Aithabathula Ananda Rao

3K posts

Aithabathula Ananda Rao banner
Aithabathula Ananda Rao

Aithabathula Ananda Rao

@aar_here

MLA Amalapuram Constituency, DR. B. AMEDKAR KONASEEMA DISTRICT.

Amalapuram, India Katılım Mayıs 2015
14 Takip Edilen496 Takipçiler
Aithabathula Ananda Rao
అమలాపురం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు, గోలకోటి చిన్న గారు ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై, చేతికి ఫ్రాక్చర్ అయిన విషయం తెలిసి గురువారం ఉప్పలగుప్తం మండలం చల్లపల్లిలోని తన స్వగృహానికి వెళ్ళి పరామర్శించడం జరిగింది. చిన్న ఆరోగ్య పరిస్థితిని, ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పాం. పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే ఇటువంటి యువ నాయకత్వమే మన బలం. చిన్న త్వరగా కోలుకుని, మళ్లీ పూర్తి ఆరోగ్యంతో ప్రజాసేవలో, పార్టీ కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. ఏ కష్టం వచ్చినా పార్టీ మీకు ఎప్పుడూ అండగా ఉంటుంది. #Amalapuram #TeluguYuvatha #TDPFamily #MLAAnandaRao #NaraChandraBabuNaidu #NaraLokesh #PawanKalyan #TDPJSPBJPAlliance #AndhraPradesh #YouthLeadership #TeluguDesamParty
Aithabathula Ananda Rao tweet mediaAithabathula Ananda Rao tweet media
తెలుగు
0
0
1
6
Aithabathula Ananda Rao
అమలాపురం రూరల్ మండలం ఈదరపల్లి గ్రామంలో సుమారు ₹2 కోట్ల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న ఎస్సీ కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణ పనులను గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగింది. నిర్మాణ నాణ్యతను మరియు పనుల పురోగతిని స్వయంగా పర్యవేక్షించి, మిగిలి ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించాను. అత్యుత్తమ వసతులతో రూపుదిద్దుకుంటున్న ఈ భవనాన్ని అన్ని పనులు పూర్తి చేసి త్వరలోనే ప్రారంభించి, స్థానిక ప్రజల వినియోగానికి అందుబాటులోకి తీసుకువస్తాం. షెడ్యూల్డ్ కులాల ప్రజల సామాజిక అవసరాలకు మరియు శుభకార్యాలకు ఈ భవనం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. నియోజకవర్గవ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా, నిధుల కొరత లేకుండా అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నాం. #Amalapuram #MLAAnandRao #Edarapalli #Development #CommunityHall #PublicWelfare #drbrambedkarkonaseema #AndhraPradesh #NaraChandraBabuNaidu #PawanKalyan #sccommunityhall
Aithabathula Ananda Rao tweet mediaAithabathula Ananda Rao tweet mediaAithabathula Ananda Rao tweet media
తెలుగు
0
1
1
10
Aithabathula Ananda Rao
రాష్ట్రపతి సంతకం తర్వాత అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ కేంద్ర న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో 2024 జూన్‌ 2 నుంచి అమరావతికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని హోదా దక్కింది. 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష నెరవేర్చడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ ఏపీ ప్రజల తరపున కృతజ్ఞతలు #AmaravatiGazette #HistoricAmaravatiResolution #APThanksIndia #APThanksModiJi #Amaravati #ChandrababuNaidu #AndhraPradesh
Aithabathula Ananda Rao tweet media
తెలుగు
0
1
3
15
Aithabathula Ananda Rao
ఆరోగ్యమే మహాభాగ్యం మన శరీరం మనం నివసించే ఏకైక ఇల్లు. దాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత. ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మంచి అలవాట్లను పాటిద్దాం, ఆరోగ్యంగా జీవిద్దాం. అందరికీ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ శుభాకాంక్షలు #WorldHealthDay #WorldHealthDay2026 #HealthIsWealth #ఆరోగ్యమేమహాభాగ్యం #StayHealthy #WellnessJourney #HealthyLifestyle #HealthForAll
