Collector Bhadradri Kothagudem

2.2K posts

Collector Bhadradri Kothagudem banner
Collector Bhadradri Kothagudem

Collector Bhadradri Kothagudem

@Collector_BDD

Ankit IAS., Collector & District Magistrate, Bhadradri Kothagudem, Telangana.

Katılım Ocak 2017
162 Takip Edilen19.2K Takipçiler
Collector Bhadradri Kothagudem
జిల్లా కలెక్టర్ అంకిత్ IAS మాట్లాడుతూ రహదారి ప్రమాదాల నివారణలో అవగాహన కీలకమని తెలిపారు. “అర్రైవ్ అ లైవ్” కార్యక్రమం ద్వారా జిల్లాలో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. విద్యార్థులు, యువత ముందుకు వచ్చి సమాజంలో చైతన్యం కల్పించాలని సూచించారు. జిల్లాలో భారీ వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉండటంతో ప్రమాదాల అవకాశాలు అధికంగా ఉన్నాయని, ఇప్పటికే 38 బ్లాక్ స్పాట్లను గుర్తించి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రమాద సమయంలో తక్షణ వైద్య సహాయం అందేలా అంబులెన్స్ సేవలను బలోపేతం చేస్తున్నామని పేర్కొన్నారు. హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం, వేగ పరిమితులు పాటించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని, రహదారి భద్రతను ప్రజలు తమ బాధ్యతగా భావించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ IAS పిలుపునిచ్చారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ రహదారి ప్రమాదాల నివారణలో అన్ని శాఖల సమన్వయం కీలకమని తెలిపారు. మద్యం సేవించి వాహనం నడపడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వంటి కారణాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అనంతరం రహదారి భద్రతపై పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేసి, కొంతమందికి డ్రైవింగ్ లైసెన్సులు పంపిణీ చేశారు. గిరిజనులకు హెల్మెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పగడాల రమాదేవి, మార్కెట్ కమిటీ చైర్మన్, డీఎస్పీ సతీష్, పోలీస్ శాఖ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. @TelanganaCMO @TelanganaCS @IPRTelangana @Bhatti_Mallu @TummalaOfficial @INC_Ponguleti @Vakiti_srihari @DamodarCilarapu #BhadradriKothagudem #RoadSafety #ArriveAlive #TrafficAwareness #SafeDriving #TelanganaCongress
Collector Bhadradri Kothagudem tweet mediaCollector Bhadradri Kothagudem tweet mediaCollector Bhadradri Kothagudem tweet mediaCollector Bhadradri Kothagudem tweet media
తెలుగు
0
1
1
48
Collector Bhadradri Kothagudem
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా – దమ్మపేట మండలం (బాల్కలగండి GP, చిల్లగుంపు గ్రామం) ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్ IAS దమ్మపేట మండలం బాల్కలగండి గ్రామపంచాయతీ పరిధిలోని చిల్లగుంపు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతిని జిల్లా కలెక్టర్ అంకిత్ IAS శుక్రవారం పరిశీలించారు. గ్రామంలో నిర్మాణంలో ఉన్న పలు ఇండ్లను సందర్శించి పనుల పురోగతిని ప్రత్యక్షంగా సమీక్షించారు. లబ్ధిదారులతో మాట్లాడిన జిల్లా కలెక్టర్ అంకిత్ IAS, ఇండ్ల నిర్మాణంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకున్నారు. ముఖ్యంగా ఇసుక, నిర్మాణ సామగ్రి సరఫరా అంశాలపై వివరాలు అడిగి తెలుసుకుని, ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. గ్రామంలో మొత్తం 15 ఇండ్లు మంజూరు కాగా, వాటిలో 14 ఇండ్లకు గ్రౌండింగ్ పనులు పూర్తయ్యాయని, ఒక ఇంటికి ఇంకా గ్రౌండింగ్ జరగలేదని అధికారులు తెలిపారు. ఆ ఇంటికి ఆలస్యానికి గల కారణాలను తెలుసుకున్న జిల్లా కలెక్టర్ అంకిత్ IAS, వెంటనే సమస్యను పరిష్కరించి గ్రౌండింగ్ పనులు ప్రారంభించాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు నాణ్యతతో, సమయానికి పూర్తయ్యేలా అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ IAS సూచించారు. ఈ పరిశీలనలో సర్పంచ్ సుశీల, తాసిల్దార్ రామ్ నరేష్, ఎంపీడీవో రవీందర్ రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. @TelanganaCMO @TelanganaCS @IPRTelangana @Bhatti_Mallu @TummalaOfficial @INC_Ponguleti @Vakiti_srihari @DamodarCilarapu #BhadradriKothagudem #Dummapeta #IndirammaIllu #HousingForAll #TelanganaDevelopment #RuralDevelopment
Collector Bhadradri Kothagudem tweet mediaCollector Bhadradri Kothagudem tweet mediaCollector Bhadradri Kothagudem tweet mediaCollector Bhadradri Kothagudem tweet media
Kottagudem, India 🇮🇳 తెలుగు
0
1
4
179
Collector Bhadradri Kothagudem
