Ashok Reddy Korem

250 posts

Ashok Reddy Korem banner
Ashok Reddy Korem

Ashok Reddy Korem

@ashok_korem

IAS,Managing Director, Hyderabad Metro Water Supply and Sewerage Board, Govt of Telangana.

Hyderabad Katılım Şubat 2011
62 Takip Edilen1.1K Takipçiler
Ashok Reddy Korem retweetledi
HMWSSB
HMWSSB@HMWSSBOnline·
జీహెచ్ఎంసీ క‌మీష‌న‌ర్‌, జ‌ల‌మండ‌లి ఎండీ జాయింట్ ఇన్‌స్పెక్ష‌న్‌ ================ # అంబర్ పేట్ ఎమ్మెల్యేతో క‌లిసి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌ట‌న‌ # అంబర్ పేట్ ప్రాంతంలో మురుగు స‌మ‌స్య క‌ట్ట‌డికి కార్య‌చ‌ర‌ణ‌ # ఇరుశాఖ‌లు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాల‌ని నిర్ణ‌యం. అంబర్ పేట్ శాస‌న‌స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో మురుగునీటి స‌మ‌స్య‌ల శాశ్వ‌త‌ ప‌రిష్కారానికి ఇరుశాఖ‌ల ఆధ్వ‌ర్యంలో సంయుక్త కార్య‌చ‌ర‌ణ చేప‌ట్ట‌నున్నారు. నియోజ‌క‌వ‌ర్గం అంబర్ పేట్, పటేల్ నగర్, గోల్నాక ప్రాంతంలోని నాలా ప‌రివాహ‌క ప్రాంతంలో వ‌ర్షాకాలంలో ఈ ప్రాంత నివాసులు ప‌లు ఇక్క‌ట్లు ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో జ‌ల‌మండలి ఎండీ అశోక్ రెడ్డి, జీహెచ్ఎంసీ క‌మీష‌న‌ర్ కర్ణన్, స్థానిక శాస‌న స‌భ్యుడు కాలేరు వెంకటేష్ క‌లిసి జాయింట్ ఇన్‌స్పెక్ష‌న్ నిర్వ‌హించారు. ఈ ప్రాంతంలో రోడ్డు విస్త‌ర‌ణ, జీహెచ్ఎంసీ ప్రాజెక్టు విభాగం చేప‌ట్టిన నాలా విస్త‌ర‌ణ ప‌నుల కార‌ణంగా స‌మీప‌ ప్రాంతాలలో జీహెచ్ఎంసీ చిన్న చిన్న రెయిన్‌వాట‌ర్ డ్రైన్లు, జ‌ల‌మండ‌లికి సంబంధించిన సీవ‌రేజ్ లైన్ల‌ ను ద్వాంసం చేయడంతో మురుగు స‌మ‌స్య తీవ్ర‌మైంది. మొదటగా.. కింగ్స్ హోటల్, అంబర్‌పేట్ ప్రాంతంలో ఉన్న స్టార్మ్ వాటర్ డ్రైన్ పునర్ నిర్మాణం సాధ్యాసాధ్యాలు, ఉస్మానియా యూనివర్సిటీ నుండి పటేల్ నగర్ నాలా వరకు ఉన్న వాన నీటిని కాలువను పరిస్థితిని అధికారులు సమీక్షించారు. ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే, పోలీస్ గ్రౌండ్స్ గుండా కొత్త స్టార్మ్ వాటర్ డ్రైన్ నిర్మాణం చేపడితే ఓ మేర‌కు స‌మ‌స్య తీరిన‌ట్టేన‌ని అంచ‌నా వేశారు. అలాగే, దీనికి సమాంతరంగా ట్రంక్ సీవర్ పైప్ నిర్మించాలని జలమండలి ఎండీని కోరారు.ఈ సందర్బంగా నాలా విస్త‌ర‌ణ ప‌నుల స‌మ‌యంలోని స‌మాంత‌రంగా జ‌ల‌మండలి సీవ‌రేజ్ లైన్ల నిర్మాణం సైతం పూర్తి చేయాల‌ని జ‌ల‌మండ‌లి అధికారుల‌కు ఎండీ అశోక్ రెడ్డి ఆదేశించారు. అలాగే నిర్మాణ స‌మయంలో సీవ‌రేజ్‌ ఫ్లోకు అనుగుణంగా సీవ‌రేజ్ లైన్ల లెవ‌ల్ మ్యాచ్ అయ్యేలాగా జాగ్ర‌త్త వ‌హించాల‌ని సూచించారు. ఈ ప్రాంతంలో ఉన్న ఇంటర్‌సెప్షన్ & డైవర్షన్ (ఐడీ) వ్యవస్థను పరిశీలించారు. మురుగు నీటి ప్రవాహాలు సక్రమంగా ఎస్టీపీకి అనుసంధానం ఉన్నట్లు గుర్తించారు. ఈ వ్యవస్థ పనితీరు