
అధికారిక వివరణ :
హైడ్రా టెండర్ల ప్రక్రియ లో అవకతవకలు జరిగాయి అంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ కండించారు.
మాన్సూన్ ఎమర్జన్సీ టీమ్‌ల (MET) ఎంపిక పారదర్శకంగా జరిగిందని హైడ్రా స్పష్టం చేసింది. ఇవన్నీ అవకాశం దొరకని కాంట్రాక్టర్లు చేసిన ఆరోపణలు అని తెలిపింది.
హైడ్రా విడుదల చేసిన వివరాలు:
మొత్తం రూ.65 కోట్ల విలువైన 62 టెండర్లను వర్షాకాల అత్యవసర పనుల కోసం హైడ్రా ఆహ్వానించింది.
వీటిలో 44 టెండర్లను తెరవగా, ఇందులో 4 ఆర్హత సాధించలేదని తెలిపింది.
మిగిలిన 40 టెండర్ల లో, 18 మందికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసుకుని కాంట్రాక్టులు పొందారు.
వర్షాకాలం ఆరంభమవ్వడంతో, అత్యవసర పనుల దృష్ట్యా అర్హత సాధించని 4 చోట్ల టెండరు ప్రకటన మళ్లీ పేపర్లలో ఇవ్వడమైంది.
మరో 22 టెండర్ల దరఖాస్తులను పరిశీలించి ఖరారు చేయాల్సి ఉందని, ఇందులో మరింతమందికి అవకాశం లభించనుందని తెలిపింది.
ఇలాంటి తరుణంలో కేవలం 5 సంస్థలకే టెండర్లు కట్టపెట్టారని ఆరోపించడంలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేసింది.
హైడ్రా టెండర్ల ప్రక్రియ ఏ విధంగా జరిగింది?
అనుభవానికి, సామర్థ్యానికి పెద్దపీట:
గతంలో పని చేసిన అనుభవం, సన్నద్ధత, వాహనాలు, సిబ్బందిని సమకూర్చడంలో వారికున్న సామర్థ్యం మేరకు ఎంపిక చేసినట్టు హైడ్రా పేర్కొంది.
టెండరు ఎంపిక ప్రక్రియలో సైబరాబాద్, మల్కాజిగిరి, జీహెచ్ ఎంసీ కమిషనరేట్ల నుంచి ముగ్గురు సూపరింటెండెంట్ ఇంజినీర్లు, ఆరుగురు ఏఈలు పాల్గొన్న విషయాన్ని తెలియజేసింది.
నిరసన చేపట్టిన కాంట్రాక్టర్లను ఎందుకు కలవలేదు?
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ గారు సోమవారం ఉదయం నుంచి క్షేత్ర స్థాయి పర్యటనలో ఉండడం వల్ల టెండరు దక్కని వాళ్లు కలవడానికి అవకాశం లేకుండా పోయింది.
మధ్యాహ్నం 3 గంటల వరకూ హైడ్రా కమిషనర్ కార్యాలయానికి వచ్చినా ఎవరూ కలవలేదని తెలిపింది.
గమనిక
వర్షాకాల అత్యవసర పనులు పారదర్శకంగా, జవాబుదారీతనంతో, సమర్థవంతంగా అమలు చేయడానికి హైడ్రా కట్టుబడి ఉందని హైడ్రా అధికారికంగా పేర్కొంది.
ప్రజలు, ప్రభుత్వ మాధ్యమాల ద్వారా విడుదలయ్యే అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని, సామాజిక మాధ్యమాలలో తప్పుడు సమాచారాన్ని నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి.
-
హైడ్రా

తెలుగు














