
#BookMyShow రూపంలో జరుగుతున్న దోపిడీ కూడా తక్కువేం కాదు. నిబంధనల ప్రకారం ఒక్కో టికెట్ కీ సర్వీస్ ఛార్జ్ రూపంలో రూ.6 (జీఎస్టీ అదనం) మాత్రమే వసూలు చేయాలి. కానీ ఏకంగా రూ.25 (జీఎస్టీ అదనం) పిండుకొంటున్నారు. అందులో రూ.10 ఎగ్జిబీటర్ ఖాతాలోకి వెళ్తుంది. రూ.15 బుక్ మై షో తీసుకొంటుంది. సినిమా తీసిన నిర్మాతకు మాత్రం పైసా రావడం లేదు. దీనిపై కూడా నిర్మాతలు చర్చకు పట్టుబడుతున్నారు. ప్రేక్షకుల నుంచి వసూలు చేస్తున్న ఈ మొత్తాన్ని తక్షణం తగ్గించాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. #BMS




