West Godavari District Police

768 posts

West Godavari District Police banner
West Godavari District Police

West Godavari District Police

@Police_WG

Official Handle of west godavari district police. please don't report crime here. In case of emergency please #dial100, #dial112

@bhimavaram Katılım Temmuz 2024
67 Takip Edilen289 Takipçiler
Sabitlenmiş Tweet
West Godavari District Police
The West Godavari district police officers were honored with the prestigious ABCD (Award for Best Crime Detection) award by the State DGP, Sri Harish Kumar Gupta, for solving the sensational case of corpse parcel distribution in Yandagandi village, Undi Mandal, in record time. #AdnanNayeemAsmiIPS #WestGodavariPolice #CrimeDetection #LawAndOrder #ABCDAward #PoliceExcellence #PublicSafety #CrimeSolved #DGPRecognition #StateLevelAchievement @APPOLICE100
West Godavari District Police tweet mediaWest Godavari District Police tweet mediaWest Godavari District Police tweet mediaWest Godavari District Police tweet media
English
3
4
11
2.3K
West Godavari District Police
Mogalturu Police Save Youth’s Life After Sudden Fits at Perupalem Beach Mogalturu Police and Marine Police personnel saved the life of a youth who collapsed after suffering epileptic fits at Perupalem Beach. Hyderabad resident Bakka Mahesh (27) suddenly lost consciousness while bathing with friends at the beach. On-duty Constable P. Satyanarayana and Marine Police staff rushed to the spot, provided emergency first aid, and shifted him for immediate medical treatment. Due to their timely response, the victim is now safe. The victim and his family thanked the police personnel for their swift action and life-saving support. District SP specially appreciated the Mogalturu Police and Marine staff for their dedication and prompt response. #AndhraPradeshPolice #MogalturuPolice #MarinePolice #PerupalemBeach #PoliceService #LifeSaved #EmergencyResponse #PublicSafety #WestGodavariPolice @APPOLICE100 @HomeMinisterAP
West Godavari District Police tweet media
English
0
0
0
4
West Godavari District Police
Government Whip & Tadepalligudem MLA Bolisetti Srinivas donated a new Mahindra Bolero vehicle to Tadepalligudem Rural Police Station from his personal funds to strengthen patrolling and public safety. The vehicle was inaugurated by Adnan Nayeem Asmi, who appreciated the MLA’s continuous support towards strengthening police infrastructure and smart policing. #Tadepalligudem #WestGodavariPolice #AndhraPradeshPolice #SmartPolicing #PolicePatrol #PublicSafety @APPOLICE100
West Godavari District Police tweet mediaWest Godavari District Police tweet mediaWest Godavari District Police tweet mediaWest Godavari District Police tweet media
English
0
0
1
15
West Godavari District Police
*పెరుపాలెం బీచ్‌లో తప్పిపోయిన ఏడేళ్ల బాలికను సకాలంలో గుర్తించి, సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించిన మొగల్తూరు పోలీసులు......* *ఫిర్యాదు అందిన వెంటనే అప్రమత్తమై, బాలికను క్షేమంగా తిరిగి అప్పగించిన పోలీసు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపిన బాలిక తల్లిదండ్రులు.....* పెరుపాలెం బీచ్‌లో తప్పిపోయిన ఏడేళ్ల బాలికను మొగల్తూరు పోలీసులు సకాలంలో స్పందించి, గాలింపు చేపట్టి సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ ఉదంతంపై బాలిక తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తూ, సకాలంలో స్పందించిన పోలీసు అధికారులకు మరియు సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. వివరాల్లోకి వెళ్తే, పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం, కవిటం గ్రామానికి చెందిన తాడిపర్తి రాజబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం ఉదయం పెరుపాలెం బీచ్‌ను సందర్శించారు. బీచ్‌లో స్నానం చేస్తుండగా, అదే సమయంలో వారి ఏడేళ్ల కుమార్తె సుస్మిత అదృశ్యమైంది. తన కుమార్తె కనిపించడం లేదని ఆందోళన చెందిన రాజబాబు, వెంటనే అక్కడే విధుల్లో ఉన్న మొగల్తూరు పోలీస్ కానిస్టేబుల్ పి. సత్యనారాయణకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన వెంటనే కానిస్టేబుల్ పి. సత్యనారాయణ గారు అత్యంత అప్రమత్తతతో గాలింపు చర్యలు చేపట్టారు. బీచ్ వెంబడి క్షుణ్ణంగా పరిశీలిస్తుండగా, మొళ్ళపర్రు బీచ్ వైపు ఉన్న హంస రెస్టారెంట్ సమీపంలో ఒంటరిగా ఉన్న బాలికను గుర్తించారు. వెంటనే ఆమెను సురక్షితంగా తన తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. తమ బిడ్డను తిరిగి అప్పగించిన పోలీసు సిబ్బందిని చూసి తల్లిదండ్రులు ఉద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా వారు పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారికి మరియు మొగల్తూరు పోలీసు సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు. అప్రమత్తతతో వ్యవహరించి, బాలికను కాపాడిన మొగల్తూరు పోలీసు సిబ్బంది పనితీరును జిల్లా ఉన్నతాధికారులు అభినందించారు. పెరుపాలెం బీచ్‌కు విచ్చేసే పర్యాటకులు, ముఖ్యంగా చిన్నపిల్లలతో వచ్చే తల్లిదండ్రులు వారి పట్ల నిరంతరం పర్యవేక్షణ కలిగి ఉండాలని, ఏమాత్రం నిర్లక్ష్యం వహించిన సరిదిద్దుకోలేని పొరపాటు చేసినవాళ్లు అవుతారని, అత్యవసర సమయాల్లో తక్షణ సహాయం కోసం స్థానిక పోలీసులకు లేదా డయల్ 100/112 కు సమాచారం అందించాలని జిల్లా పోలీసు యంత్రాంగం ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసింది. @APPOLICE100