Aithabathula Ananda Rao tweet media
తెలుగు
0
1
1
42
Aithabathula Ananda Rao
30 ఏళ్ల క్రితమే నీటి భద్రత కోసం పని చేశాం. ఇంకుడు గుంతలు, చెక్ డ్యామ్‌లు, తుంపర సేద్యం, సూక్ష్మ సేద్యం వంటి అనేక ప్రయత్నాలు చేసి ముందుకు వెళ్లాం. పంట కుంటలు, కాలువలు, చెరువుల్లో మట్టి తీసి పొలాల్లో వేశాం. ఎన్టీఆర్ జలసిరి ద్వారా ట్రెంచ్‌లు, నీరు-చెట్టు, నీరు-మీరు, నీరు-ప్రగతి వంటి అనేక కార్యక్రమాలు చేపట్టాం. #Jaladhara #జలధార #ChandrababuNaidu #AndhraPradesh
తెలుగు
0
1
1
23
Aithabathula Ananda Rao
అమలాపురం రూరల్ మండలం, సమనస గ్రామంలో "నీటి భద్రత - సాగు నీటి సంఘాల బాధ్యత" కార్యక్రమాన్ని నేడు ఘనంగా ప్రారంభించటం జరిగింది. ఈ సందర్భంగా లకుల వద్ద పూడికతీత పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారులకు దిశానిర్దేశం చేశాను. ఏప్రిల్ 6 నుండి జూలై 5 వరకు 90 రోజుల పాటు కొనసాగనున్న ఈ బృహత్తర కార్యక్రమంలో భాగంగా కాలువలు పునరుద్ధరణ, భూగర్భ జలాల పెంపునకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. రైతు సంక్షేమమే ధ్యేయంగా చేపట్టిన ఈ జల యజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చాను #Amalapuram #MLAAnandRao #WaterSecurity #FarmersFirst #AndhraPradesh #Samanasa #JalaYagnam #Konaseema #PawanKalyan #ChandrababuNaidu #JalaShakti
Aithabathula Ananda Rao tweet mediaAithabathula Ananda Rao tweet mediaAithabathula Ananda Rao tweet mediaAithabathula Ananda Rao tweet media
తెలుగు
0
1
1
14
Aithabathula Ananda Rao
భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, ఎన్డీయే భాగస్వాములైన భాజపా నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రధాని నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో దేశ అభివృద్ధికి మనందరం కృషి చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను #BJPFoundationDay #BJP4India #NDAAlliance #NarendraModi #ViksitBharat #bjptdpjsp #ndakutami #andhrapradesh
Aithabathula Ananda Rao tweet media
తెలుగు
0
0
1
18
Aithabathula Ananda Rao
ఆంధ్రుల కోసం కడుతున్న రాజధాని అమరావతికి చదరపు అడుగుకి రూ.12,000 అవుతుందని జగన్ అబద్ధం చెబుతున్నాడు. అలా అనుకున్నా సొంత విలాసాల కోసం జగన్ కట్టుకున్న రుషికొండ ప్యాలెస్ కట్టడానికి చదరపు అడుగుకి రూ.35,714 అయ్యింది. జగన్ దీనికేమని జవాబు చెపుతాడు. #Amaravati #AndhraPradesh
Aithabathula Ananda Rao tweet media
తెలుగు
0
0
0
10
Aithabathula Ananda Rao
భారత మాజీ ఉప ప్రధాని, అణగారిన వర్గాల ఆశాజ్యోతి శ్రీ బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఇవే నా ఘన నివాళులు #BabuJagjivanRam #BabuJagjivanRamJayanthi #JagjivanRamJayanthi
Aithabathula Ananda Rao tweet media
తెలుగు
0
1
3
22
Aithabathula Ananda Rao
మరణాన్ని జయించి, నిరీక్షణగా మారిన రోజు. లోక రక్షకుడైన యేసు క్రీస్తు పునరుత్థానాన్ని వేడుక చేసుకుందాం. క్రైస్తవ సోదర, సోదరీమణులందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు #jesuschrist #Easter2026 #HeIsRisen #HappyEaster
Aithabathula Ananda Rao tweet media
తెలుగు
0
1
2
21
Aithabathula Ananda Rao
అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుకు అన్నివిధాలా సహకరించిన ప్రధాని నరేంద్ర మోదీ గారికి, హోమ్ మంత్రి అమిత్ షా గారికి, పార్లమెంటులో మద్దతిచ్చిన పార్టీలన్నిటికీ 5 కోట్ల ఆంధ్రుల తరపున కృతజ్ఞతలు. #HistoricAmaravatiResolution #APThanksIndia #Amaravati #ChandraBabuNaidu #AndhraPradesh
తెలుగు
0
2
3
18
Aithabathula Ananda Rao
రాజధాని అమరావతి విషయంలో భారతదేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ కు అండగా నిలిచింది. అమరావతికి చట్టబద్దత రావడం అన్నది 5 కోట్ల ఆంధ్రుల గెలుపు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజధాని నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తుంది. #HistoricAmaravatiResolution #APThanksIndia #Amaravati #NaraLokesh #AndhraPradesh
