
హిందూపురం నియోజకవర్గ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో స్థానిక శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ, ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో హిందూపురంలో భారీ మెగా జాబ్ మేళా నిర్వహించడం అభినందనీయం. జాబ్ మేళాకు వచ్చిన 5323 మందిలో 1903 మంది ఉద్యోగాలకు ఎంపికకావడం సంతోషకరం. వారందరికీ శుభాకాంక్షలు. మరో 868 మంది అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి తర్వాతి దశల ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని తెలిసింది. ఈ జాబ్ మేళాలో పాల్గొన్న 110 సంస్థలకు కృతజ్ఞతాభినందనలు.




తెలుగు

