West Godavari District Police tweet media
తెలుగు
0
0
0
19
West Godavari District Police
*పశ్చిమ గోదావరి జిల్లా పోలీసు కార్యాలయంలో వార్షిక తనిఖీలు నిర్వహించిన ఏలూరు రేంజ్ ఐ.జి శ్రీ జి.వి.జి. అశోక్ కుమార్ ఐ.పీ.ఎస్., గారు.....* మే 26, మంగళవారం నాడు గొల్లలకోడేరులోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏలూరు రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ జి.వి.జి. అశోక్ కుమార్, ఐ.పి.ఎస్. గారు వార్షిక తనిఖీలను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయానికి విచ్చేసిన ఐ.జి. గారికి, జిల్లా ఎస్పీ శ్రీ అద్నాన్ నయీం అస్మి, ఐ.పి.ఎస్. గారు మరియు ఇతర పోలీసు ఉన్నతాధికారులు పుష్పగుచ్ఛం అందించి సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం, పోలీసు బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించిన ఐ.జి. గారు, కార్యాలయ ఆవరణను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ తనిఖీల్లో భాగంగా, జిల్లా పోలీసు కార్యాలయంలోని వివిధ విభాగాల పనితీరును ఐ.జి. గారు క్షుణ్ణంగా పరిశీలించారు. ముఖ్యంగా కార్యాలయ రికార్డుల నిర్వహణ, క్రమశిక్షణ, సిబ్బంది హాజరు, మరియు పరిపాలనాపరమైన ఫైళ్ల కదలికల వంటి కీలక అంశాలను ఆయన లోతుగా సమీక్షించారు. అనంతరం జరిగిన సమావేశంలో, గడిచిన సంవత్సర కాలంలో జిల్లాలో నమోదైన నేరాల గణాంకాలు, దర్యాప్తు పురోగతి, మరియు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారానికి తీసుకున్న చర్యల గురించి నివేదికలను ఆయన సమీక్షించారు. ముఖ్యంగా మహిళలు, పిల్లలపై జరుగుతున్న నేరాల కట్టడికి తీసుకుంటున్న చర్యలు, కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాలు, శాంతిభద్రతల పరిరక్షణ కోసం అమలు చేస్తున్న వ్యూహాలు మరియు నేరాల నియంత్రణలో పోలీసు విభాగం తీసుకుంటున్న చర్యలపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ఐ.జి. గారు అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ....., ప్రజల భద్రతే పరమావధిగా పోలీసు వ్యవస్థ పనిచేయాలని, బాధితుల ఫిర్యాదులపై తక్షణమే స్పందించి న్యాయం చేయడంలో ఎటువంటి అలసత్వం వహించకూడదని స్పష్టం చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ నేరాల గుర్తింపు మరియు కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా, సిబ్బంది సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించాలని మరియు విధి నిర్వహణలో నిబద్ధత, పారదర్శకతను పాటిస్తూ ప్రజలతో మమేకం కావాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో భీమవరం డీఎస్పీ శ్రీ రఘువీర్ విష్ణు గారు, నర్సాపురం డీఎస్పీ శ్రీ ఎం. సుధాకరరావు గారు, తాడేపల్లిగూడెం డీఎస్పీ శ్రీ డి. విశ్వనాథ్ గారు, జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ డీఎస్పీ శ్రీ  ఎం.వి.వి సత్యనారాయణ గారు, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీ కె.వి.వి.ఎన్ సత్యనారాయణ గారు, ఇతర పోలీసు అధికారులు మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. @APPOLICE100
West Godavari District Police tweet mediaWest Godavari District Police tweet mediaWest Godavari District Police tweet mediaWest Godavari District Police tweet media
తెలుగు
0
0
1
35
West Godavari District Police
*జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో "ప్రజా సమస్యల పరిష్కార వేదిక" (పి.జి.ఆర్.ఎస్) కార్యక్రమాన్ని నిర్వహించిన జిల్లా ఎస్పీ శ్రీ అద్నాన్ నయీం అస్మి , ఐపీఎస్., గారు.* *నేటి పోలీసు “పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం” కార్యక్రమంలో 18 అర్జీల స్వీకరణ.* *నిర్ణీత గడువులోగా బాధితులకు న్యాయం జరగాలి..........* *ప్రజా ఫిర్యాదులపై నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించం................* *:-  జిల్లా ఎస్పీ శ్రీ అద్నాన్ నయీం అస్మి , ఐపీఎస్., గారు.* పోలీస్ స్టేషన్లకు వచ్చే సామాన్యుల సమస్యల పట్ల స్పందించడంలో ఎటువంటి అలసత్వం ప్రదర్శించకూడదని, బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ అద్నాన్ నయీం అస్మి, ఐ.పి.ఎస్ గారు పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం గొల్లలకోడేరులోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన "ప్రజా సమస్యల పరిష్కార వేదిక" (మీకోసం) కార్యక్రమంలో ఎస్పీ గారు స్వయంగా ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన ఫిర్యాదుదారులతో ముఖాముఖిగా మాట్లాడి, వారి సమస్యల పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎస్పీ గారు మాట్లాడుతూ........, ప్రజలు ఎంతో నమ్మకంతో పోలీస్ శాఖను ఆశ్రయిస్తారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉద్ఘాటించారు. స్వీకరించిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. కేవలం తాత్కాలిక ఉపశమనం కాకుండా, సమస్య మళ్లీ పునరావృతం కాకుండా చట్ట పరిధిలో శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా పని చేయాలన్నారు. సమస్యను విన్న వెంటనే సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో ఎస్పీ గారు స్వయంగా ఫోన్లో మాట్లాడి, బాధితులకు సత్వర న్యాయం చేయాలని ఆదేశించారు. ఈ వారం నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి మొత్తం 18 అర్జీలు వచ్చాయి. ఇందులో ప్రధానంగా కుటుంబ కలహాలు, అత్తారింటి వేధింపులు, ఆస్తి తగాదాలు వంటి సివిల్ వివాదాలతో పాటు.. ఆధునిక కాలంలో సవాలుగా మారుతున్న సైబర్ మోసాలు, ఆన్‌లైన్ మోసాలు, అధిక వడ్డీల వేధింపులు మరియు ప్రేమ పేరుతో మోసం వంటి అంశాలపై బాధితులు ఎస్పీ గారికి తమ గోడు వెళ్ళబోసుకున్నారు. ప్రతీ ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించిన ఎస్పీ గారు, చట్టపరంగా న్యాయం చేస్తామని బాధితులకు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీ కె.వి.వి.ఎన్ సత్యనారాయణ గారు మరియు ఇతర కార్యాలయ పర్యవేక్షకులు, సిబ్బంది పాల్గొన్నారు. @APPOLICE100
