Ramanath B R

247 posts

Ramanath B R banner
Ramanath B R

Ramanath B R

@JOURNORAMNATH

Ananthapuram Katılım Haziran 2024
50 Takip Edilen2K Takipçiler
Ramanath B R
Ramanath B R@JOURNORAMNATH·
ఉచిత బస్సు పథకం ప్రభుత్వం సొమ్ము చెల్లించడం లేదా!. ప్రైవేటీకరణ వైపు ఆర్టీసీ. ప్రైవేటీకరణ తప్పనిసరి అంటున్న ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ. మహిళలకు ఉచిత బస్సు పథకం వల్ల ఆర్ధిక భారం పడిందంటున్న నారాయణ. అసలు ఆ పథకం ప్రకటించినప్పుడు ఎంత మంది మహిళలు ప్రయాణిస్తారో వారి తప్పున టికెట్ సొమ్మును ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లిస్తుందని చంద్రబాబు చెప్పారు. మరి అలా చెల్లించడం లేదా ?. చెల్లిస్తుంటే ఆర్టీసీపై ఆ పథకం వల్ల భారం పడిందని ఆర్టీసీ చైర్మన్ ఎందుకు చెబుతారు?.
తెలుగు
0
22
94
2.5K
Ramanath B R
Ramanath B R@JOURNORAMNATH·
హడావుడి చేస్తున్నది ఎవరు?. విజయ్ లాగా సీఎం కావాలని జనసేన వాళ్లే కదా కోరుకునేది.
తెలుగు
26
45
173
3.4K
Ramanath B R
Ramanath B R@JOURNORAMNATH·
రెండో విడత ల్యాండ్ పూలింగ్ ను వ్యతిరేకించిన ఏబీ వెంకటేశ్వరరావు. చంద్రబాబు, నారాయణను చూసి భూములు ఇస్తే మీ ఇష్టం. అది దాదాపు మీ మధ్య ఉన్న ప్రైవేట్ ఒప్పందం లాంటిదే. దానికి రాష్ట్ర ప్రజలు బాధ్యత వహించరు. మీకు ఇబ్బంది వస్తే రాష్ట్ర ప్రజలు మీకు మద్దతుగా వచ్చే పరిస్థితి కూడా ఉండదు. వెంటనే రెండు,మూడు విడత ల్యాండ్ పూలింగ్ ఆలోచన మానుకోండి.
తెలుగు
9
168
557
15.6K
Ramanath B R
Ramanath B R@JOURNORAMNATH·
జగన్ కామెడీ చేయలేదు. ఆయన కాదు పిచ్చోడు.. అలా అనుకున్న వాళ్లు పిచ్చోళ్లు...
తెలుగు
14
267
1.2K
33.6K
Ramanath B R
Ramanath B R@JOURNORAMNATH·
''తొలుత హేళన చేస్తారు.. తర్వాత వాదిస్తారు. ఆ తర్వాత నీ దారికి వస్తారు.'' అన్నట్టుగానే మావిగన్ విషయంలో టీడీపీ తీరు ఉంది. ''జగన్ చెబుతున్నదే చేస్తున్నాం. మావిగన్ ప్రాంతం కూడా సీఆర్డీఏ పరిధిలోనే ఉందంటున్న చంద్రబాబు. కాకపోతే కీలకమైన తేడా ఉంది. రెండు ప్రాంతాలు సీఆర్ డీఏలోనే ఉన్నా.. అమరావతి నిర్మాణం చాలా ఆర్థిక భారంతో కూడుకున్నది. మావిగన్ అన్నది 20వేల కోట్లు ఖర్చు పెడితే వెంటనే ఆర్థికంగా గ్రోత్ ఇంజిన్ అవుతుంది. మావిగన్ విఫలం అవ్వడం అన్నది ఉండదు. అమరావతి విఫలం కావొచ్చు. అప్పుడు భారీగా ధన నష్టం ఉంటుంది. మొత్తం మీద మావిగన్ ఆలోచనను వ్యతిరేకించే సాహసం చంద్రబాబు చేయలేకపోయారు. జగన్ ఇచ్చిన ఐడియాలో వర్త్ ఉందని ఇన్ డైరెక్ట్ గా అంగీకరించినట్టు అయింది.
