idlebrain jeevi@idlebrainjeevi
తెలుగు బ్లాక్ అండ్ వైట్ సినిమా కాలంలో నిర్మాత స్క్రిప్ట్ నుండి అన్ని చూసుకునే వారు. ఎన్టీఆర్ లాంటి స్టార్స్ కూడా కొన్ని నిర్మాణ సంస్థలలో చేయాలి అని అనుకునే వారు.
ఇప్పుడు అటువంటి ప్రొడ్యూసర్స్ ఆల్మోస్ట్ కనుమరుగైపోయారు.
ఇప్పుడు ఎక్కువమంది నిర్మాతలు స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్ల డేట్స్ కోసం, కాంబినేషన్ కోసం మార్కెట్ ని మించి రెమ్యూనరేషన్స్ ఇస్తున్నారు. ప్రొడక్షన్ లో 60-70 శాతం రెమ్యూనరేషన్స్ ఉంటే, బడ్జెట్ కి తగ్గ క్వాలిటీ సినిమాలో వుంటుందా?
హీరోలు, దర్శకులు కూడా సబ్జెక్టు ని బట్టి, జోనర్ ని బట్టి ఫ్లెక్సిబుల్ గా రెమ్యూనరేషన్ తీస్కొని, అవసరమైతే నిర్మాణంలో భాగస్వామి అయ్యితే ఉన్న సమస్యలలో కొన్ని తీరిపోతాయి.