West Godavari District Police tweet mediaWest Godavari District Police tweet mediaWest Godavari District Police tweet mediaWest Godavari District Police tweet media
తెలుగు
0
0
0
32
West Godavari District Police
West Godavari Police Arrest Interstate Fraudster Using “CCTV 360” Technology Under the supervision of Adnan Nayem Asmi, Tadepalligudem Town Police arrested an interstate fraudster involved in multiple cheating cases across AP & Telangana. Using “CCTV 360,” police tracked the accused’s vehicle movement in Chittoor and apprehended him, recovering ₹2 lakh cash. #WestGodavariPolice #CCTV360 #SmartPolicing #TadepalligudemPolice #CrimeInvestigation #AndhraPradeshPolice #TechnologyInPolicing @APPOLICE100 @AndhraPradeshCM @BPRDIndia
West Godavari District Police tweet media
English
0
0
0
80
West Godavari District Police
*జిల్లా పోలీస్ సిబ్బంది మానసిక ప్రశాంతత, ఒత్తిడి నిర్వహణ కోసం ‘హార్ట్‌ఫుల్‌నెస్ మెడిటేషన్’ శిక్షణ కార్యక్రమం ప్రారంభం.......* నిరంతరం ప్రజా సేవలో ఉంటూ, విధి నిర్వహణలో ఎదురయ్యే ఒత్తిడిని అధిగమించి, మానసిక ఉల్లాసంతో మెరుగైన సేవలను అందించే లక్ష్యంతో పశ్చిమ గోదావరి జిల్లా పోలీస్ సిబ్బంది కోసం ప్రత్యేక ‘హార్ట్‌ఫుల్‌నెస్ మెడిటేషన్’ (ధ్యానం) శిక్షణా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మరియు జిల్లా ఎస్పీ శ్రీ అద్నాన్ నయీం అస్మి, ఐపీఎస్ గారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. భీమవరం, నర్సాపురం మరియు తాడేపల్లిగూడెం సబ్ డివిజన్ల పరిధిలోని పోలీసు అధికారులకు, సిబ్బందికి మూడు రోజుల పాటు ఈ శిక్షణను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా, ఆదివారం నాడు భీమవరంలోని డి.ఎన్.ఆర్ కళాశాల ఆవరణలో ఉన్న ‘రామకృష్ణ భవన్’లో నిర్వహించిన తొలిరోజు శిక్షణను భీమవరం డీఎస్పీ శ్రీ రఘువీర్ విష్ణు మరియు జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ డీఎస్పీ శ్రీ ఎం.వి.వి. సత్యనారాయణ గారు సమన్వయకర్తలుగా వ్యవహరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ........, పోలీస్ వృత్తిలో ఎదురయ్యే తీవ్రమైన ఒత్తిడిని నియంత్రించుకోవడానికి ధ్యానం ఒక దివ్యౌషధమని పేర్కొన్నారు. క్రమబద్ధమైన ధ్యాన సాధన ద్వారా ఏకాగ్రత పెంపొందడమే కాకుండా, శారీరక దృఢత్వం, మానసిక సమతుల్యత సిద్ధిస్తాయని, ఇది సిబ్బంది వ్యక్తిగత జీవితంతో పాటు వృత్తిపరమైన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు దోహదపడుతుందని వివరించారు. ఈ మూడు రోజుల శిక్షణను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఈ శిక్షణలో హార్ట్‌ఫుల్‌నెస్ సంస్థ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ శ్రీ ఆకుల స్వామి గారు, ఆర్.పి. శ్రీ కె. రాజేష్ బాబు గారు, అలాగే భీమవరం నుండి ట్రైనర్లు శ్రీమతి ఎస్. గాయత్రీ దేవి, శ్రీ సిహెచ్. సత్యనారాయణ రాజు, శ్రీ జి. రవి ప్రకాష్ గార్లు ఉదయం 5:30 గంటల నుండి 7:00 గంటల వరకు ప్రత్యేక ధ్యాన తరగతులు నిర్వహించారు. నిపుణుల మార్గదర్శకత్వంలో సిబ్బందికి శ్వాసక్రియలు, ఏకాగ్రతను పెంచే ధ్యాన ముద్రలు, ఒత్తిడిని తగ్గించే వ్యాయామాలపై శాస్త్రీయ శిక్షణ అందించారు. ఈ కార్యక్రమంలో భీమవరం వన్ టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీ ఎ. రమేష్, టూ టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీ పి. మురళీ కృష్ణ, రూరల్ ఇన్స్పెక్టర్ శ్రీ బి. శ్రీనివాసరావు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీ వి. శ్రీనివాసరావు, ఆకివీడు ఇన్స్పెక్టర్ శ్రీ జి. కాళీ చరణ్, మహిళా ఆర్మ్డ్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ (అడ్మిన్) శ్రీమతి ఇ. ఇందుమతితో పాటు ఇతర ఎస్సైలు, ఆర్మ్డ్ రిజర్వ్ సిబ్బంది, హోమ్ గార్డులు, ఇతర సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. @APPOLICE100
West Godavari District Police tweet mediaWest Godavari District Police tweet mediaWest Godavari District Police tweet mediaWest Godavari District Police tweet media
తెలుగు
0
0
0
25
West Godavari District Police
*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ గారి ఆదేశాల మేరకు, జిల్లా ఎస్పీ గారి పర్యవేక్షణలో "స్పీడీ ట్రయల్ మానిటరింగ్" పద్ధతులను అవలంబిస్తూ, ప్రతి కేసులోనూ శాస్త్రీయ దర్యాప్తు జరిపి, పక్కా ఆధారాలను సమర్పించడం ద్వారా నేరస్తులకు కఠిన శిక్షలు పడేలా చేస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు.....* *కన్నకూతురిపైనే అమానుషంగా లైంగిక దాడికి పాల్పడిన కన్నతండ్రికి జీవితకాల జైలు శిక్ష మరియు రూ. 10,000/- జరిమానా విధిస్తూ భీమవరం ప్రత్యేక పోక్సో కోర్టు గౌరవ న్యాయమూర్తి డా. బి. లక్ష్మీనారాయణ గారు చారిత్రాత్మక తీర్పు వెల్లడి........