సంతృప్తికరంగా ఉందని ఈ సందర్బంగా అధికారులు తెలిపారు. అలాగే కమిషనర్ గారితో కలిసి మూసారంబాగ్ ఫ్లైఓవర్ పరిసర ప్రాంతాల్లో డ్రైనేజీ, పనులు సమీక్షించారు. అనంతరం డి-మార్ట్ వద్ద ఉన్న నాలాను పరిశీలించి, భవిష్యత్తులో మురుగు నీటిని నాలాలలోకి మళ్లించకుండా పూర్తి స్థాయి సీవరేజ్ వ్యవస్థకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని ఇరు శాఖల అధికారులకు సూచించారు. అలాగే ఈ ప్రాంతంలో వర్షపు నీటి పారుదల వ్యవస్థ, మురుగు నీటి నిర్వహణ , మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులపై సమగ్ర సర్వే నిర్వహించాలని సూచించారు. ఈ కార్య‌క్ర‌మంలో జ‌ల‌మండ‌లి ఈడీ సామ్రాట్ అశోక్, ఆప‌రేష‌న్ డైరెక్ట‌ర్ వినోద్ భార్గ‌వ‌, సీజీఎం సుబ్రహ్మణ్యం, జీఎంశ్రీధర్ రెడ్డితో పాటు జీహెచ్ఎంసీ అధికారులు, స్థానిక ప్ర‌జా ప్ర‌తినిధులు పాల్గొన్నారు.
HMWSSB tweet mediaHMWSSB tweet mediaHMWSSB tweet mediaHMWSSB tweet media
తెలుగు
4
2
18
1.6K
Ashok Reddy Korem
Ashok Reddy Korem@ashok_korem·
Awareness campaign by HMWSSB STAFF
English
1
1
10
962
Ashok Reddy Korem retweetledi
HMWSSB
HMWSSB@HMWSSBOnline·
ముళ్లకత్వా ఎస్టీపీని పరిశీలించిన ఎండీ ================== ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులమీదుగా ప్రారంభమైన ముళ్లకత్వా 25 ఎమ్మెల్డీల సామర్థ్యం కలిగిన ఎస్టీపీ జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అధికారులతో కలిసి సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఎండీ అశోక్ రెడ్డి ఎస్టీపీ పనితీరు పరిశీలించారు. వివిధ దశలో జరిగే శుద్ధి వివరాలను, మురుగుశుద్ధి ప్రక్రియను పరిశీలించిన ఎండీ..ఎస్టీపీ సామర్థ్యం, శుద్ధి నీటి నాణ్యత తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. అన్ని పనులు పూర్తయినట్లు, 100 శాతం వినియోగంలోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఎస్టీపీకి విద్యుత్ సరఫరాకు సంబంధించిన ఎలక్ట్రిక్ స్తంభాలను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే అంతర్గత రహదారులు పరిశీలించిన ఎండీ.. రహదారులకు ఇరుప్రక్కన పూల ముక్కలను నాటించి ఎస్టీపీ ప్రాంగణంలో సుందరీకరణ, గార్డెనింగ్ పనులు వెంటనే చేపట్టాలని చెప్పారు. అనంతరం ఎస్టీపీలో లాబరేటరీని సందర్శించిన ఎండీ అన్నీ ఎస్టీపీల మురుగుశుద్ధి వివరాలను, గణాంకాలను ఎప్పటికప్పుడు ప్రత్యేకమైన యాప్ లో నమోదుచేయడానికి ఏర్పాట్లు చేసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. దీనివల్ల ఎక్కడినుంచి అయినా వివరాలను తెలుసుకునే వెసులుబాటు ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జలమండలి సైబరాబాద్ రీజియన్ ఈడి సంతోష్, ఆపరేషన్ డైరెక్టర్ నారాయణ, సీజీఎంలు పద్మజ, రాజశేఖర్, జీఎంలు, అధికారులు ఉన్నారు.
