
భూ సేకరణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. శుక్రవారం వి సి కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లాలో వివిధ అభివృద్ధి పనులకు కావలసిన భూసేకరణ నిమిత్తం ఏర్పాటుచేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇరిగేషన్, రైల్వే, ఇండస్ట్రియల్ పార్క్ మొదలగు అభివృద్ధి పనులకు కావలసిన భూమి నిమిత్తం భూసేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కె సీతారామారావు, ఆర్డీవోలు వేణుమాధవ్, శ్రీనివాసులు, సూర్యనారాయణ, ఇ ఇ, డి ఇ లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


తెలుగు



































































