
CP Hyderabad City Police
3.8K posts

CP Hyderabad City Police
@CPHydCity
Official handle of Commissioner of Police, Hyderabad City. Dial 100 in case of Emergency.





సైబర్ నేరగాళ్లకు అడ్డాగా మారిన ఘోస్ట్ సిమ్ నెట్‌వర్క్ పై 'ఆపరేషన్ ఆక్టోపస్ 3.O'ను హైదరాబాద్ సిటీ పోలీస్ చేపట్టడం జరిగింది. గతంలో మ్యూల్ ఖాతాదారులు, అక్రమాలకు సహకరించిన బ్యాంకు అధికారులపై చర్యలు తీసుకున్న మేము, ఇప్పుడు సైబర్ నేరాలకు ప్రధాన వనరుగా మారిన ‘ఘోస్ట్ సిమ్’ వ్యవస్థపై ఉక్కుపాదం మోపాం. ఈ ఆపరేషన్‌లో భాగంగా మా 18 ప్రత్యేక బృందాలు దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించి, మొత్తం 66 మంది నిందితులను అరెస్ట్ చేశాయి. వీరి వద్ద నుంచి 544 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నాము. ఈ ఘోస్ట్ సిమ్ కార్డుల ద్వారా దేశవ్యాప్తంగా సుమారు రూ.101.87 కోట్ల విలువైన 76 సైబర్ నేరాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. అరెస్టయిన వారిలో నిబంధనలు ఉల్లంఘించిన వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్, జియో నెట్‌వర్క్‌లకు చెందిన 20 మంది పాయింట్ ఆఫ్ సేల్ (PoS) ఏజెంట్లు కూడా ఉన్నారు. వీరి మోసపూరిత విధానం (Modus Operandi) అత్యంత ప్రమాదకరంగా ఉంది. అమాయక వినియోగదారులకు 'సర్వర్ డౌన్' అని అబద్ధం చెప్పి వారి నుంచి అదనపు బయోమెట్రిక్ తీసుకోవడం లేదా గ్రామాల్లో ఉచిత ఇంటర్నెట్ ఆశచూపి నిరక్షరాస్యుల పేరుతో సిమ్ కార్డులు సృష్టించడం చేస్తున్నారు. ఇలా యాక్టివేట్ చేసిన సిమ్ కార్డులను వెంటనే 'ఈ-సిమ్' (e-SIM)లుగా మార్చి విదేశాల్లోని సైబర్ ముఠాలకు చేరవేస్తున్నారు. తద్వారా మన దేశ నంబర్లతోనే వాట్సాప్, టెలిగ్రామ్ ఖాతాలు తెరిచి సెక్స్‌టార్షన్, డిజిటల్ అరెస్ట్ వంటి మోసాలకు పాల్పడుతున్నారు. లక్ష్యం నెరవేరగానే ఏజెంట్లు తమ దుకాణాలు మూసేసి పరారవుతున్నారు. ఈ ముప్పును అరికట్టడానికి హైదరాబాద్ సిటీ పోలీస్ త్వరలోనే టెలికాం సంస్థల ఉన్నతాధికారులతో సమావేశం కానుంది. కేవైసీ ప్రక్రియను మరింత కఠినతరం చేయాలని, నిబంధనలు పాటించని ఏజెంట్లను అన్ని నెట్‌వర్క్‌ల నుంచి బ్లాక్ లిస్ట్ చేయాలని DoT మరియు TRAI ని కోరనున్నాము. ప్రజలారా, మీ ఆధార్, బయోమెట్రిక్ వివరాలను ఎవరికీ ఇవ్వకండి. మీ పేరు మీద మీకు తెలియకుండా ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో tafcop.sancharsaathi.gov.in పోర్టల్ ద్వారా వెంటనే తనిఖీ చేసుకోండి. ఏదైనా సైబర్ మోసానికి గురైతే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా 'గోల్డెన్ అవర్'లో 1930 నంబర్‌కు కాల్ చేయండి లేదా cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి. హైదరాబాద్ సిటీ పోలీస్ ఎల్లప్పుడూ మీ రక్షణ కోసం ముందుంటుంది. #OperationOctopus3 #CyberCrimeCrackdown #HyderabadPolice #GhostSIM #SancharSaathi #CyberSecurity #SafeDigitalIndia #1930Helpline





క్రికెట్ అభిమానులు ఫేక్ యాప్స్ తో తస్మాత్ జాగ్రత్త!? Attention cricket fans: Stay alert, fake apps are on the prowl! హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా ఈనెల 22న జరగనున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య పోరుకు ఉన్న విపరీతమైన క్రేజ్‌ను సైబర్ కేటుగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. టికెట్ల కోసం అభిమానుల్లో ఉన్న డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని, నకిలీ యాప్‌లు, వెబ్‌సైట్ల ద్వారా దోపిడీకి తెరలేపారు. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఐపీఎల్ టికెట్ల బుకింగ్‌కు సంబంధించి అనేక ప్రకటనలు దర్శనమిస్తున్నాయి. అధికారిక టికెటింగ్ భాగస్వామి అయిన 'డిస్ట్రిక్ట్' (District) యాప్‌ను పోలిన రంగులు, లోగోలతో ఉన్న నకిలీ యాప్‌లను సృష్టించి, తక్కువ ధరకే టికెట్లు ఇస్తామంటూ ఊరిస్తున్నారు. అచ్చం అసలు యాప్‌ను తలపించేలా ఉన్న ఈ నకిలీ లింకులను క్లిక్ చేసి టికెట్లు బుక్ చేసుకుంటే, మీ సొమ్ము గల్లంతవ్వడం ఖాయం. పేమెంట్ చేసిన తర్వాత టికెట్లు రాకపోగా, మీ బ్యాంకింగ్ వివరాలు కూడా సైబర్ నేరగాళ్ల పరమయ్యే ప్రమాదం ఉంది. మ్యాచ్ చూడాలనే ఉత్సాహంతో సోషల్ మీడియాలో వచ్చే అనధికారిక లింకులను నమ్మి మోసపోవద్దు. ఇలాంటి ఫేక్ యాప్ లు, వెబ్ సైట్స్ పై నిఘా ఉంచాం. ఎవరైనా ఇటువంటి ఫేక్ యాప్స్ లేదా వెబ్‌సైట్ల గురించి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు పిర్యాదు చేయాలి. మీ కష్టార్జితాన్ని కేటుగాళ్ల పాలు చేయకుండా అప్రమత్తంగా ఉండాలని క్రికెట్ ప్రియులకు విజ్ఞప్తి చేస్తున్నాం. @BCCI @IPL @SunRisers @RCBTweets











Deeply concerned about the accidents on the Outer Ring Road (ORR). I appeal to all commuters to strictly avoid stopping your vehicles on the ORR unless it is an emergency like a breakdown. In such unavoidable situations, please call the ORR Helpline at 14449 immediately for safety assistance before moving to the extreme left lane. It is important to remember that these precautions are not limited to the ORR alone; they must be strictly followed while traveling on any National Highway. I also urge every organisation to sensitize their drivers and employees regarding these safety protocols. Together, we must strive to prevent fatal road accidents. I request your full support in our mission to curb road accidents and save lives. Such acts will not only attract heavy penalties but are also life-threatening. Let’s prioritise safety above all.









