
విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ (చిన్ని) గారి ద్వారా కేశినేని ఫౌండేషన్ లో మహిళలకు ఉపాధి దిశగా శిక్షణ..
హోమ్ లిక్విడ్స్ తయారీపై కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న చింతా అరుణకుమారి గారు తమ అనుభవాన్ని పంచుకున్నారు. ఈ శిక్షణలో భాగంగా డిటర్జెంట్ పౌడర్ (సర్ఫ్) తయారీ విధానం మరియు దానికి అవసరమైన ముడి పదార్థాల గురించి సమగ్రంగా నేర్చుకున్నట్లు తెలిపారు.
హైదరాబాద్‌లోని National Institute of Rural Development and Panchayati Raj (NIRD) లో మానస గారి మార్గదర్శకత్వంలో ఈ శిక్షణ పొందినట్లు చెప్పారు. సర్ఫ్ తయారీకి అవసరమైన 13 రకాల ముడి పదార్థాల గురించి వివరంగా అవగాహన కలిగిందని తెలిపారు.
మహిళలకు నైపుణ్యాభివృద్ధి కల్పించి, స్వయం ఉపాధి అవకాశాలు పెంచడం కేశినేని ఫౌండేషన్ లక్ష్యమని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
#kesinenisivanadh #KesineniFoundation #WomenEmpowerment #SkillDevelopment #SelfEmployment #WomenEntrepreneurs #NIRD #EmpoweringWomen
తెలుగు

































