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటవీ, అసైన్డ్ భూముల సమస్యల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు: జిల్లా కలెక్టర్ అంకిత్ IAS పెండింగ్‌లో ఉన్న అటవీ, అసైన్డ్ భూముల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ IAS ఆదేశించారు. గురువారం ఐడీఓసీ కార్యాలయం సమావేశ మందిరంలో అటవీ శాఖ అధికారి కృష్ణ గౌడ్‌తో కలిసి నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ IAS మాట్లాడుతూ జిల్లాలో అసైన్డ్ భూములకు సంబంధించిన వివిధ సమస్యలను సమగ్రంగా పరిశీలించి, వేగవంతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అసైన్డ్ భూములపై అక్రమ ఆక్రమణలను కఠినంగా అరికట్టాలని, ఎక్కడైనా అక్రమాలు గుర్తించిన వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూముల రికార్డులను సక్రమంగా నవీకరించి పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు. సర్వే నెంబర్ వారీగా ప్రభుత్వ, అటవీ, అసైన్డ్ భూముల పూర్తి వివరాలను సేకరించి సమగ్ర నివేదికలను తక్షణమే అందజేయాలని సూచించారు. భూముల ప్రస్తుత స్థితి, సమస్యలు, ఆక్రమణల వివరాలు స్పష్టంగా నమోదు చేయాలని తెలిపారు. ఆక్రమణకు గురైన భూములపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురికాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను వేగంగా పరిష్కరించాలని సూచించారు. అసైన్డ్ భూముల అంశాలలో నిర్లక్ష్యం లేకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ IAS స్పష్టం చేశారు. ఈ సమావేశంలో భద్రాచలం సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, రెవెన్యూ శాఖ అధికారులు, అటవీ శాఖ అధికారులు మరియు సంబంధిత విభాగాల అధికారులు పాల్గొన్నారు. @TelanganaCMO @TelanganaCS @IPRTelangana @Bhatti_Mallu @TummalaOfficial @INC_Ponguleti @Vakiti_srihari @DamodarCilarapu #BhadradriKothagudem #LandIssues #AssignedLands #ForestLands #RevenueDept #Telangana
Collector Bhadradri Kothagudem tweet mediaCollector Bhadradri Kothagudem tweet mediaCollector Bhadradri Kothagudem tweet mediaCollector Bhadradri Kothagudem tweet media
Paloncha, India 🇮🇳 తెలుగు
2
1
5
213
Collector Bhadradri Kothagudem
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ IAS జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణను వేగవంతం చేసి బాధితులకు తక్షణ న్యాయం అందించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అంకిత్ IAS అధికారులను ఆదేశించారు. గురువారం ఐడీఓసీ కార్యాలయం సమావేశ మందిరంలో భద్రాచలం సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్టతో కలిసి నిర్వహించిన జిల్లా స్థాయి విజిలెన్స్ & మానిటరింగ్ కమిటీ సమావేశంలో కలెక్టర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ IAS మాట్లాడుతూ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న 40 ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసుల పురోగతిని సమీక్షించినట్లు తెలిపారు. ప్రతి కేసులో దర్యాప్తు వేగవంతం చేసి, నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలని, చార్జ్‌షీట్లు ఆలస్యం లేకుండా దాఖలు చేయాలని అధికారులకు సూచించారు. బాధితులకు చట్టపరమైన రక్షణతో పాటు ప్రభుత్వ పరిహారం, పునరావాస సదుపాయాలు సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అట్రాసిటీ కేసుల్లో నిర్లక్ష్యం సహించబోమని స్పష్టం చేస్తూ, శాఖల మధ్య సమన్వయం పెంచి కేసుల పరిష్కారంలో వేగం తీసుకురావాలని తెలిపారు. బాధితుల గోప్యత, భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, గ్రామ, మండల స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ఎస్సీ, ఎస్టీ హక్కులపై చైతన్యం పెంపొందించాలని సూచించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భద్రాచలం సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట మాట్లాడుతూ ప్రతి కేసును సున్నితంగా తీసుకుని బాధితులకు న్యాయం జరిగేలా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కేసుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి శ్రీలత, జిల్లా అధికారులు, పోలీస్ శాఖ అధికారులు, కమిటీ సభ్యులు సామ్యా నాయక్, లకావత్ వెంకటేశ్వర్లు, లక్ష్మీ రాంబాయి, కోలూరి రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. @TelanganaCMO @TelanganaCS @IPRTelangana @Bhatti_Mallu @TummalaOfficial @INC_Ponguleti @Vakiti_srihari @DamodarCilarapu #BhadradriKothagudem #SCSTWelfare #SocialJustice #AtrocityCases #LawAndOrder #Telangana
Collector Bhadradri Kothagudem tweet mediaCollector Bhadradri Kothagudem tweet mediaCollector Bhadradri Kothagudem tweet media
Paloncha, India 🇮🇳 తెలుగు
0
1
7
370
Collector Bhadradri Kothagudem