* నేర నియంత్రణతో పాటు, మహిళలు, మైనర్ బాలికలపై జరిగే నేరాలకు సంబంధించి కోర్టులో పక్కా ఆధారాలు సమర్పించి దోషులకు కఠిన శిక్షలు పడేలా చేయడమే లక్ష్యంగా, పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు అమలు చేస్తున్న "స్పీడీ ట్రయల్ మానిటరింగ్ సిస్టమ్" (Speedy Trial Monitoring System) మరోసారి సత్ఫలితాన్ని ఇచ్చింది. సమాజంలో రక్షణ కల్పించాల్సిన కన్నతండ్రే కామంతో కళ్ళు మూసుకుపోయి 10 సంవత్సరాల మైనర్ బాలికపై అమానుషంగా, నిరంతరం లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడికి జీవితకాల జైలు శిక్ష విధిస్తూ భీమవరం ప్రత్యేక పోక్సో కోర్టు నేడు (21-05-2026) తుది తీర్పు వెల్లడించింది. కేసు వివరములు: మొగల్తూరు మండలంలోని ఒక గ్రామానికి చెందిన కట్టా నాగరాజు (42), S/o వెంకటేశ్వర్లు అనే వ్యక్తి, తన 10 సంవత్సరాల మైనర్ కుమార్తెపై తన స్వగృహంలోనే నిరంతరం అమానుషంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో బాలిక తీవ్ర కడుపునొప్పితో బాధపడటంతో, ఆమె తల్లి బాధితురాలిని భీమవరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ మెడికల్ ఆఫీసర్ బాలికను పరీక్షించి, జరిగిన ఘోరాన్ని గుర్తించి ఏలూరు చైల్డ్ లైన్ అధికారులకు సమాచారం అందించారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు 24.06.2017వ తేదీన మొగల్తూరు పోలీస్ స్టేషన్ అప్పటి ఎస్సై శ్రీ కె. గుర్రయ్య గారు క్రైమ్ నెం. 131/2017, U/s 376(2)(i), 506 IPC మరియు Section 6 of POCSO Act 2012 కింద కేసు నమోదు చేశారు. అనంతరం అప్పటి నరసాపురం డిఎస్పీ శ్రీ జి. పూర్ణచంద్రరావు గారు ఈ కేసులో ప్రాథమిక దర్యాప్తును అత్యంత వేగంగా నిర్వహించారు. ఆ తర్వాత నరసాపురం డిఎస్పీ శ్రీ టి. ప్రభాకర్ బాబు గారు లోతైన శాస్త్రీయ దర్యాప్తు పూర్తి చేసి, నిందితుడికి వ్యతిరేకంగా పక్కా సాక్ష్యాధారాలను సేకరించి గౌరవ కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ కేసుపై సుదీర్ఘ విచారణ చేపట్టిన భీమవరం ప్రత్యేక పోక్సో కోర్టు గౌరవ న్యాయమూర్తి డా. బి. లక్ష్మీనారాయణ గారు, ప్రాసిక్యూషన్ సమర్పించిన బలమైన సాక్ష్యాధారాలను మరియు వైద్య నివేదికలను పరిగణనలోకి తీసుకుని, నిందితుడు (కన్నతండ్రి) కట్టా నాగరాజుపై మోపబడిన అభియోగాలు నిస్సందేహంగా రుజువు కావడంతో, నిందితుడికి U/s 235(2) CrPC కింద జీవితకాల జైలు శిక్ష మరియు రూ. 10,000/- (పది వేల రూపాయలు) జరిమానా విధిస్తూ నేడు (21.05.2026) చారిత్రాత్మక తీర్పును వెల్లడించారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్‌ను సమర్థవంతంగా నిర్వహించి, నేరస్తుడికి కఠిన శిక్ష పడేలా కోర్టులో బలమైన వాదనలు వినిపించిన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీ ఉండపల్లి రమేష్ నాయుడు గారిని, అదేవిధంగా, ఈ కేసు విచారణ మరియు పర్యవేక్షణలో నిరంతరం శ్రమించి ప్రాసిక్యూషన్‌కు పూర్తి స్థాయిలో సహకరించిన నరసాపురం డిఎస్పీ శ్రీ ఎం. సుధాకర్ రావు గారిని, రూరల్ సి.ఐ. శ్రీ జి. దుర్గాప్రసాద్ గారిని, మొగల్తూరు పోలీస్ స్టేషన్ ఎస్సై శ్రీ జి. వాసు గారిని, ఎస్సై శ్రీ కేతా నాగేశ్వరరావు గారిని మరియు కోర్టు కానిస్టేబుల్ జె. రాజేష్ లను జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించారు. @APPOLICE100
West Godavari District Police tweet media
తెలుగు
0
0
0
39
West Godavari District Police
*"వెట్టిచాకిరి నిర్మూలన మరియు మానవ అక్రమ రవాణా నిరోధం"పై జిల్లా పోలీసు అధికారులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమం.......* పశ్చిమగోదావరి జిల్లా పోలీస్ శాఖ మరియు చైల్డ్ రైట్స్ అడ్వకేసి ఫౌండేషన్ (CRAF) సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక డి.ఎన్.ఆర్ కళాశాలలోని ప్లాటినం జూబ్లీ హాలు నందు పోలీస్ అధికారులకు "వెట్టిచాకిరి నిర్మూలన మరియు మానవ అక్రమ రవాణా నిరోధం" అనే అంశంపై ఒకరోజు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శ్రీ అద్నాన్ నయీం అస్మి, ఐపీఎస్., గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ..... జిల్లాలో వెట్టిచాకిరి (Bonded Labour), మానవ అక్రమ రవాణా (Human Trafficking) వంటి సామాజిక రుగ్మతలకు తావులేకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఇటువంటి చట్టవిరుద్ధమైన చర్యలపై సమాచారం అందిన వెంటనే పోలీస్ అధికారులు తక్షణమే స్పందించి, నిందితులపై కఠిన చట్టాలను ప్రయోగించాలని ఆదేశించారు. జిల్లాలో మానవ హక్కుల ఉల్లంఘనలను సహించేది లేదని, బాధితులకు తక్షణ న్యాయం, రక్షణ కల్పించడమే పోలీస్ శాఖ ప్రథమ కర్తవ్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ శిక్షణా శిబిరంలో ముఖ్య వక్తగా పాల్గొన్న చెన్నై హైకోర్టు సీనియర్ న్యాయవాది శ్రీ నటరాజన్ గారు 'వెట్టిచాకిరి వ్యవస్థ (నిర్మూలన) చట్టం-1976' (Bonded Labour System Abolition Act) లోని ముఖ్యాంశాలను, భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 143 యొక్క చట్టపరమైన నిబంధనలను పోలీస్ అధికారులకు సవివరంగా వివరించారు. బాధితులకు అందవలసిన ప్రభుత్వ పరిహారం, పునరావాసం మరియు సంరక్షణ చర్యల గురించి ఆయన అవగాహన కల్పించారు. వెట్టిచాకిరి కేసుల నమోదు ప్రక్రియలో రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (RDO) లతో సమన్వయం చేసుకుంటూ, పోలీసు వారు పూర్తి సహకారాన్ని అందించి పటిష్టమైన చట్టపరమైన చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. అనంతరం చైల్డ్ రైట్స్ అడ్వకేసి ఫౌండేషన్ (CRAF) డైరెక్టర్ డాక్టర్ ఫ్రాన్సిస్ తంబి గారు మాట్లాడుతూ.. పశ్చిమగోదావరి జిల్లాలో వెట్టిచాకిరి, అక్రమ రవాణా నిర్మూలనకై తమ సంస్థ నిరంతరం శ్రమిస్తోందని తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా వెట్టిచాకిరి లేదా బాల కార్మిక వ్యవస్థ నిర్బంధాలు గమనిస్తే వెంటనే 'క్రాఫ్' (CRAF) సంస్థకు సమాచారం అందించాలని కోరారు. తమ సంస్థ 24/7 అందుబాటులో ఉంటుందని, సమాచారం అందిన వెంటనే రెవెన్యూ మరియు పోలీస్ శాఖల సమన్వయంతో ప్రత్యేక రెస్క్యూ డ్రైవ్స్ (Rescue Drives) నిర్వహించి బాధితులకు విముక్తి ప్రసాదిస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రతిష్టాత్మక శిక్షణా కార్యక్రమంలో జిల్లాలోని పలువురు ఉన్నత పోలీస్ అధికారులు, బాలల సంరక్షణ విభాగం ప్రతినిధులు మరియు క్రాఫ్ సంస్థ సిబ్బంది సతీష్, అచ్యుత రావు, రవికుమార్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. @APPOLICE100
