
Rhymmy(ECF)🦅
10K posts

Rhymmy(ECF)🦅
@ChranistRC
not Interested in Fan Wars













#MostHypedMovies - #Deviputrudu దేవి పుత్రుడు ...ఇది పరాజయం పాలయిందంటే ఒక పట్టాన నమ్మబుద్ధి కాదు . ఫ్లాప్ మూవీ కానీ ఎంతో మందికి అత్యంత ఇష్టమైన మూవీ. ముఖ్యంగా అప్పటి కిడ్స్ కు ఒక స్వీట్ మెమరీ. ఎన్నో కష్ట నష్టాల కోర్చి ఎంతో ఖర్చుతో దేవి పుత్రుడు మూవీ రూపొందింది. బడ్జెట్ 14 కోట్లు. అప్పటికీ దేవి పుత్రుడే తెలుగులో హై బడ్జెట్ మూవీ. ముందుగా 2000 డిసెంబర్ 21 న రిలీజ్ డేట్ ఇచ్చారు కానీ తర్వాత నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి పోస్ట్పోన్ చేశారు. ఆడియో సూపర్ హిట్. ప్రీ రిలీజ్ బిజినెస్ వాల్యూ 18 కోట్లు. నైజాంలో దేవి పుత్రుడు 5 కోట్లకు అమ్ముడుపోయింది. ఇది సెన్సేషనల్ రికార్డ్. ఎంఎస్ రాజుగారు ప్లస్ కోడి రామకృష్ణ ప్లస్ వెంకటేష్ ఈ ముగ్గురి కాంబినేషన్ లో అంతకుముందు శత్రువు మూవీ రూపొంది విజయం సాధించింది. అలానే వెంకటేష్ సౌందర్య అంటే సూపర్ హిట్ కాంబినేషన్. మంచి ఫామ్ లో ఉన్న అంజలా జవేరి మరో హీరోయిన్. మణి శర్మ ఆడియో సూపర్ హిట్. టాలీవుడ్ లోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ మూవీ. వీటన్నింటికీ తోడు బ్లాక్ బస్టర్ లు కొడుతూ భయంకరమైన ఫామ్ లో ఉన్న విక్టరీ వెంకటేష్ క్రేజ్. సో దేవి పుత్రుడు మూవీ పై అంచనాలు స్కై లెవెల్ లో ఉండేవి. 2001 జనవరి 15 న మూవీ రిలీజ్. పక్కనే ఇంకో రెండు పెద్ద మూవీస్ ఉన్నా ఫస్ట్ డే దేవి పుత్రుడు మూవీకే హైయెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి. గ్రాఫిక్స్ అద్భుతంగా ఉన్నాయి. సినిమా కూడా బానే ఉంది కానీ ఫైనల్ రిజల్ట్ ఫ్లాప్. సినిమా ఎక్కడా బోర్ కొట్టదు. స్టార్టింగ్ సీన్ నుండే వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సముద్రంలో మునిగిపోయిన ద్వారక సీన్స్, దాని ఫ్లాష్ బ్యాక్, పవర్ఫుల్ బాక్స్ నేపథ్యం, దాని ఆకారం, అది ఓపెన్ చేయాలనుకున్నప్పుడు జరిగే పరిణామాలు, చిన్న పాపతో సీన్స్, , రెండు పాత్రల్లో వెంకటేష్ పర్ఫార్మెన్స్ ,ముఖ్యంగా 25 నిమిషాల నిడివి ఉండే గ్రాఫిక్స్ విపరీతంగా ఆకట్టుకుంటాయి. “కృష్ణుడు ఏలిన ద్వారక” అంటూ చిన్న పాప పాడే సాంగ్ ఎంతో మందికి ఇష్టం. అలానే మణిశర్మ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవుట్స్టాండింగ్. సినిమా అయిపోయాక కూడా ఒక తీమ్ మ్యూజిక్ హాంట్ చేస్తూనే ఉంటుంది. ఈ సినిమా ఫ్లాప్ వల్ల ఆయన స్వరపరిచిన సాంగ్స్ కూడా పెద్దగా ప్రజాధరణకు నోచుకోలేదు. ప్రతి పాట చాలా బాగుంటుంది. “ఓ ప్రేమ ప్రణయవీణ నీవమ్మ” అనే అద్భుతమైన మెలోడీ సాంగ్ మోస్ట్ అండర్ రేటెడ్ సాంగ్. అలానే “ఆకాశంలోని చందమామ” సాంగ్ కూడా ఎక్సలెంట్. కోడి రామకృష్ణ గారి వండర్ఫుల్ టేకింగ్ తో రూపొందిన దేవి పుత్రుడు రిలీజ్ అయిన 10 రోజులకు గుజరాత్లో భూకంపం రావడం, ఈ సినిమా కంటెంట్ కు గుజరాత్ కు లింక్ ఉండడం కోయిన్సిడెంట్ అనుకోవాలేమో. ఈ సినిమా చూసిన తర్వాత మన వాళ్లకి గుజరాత్లోని ద్వారక చాలా సుపరిచితమైంది. ఎంతో మంది దీని గురించి ఇంటర్నెట్ లో సెర్చ్ చేశారు. అలానే దేవి పుత్రుడు సక్సెస్ అవుతుందని కోటి ఆశలు పెట్టుకున్నారు నిర్మాత ఎంఎస్ రాజు. దాని తర్వాత వెంకటేష్ తోనే 25 కోట్ల బడ్జెట్ తో అంజనీ పుత్రుడు అనే మూవీ కూడా చేయాలని కాన్సెప్ట్ రెడీ చేయించారు. కానీ దేవీ పుత్రుడు పరాజయం వల్ల ఆ ఆలోచన మాయమైపోయింది. అంత ప్లాప్ టాక్ తో కూడా చెప్పుకోదగ్గ సెంటర్స్ లో 50 రోజులు, వంద రోజులు కూడా ఆడింది . సినిమా పరాజయానికి కారణాలేంటో వేరే పోస్ట్ లో చూద్దాం కానీ ఇప్పుడు ప్రశాంతంగా ఈ సినిమా చూస్తుంటే “అబ్బా సూపర్ ఉంది, అప్పట్లోనే ఇంత గ్రాండ్ గా గ్రాఫిక్స్ తో తీశారా?” అనిపిస్తుంది. సినిమాలో ఏదో మ్యాజిక్ ఉంది. సినిమా చూడడం పూర్తయ్యాక కూడా అది వెంటాడుతూనే ఉంటుంది. ఇది హిట్ అయుంటే వెంకీ రేంజ్ ...అబ్బో...ఊహించుకోలేము . #Venkatesh #AK47
























