
Anshul
37 posts

Anshul
@anshulnephro
Assistant Professor,Nephrology,Nizam's Institute of Medical Sciences































హైదరాబాద్‌లోని మైండ్ స్పేస్‌లో Society of the Renal Nutrition & Metabolism వార్షిక సదస్సును ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రారంభించారు. మంత్రి స్పీచ్ పాయింట్స్: డయాబెటీస్, హైపర్ టెన్షన్, గుండె జబ్బులు, కిడ్నీ జబ్బుల వంటి నాన్ కమ్యునికెబుల్ డిసీజ్‌లు ప్రజారోగ్యానికి పెద్ద సవాలుగా మారాయి. డయాబెటిస్, హైపర్‌టెన్షన్, జీవనశైలిలో వచ్చిన మార్పుల వల్ల కిడ్నీలు దెబ్బతిని ఎంతో మంది రోగులుగా మారుతున్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో సమస్య మరింత ఎక్కువగా ఉంది. ఈ నాన్ కమ్యునికెబుల్ డిసీజ్‌లను ఎదుర్కొనేందుకు ప్రజా ఆరోగ్య వ్యవస్థను సిద్ధం చేస్తున్నాం. వ్యాధి నివారణపై అవగాహన, ఎర్లీ స్టేజ్‌లోనే వ్యాధుల గుర్తింపు, ట్రీట్‌మెంట్, రిహాబిలిటేషన్ వరకూ సమగ్రంగా ఆరోగ్య వ్యవస్థను తీర్చిదిద్దుతున్నాం. ప్రతి జిల్లాలో NCD క్లినిక్స్ ఏర్పాటు చేశాం. జిల్లాల్లోనే కీమో థెరపీ అందించేలా అన్ని జిల్లా కేంద్రాల్లో డే కేర్ కేన్సర్ సెంటర్లు ఏర్పాటు చేశాం. రీజనల్ రిఫరల్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్రంలో 46 లక్షల స్వయం సహాయక సంఘాల మహిళలకు 30 రకాల ఉచిత పరీక్షలు నిర్వహిస్తున్నాం, అందులో సీరమ్ క్రియాటినిన్ పరీక్ష కూడా ఉంది. కిడ్నీ వ్యాధిని ప్రాథమిక దశకో గుర్తించేందుకు ఇది ఉపయోగపడుతుంది. మరోవైపు, ప్రతి పౌరుడికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ తయారు చేసి, కార్డులు అందించబోతున్నాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డయాలసిస్ సేవలను గణనీయంగా విస్తరించాం. గత సంవత్సరం 16 కొత్త డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో మొత్తం సెంటర్ల సంఖ్య 102కు చేరింది. ప్రతి రోగి 20 నుంచి 25 నిమిషాల్లో డయాలసిస్ కేంద్రానికి చేరుకునేలా లక్ష్యంగా పెట్టుకుని 416 బెడ్ల కెపాసిటీతో మరో 79 డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే డయాలసిస్ సేవలు అందిస్తున్న 67 సెంటర్లలో వెయిటింగ్ టైమ్ తగ్గించేందుకు అదనంగా 155 కొత్త డయాలసిస్ యంత్రాలు ఏర్పాటు చేస్తున్నాం. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా సుమారు 16,500 మంది రోగులకు ఉచిత డయాలసిస్ సేవలు అందిస్తున్నాం. ఇందులో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 10,000 మంది, ప్రైవేట్ ఆసుపత్రుల్లో 6,500 మంది సేవలు పొందుతున్నారు. ఈ సేవల కోసం ప్రతి సంవత్సరం సుమారు ₹220 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. అవయవ దానంలో రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. జీవనదాన్ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు వేలాది అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు జరిగాయి, అందులో 2,700 కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్లు ఉన్నాయి. గతేడాది THOTA Act అడాప్ట్ చేసుకున్నాం. గ్రాండ్ పేరెంట్స్ కూడా కిడ్నీ దానం చేసే అవకాశాన్ని కల్పించాం. డోనర్ స్వాపింగ్ ప్రక్రియను సులభతరం చేశాం. బ్రెయిన్ డెత్ ధృవీకరణ విధానాన్ని సరళీకరించి అవయవ దానాన్ని ప్రోత్సహిస్తున్నాం. కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను కూడా ఆరోగ్యశ్రీ ద్వారా పూర్తిగా ఉచితంగా అందిస్తున్నాం. రాష్ట్రంలోని 6 ప్రభుత్వ జనరల్ హాస్పిటల్స్‌లో ఆర్గాన్ రిట్రైవల్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నాం. వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, టిమ్స్ సనత్‌నగర్‌లో అత్యాధునిక అవయవ మార్పిడి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. రోగం వచ్చాక చికిత్స అందించడంతోపాటు, వ్యాధుల నివారణపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. కిడ్నీ ఆరోగ్యంలో పోషకాహారం కీలక పాత్ర పోషిస్తుంది. సరైన ఆహార అలవాట్లు, క్రమం తప్పని వ్యాయామం ద్వారా కిడ్నీ వ్యాధులను మాత్రమే కాకుండా డయాబెటిస్, హైపర్‌టెన్షన్ వంటి అనారోగ్యాలను కూడా నివారించవచ్చు. ప్రజలు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకునేలా డాక్టర్లు ప్రోత్సహించాలి. పబ్లిక్ హెల్త్‌లో దేశానికి తెలంగాణను రోల్ మోడల్‌గా చేసుకుందాం. ఇందుకు డాక్టర్లు సహకరించాలని మా విజ్ఞప్తి. మీరు అందించే మంచి సూచనలను అమలు చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం.

X Space on #RenalNutrition 🎙️ Expertly moderated by @drpriyajohn with insightful perspectives from senior nephrologists. Key takeaways- ✅ Actionable renal nutrition strategies ✅ Need for structured training ✅ Translating guidelines to real-world diverse diets #SRNMCON2026