HMWSSB tweet mediaHMWSSB tweet mediaHMWSSB tweet mediaHMWSSB tweet media
తెలుగు
1
2
8
1.4K
Ashok Reddy Korem retweetledi
HMWSSB
HMWSSB@HMWSSBOnline·
మల్లేపల్లి సీవరేజ్ సమస్య ప్రాంతాన్ని పర్యటించిన జలమండలి ఎండీ అశోక్ రెడ్డి.. ==================== # ఇప్పటికే కొత్త పైప్ లైన్ విస్తరణ సాగుతున్న పనులు.. # జలమండలి జేఎండీ, ఈడీలతో కలిసి పరిశీలన మెహిదీపట్నం పరిధిలోని పాత మల్లేపల్లి వార్డు, బయోటెక్ మెయిన్ రోడ్డులో తెలెత్తిన దీర్ఘకాలిక సీవరేజ్ ఓవర్‌ఫ్లో సమస్య పరిష్కార పనుల భాగంగా చేపట్టిన సీవరేజ్ పైప్ లైన్ నిర్మాణ పనులను జలమండలి ఎండీ అశోక్ రెడ్డి జేఎండీ మయాంక్ మిట్టల్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సీనియర్ కేఫ్ హోటల్ నుండి ఆర్‌కే పాన్ షాప్ వరకు చేపట్టిన పైప్‌లైన్ నిర్మాణ పనులను అధికారులు సమీక్షించారు. ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ.. స్థానికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, సీవరేజ్ ఓవర్‌ఫ్లో మరింత పెరగకుండా ఉండేందుకు, సీవర్ లైన్‌లో సజావుగా ప్రవాహం కొనసాగేందుకు మాన్‌హోల్ నుండి మాన్‌హోల్ వరకు తక్షణమే డీ-వాటరింగ్ పంపులను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే పైపులైన్ విస్తరణ పనులు పూర్తి అయిన వెంటనే రోడ్డు పునరుద్ధరణ పనులను చేపట్టాలని అన్నారు. అలాగే నిర్మాణ వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలని సూచించారు. మాన్ హోల్ నిర్మాణంలో సరైన నాణ్యత పాటించాలని,మాన్ హోల్ లోపల వైపు సైతం ప్లాస్టరింగ్ తప్పనిసరిగా ఉండేలాగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జలమండలి హైదరాబాద్ రీజియన్ ఈడీ సామ్రాట్ అశోక్, ఆపరేషన్ డైరెక్టర్ వినోద్ భర్గవ, సీజీఎం ప్రభు, జీఎం, డీజీఎం తదితరులు పాల్గొన్నారు.