West Godavari District Police tweet mediaWest Godavari District Police tweet mediaWest Godavari District Police tweet media
తెలుగు
0
0
0
28
West Godavari District Police
*జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో "ప్రజా సమస్యల పరిష్కార వేదిక" (పి.జి.ఆర్.ఎస్) కార్యక్రమాన్ని నిర్వహించిన జిల్లా ఎస్పీ శ్రీ అద్నాన్ నయీం అస్మి , ఐపీఎస్., గారు.* *ప్రజా సమస్యలపై త్వరితగతిన స్పందించి, నిర్ణీత గడువులోగా చట్ట పరిధిలో శాశ్వత పరిష్కారం చూపాలని జిల్లా పోలీసు అధికారులు ఆదేశాలు జారీ.........* *నేటి పోలీసు “పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం” కార్యక్రమంలో 22 అర్జీల స్వీకరణ.......* పశ్చిమగోదావరి జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన "ప్రజా సమస్యల పరిష్కార వేదిక" (మీకోసం) కార్యక్రమం ద్వారా ప్రజల నుండి జిల్లా ఎస్పీ శ్రీ అద్నాన్ నయీం అస్మి, ఐపీఎస్., గారు నేరుగా ఫిర్యాదులను స్వీకరించారు. బాధితుల సమస్యలను ఓపికగా విన్న ఎస్పీ గారు, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులతో ముఖాముఖి మాట్లాడి, వారి సమస్యల పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి, క్షేత్రస్థాయిలో పూర్తి విచారణ జరిపి, నిర్ణీత గడువులోగా చట్టపరమైన శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ......., ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఎంతో ఆశతో పోలీసు కార్యాలయాలను ఆశ్రయిస్తారని, అటువంటి బాధితులకు పోలీసు శాఖ వెన్నుముకగా నిలిచి భరోసా కల్పించాలని అధికారులకు స్పష్టం చేశారు. ముఖ్యంగా ఫిర్యాదులు మరల మరల పునరావృతం కాకుండా ఉండాలంటే, మొదటి విడతలోనే లోతైన దర్యాప్తు జరిపి బాధితులకు న్యాయం చేకూరేలా చూడాలన్నారు. విచారణలో జాప్యం వహించకుండా, పారదర్శకమైన పద్ధతిలో సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేయాలని ఆయన ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీ కె.వి.వి.ఎన్ సత్యనారాయణ గారు మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. @APPOLICE100
West Godavari District Police tweet mediaWest Godavari District Police tweet mediaWest Godavari District Police tweet mediaWest Godavari District Police tweet media
తెలుగు
0
0
0
28
West Godavari District Police
*ఎస్. కొండేపాడు బాధితులకు మెరుగైన వైద్యం – పరామర్శించిన జిల్లా కలెక్టర్ మరియు ఉన్నతాధికారులు.....* పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం, ఎస్. కొండేపాడు గ్రామంలో సంభవించిన దురదృష్టకర ఆహార కలుషిత (ఫుడ్ పాయిజనింగ్) ఘటనపై జిల్లా యంత్రాంగం యుద్ధప్రాతిపదికన స్పందించింది. ఈ ఘటనలో అస్వస్థతకు గురై భీమవరంలోని ఇంపీరియల్ మరియు భీమవరం ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న 12 మంది బాధితులను జిల్లా కలెక్టర్ శ్రీమతి సి. నాగరాణి, ఐ.ఏ.ఎస్., జిల్లా ఎస్పీ శ్రీ అద్నాన్ నయీం అస్మి, ఐ.పీ.ఎస్., మరియు జాయింట్ కలెక్టర్ శ్రీ టి. రాహుల్ కుమార్ రెడ్డి, ఐ.ఏ.ఎస్.లు బుధవారం పరామర్శించారు. వీరితో పాటు గౌరవ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి మరియు ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కనుమూరు రఘురామకృష్ణంరాజు, ఉంగుటూరు ఎమ్మెల్యే శ్రీ పత్సమట్ల ధర్మరాజు కూడా ఆసుపత్రులను సందర్శించి బాధితుల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మరియు అధికారులు బాధితులతో స్వయంగా మాట్లాడి, ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మరియు వారి కుటుంబ సభ్యులకు భరోసా కల్పిస్తూ, ఎటువంటి ఆందోళన చెందవద్దని ధైర్యం చెప్పారు. అనంతరం వైద్య అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన కలెక్టర్, బాధితులకు అందిస్తున్న చికిత్స మరియు అందుబాటులో ఉన్న వైద్య సౌకర్యాలను క్షుణ్ణంగా పరిశీలించారు. చికిత్సలో ఎటువంటి జాప్యం జరగకుండా, అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని వైద్యులను ఆదేశించారు. బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని, ఘటనకు గల కారణాలపై విచారణ చేపట్టి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లా ఎస్పీ మరియు ఇతర అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. @APPOLICE100
West Godavari District Police tweet mediaWest Godavari District Police tweet mediaWest Godavari District Police tweet mediaWest Godavari District Police tweet media
తెలుగు
0
0
0
48
West Godavari District Police
*కుమారుడి హత్య కేసులో నిందితుడైన తండ్రి అరెస్టు........* అత్తిలి మండలం ఈడూరు గ్రామంలో చోటుచేసుకున్న ఘోర హత్య ఉదంతంలో నిందితుడైన తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్ నిమిత్తం ఈ రోజు కోర్టులో హాజరుపరిచారు. *కేసు వివరాలు:* పాలకొల్లుకు చెందిన కొయ్యని గణేష్ (43), ప్రస్తుతం అత్తిలి మండలం ఈడూరు గ్రామంలోని రామాలయం వీధిలో నివాసం ఉంటున్నారు. గత కొంతకాలంగా కుటుంబంలో నెలకొన్న కలహాల నేపథ్యంలో, ఈ నెల 8వ తేదీ సాయంత్రం 5:00 గంటల సమయంలో గణేష్ ఇంట్లో ఉన్న కత్తెరతో తన కుమారుడైన కొయ్యని శామ్యూల్ రాజు (అలియాస్ సన్నీ) పొత్తికడుపు, వీపు మరియు ఎడమ చేయిపై విచక్షణారహితంగా దాడి చేసి ప్రాణాలు తీశాడు. ఈ దారుణ ఘటనపై మృతుని తల్లి కొయ్యని శేషవేణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు, అత్తిలి పోలీసు స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 70/2026, సెక్షన్ 103(1) BNS కింద కేసు నమోదైంది. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ శ్రీ అద్నాన్ నయీమ్ అస్మి, ఐ.పి.ఎస్., వారి ఆదేశానుసారం, తాడేపల్లిగూడెం డీఎస్పీ శ్రీ డి. విశ్వనాధ్ గారి పర్యవేక్షణలో తణుకు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ దేశంశెట్టి వెంకటేశ్వర రావు గారు దర్యాప్తును వేగవంతం చేశారు. శాస్త్రీయ ఆధారాలను సేకరించిన అనంతరం, నిందితుడు కొయ్యని గణేష్‌ను మే 9వ తేదీ రాత్రి 8:00 గంటల ప్రాంతంలో పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం నిందితుడిని రిమాండ్ నిమిత్తం గౌరవ న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఈ కేసు ఛేదనలో చురుగ్గా వ్యవహరించిన అత్తిలి ఎస్.ఐ. కె.ఎన్. విశ్వనాథ్, ఇరగవరం ఎస్.ఐ. జె. సతీష్ మరియు అత్తిలి, తణుకు టౌన్, రూరల్ స్టేషన్ల సిబ్బందిని జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించారు. @APPOLICE100
