INC Andhra Pradesh
24.1K posts

INC Andhra Pradesh
@INC_Andhra
Official Twitter handle of APCC. Andhra Pradesh Congress Committee.
Andhra Pradesh Katılım Ağustos 2014
276 Takip Edilen39.8K Takipçiler

INC Andhra Pradesh retweetledi

తెలుగు ప్రజలకు పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈ పర్వదినం మీ జీవితాల్లో కొత్త వెలుగులు, శాంతి, అష్ట ఐశ్వర్యాలు, సామరస్యం , ఆనందం నింపాలని, ఈ ఏడాది శుభప్రదంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా.
#ugadi

తెలుగు

విజయనగరం జిల్లా శృంగవరపుకోట (ఎస్.కోట) మండలంలో జిందాల్ ప్రాజెక్ట్ కోసం భూములు ఇచ్చిన రైతులు ఏపీసీసీ చీఫ్ వైయస్ షర్మిల గారిని కలిసి, రాజశేఖర్ రెడ్డి గారి అకాల మరణంతో తమకు అన్యాయం జరిగిందని తమ గోడును వెల్లబోసుకున్నారు. 2008లో 1166 ఎకరాలకు పైగా సేకరించిన ఈ భూముల్లో పరిశ్రమ రాలేదని, ఉద్యోగాలు కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పైగా రైతులకు భూములు సాగుకు దక్కక, నష్టపరిహారం సరిగా అందక ఉపాధి కోల్పోయి ఆందోళన బాట పట్టినట్లు వివరించారు. గడిచిన రెండు ప్రభుత్వాల్లోనూ తమకు ఎవరూ న్యాయం చేయలేదని, షర్మిల గారితోనే న్యాయం జరుగుతుందని నమ్మి కలిసినట్లు తెలిపారు. దీనిపై స్పందించిన షర్మిల గారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి లేఖ రాస్తామని, రైతులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పక్షాన పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు.
తెలుగు

విజయనగరం జిల్లా ఎస్.కోట నియోజకవర్గం జామి మండల కేంద్రంలో నిర్వహించిన ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర సభలో కొందరు స్థానిక విద్యార్థినీలు ఏపీసీసీ చీఫ్ వైయస్ షర్మిల గారిని కలిసి తమ సమస్యలను వివరించారు. 800 మంది విద్యార్థులు ఉన్న తమ మండలానికి బస్సు సౌకర్యం లేదని తెలిపారు. వచ్చే ఒకటి రెండు బస్సులు కూడా విద్యార్థినీలను చూసి ఆపకుండా వెళ్లిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో చలించిపోయిన షర్మిల గారు స్థానిక డిపో మేనేజర్‌తో మాట్లాడి సమస్య పరిష్కార దిశగా ఆదేశాలు ఇచ్చారు.
తెలుగు

రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉండి డ్రగ్స్ తీసుకోవడమా? ప్రజాప్రతినిధులు ఆదర్శంగా ఉండాలి, అలవాట్లకు బానిసలు కాకూడదు. ఇది ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటు! కాంగ్రెస్ ఖండిస్తోంది.
#TDP #TeluguDrugsParty
తెలుగు
INC Andhra Pradesh retweetledi

మహానేత YSR ముఖ్యమంత్రిగా ఉండగా పార్టీలకు,కులాలకు, మతాలకు అతీతంగా పథకాలు అందేవి. కానీ నేటి రాజకీయాలు ఇలా లేవు. అధికార పక్షంతో ఉంటే తప్పా పథకాలు రావు. YCP 5 ఏళ్ల పాలనలో పథకాలు ఆ పార్టీ కార్యకర్తలకే ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు గారు సైతం తమ కూటమి కార్యకర్తలకే పథకాలు వర్తింప జేస్తున్నారు. ఇదెక్కడి పద్దతి ? ప్రజలను ప్రజలుగా చూడాలి. ప్రజలకు పార్టీలు అంటగట్టడం తగదు. ప్రజలు కూడా పార్టీలకు అతీతంగా వ్యవహరించాలి. ప్రజల్లో మార్పు, చైతన్యం రెండూ రావాలి. నాయకులు బాగుంటే ప్రజలు బాగుంటారు. నాయకుల సిద్ధాంతాలు ప్రజల కోసం రూపొందించాలి. YSR నిజమైన ప్రజా నాయకుడు.
@INC_Andhra #upaadihaamiparirakshnayatra
తెలుగు
INC Andhra Pradesh retweetledi

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్ట( MGNREGA) పరిరక్షణ యాత్ర నేడు శ్రీకాకుళం జిల్లాలో సాగుతోంది. ఆముదాలవలస నియోజకవర్గం కొర్లకోట గ్రామంలో జరిగిన రచ్చబండ కార్యక్రమానికి గ్రామస్థులంతా హాజరై కాంగ్రెస్ తెచ్చిన కరువు పని చట్టాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. మహానేత YSR ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రారంభమైన ఈ ఉపాధి పథకం తమ జీవితాల్లో వెలుగులు తెచ్చిందని, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన జరిగిందని, కేంద్రంలో బీజేపీ అధికారంలో వచ్చాకే కరువు పనికి గ్రహణం పట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. VB G- RAM G చట్టం ద్వారా జరిగే నష్టాన్ని వివరించడంతో పాటు, మన్రేగా చట్టాన్ని పునరుద్ధరించాలని, లేకుంటే కాంగ్రెస్ అధికారంలో వచ్చిన వెంటనే పాత పథకాన్ని కొనసాగించడంతో పాటు, పని దినాలను 150 రోజులకు వేతనాలు 400 రూపాయలకు పెంచుతామని రచ్చబండ వేదికగా హామీ ఇవ్వడం జరిగింది.
@INCIndia @INC_Andhra @manickamtagore
#upaadihaamiparirakshnayatra




తెలుగు
INC Andhra Pradesh retweetledi

తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని, భాష ప్రయుక్త రాష్ట్రంగా ఉండాలని, ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 58 రోజుల పాటు ఆమరణ దీక్ష చేసి ప్రాణాలు అర్పించిన తెలుగు వారి ఆత్మగౌరవ ప్రతీక, అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125 వ జయంతి సందర్భంగా మహనీయుడికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. శ్రీరాములు గారి పోరాటం, త్యాగం భావితరాలకు స్ఫూర్తిదాయకం.
తెలుగు

APCC Working President @MastanValiINC garu spoke at a meeting in Guntur to condemn the war between USA-Israel and Iran. He called for peace and restoration of global harmony.



English
INC Andhra Pradesh retweetledi

మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం పేదలకు బరోసా. గ్రామాల్లో పేదరికాన్ని రూపుమాపి, వలసలు నివారించి, గ్రామ స్వరాజ్యాన్ని సాధించిన పథకం ఇది. ఇలాంటి గొప్ప పథకాన్ని ప్రధాని మోదీ గారు చంపేస్తున్నారు. ఉపాధి హామీ పథకంలో ఉపాధి లేకుండా ఊపిరి తీస్తున్నారు. కాంగ్రెస్ చేపట్టిన పరిరక్షణ యాత్రలో భాగంగా మన్రేగా చట్టాన్ని పునరుద్ధరించాలని, పాయకరావుపేట లో శ్రామికులతో కలిసి కరువు పని చేసి, కాంగ్రెస్ పక్షాన 100 రోజుల పనిపై బరోసా ఇవ్వడం జరిగింది.
#congress #upaadihaamiparirakshnayatra



తెలుగు