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా – జూలూరుపాడు మండలం, కరివారిగూడెం వేసవిలో తాగునీటి సమస్య లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ IAS జూలూరుపాడు మండలం కరివారిగూడెం గ్రామంలో తాగునీటి సమస్య దృష్టికి వచ్చిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అంకిత్ IAS గ్రామాన్ని సందర్శించి మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలోని నీటి వనరుల పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్‌కు నీటిని ఎక్కించడంలో సాంకేతిక సమస్యలు ఉన్నట్లు అధికారులు తెలియజేయగా, వాటిని తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. గ్రామ ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా అందేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. అవసరమైతే బోర్ల ద్వారా నీటి సరఫరా చేయడం, అందుబాటులో ఉన్న వనరులను వినియోగించడం వంటి చర్యలు తీసుకోవాలని తెలిపారు. వేసవి కాలం ముగిసే జూన్ వరకు గ్రామంలో తాగునీటి కొరత లేకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని మిషన్ భగీరథ అధికారులను జిల్లా కలెక్టర్ అంకిత్ IAS ఆదేశించారు. @TelanganaCMO @TelanganaCS @IPRTelangana @Bhatti_Mallu @TummalaOfficial @INC_Ponguleti @Vakiti_srihari @DamodarCilarapu #BhadradriKothagudem #Julurupadu #DrinkingWater #MissionBhagiratha #SummerPreparedness #Telangana #WaterManagement
Collector Bhadradri Kothagudem tweet mediaCollector Bhadradri Kothagudem tweet mediaCollector Bhadradri Kothagudem tweet mediaCollector Bhadradri Kothagudem tweet media
Kottagudem, India 🇮🇳 తెలుగు
0
1
9
265
Collector Bhadradri Kothagudem
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా – కొత్తగూడెం చిన్న దృష్టిలోపం కూడా పెద్ద ప్రమాదాలకు కారణమవుతుంది: జిల్లా కలెక్టర్ అంకిత్ IAS డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహణ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహిస్తున్న “అరైవ్–అలైవ్” రహదారి భద్రత వారోత్సవంలో భాగంగా కొత్తగూడెం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి పరీక్షా శిబిరాన్ని జిల్లా కలెక్టర్ అంకిత్ IAS గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా పరీక్షా విభాగాలను సందర్శించి పరీక్షల విధానం, పరికరాలు, వైద్య సిబ్బంది అందిస్తున్న సేవలను పరిశీలించారు. ఆటో డ్రైవర్లకు ప్రాథమిక దృష్టి పరీక్షలతో పాటు దూర దృష్టి, సమీప దృష్టి పరీక్షలు నిర్వహిస్తున్నారు. అవసరాన్ని బట్టి కంటి ఒత్తిడి, కంటి ఆరోగ్య పరిస్థితులను కూడా పరీక్షించి సమస్యలను ముందుగానే గుర్తిస్తున్నారు. చూపు మందగించడం, మసకగా కనిపించడం, దూరం లేదా సమీపంలో స్పష్టంగా కనిపించకపోవడం వంటి సమస్యలను గుర్తించి వైద్యులు తగిన సూచనలు అందిస్తున్నారు. దృష్టి లోపం ఉన్న డ్రైవర్లకు వెంటనే కళ్లద్దాలు అందజేసి, అవసరమైన చికిత్సకు మార్గనిర్దేశం చేస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ IAS మాట్లాడుతూ డ్రైవర్లకు కంటి పరీక్షలు చాలా ముఖ్యమని తెలిపారు. కంటి చూపు స్పష్టంగా లేకపోతే రహదారులపై ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రతి డ్రైవర్ నిర్దిష్ట కాల వ్యవధిలో కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉచిత కంటి పరీక్షా శిబిరాలను డ్రైవర్లు సద్వినియోగం చేసుకోవాలని, కంటి సమస్యలను ముందుగానే గుర్తించి చికిత్స పొందడం ద్వారా సురక్షితంగా వాహనాలు నడపగలరని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా డ్రైవర్లలో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతుందని, రహదారి భద్రత మరింత మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వైద్య సిబ్బంది ప్రతి ఒక్కరికీ నాణ్యమైన సేవలు అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యశాఖ అధికారి తుకారాం రాథోడ్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాధ రామ్మోహన్, వైద్యులు, నర్సులు, సిబ్బంది పాల్గొన్నారు. @TelanganaCMO @TelanganaCS @IPRTelangana @Bhatti_Mallu @TummalaOfficial @INC_Ponguleti @Vakiti_srihari @DamodarCilarapu #BhadradriKothagudem #RoadSafety #ArriveAlive #EyeCheckup #DriversSafety #HealthAwareness #telanganaevrevolution
Collector Bhadradri Kothagudem tweet mediaCollector Bhadradri Kothagudem tweet mediaCollector Bhadradri Kothagudem tweet media
Kottagudem, India 🇮🇳 తెలుగు
0
1
16
415
Collector Bhadradri Kothagudem