తెలుగు
29
115
411
19K
Ramanath B R
Ramanath B R@JOURNORAMNATH·
శ్రీకాకుళంలో పడే వర్షపు నీరు అనంతపురం జిల్లాకు తేవడమే నా జీవితం ఆశయం. - ఏపీ సీఎం చంద్రబాబుగారు. అలా తేవాలంటే పోలవరం డ్యాంలోకి శ్రీకాకుళంలో పడి వర్షపు నీరు రావాలి. అది సాధ్యమయ్యే పనేనా. పోలవరం ఎగువన ఉంటుంది. అంటే శ్రీకాకుళంలో పడిన వర్షపు నీరు ఎత్తి పోలవరంలోకి పోస్తారా?. అంత అవసరం ఏముంది. ఏటా వేల టీఎంసీల నీరు పోలవరం దాటే గోదావరిలోకి వెళ్తోంది. అసలు పోలవరం- బనకచర్ల అని చెబుతున్నారే గానీ అమరావతిపై పెట్టిన ఫోకస్ ఒక శాతమైనా దీని మీద పెడుతున్నారా సర్. అమరావతి కోసం అప్పులు తెస్తున్నారే గానీ సాగునీటి ప్రాజెక్టుల కోసం ఆ ఆలోచనైనా చేస్తున్నారా సర్. అనంతపురం ఏరో స్పేస్ సిటీ అవుతుంది. విమానాలు ఎక్కడో కాదు ఇక్కడే తయారు చేసే పరిస్థితి వస్తుంది, అనేక హబ్ లు వస్తాయి అని చంద్రబాబు చెబుతుంటే సభలో ముందు కూర్చున్న టీడీపీ కార్యకర్తలు చప్పట్లు కొట్టారు. ప్రతి జిల్లాకు పది ప్రాజెక్టులు అంటూ అమరావతిపై పదేళ్ల క్రితమే అసెంబ్లీలో ప్రకటన చేసిన సమయంలోనూ జిల్లాల వారీగా చంద్రబాబు ఇలాంటి హామీలే ఇచ్చారు. కానీ ఒక్కటి ముందుకెళ్లలేదు.
తెలుగు
12
20
79
6.8K
Ramanath B R
Ramanath B R@JOURNORAMNATH·
వరుసగా మూడో రోజు కూడా మావిగన్ అంటూ హేళన చేస్తూ టీడీపీ చానళ్లు డిబేట్లు పెట్టాయి అంటే... చాలా లోతైన గాయమై అయిందన్న మాట. కాన్సెప్ట్ లోకి వెళ్లకుండా కేవలం పేరును మాత్రమే ఎగతాళి చేస్తూ మూడు రోజులుగా కథ నడపడం అంటే మామూలు ఎఫెక్ట్ కాదు. అమరావతికి చట్టబద్దత తెచ్చాం ఇంకెవరూ కదిలించలేరు అన్నారు టీడీపీ వారు. ఇప్పుడు సీఆర్డీఏ పరిధిలోనే కొత్త కాన్సెప్ట్ తెరపైకి తేవడం ద్వారా టీడీపీని సంకట స్థితిలోకి నెట్టారు జగన్. కనీసం ఇప్పటికైనా మరో 50వేల ఎకరాల ల్యాండ్ పూలింగ్ లాంటి నిర్ణయాలు పక్కన పెట్టి ఉన్న భూముల సంగతి చూస్తే అమరావతి పై వ్యతిరేకత తగ్గుతుంది.
తెలుగు
28
170
619
14.6K
Ramanath B R
Ramanath B R@JOURNORAMNATH·
నారా లోకేష్ గారు ప్రత్యేక సింహాసనాన్ని తిరస్కరించారు బాగానే ఉంది. అసలు కార్యక్రమం నిర్వహించిన వారికి సభా మర్యాద అన్నది తెలుసా?. ఒక కేంద్ర మంత్రి కుమారస్వామి గారు కూడా హాజరైన కార్యక్రమంలో ఆయనకు సాధారణ చైర్ వేసి పక్కనే లోకేష్ కోసం అలాంటి సింహాసనం ఏర్పాటు చేయడం ద్వారా ఏం సంకేతాలు ఇచ్చారు. లోకేష్ గారి మీద గౌరవాన్ని ప్రదర్శించడానికి ఇతరులను అవమానించేలా వ్యవహరించడం సరైనదేనా ?. పైగా అది ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం. అంటే టీడీపీ మద్దతుదారులే ఏర్పాటు చేసిన కార్యక్రమం. ఆ సీటు లోకేష్ కోసమే వేశారా?. ఈ వీడియోను తెలుగుదేశం పార్టీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసి లోకేష్ గారికి పెద్దలంటే ఎంత గౌరవమో చూడండి అని చెబుతోంది. ఇప్పటికే రాజ్యసభలో అమరావతి బిల్లు సందర్భంగా విజిటర్స్ గ్యాలరీలో ఉన్న లోకేష్ మీదకు ప్రత్యేకంగా కెమెరా తిప్పడంపై రాజ్యసభ చైర్మన్ కు ఫిర్యాదులు వెళ్లాయి. అంటే ఇలాంటి వాటితో లోకేష్ కు మంచి చేస్తున్నారో మొదటికే మోసం తెస్తున్నారోో ఒకసారి వారి టీం ఆలోచించుకోవాలి.