West Godavari District Police tweet media
తెలుగు
0
0
0
37
West Godavari District Police
*అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించిన జిల్లా ఎస్పీ శ్రీ అద్నాన్ నయీం అస్మి, ఐపీఎస్ గారు.....* భారత స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రలో అచంచలమైన ధైర్యసాహసాలకు, నిరుపమాన దేశభక్తికి మారుపేరుగా నిలిచిన మన్యం వీరుడు, విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతిని పురస్కరించుకుని, పశ్చిమగోదావరి జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ అద్నాన్ నయీం అస్మి, ఐపీఎస్ గారు అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి, ఆయన చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. అనంతరం జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ....., బ్రిటిష్ సామ్రాజ్యవాద పాలనకు వ్యతిరేకంగా గిరిజన ప్రజలను ఏకం చేసి, సాయుధ పోరాటం ద్వారా వారిలో స్వేచ్ఛా కాంక్షను రగిలించిన మహోన్నత వ్యక్తి అల్లూరి అని కొనియాడారు. కేవలం 27 ఏళ్ల అతి పిన్న వయసులోనే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అల్లూరి చరిత్ర, నేటి యువతకు మరియు ముఖ్యంగా పోలీసు యంత్రాంగానికి ఎనలేని స్ఫూర్తినిస్తుందని ఆయన పేర్కొన్నారు. విధి నిర్వహణలో అంకితభావం, క్రమశిక్షణ మరియు ప్రజల పట్ల సేవాభావాన్ని పెంపొందించుకోవడమే మనం ఆ మహనీయునికి ఇచ్చే నిజమైన నివాళి అని ఎస్పీ గారు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీ కె.వి.వి.ఎన్ సత్యనారాయణ గారు, మహిళా ఆర్మ్డ్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ (అడ్మిన్) శ్రీమతి ఇ.ఇందుమతి గారు, ఆర్ఎస్సై శ్రీ కె.గోపి కృష్ణ గారు మరియు ఇతర పోలీసు కార్యాలయ ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొని అల్లూరి సీతారామరాజు గారికి అంజలి ఘటించారు. @APPOLICE100
West Godavari District Police tweet mediaWest Godavari District Police tweet mediaWest Godavari District Police tweet mediaWest Godavari District Police tweet media
తెలుగు
0
0
0
35
West Godavari District Police
District SP Adnan Nayeem Asmi ,IPS conducted the PGRS program at the District Police Office, where 16 petitions were received and addressed. He personally interacted with complainants, heard their grievances, and directed concerned officers to conduct thorough field inquiries and resolve issues within the stipulated time as per law. Emphasizing transparency and prompt action, the SP instructed officers to ensure in-depth investigation at the initial stage, deliver lasting solutions, and prevent recurrence of complaints. #PGRS #WestGodavariPolice #PublicGrievance #AdnanNayeemAsmiIPS #PeopleFirst #TransparentPolicing #QuickJustice @APPOLICE100
West Godavari District Police tweet mediaWest Godavari District Police tweet mediaWest Godavari District Police tweet mediaWest Godavari District Police tweet media
English
0
0
0
90
West Godavari District Police
*పోలీసు విభాగంలో సుదీర్ఘ సేవలందించి పదవీ విరమణ పొందిన సిబ్బందిని ఘనంగా సన్మానించి, ఆత్మీయ వీడ్కోలు పలికిన జిల్లా ఎస్పీ శ్రీ అద్నాన్ నయీం అస్మి , ఐపీఎస్., గారు.* *పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని ఆకాంక్ష* పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించి, కర్తవ్య నిర్వహణలో చిత్తశుద్ది, అంకిత భావంతో పోలీస్ శాఖ ద్వారా ప్రజలకు విశిష్ట సేవలందించి ఈ రోజు పదవీ విరమణ చేసిన పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ శ్రీ అద్నాన్ నయీం అస్మి , ఐపీఎస్., గారు మరియు పోలీస్ అధికారులు ఘనంగా సత్కరించి, జ్ఞాపికలను అందజేసి, ఆత్మీయ వీడ్కోలు పలికారు. *పదవీవిరమణ పొందిన వారి వివరాలు:* 1. శ్రీ వి. శ్రీనివాసరావు గారు, సబ్ ఇన్స్పెక్టర్, సిసిఎస్ పోలీస్ స్టేషన్, భీమవరం. 2. శ్రీ కె.ఎస్. ప్రసాద్ గారు, హెడ్ కానిస్టేబుల్, భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్. 3. శ్రీ కె.ఆంజనేయులు గారు, హెడ్ కానిస్టేబుల్, తాడేపల్లిగూడెం టౌన్ పోలీస్ స్టేషన్ ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ...., సుమారు 35 నుండి 40 సంవత్సరాల సుదీర్ఘ సర్వీసులో వ్యక్తిగత సుఖాలను, కుటుంబ వ్యవహారాలను పక్కన పెట్టి, అహోరాత్రులు ప్రజా రక్షణ కోసం శ్రమించి, ఎటువంటి విమర్శలకు తావులేకుండా సగర్వంగా పదవీ విరమణ చేయడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. పోలీసు వ్యవస్థలో ప్రతి ఉద్యోగి అందించే సేవలను శాఖ ఎప్పటికీ స్మరించుకుంటుందని, నిత్యం సవాళ్లతో కూడుకున్న విధుల్లో ఉన్నప్పుడు సిబ్బందికి వెన్నుదన్నుగా నిలిచిన వారి కుటుంబ సభ్యులకు ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. పదవీ విరమణ కేవలం విధులకు మాత్రమేనని, పోలీసు కుటుంబంతో మీ అనుబంధం శాశ్వతమని భరోసా ఇచ్చారు. పదవీ విరమణ పొందిన సిబ్బంది తమ తదుపరి జీవితాన్ని ఆర్థిక క్రమశిక్షణతో, మెరుగైన ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా గడపాలని ఆకాంక్షించారు. అలాగే, వారికి అందవలసిన పదవీ విరమణ ప్రయోజనాలను సకాలంలో అందేలా అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీ కె.వి.వి.ఎన్ సత్యనారాయణ గారు, జిల్లా పోలీసు అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ సి.హెచ్. మోజేష్ గారు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. @APPOLICE100