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్ IAS ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అంకిత్ IAS తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కొనుగోలు ప్రక్రియకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు సమగ్రంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్రంలో ఏర్పాటు చేసిన మాయిశ్చర్ యంత్రం (తేమ కొలిచే యంత్రం), తూకం యంత్రాలు, గ్రేడింగ్ యంత్రాలు తదితర సౌకర్యాలను పరిశీలించి, అవి పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలని సూచించారు. గత సంవత్సరం ఈ కేంద్రం ద్వారా ఎంతమేరకు ధాన్యం సేకరించారో, ప్రస్తుత సీజన్‌లో అంచనా దిగుబడి ఎంత ఉంటుందో అధికారులను అడిగి తెలుసుకున్నారు. టార్పాలిన్లు, గన్నీ బ్యాగుల నిల్వలపై కూడా వివరాలు సేకరించారు. రైతులు ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకువచ్చే సమయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రతి కొనుగోలు కేంద్రానికి పర్యవేక్షణ అధికారిని నియమించి, కొనుగోలు ప్రారంభమైన వెంటనే సమర్థవంతంగా నిర్వహణ జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కేంద్రాల్లో తాగునీరు, విశ్రాంతి సదుపాయాలు, సరిపడా సిబ్బంది, రవాణా సదుపాయాలు ముందుగానే ఏర్పాటు చేయాలని తెలిపారు. రైతుల నుంచి ధాన్యం సేకరణ ప్రారంభమైన తర్వాత చెల్లింపులు ఆలస్యం కాకుండా వారి బ్యాంకు ఖాతాల్లో వెంటనే జమ చేయాలని ఆదేశించారు. కొనుగోలు ప్రక్రియలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలని, రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ IAS స్పష్టం చేశారు. ఈ తనిఖీలో తాసిల్దార్ శ్రీనివాస్, వ్యవసాయ శాఖ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. @TelanganaCMO @TelanganaCS @IPRTelangana @Bhatti_Mallu @TummalaOfficial @INC_Ponguleti @Vakiti_srihari @DamodarCilarapu #BhadradriKothagudem #PaddyProcurement #FarmersWelfare #Agriculture #Telangana #ProcurementCenters
Collector Bhadradri Kothagudem tweet mediaCollector Bhadradri Kothagudem tweet mediaCollector Bhadradri Kothagudem tweet media
Kottagudem, India 🇮🇳 తెలుగు
0
1
6
282
Collector Bhadradri Kothagudem
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా – జూలూరుపాడు మండలం ప్రజా పాలన ప్రగతి ప్రణాళికతో సమస్యల పరిష్కారం వేగవంతం – జిల్లా కలెక్టర్ అంకిత్ IAS ప్రతి గ్రామపంచాయతీని మోడల్ గ్రామంగా తీర్చిదిద్దేలా కృషి చేయాలి ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జూలూరుపాడు రైతు వేదికలో గురువారం మండల స్థాయి సభ నిర్వహించారు. ఈ సభకు జిల్లా కలెక్టర్ అంకిత్ IAS ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమం ప్రారంభంలో రాష్ట్ర గీతాన్ని ఆలపించి, అనంతరం ముఖ్యమంత్రి సందేశాన్ని వినిపించారు. ఈ సందర్భంగా మండలంలో రహదారి భద్రత “అరైవ్–అలైవ్”, వ్యవసాయం, విద్య, వైద్యం, మిషన్ భగీరథ, ఇరిగేషన్, మహిళా సంఘాలు వంటి విభాగాల ద్వారా అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల వివరాలను అధికారులు వివరించారు. అనంతరం సర్పంచులు తమ గ్రామాల సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. జిల్లా కలెక్టర్ అంకిత్ IAS మాట్లాడుతూ, ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ద్వారా గ్రామ స్థాయి వరకు సమస్యలను గుర్తించి వేగంగా పరిష్కరిస్తున్నామని తెలిపారు. గ్రామసభలు, సర్పంచులకు శిక్షణ కార్యక్రమాలు ఇప్పటికే నిర్వహించామని చెప్పారు. అధికారులు క్షేత్రస్థాయిలో సమర్థంగా పనిచేస్తేనే సమగ్ర అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన వారికి చేరేలా అధికారులు, ప్రజా ప్రతినిధులు సమగ్ర పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతులు ముందుగానే బుకింగ్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మధ్యాహ్న భోజన పథకంలో మెనూ తప్పనిసరిగా పాటించేలా పాఠశాలల్లో పర్యవేక్షణ పెంచాలని తెలిపారు. డ్రాప్‌అవుట్ విద్యార్థులను గుర్తించి తిరిగి పాఠశాలలో చేర్చాలని అధికారులను ఆదేశించారు. ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని, వేసవి తీవ్రత దృష్ట్యా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు గ్రామస్థాయిలో సేవలు అందించేలా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. చేయూత వంటి పథకాల అమలులో అర్హులకే లబ్ధి అందేలా కట్టుదిట్టమైన పర్యవేక్షణ అవసరమని పేర్కొన్నారు. గ్రామాభివృద్ధిలో సర్పంచులు, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామాన్ని మోడల్ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని సూచించారు. రహదారి భద్రతపై గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రమాదాలను తగ్గించే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా అనంతారం గ్రామంలో భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ సమస్యపై ప్రజాప్రతినిధులు వివరించగా, సురక్షిత తాగునీటి సరఫరా కోసం మిషన్ భగీరథ అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో తాసిల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో తాళ్లూరి రవి, మండల స్థాయి అధికారులు, సర్పంచులు, ఉప సర్పంచులు, పంచాయతీ సెక్రటరీలు పాల్గొన్నారు. @TelanganaCMO @TelanganaCS @IPRTelangana @Bhatti_Mallu @TummalaOfficial @INC_Ponguleti @Vakiti_srihari @DamodarCilarapu #BhadradriKothagudem #Julurupadu #PrajaPalana #RuralDevelopment #ModelVillage #Telangana #GoodGovernance