తెలుగు
6
22
112
9.3K
Ramanath B R
Ramanath B R@JOURNORAMNATH·
ఈ ఉదంతం కొందరి కిరీటాలను నేల రాల్చబోతోంది. ఇంత అధ్వాన్నమైన పాలన మీ నుంచి ప్రజలను ఊహించలేదు చంద్రబాబు గారు.
Ramanath B R tweet media
తెలుగు
6
41
173
2.7K
Ramanath B R
Ramanath B R@JOURNORAMNATH·
ఇప్పటికిప్పుడు అమరావతిలో వ్యాపారం ఉండదు. పదేళ్లలో రాబడి అంచనాతో ఫైవ్ స్టార్ హోటల్స్ లాంటివి కట్టాల్సి ఉంటుంది. ( ఇప్పుడు కాదు భవిష్యత్తులో వ్యాపారం, ఆదాయం ఉండొచ్చు అంటే ఏ సంస్థ అయినా రిస్క్ చేసి అక్కడ ఫైవ్ స్టార్ హోటల్ కడుతుందా ?. ) అమరావతిని రెండేళ్లలో హైదరాబాద్ లా చూడాలంటే తన దృష్టిలో అత్యాశ అవుతుందంటున్న పెమ్మసాని కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎప్పటి లోపు అక్కడ నిర్మిస్తారన్న దానిపై టైం చెప్పలేను అంటున్న పెమ్మసాని. వర్షాలు ఇబ్బంది పెట్టకపోతే వేగంగానే పనులు చేస్తామంటున్న కేంద్రమంత్రి. #amaravati #mavigun
తెలుగు
20
82
356
56.1K
Ramanath B R
Ramanath B R@JOURNORAMNATH·
ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలిని జనసేన పార్టీ నేత తాతంశెట్టి నాగేంద్ర కొడుతూ, నడిరోడ్డు మీద తరుముతుంటే ఆమెను పోలీసులు కాపాడలేకపోయారు అన్నది ఒక విమర్శ. పోలీసులు ఆమెనే కాదు.. వారి సొంత లాఠీని కూడా జనసేన నేత బారినుంచి కాపాడుకోలేకపోయారు. ఎందుకంటే తాతంశెట్టి నాగేంద్ర ఆమెను విచక్షణరహితంగా కొట్టింది పోలీసుల నుంచి లాక్కున్న లాఠీతోనే. టీడీపీ ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు.. ఏకంగా పల్నాడు ఎస్పీ కార్యాలయాన్ని 10 గంటల పాటు దడదడలాడిస్తే ఐజీ స్థాయి అధికారే ఏమీ చేయలేకపోయారు. ఇక ఇక్కడ కానిస్టేబుళ్లు ఏం చేస్తారులే పాపం!..
Ramanath B R tweet media
తెలుగు
32
493
1.4K
65.2K
Ramanath B R
Ramanath B R@JOURNORAMNATH·
_*పెట్టారా పేరు అమరావతి.. పిలవరా కమ్మరావతి : ఎంపీ రేణుకాచౌదరి*_
తెలుగు
1
13
52
1.3K
Ramanath B R
Ramanath B R@JOURNORAMNATH·
పోయే టైంకి ఒక పెద్ద యుద్ధం చేసే పోవాలి అని ముసలి నేతలంతా మందు కొడుతూ శపథం చేసుకున్నట్టు ఉన్నారు.
