
Cyber Crimes Unit Hyderabad
3.8K posts

Cyber Crimes Unit Hyderabad
@CyberCrimeshyd
Report Cyber Crime on 1930 or https://t.co/5sQFE4AQyj In case of any emergency of cyber frauds reach out to call or WhatsApp 8712665171 CCPS Hyd City.




బడా కంపెనీలే లక్ష్యంగా వాట్సాప్ లో కొత్త తరహా మోసం.. జాగ్రత్త!! వ్యాపార సంస్థల అధినేతలు, సీఈఓలు, సీఎఫ్ఓలు, అకౌంటెంట్లను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు సరికొత్త Whatsapp Impersonation Fraud కు తెరలేపారు. సంస్థల అధికారిక ఈమెయిల్స్‌కు హానికరమైన ఫిషింగ్ లింకులు పంపడం ద్వారా కంప్యూటర్లలోకి మాల్వేర్‌ను ప్రవేశపెట్టి, తద్వారా సిస్టమ్స్‌పై పూర్తి స్థాయి రిమోట్ యాక్సెస్‌ను పొందుతున్నారు. సిస్టమ్ నియంత్రణలోకి వచ్చిన తర్వాత, అందులో యాక్టివ్‌గా ఉన్న వాట్సాప్ వెబ్ సెషన్లను ఉపయోగించి సీఈఓ లేదా సీఎఫ్ఓల పేరుతో అకౌంటెంట్లకు తప్పుదారి పట్టించే సందేశాలను పంపిస్తున్నారు. తాను అత్యవసర సమావేశంలో ఉన్నానని, ఫోన్ ఎత్తడం వీలుపడదని నమ్మబలుకుతూ, సోషల్ ఇంజనీరింగ్ వ్యూహాలతో కోట్లాది రూపాయలను తక్షణమే సైబర్ నేరగాళ్లు తమ ఖాతాలకు బదిలీ చేయించుకుంటున్నారు. వ్యాపార సంస్థల అధినేతలు, సీఈఓలు, సీఎఫ్ఓల ఫోన్ నంబర్ల నుంచే అకౌంటెంట్లను సందేశాలు వస్తుండటంతో నిజమేనని డబ్బును పంపుతున్నారు. ఇటీవలి కాలంలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇటువంటి కేసులు నమోదవుతున్న నేపథ్యంలో, ప్రతి కంపెనీ కూడా అప్రమత్తంగా ఉండాలి. వాట్సాప్‌లో పై అధికారుల పేరుతో వచ్చే ఆర్థిక అభ్యర్థనలను గుడ్డిగా నమ్మకూడదు. వెంటనే వారికి నేరుగా ఫోన్ చేసి ఆ మెసేజ్ నిజమేనా కాదా అని ధృవీకరించుకోవాలి. ఆఫీసు సిస్టమ్స్‌లో నాణ్యమైన ఫైర్‌వాల్స్, యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌లను ఇన్‌స్టాల్ చేసి ఉంచండి. అలాగే వాట్సాప్ వెబ్ వాడిన ప్రతిసారి తప్పకుండా లాగౌట్ చేయడం మర్చిపోకండి. ఒకవేళ మీరు సైబర్ మోసానికి గురైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయండి. లేదా cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి. #CyberCrimeAwareness #WhatsAppFraud #StaySafe #CyberSecurity







#SayNoToBetting గత ఏడాది కాలంలో బెట్టింగ్ వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి గాథలు వింటే భయం వేస్తుంది. అప్పుల బాధ తాళలేక, సమాజంలో తలెత్తుకోలేక అర్ధాంతరంగా జీవితాలను ముగించిన వారు వీరంతా. క్షణికావేశంలో వారు తీసుకున్న నిర్ణయం.. నేడు ఆ కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. ఒక్క గెలుపు ఇచ్చే అత్యాశ, వేల అప్పులకు పునాది వేస్తుంది. మీరు గెలిచేది రూపాయి.. ఓడిపోయేది మాత్రం మీ ప్రాణం! గెలిచే రూపాయి కంటే మీ ప్రాణం వెలకట్టలేనిది. పందెంతో ప్రాణాలను పణంగా పెట్టకండి. మీరు కూడా వీరిలా బెట్టింగ్ భూతానికి బలికాకండి. మీ ప్రాణం మీ కుటుంబానికి కొండంత అండ - ఆ నిజాన్ని మర్చిపోవద్దు. గుర్తుంచుకోండి.. ఆటను ఆస్వాదించండి.. జీవితాన్ని పణంగా పెట్టకండి!




#SayNoToBetting బెట్టింగ్ ఊబిలో పడొద్దు.. బతుకును ఛిద్రం చేసుకోవద్దు! ఐపీఎల్ సీజన్ మొదలవుతున్న తరుణంలో క్రికెట్‌ను కేవలం క్రీడగా ఆస్వాదించాలని, బెట్టింగ్ ఊబిలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో #SayNoToBettingApps ప్రచారం ద్వారా వందలాది యాప్‌లను ప్రభుత్వం నిషేధించినప్పటికీ, ఇప్పుడు టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికగా ఈ దందా కొత్త రూపం దాల్చింది. కేవలం డబ్బు కోసం ఇటువంటి ప్రమాదకరమైన యాప్‌లను ప్రమోట్ చేసే సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఆన్‌లైన్ మాత్రమే కాకుండా ఫామ్ హౌస్‌లు, రహస్య ప్రాంతాల్లో సాగే ఆఫ్‌లైన్ బెట్టింగ్‌లపై మా ప్రత్యేక నిఘా ఉంది. బెట్టింగ్ వల్ల అప్పులపాలై కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి తెచ్చుకోవద్దు. మీ పరిసరాల్లో ఎవరైనా బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 100 లేదా మా వాట్సాప్ నంబర్ 94906 16555 కు సమాచారం ఇవ్వండి. @CPHydCity @hydcitypolice @SajjanarOffice @TelanganaCOPs @TelanganaDGP @Cyberdost @CyberCrimeshyd #StopBetting #CricketNotBetting #AntiBettingCampaign


There is no shortage of fuel or LPG cylinders in #Hyderabad. Adequate stocks are available and supply is running smoothly across the city. Citizens are requested not to panic or rush to fuel stations, as such actions may lead to unnecessary congestion and disruption. Hyderabad City Police is closely monitoring the situation in coordination with all concerned departments. We urge everyone to remain calm, avoid spreading or believing in rumours, and cooperate with authorities to ensure normalcy is maintained. @TelanganaDGP