Collector Bhadradri Kothagudem tweet mediaCollector Bhadradri Kothagudem tweet mediaCollector Bhadradri Kothagudem tweet mediaCollector Bhadradri Kothagudem tweet media
Kottagudem, India 🇮🇳 తెలుగు
0
2
6
172
Collector Bhadradri Kothagudem
జిల్లా కలెక్టర్ అంకిత్ IAS మాట్లాడుతూ ఈ ఉపకేంద్రాలు సుమారు 4 వేల మంది రైతులకు ప్రత్యక్ష లబ్ధి చేకూర్చనున్నాయని తెలిపారు. వేసవి కాలంలో లో వోల్టేజ్ సమస్యలను తగ్గించడంలో ఇవి ఉపయోగపడతాయని పేర్కొన్నారు. గండుగులపల్లి సోలార్ ప్రాజెక్ట్ ద్వారా 422 ఇళ్లకు విద్యుత్ అందించనున్నట్లు, ఇది గ్రామ స్థాయిలో విద్యుత్ స్వావలంబనకు దోహదపడుతుందని తెలిపారు. అనంతరం సోలార్ మీటర్ ఆన్ చేసి ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విద్యా చందన, జడ్పీ సీఈఓ నాగలక్ష్మి, విద్యుత్ శాఖ ఎస్సీ మహేందర్, ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. @TelanganaCMO @TelanganaCS @IPRTelangana @Bhatti_Mallu @TummalaOfficial @INC_Ponguleti @Vakiti_srihari @DamodarCilarapu #BhadradriKothagudem #Aswaraopeta #PowerDevelopment #SolarEnergy #RuralDevelopment #Telangana #ElectricityForAll
Collector Bhadradri Kothagudem tweet mediaCollector Bhadradri Kothagudem tweet mediaCollector Bhadradri Kothagudem tweet media
తెలుగు
0
1
3
218
Collector Bhadradri Kothagudem
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా – అశ్వరావుపేట నియోజకవర్గం అభివృద్ధి ఫలాలు ప్రతి ఇంటికి చేర్చడమే ప్రభుత్వ లక్ష్యం అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన గండుగులపల్లిలో సోలార్ విద్యుత్ మోడల్ ప్రాజెక్ట్ ప్రారంభం విద్యుత్ డివిజన్ కేంద్రం మంజూరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం జగ్గారం, మల్లారం గ్రామాల్లో నిర్మించనున్న రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాల శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు గారు, అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గారు, సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి గారు, ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అంకిత్ IAS, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు గారు మాట్లాడుతూ అశ్వరావుపేట నియోజకవర్గ అభివృద్ధికి నాణ్యమైన విద్యుత్ కీలకమని తెలిపారు. రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు ఉపకేంద్రాల సామర్థ్యాన్ని పెంచడం అవసరమని పేర్కొన్నారు. జగ్గారం, మల్లారం ప్రాంతాల్లో సుమారు రూ.5 కోట్ల వ్యయంతో రెండు కొత్త ఉపకేంద్రాలు మంజూరు చేసి పనులు ప్రారంభిస్తున్నామని చెప్పారు. దమ్మపేట మండలం గండుగులపల్లి గ్రామాన్ని మోడల్ సోలార్ గ్రామంగా అభివృద్ధి చేస్తూ, సుమారు 422 ఇండ్లకు సోలార్ విద్యుత్ అందించేందుకు రూ.23 కోట్ల వ్యయంతో ప్రాజెక్ట్ అమలు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే విద్యుత్ లైన్లు, పోల్స్ పునరుద్ధరణకు రూ.8 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రతి కుటుంబానికి ఆహార భద్రత, గృహ నిర్మాణం, ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గారు మాట్లాడుతూ నియోజకవర్గంలో విద్యుత్ సమస్యలను పూర్తిగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పాత విద్యుత్ లైన్ల మార్పు, కొత్త పోల్స్ ఏర్పాటు, డివిజన్ కేంద్రం ఏర్పాటు అవసరాన్ని వివరించారు. ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఉపకేంద్రాల ద్వారా సుమారు 6 వేల మందికి నాణ్యమైన విద్యుత్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
Collector Bhadradri Kothagudem tweet mediaCollector Bhadradri Kothagudem tweet mediaCollector Bhadradri Kothagudem tweet mediaCollector Bhadradri Kothagudem tweet media
తెలుగు
1
1
9
395
Collector Bhadradri Kothagudem