West Godavari District Police tweet mediaWest Godavari District Police tweet mediaWest Godavari District Police tweet mediaWest Godavari District Police tweet media
తెలుగు
0
0
0
28
West Godavari District Police
*జిల్లాలోని పోలీసు అధికారులతో జూమ్ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించిన పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ అద్నాన్ నయీం అస్మి , ఐపీఎస్., గారు........* జిల్లాలో శాంతిభద్రతల పరిస్థితిని, కేసుల పురోగతిని సమీక్షించేందుకు జిల్లా ఎస్పీ శ్రీ అద్నాన్ నయీం అస్మి, ఐపీఎస్., గారు ఏప్రిల్ 28, మంగళవారం నాడు గొల్లలకోడేరులోని జిల్లా పోలీసు కార్యాలయం నుండి జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు మరియు ఎస్సైలతో జూమ్ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా నెలవారీ నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ, జిల్లాలో రౌడీషీటర్ల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని, సమాజ శాంతికి భంగం కలిగించే వారిపై అవసరమైతే తక్షణమే బైండోవర్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. అదేవిధంగా, జిల్లాలో పెట్రోల్ మరియు డీజిల్ సరఫరా వ్యవస్థను పర్యవేక్షిస్తూ, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. నేరాల దర్యాప్తులో నాణ్యతను పెంచడమే లక్ష్యంగా, గ్రేవ్ మరియు నాన్-గ్రేవ్ కేసులతో పాటు ఎన్‌డీపీఎస్ (NDPS), ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ, పోక్సో (POCSO) మరియు మహిళలపై జరిగే నేరాలకు సంబంధించిన దర్యాప్తు స్థితిగతులను ఎస్పీ గారు క్షుణ్ణంగా పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించాలని, ముఖ్యంగా ఆస్తి సంబంధిత నేరాలలో చోరీ సొత్తు రికవరీపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని దర్యాప్తులో అంతర్భాగం చేస్తూ, పక్కా ఆధారాలతో చార్జిషీట్లు దాఖలు చేయడం ద్వారా నేరస్తులకు చట్టపరంగా కఠిన శిక్షలు పడేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కోర్టు సమన్ల జారీ మరియు నాన్‌బెయిలబుల్ వారెంట్ల అమలులో ఎటువంటి జాప్యం జరగకుండా నిరంతర పర్యవేక్షణ ఉండాలని, న్యాయస్థానాలతో సమన్వయం మెరుగుపరచుకొని కేసుల విచారణ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. రహదారి భద్రతపై ప్రత్యేక దృష్టి సారించిన ఎస్పీ గారు, జిల్లాలోని 'బ్లాక్ స్పాట్స్' (ప్రమాద తీవ్రత ఉన్న ప్రాంతాలు) వద్ద రక్షణ చర్యలు చేపట్టాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ మరియు హెల్మెట్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పట్ల అత్యంత బాధ్యతాయుతంగా స్పందిస్తూ, పారదర్శకమైన మరియు జవాబుదారీతనంతో కూడిన పోలీసింగ్ ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించాలని ఆయన స్పష్టం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీ కె.వి.వి.ఎన్ సత్యనారాయణ గారు, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీమతి అహ్మదున్నీషా గారు, ఫింగర్ ప్రింట్స్ ఇన్స్పెక్టర్ శ్రీ రాజేష్‌ గార్లతో పాటు జిల్లాలోని డిఎస్పీలు, సిఐలు మరియు ఎస్సైలు పాల్గొన్నారు. @APPOLICE100
West Godavari District Police tweet mediaWest Godavari District Police tweet mediaWest Godavari District Police tweet mediaWest Godavari District Police tweet media
తెలుగు
0
0
0
31
West Godavari District Police
*రోడ్డు ప్రమాదాల నివారణ ధ్యేయంగా జిల్లావ్యాప్తంగా ఉన్న "బ్లాక్ స్పాట్స్"ను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా ఎస్పీ శ్రీ అద్నాన్ నయీం అస్మి, ఐపీఎస్ గారు.....* *సంబంధిత శాఖల సమన్వయంతో రోడ్డు ప్రమాదాలను పూర్తిగా అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ.......* పశ్చిమగోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణను చేపట్టింది. ఇందులో భాగంగా ఏప్రిల్ 23, గురువారం నాడు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ శ్రీ అద్నాన్ నయీం అస్మి, ఐపీఎస్ గారు జిల్లావ్యాప్తంగా ప్రమాదాలకు నిలయంగా మారిన 'బ్లాక్ స్పాట్స్' (తరచూ తీవ్రమైన రోడ్డు ప్రమాదాలు జరుగు ప్రదేశాలు) ను పోలీస్, రవాణా, జాతీయ రహదారులు (NHAI), ఆర్ అండ్ బి (R&B), పంచాయతీరాజ్, రెవెన్యూ మరియు మున్సిపల్ శాఖల ఉన్నతాధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా పరిశీలించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగిన ఈ పర్యటనలో భాగంగా భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, అత్తిలి, పెనుమంట్ర, పెనుగొండ, పోడూరు, ఎలమంచిలి, నర్సాపురం, మొగల్తూరు ప్రాంతాల పరిధిలోని 23 బ్లాక్ స్పాట్ల వద్ద నెలకొన్న భౌగోళిక పరిస్థితులు, రహదారి నిర్మాణ లోపాలు మరియు ప్రమాదాలకు దారితీస్తున్న సాంకేతిక కారణాలను ఎస్పీ గారు క్షుణ్ణంగా విశ్లేషించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ......, ప్రజా ప్రాణాల రక్షణకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ, రోడ్డు ప్రమాదాలను సమూలంగా అరికట్టేందుకు అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఒక సమగ్ర ప్రణాళికను అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. గుర్తించిన 