తెలుగు
0
0
1
9
Aithabathula Ananda Rao
హైదరాబాద్ JRC కన్వెన్షన్ సెంటర్ లో అనపర్తి ఎమ్మెల్యే శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి కుమార్తె సనాతని, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి గారి కుమారుడు జనార్ధనరెడ్డి కి జరిగిన వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించటం జరిగింది #WeddingBells #WeddingCereomy #SanataniJanardhanWedding #JRCConvention #Hyderabad #MLAAnandarao #Amalapuram #Blessings #NewBeginnings #NallamilliRamakrishnaReddy #Anaparthi #GowruCharithaReddy #Panyam
Aithabathula Ananda Rao tweet media
తెలుగు
0
0
3
28
Aithabathula Ananda Rao
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ బిల్లుకు ఉభయసభల్లో ఆమోదం లభించింది. రాష్ట్రపతి ఆమోదం తర్వాత ఇక బిల్లు చట్టం కానుంది. #HistoricAmaravatiResolution #APThanksIndia #APThanksModiJi #Amaravati #ChandrababuNaidu #AndhraPradesh
Aithabathula Ananda Rao tweet media
తెలుగు
2
1
2
15
Aithabathula Ananda Rao
లోక పాప పరిహారార్థమై తన ప్రాణాలను త్యాగం చేసిన ఆ కరుణామయుని ఆశీస్సులు ప్రజలందరికీ కలగాలని ఆశిస్తూ... క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు #GoodFriday #GoodFriday2026 #Calvary #JesusSacrifice #HolyFriday #Crucifixion #Lent #Blessings #Faith #Peace
Aithabathula Ananda Rao tweet media
తెలుగు
0
0
1
23
Aithabathula Ananda Rao
Aithabathula Ananda Rao@aar_here·
ధైర్యం, భక్తి, శక్తి స్వరూపుడైన హనుమంతుని జయంతి సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆ పవనసుతుని కృపతో మనందరికీ ఆయురారోగ్యాలు, విజయాలు కలగాలని కోరుకుంటున్నాను. #HanumanJayanti #JaiBajrangBali #LordHanuman #HanumanJayanti2026 #JaiShreeRam #Pavanaputra #BajrangBali #Devotional
Aithabathula Ananda Rao tweet media
తెలుగు
0
1
1
44
Aithabathula Ananda Rao
Aithabathula Ananda Rao@aar_here·
కొత్తపేట మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గానికి హృదయపూర్వక శుభాకాంక్షలు కొత్తపేట మార్కెట్ కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీమతి పల్లి మంగాదేవి భీమారావు గారికి మరియు వైస్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ కంఠంశెట్టి శ్రీనివాసరావు గారికి నా అభినందనలు. ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారి నేతృత్వంలోని మన కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోంది. నూతన పాలకవర్గం అంకితభావంతో పనిచేస్తూ, రైతులకు అండగా ఉంటూ నియోజకవర్గ అభివృద్ధిలో చురుకైన పాత్ర పోషించాలని ఆకాంక్షిస్తున్నాను. #kothapetaconstituency #MarketCommittee #FarmersWelfare #MLAAnandarao #kothapetaconstituency #bandarusatyanadharao
Aithabathula Ananda Rao tweet mediaAithabathula Ananda Rao tweet media
తెలుగు
0
1
4
27
Aithabathula Ananda Rao
Aithabathula Ananda Rao@aar_here·
అమలాపురం రూరల్ మండలం గున్నేపల్లి అగ్రహారం గ్రామంలో నూతనంగా నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్ ను బుధవారం ప్రారంభించాను. రాబోయే రోజుల్లో వృద్ధులు, గర్భిణీలు మరియు అత్యవసర చికిత్స అవసరమైన వారికి గ్రామంలోనే వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు, వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నాము. పేదవాడి ఆరోగ్యానికి పెద్దపీట వేయడమే మా కూటమి ప్రభుత్వ సంకల్పం #VillageHealthClinic #PublicHealth #Amalapuram #MLAAnandarao #GunnepalliAgraharam #ChandrababuNaidu #ApHealth #WelfareState #JanaSena #TDP #BJP
Aithabathula Ananda Rao tweet mediaAithabathula Ananda Rao tweet media
తెలుగు
0
0
1
20