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా – సుజాతానగర్ మండలం, మర్రి తండ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యత, వేగం పై జిల్లా కలెక్టర్ అంకిత్ IAS ప్రత్యేక దృష్టి ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్మాణాలు – గడువులోపు పూర్తి చేయాలని ఆదేశాలు సుజాతానగర్ మండలం మర్రి తండ గ్రామంలో అమలవుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ అంకిత్ IAS బుధవారం సమగ్రంగా పరిశీలించారు. గ్రామంలో మొత్తం 99 ఇళ్లకు అనుమతులు మంజూరు కాగా, అందులో 65 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని, మిగిలిన ఇళ్ల పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయని అధికారులు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ IAS గ్రామంలో పలువురు లబ్ధిదారుల ఇళ్లను ప్రత్యక్షంగా సందర్శించి నిర్మాణ నాణ్యత, పనుల పురోగతిని పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి ఇప్పటివరకు జరిగిన వ్యయం, ప్రభుత్వం నుండి విడుదలైన నిధుల వివరాలు తెలుసుకున్నారు. లేబర్ చార్జీలు, లబ్ధిదారులు అదనంగా వెచ్చిస్తున్న ఖర్చులపై ప్రశ్నించి సమగ్ర సమాచారం సేకరించారు. ఈ క్రమంలో మూడ్ మౌనిక, హాథిరాం, భూక్య అమల, భూక్య సునీత, భూక్య పంతులీ తదితరుల ఇళ్లను పరిశీలించారు. గ్రామంలో సుమారు 650 మంది జనాభా ఉండగా, వారిలో ఎక్కువ మంది తాపీ మేస్త్రీలు ఉన్నారని గమనించారు. ప్రభుత్వం అందిస్తున్న రూ.5 లక్షల ఆర్థిక సహాయానికి అదనంగా లబ్ధిదారులు స్వంతంగా పెట్టుబడి పెట్టి, తామే ఇళ్ల నిర్మాణంలో పాల్గొని లేబర్ ఖర్చులను తగ్గించుకుంటున్న విషయాన్ని తెలుసుకున్నారు. ఇళ్ల నిర్మాణం ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలు, నిబంధనల ప్రకారం జరుగుతోందో లేదో అధికారులను ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. ఇళ్ల విస్తీర్ణం, నిర్మాణ పరిమాణాన్ని టేప్‌తో కొలిపించి నిర్ధారించారు. నాణ్యత లోపాలు లేకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ IAS మాట్లాడుతూ, పనుల పురోగతిపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని, ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలు పాటిస్తూ నిర్మాణాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మిగిలిన ఇళ్ల పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ పరిశీలనలో తాసిల్దార్ కృష్ణ ప్రసాద్, ఎంపీడీవో భారతి, గృహ నిర్మాణ శాఖ ఏఈ లాల్ సాబ్, పంచాయతీ సెక్రటరీ విజయలక్ష్మి, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. @TelanganaCMO @TelanganaCS @IPRTelangana @Bhatti_Mallu @TummalaOfficial @INC_Ponguleti @Vakiti_srihari @DamodarCilarapu #BhadradriKothagudem #IndirammaIllu #HousingForAll #RuralDevelopment #Telangana #GovernmentSchemes
Collector Bhadradri Kothagudem tweet mediaCollector Bhadradri Kothagudem tweet mediaCollector Bhadradri Kothagudem tweet mediaCollector Bhadradri Kothagudem tweet media
Palwancha, India 🇮🇳 తెలుగు
0
1
21
568
Collector Bhadradri Kothagudem
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రోడ్డు భద్రతపై అవగాహనతోనే ప్రమాదాల నివారణ – విద్యార్థులు మార్గదర్శకులుగా నిలవాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ IAS ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “అరైవ్ – అ లైవ్” కార్యక్రమంలో భాగంగా పాత కొత్తగూడెం హనుమాన్ బస్తీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రోడ్డు భద్రతపై అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ అంకిత్ IAS ఘనంగా ప్రారంభించారు. “రహదారుల భద్రత మన అందరి బాధ్యత” అనే నినాదంతో ప్రారంభమైన ఈ ర్యాలీలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని రోడ్డు భద్రతపై నినాదాలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి జిల్లా కలెక్టర్ అంకిత్ IAS రహదారి భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ప్రజల్లో, ముఖ్యంగా విద్యార్థుల్లో అవగాహన కల్పించడం అత్యంత కీలకమని తెలిపారు. చిన్న వయస్సులోనే ట్రాఫిక్ నిబంధనలు, రహదారి భద్రతపై అవగాహన పెంపొందితే భవిష్యత్తులో బాధ్యతాయుత పౌరులుగా ఎదుగుతారని అన్నారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులు, బంధువులు ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి, కార్లలో ప్రయాణించే సమయంలో సీట్ బెల్ట్ ధరించాలనే విషయాన్ని గుర్తుచేయాలని సూచించారు. ట్రాఫిక్ సిగ్నల్స్, జీబ్రా క్రాసింగ్ వినియోగం, రోడ్డు నియమాల పాటింపు వంటి అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. పాఠశాలల్లో రోడ్డు భద్రతపై పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో పాటు విద్యార్థులకు ప్రత్యేక అవగాహనా తరగతులు నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. గ్రామాలు, పట్టణాల్లో ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రజల్లో భద్రతపై చైతన్యం పెంపొందించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల వల్ల అనేక కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయని, ఈ ప్రమాదాలను తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు. “అరైవ్ – అ లైవ్” కార్యక్రమం ద్వారా ప్రజల్లో రహదారి భద్రతపై విస్తృత అవగాహన కల్పించడం లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ మధురవాణి, ప్రధానోపాధ్యాయులు లక్ష్మి, కోఆర్డినేటర్ నాగశేఖర శర్మ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. @TelanganaCMO @TelanganaCS @IPRTelangana @Bhatti_Mallu @TummalaOfficial @INC_Ponguleti @Vakiti_srihari @DamodarCilarapu #BhadradriKothagudem #RoadSafety #ArriveAlive #TrafficAwareness #StudentPower #SafeDriving #Telangana
Collector Bhadradri Kothagudem tweet mediaCollector Bhadradri Kothagudem tweet mediaCollector Bhadradri Kothagudem tweet media
Palwancha, India 🇮🇳 తెలుగు
0
2
17
319
Collector Bhadradri Kothagudem
అనంతరం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఏప్రిల్ 14 నుండి 20 వరకు నిర్వహించనున్న అగ్నిమాపక వారోత్సవాల గోడపత్రికను జిల్లా కలెక్టర్ అంకిత్ IAS ఆవిష్కరించారు. అలాగే రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “అరైవ్–అలైవ్” కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగం, మద్యపానం చేసి డ్రైవింగ్ చేయకపోవడం, వేగ నియంత్రణ పాటించడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. అనంతరం జడ్పీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) విద్యా చందన, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి శ్రీలత, జిల్లా రవాణా శాఖ అధికారి వెంకటరమణ, తూనికలు కొలతలు శాఖ అధికారి మనోహర్, వైద్యశాఖ అధికారి తుకారాం రాథోడ్, జిల్లా అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు డాక్టర్ మద్దెల శివకుమార్, సబ్బారపు మధుసూదన్ రావు, పీక కృష్ణ, కుసపాటి శ్రీనివాస్, కోలపూరి ధర్మరాజు, సలింగటి శ్రీనివాస్, కమిటీ కో-కన్వీనర్లు, సభ్యులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. @TelanganaCMO @TelanganaCS @IPRTelangana @Bhatti_Mallu @TummalaOfficial @INC_Ponguleti @Vakiti_srihari @DamodarCilarapu #BhadradriKothagudem #AmbedkarJayanti #SocialEquality #IndianConstitution #ArriveAlive #RoadSafety #Telangana
Collector Bhadradri Kothagudem tweet mediaCollector Bhadradri Kothagudem tweet mediaCollector Bhadradri Kothagudem tweet mediaCollector Bhadradri Kothagudem tweet media
తెలుగు
0
1
1
230
Collector Bhadradri Kothagudem
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ IAS మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత ప్రజలు స్వయంగా పరిపాలించుకునే విధంగా రాజ్యాంగం అవసరమైందని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న మేధావులలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ బాధ్యతను సమర్థంగా నిర్వర్తించిన మహనీయుడని పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాణంలో ఆయన చేసిన కృషి అపూర్వమని, విద్య, ఆర్థిక, నీటిపారుదల రంగాల్లో ఆయన చూపిన దూరదృష్టి దేశాభివృద్ధికి పునాది అయిందన్నారు. భారత రాజ్యాంగం ద్వారా ప్రతి పౌరుడికి సమాన హక్కులు లభించాయని, “ఒక వ్యక్తి – ఒక ఓటు” సూత్రాన్ని స్థిరపరిచిన గొప్ప నాయకుడు అంబేద్కర్ అని తెలిపారు. కుల, మత భేదాలకు అతీతంగా సమానత్వ భావనను నెలకొల్పిన ఆయన ఆశయాలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ, విభిన్న కులాలు, మతాలు, భాషలు, సంస్కృతులు ఉన్న దేశం ఐక్యంగా నిలబడటానికి ప్రధాన కారణం భారత రాజ్యాంగమని అన్నారు. తక్కువ సవరణలతోనే సమర్థవంతంగా కొనసాగుతున్న రాజ్యాంగం అంబేద్కర్ దూరదృష్టికి నిదర్శనమన్నారు. సమాజంలో సమానత్వం, మానవతా విలువలు పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Collector Bhadradri Kothagudem tweet mediaCollector Bhadradri Kothagudem tweet mediaCollector Bhadradri Kothagudem tweet mediaCollector Bhadradri Kothagudem tweet media
తెలుగు
1
2
6
306
Collector Bhadradri Kothagudem
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంబేద్కర్ ఆశయాలు యువతకు స్ఫూర్తి కావాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ IAS డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్ ప్రధాన కూడలిలో షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అంకిత్ IAS, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ముఖ్య అతిథులుగా పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు.