తెలుగు
5
8
73
4.2K
Ramanath B R
Ramanath B R@JOURNORAMNATH·
నారా లోకేష్ గారి గురించి Abn గతంలో ఒక స్టోరీ ప్రసారం చేస్తే భజన అంటూ చిడతలు వాయిస్తూ మరీ హేళన చేసిన స్థాయి నుంచి అద్భుతం లోకేష్ మహాద్భుతం అనే వరకు నాగబాబు గారి ప్రయాణం ఆసక్తికరం. లోకేష్ సారథ్యంలో పని చేయటానికి సిద్దం అని సంకేతాలు ఇస్తున్న నాగబాబు గారు. ఇక టీడీపీదే ఆలస్యం.
Ramanath B R tweet media
తెలుగు
8
31
149
4.6K
Ramanath B R
Ramanath B R@JOURNORAMNATH·
పిఠాపురం వర్మ ఆగ్రహం. వేదికపై పవన్ కల్యాణ్ ఫోటో పెద్దదిగా ఉంచి చంద్రబాబు ఫోటో చిన్నదిగా ఉంచడంపై ఆగ్రహం. చంద్రబాబుకు గౌరవం లేని చోట నేను కూర్చోలేను అంటూ వేదిక మీదకు వెళ్లని వర్మ. బయటకు వచ్చిన తర్వాత టీడీపీ స్థానిక నేతలపై ఆగ్రహం. ఇంతమంది ఉన్నారు... ముఖ్యమంత్రి బొమ్మ లేకుంటే చూసుకోవడం తెలియదా అంటూ వర్మ ఆగ్రహం.
తెలుగు
77
229
1.6K
260.7K
Ramanath B R
Ramanath B R@JOURNORAMNATH·
ఎమ్మెల్యే ఏదైనా పెళ్లికి వెళ్తే... పెళ్లి కూతురు వైపు నిలబడి ఆమెను చూస్తూ ''అందమా నీ పేరేంటి అందమా'' అని పాట పాడాలి అని ఎమ్మెల్యే ఈశ్వరరావు స్కిట్. అలా పాడినా పెళ్లి కొడుకు ఏమీ అనుకోడు... పెళ్లి కూతురు అంటే ఎమ్మెల్యేకు అభిమానం అనుకుంటాడు- స్కిట్ లో ఈశ్వరరావు. ఈ సారి ఏమాత్రం నవ్వులు పూయించని డ్రామా.
తెలుగు
14
18
155
21.3K
Ramanath B R
Ramanath B R@JOURNORAMNATH·
చంద్రబాబు వల్ల ప్రభుత్వం సాయం అందినట్టు, లోకేష్ వల్ల తన బిడ్డకు టీచర్ ఉద్యోగం వచ్చినట్టు ఎమ్మెల్యేల ఉత్తుత్తి స్కిట్.
తెలుగు
13
26
231
20.2K
Ramanath B R
Ramanath B R@JOURNORAMNATH·
తిరుమల క్యూలైన్లలో బెల్ట్ లతో కొట్టుకున్న భక్తులు. సంయమనం పాటించాలని టీటీడీ వినతి. క్యూలైన్లలో భక్తులు సంయమనం పాటించాలి – టీటీడీ విజ్ఞప్తి తిరుమల, 2026 మార్చి 02: తిరుమల లోని ఔటర్ రింగ్ రోడ్డులో కృష్ణ తేజ అతిథి భవనం సమీపంలోని క్యూలైన్లలో వేచి ఉండే సమయంలో ఇరువురు భక్తులు పరస్పర ఘర్షణ కు దిగిన సంఘటన సోమవారం నాడు చోటు చేసుకుంది. అక్కడ విధులు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బంది మరియు   శ్రీవారి సేవకులు వెంటనే అప్రమత్తం కావడంతో ఘర్షణను నిలువరించారు. శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులు ఈ విధంగా పరస్పర ఘర్షణకు దిగడం సమంజసం కాదని, ఓర్పుతో, సహనంతో వ్యవహరిస్తూ  తోటి భక్తులతో స్నేహ పూర్వకంగా ఉండాలని ,అదేవిధంగా క్యూలైన్ నియమాలను తప్పనిసరిగా పాటించి స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా టిటిడి విజ్ఞప్తి చేస్తోంది. టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారి జారీ చేయబడింది.
తెలుగు
1
24
65
2.2K