు. పార్టీ కార్యాలయంలో ఎప్పుడు కలిసినా ప్రజల సమస్యల గురించి ప్రస్తావించేవారు. అందరితో కలివిడిగా ఉంటూ, ఎంతో మంది స్నేహితులను సంపాదించుకున్న పూర్ణ 54 ఏళ్ల వయసులోనే అందరికీ దూరమవ్వడం తీవ్ర విషాదకరం. పూర్ణ కుటుంబ సభ్యులకు నా సానుభూతి తెలుపుతున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నాను.

తెలుగు


















