Collector Bhadradri Kothagudem tweet mediaCollector Bhadradri Kothagudem tweet media
తెలుగు
1
3
15
486
Collector Bhadradri Kothagudem
l భద్రాద్రి కొత్తగూడెం జిల్లా l రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా కలెక్టర్ అంకిత్ IAS ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనం చేసిన ఐదు గ్రామపంచాయతీలను తిరిగి తెలంగాణ రాష్ట్రంలో కలపాలని డిమాండ్ చేస్తూ భద్రాచలంలో నిర్వహిస్తున్న సమరభేరి కార్యక్రమంలో పాల్గొనటానికి జిల్లాకు విచ్చేసిన రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి గారిని జిల్లా కలెక్టర్ అంకిత్ IAS సోమవారం పాల్వంచ నవభారత్ గెస్ట్ హౌస్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ IAS పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యలు, ప్రభుత్వ పథకాల అమలు వంటి అంశాలపై స్వల్పంగా చర్చించారు. @TelanganaCMO @TelanganaCS @IPRTelangana @Bhatti_Mallu @TummalaOfficial @INC_Ponguleti @Vakiti_srihari @DamodarCilarapu #BhadradriKothagudem #Palwancha #RenukaChowdhury #Telangana #Governance
Collector Bhadradri Kothagudem tweet mediaCollector Bhadradri Kothagudem tweet media
Palwancha, India 🇮🇳 తెలుగు
3
5
59
4.9K
Collector Bhadradri Kothagudem
l భద్రాద్రి కొత్తగూడెం జిల్లా l సెన్సస్ పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ IAS సెన్సస్‌కు సంబంధించిన పెండింగ్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ IAS సంబంధిత జిల్లా అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలో సెన్సస్–2027 ఏర్పాట్లపై డీసీఓ భారతి హోళీకేరి గారు సోమవారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రత్యేక చార్జ్‌లకు సంబంధించిన ప్రతిపాదనలు అన్ని జిల్లాలు సమర్పించాలని, పెండింగ్ ఉన్న జిల్లాలు వెంటనే వివరాలు అందించాలని ఆదేశించారు. ఇళ్ల గణనకు సంబంధించి జిల్లా, మండల స్థాయిలో భూభాగ గణాంకాల్లో ఉన్న వ్యత్యాసాలపై చర్చించారు. వివిధ వనరుల నుంచి వచ్చిన డేటాలో ఒకే డేటాను ఖరారు చేసి జిల్లా సెన్సస్ అధికారి ద్వారా ధృవీకరించి పంపించాలని సూచించారు. ఇతర మార్గాల ద్వారా పంపిన సమాచారాన్ని పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేశారు. ఎన్యూమరేటర్ల మాన్యువల్స్, సూపర్వైజర్ కిట్స్, మ్యాప్స్ వంటి సెన్సస్ సామగ్రి పంపిణీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. చార్జ్ అధికారులకు పంపే ఈ సామగ్రిని స్వీకరించి పరిమాణాన్ని ధృవీకరించాలని సూచించారు. అలాగే ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్ల నియామక ప్రక్రియను పూర్తి చేసి అదనపు రిజర్వ్ సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఐడీఓసీ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ అంకిత్ IAS మాట్లాడుతూ, జిల్లాలో సెన్సస్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు ఇప్పటికే ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. ప్రతి దశను సమయపాలనతో అమలు చేస్తూ శాఖల మధ్య సమన్వయం కల్పిస్తున్నామని చెప్పారు. ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు శిక్షణ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఫీల్డ్ స్థాయిలో ఎలాంటి లోపాలు లేకుండా ముందస్తు పర్యవేక్షణ కొనసాగిస్తున్నామని తెలిపారు. సెన్సస్ కార్యక్రమం విజయవంతం కావాలంటే ప్రతి అధికారి బాధ్యతతో పని చేసి డేటా ఖచ్చితత్వంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ సమావేశంలో సీపీఓ సంజీవరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. @TelanganaCMO @TelanganaCS @IPRTelangana @Bhatti_Mallu @TummalaOfficial @INC_Ponguleti @Vakiti_srihari @DamodarCilarapu #BhadradriKothagudem #Census2027 #Governance #DataAccuracy #Telangana
Collector Bhadradri Kothagudem tweet mediaCollector Bhadradri Kothagudem tweet media
Kottagudem, India 🇮🇳 తెలుగు
0
2
20
841
Collector Bhadradri Kothagudem
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా – కలెక్టరేట్ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం – తక్షణ చర్యలకు జిల్లా కలెక్టర్ అంకిత్ IAS ఆదేశాలు తేది: 13-04-2026 సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అంకిత్ IAS ప్రజల నుండి అందిన వినతిపత్రాలు, ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన ప్రజలు తమ వ్యక్తిగత, సామూహిక సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ IAS ప్రతి ఫిర్యాదును శ్రద్ధగా పరిశీలిస్తూ సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమస్యలపై వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తక్షణ పరిష్కారం సాధ్యమైన సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలని, మిగిలిన వాటిని నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ఆలస్యం ఉండకూడదని, అధికారులు సమన్వయంతో బాధ్యతాయుతంగా పనిచేయాలని తెలిపారు. ప్రతి వినతిపత్రాన్ని పరిశీలించి సమస్యల మూలాలను గుర్తించి దీర్ఘకాలిక పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. ప్రజలు తమ ఫిర్యాదులను పూర్తి వివరాలతో పాటు అవసరమైన ఆధార పత్రాలతో సమర్పిస్తే పరిష్కారం వేగవంతమవుతుందని తెలిపారు. ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత చేరువ కావాలని, ప్రతి సమస్యకు సమర్థవంతమైన పరిష్కారం అందేలా అధికారులు కట్టుబడి పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. @TelanganaCMO @TelanganaCS @IPRTelangana @Bhatti_Mallu @TummalaOfficial @INC_Ponguleti @Vakiti_srihari @DamodarCilarapu #BhadradriKothagudem #Prajavani #PublicGrievances #Governance #Telangana
Collector Bhadradri Kothagudem tweet mediaCollector Bhadradri Kothagudem tweet mediaCollector Bhadradri Kothagudem tweet mediaCollector Bhadradri Kothagudem tweet media
Palwancha, India 🇮🇳 తెలుగు
0
3
9
452