23 బ్లాక్ స్పాట్లలో వచ్చే రెండు నుండి మూడు నెలల వ్యవధిలో 100 శాతం భద్రతా ప్రమాణాలను మెరుగుపరచాలని సంబంధిత అధికారులకు కచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. తక్షణ చర్యల్లో భాగంగా ప్రమాద హెచ్చరిక బోర్డులు, బ్లింకర్స్, రంబుల్ స్ట్రిప్స్, రేడియం స్టిక్కర్లు మరియు ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థను పటిష్టం చేయాలని సూచించారు. రహదారి నిబంధనల అమలులో ఎటువంటి రాజీ లేదని స్పష్టం చేస్తూ, అతివేగం (Over Speeding) మరియు మద్యం సేవించి వాహనాలు నడిపే (Drunk & Drive) వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి స్పీడ్ గన్స్ మరియు ఆల్కహాల్ మీటర్ల వినియోగాన్ని మరింత పెంచుతున్నట్లు ఎస్పీ గారు తెలిపారు. ఒకవైపు మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారిస్తూనే, మరోవైపు ప్రజల్లో ట్రాఫిక్ నిబంధనల పట్ల విస్తృత అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఉమ్మడి కార్యాచరణ ద్వారా జిల్లాలో ప్రాణ నష్టాన్ని కనిష్ట స్థాయికి తీసుకురావడమే తమ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారితో పాటు భీమవరం డీఎస్పీ శ్రీ రఘువీర్ విష్ణు గారు, తాడేపల్లిగూడెం డీఎస్పీ శ్రీ డి. విశ్వనాథ్ గారు, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీ కె.వి.వి.ఎన్ సత్యనారాయణ గారు, ఇతర పోలీసు అధికారులు మరియు రవాణా, జాతీయ రహదారులు, ఆర్ & బి, రెవెన్యూ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. #WestGodavariPolice #RoadSafety #AccidentPrevention #BlackSpots #TrafficSafety #SafeRoads #PublicSafety #DrunkAndDrive #OverSpeeding #RoadAwareness #AndhraPradeshPolice #AdnanNayeemAsmiIPS @APPOLICE100
West Godavari District Police tweet mediaWest Godavari District Police tweet mediaWest Godavari District Police tweet mediaWest Godavari District Police tweet media
తెలుగు
0
0
0
35
West Godavari District Police
With the objective of preventing road accidents and saving lives, West Godavari Police launched a special road safety initiative across the district. On April 23, District SP Adnan Nayeem Asmi personally inspected 23 accident-prone black spots across Bhimavaram, Tadepalligudem, Tanuku, Attili, Penumantra, Penugonda, Poduru, Elamanchili, Narsapuram, and Mogalthuru along with officials from Police, Transport, NHAI, R&B, Revenue, Panchayat Raj, and Municipal departments. He reviewed road conditions and accident causes and directed officials to complete safety improvements within 2–3 months by installing warning boards, blinkers, rumble strips, radium stickers, and strengthening traffic signals. The SP also emphasized strict enforcement against over-speeding and drunk driving while increasing public awareness to reduce road fatalities in the district. #WestGodavariPolice #RoadSafety #AccidentPrevention #BlackSpots #TrafficSafety #SafeRoads #PublicSafety #DrunkAndDrive #OverSpeeding #RoadAwareness #AndhraPradeshPolice #AdnanNayeemAsmiOPS @APPOLICE100
West Godavari District Police tweet mediaWest Godavari District Police tweet mediaWest Godavari District Police tweet mediaWest Godavari District Police tweet media
English
0
0
0
81
West Godavari District Police
*జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో "ప్రజా సమస్యల పరిష్కార వేదిక" (పి.జి.ఆర్.ఎస్) కార్యక్రమాన్ని నిర్వహించిన జిల్లా ఎస్పీ శ్రీ అద్నాన్ నయీం అస్మి , ఐపీఎస్., గారు.* *ప్రజా సమస్యలపై త్వరితగతిన స్పందించి, నిర్ణీత గడువులోగా చట్ట పరిధిలో శాశ్వత పరిష్కారం చూపాలని జిల్లా పోలీసు అధికారులు ఆదేశాలు జారీ.........* *నేటి పోలీసు “పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం” కార్యక్రమంలో 17 అర్జీల స్వీకరణ.......* పశ్చిమగోదావరి జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన "ప్రజా సమస్యల పరిష్కార వేదిక" (మీకోసం) కార్యక్రమం ద్వారా ప్రజల నుండి జిల్లా ఎస్పీ శ్రీ అద్నాన్ నయీం అస్మి, ఐపీఎస్., గారు నేరుగా ఫిర్యాదులను స్వీకరించారు. బాధితుల సమస్యలను ఓపికగా విన్న ఎస్పీ గారు, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులతో ముఖాముఖి మాట్లాడి, వారి సమస్యల పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి, క్షేత్రస్థాయిలో పూర్తి విచారణ జరిపి, నిర్ణీత గడువులోగా చట్టపరమైన శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ......., ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఎంతో ఆశతో పోలీసు కార్యాలయాలను ఆశ్రయిస్తారని, అటువంటి బాధితులకు పోలీసు శాఖ వెన్నుముకగా నిలిచి భరోసా కల్పించాలని అధికారులకు స్పష్టం చేశారు. ముఖ్యంగా ఫిర్యాదులు మరల మరల పునరావృతం కాకుండా ఉండాలంటే, మొదటి విడతలోనే లోతైన దర్యాప్తు జరిపి బాధితులకు న్యాయం చేకూరేలా చూడాలన్నారు. విచారణలో జాప్యం వహించకుండా, పారదర్శకమైన పద్ధతిలో సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేయాలని ఆయన ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీ శ్రీ యు. రవిచంద్ర గారు, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీ కె.వి.వి.ఎన్ సత్యనారాయణ గారు మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. @APPOLICE100
West Godavari District Police tweet mediaWest Godavari District Police tweet mediaWest Godavari District Police tweet media
తెలుగు
0
0
0
38