HMWSSB tweet mediaHMWSSB tweet mediaHMWSSB tweet mediaHMWSSB tweet media
తెలుగు
2
3
16
1.9K
Ashok Reddy Korem retweetledi
HMWSSB
HMWSSB@HMWSSBOnline·
Press Note: తేదీ: 28.02.2026 రోబోటిక్ టెక్నాలజీతో ముగునీటి శుద్ధి- ప్రయోగాత్మకంగా పాతబస్తీలో డీ-సిల్టింగ్ పనులల్లో వినియోగం ================== # హైడ్రా కమిషనర్ రంగనాథ్ తో కలిసి పరిశీలించిన ఎండీ అశోక్ రెడ్డి రోబోటిక్ టెక్నాలజీతో డీ-సిల్టింగ్ పనులను నిర్వహించడానికి ప్రయోగాత్మకంగా కొత్త టెక్నాలజీని జలమండలి అశోక్ రెడ్డి.హైడ్రా కమిషనర్ రంగనాథ్, జలమండలి జేఎండీ మయాంక్ మిట్టల్ తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. శనివారం ఓ అండ్ ఎం డివిజన్-3 పరిధిలో విజయనగర్ కాలనీ సెక్షన్ పరిధిలో మల్లేపల్లి ఎక్స్ రోడ్ నుండి వీఎన్‌సీ ఎక్స్ రోడ్ వరకు ఉన్న సీవర్ లైన్‌లో ఏర్పడిన చోకేజ్ సమస్యను పరిష్కరించేందుకు జలమండలి అధికారులు డీ- సిల్టింగ్ పనులు చేపట్టారు. ఈ ప్రాంతంలో మురుగునీటి ప్రవాహం అంతరాయం కలగకుండా ఉండేందుకు రోబోటిక్ యంత్రాన్ని వినియోగించి సీవరేజ్ చోకేజ్ తొలగింపు పనులు వేగవంతంగా నిర్వహించడానికి అవకాశాలు ఏజెన్సీ నిర్వాహకులు అశోక్ రెడ్డి, రంగనాథ్ లకు వివరించారు. టెక్నాలజీ ముఖ్య అంశాలు: ----------------------- 1. నిలువు మాన్‌హోల్స్‌తో పాటు అడ్డంగా ఉన్న పైప్‌లైన్లను శుభ్రం చేసే సెల్ఫ్ డిటెక్టివ్ తో రోబోటిక్ వ్యవస్థలు 2. మాన్ హాలో లో అడ్డంకులు ఏర్పడే ముందే అంచనా వేసి నివారించే AI ఆధారిత ప్రిడిక్షన్ & ప్రివెంటివ్ అవకాశం. 3. నగరవ్యాప్తంగా పారిశుధ్య కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు, ట్రాక్ చేయడానికి మరియు ప్రణాళిక రూపొందించడానికి సహాయపడే రియల్-టైమ్ డాష్‌బోర్డ్స్ సాంప్రదాయ వ్యవస్థలతో అనుసంధానం చేయడం ఈ టెక్నాలజీ ప్రత్యేకతలు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ రీజియన్ ఈడీ సామ్రాట్ అశోక్, ఆపరేషన్ డైరెక్టర్ వినోద్ భర్గవ, సీజీఎం ప్రభు, జీఎం, డీజీఎం తదితరులు పాల్గొన్నారు.
HMWSSB tweet mediaHMWSSB tweet mediaHMWSSB tweet mediaHMWSSB tweet media
తెలుగు
2
3
13
1.8K
Ashok Reddy Korem retweetledi
HMWSSB
HMWSSB@HMWSSBOnline·
జలమండలిలో కాగిత రహిత కార్యకలాపాలు ====================== # ఈ- ఆఫీస్ ప్రారంభించిన ఎండీ అశోక్ రెడ్డి జలమండలి అన్ని కార్యాలయాల్లో ఈ-ఆఫీస్ వ్యవస్థను పూర్తిగా అమలు చేయాలని ఎండీ అశోక్ రెడ్డి తెలియజేశారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ-ఆఫీస్ ను అన్ని విభాగాలలో అమలు చేస్తున్నట్లు.. దీనివల్ల కార్యాలయాల్లో సామర్థ్యం, పారదర్శకత, బాధ్యతతో పాటు సేవల ప్రమాణాలు మెరుగుపడనున్నాయని అయన అన్నారు. సోమవారం జలమండలి ప్రధాన కార్యాలయంలో జేఎండీ మయాంక్ మిట్టల్ తో కలిసి ఈ-ఆఫీస్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ.. ఈ-ఆఫీస్ విధానం ద్వారా ఫైళ్ల సత్వర పరిష్కారం సాధ్యమవుతుందని, అలాగే పరిపాలనలో జవాబుదారీతనం పెరుగుతుందని పేర్కొన్నారు. ఇక నుంచి ప్రతి ఫైలు మాన్యువల్ గా స్వీకరించడం జరగదని ఈ-ఆఫీస్ ద్వారా పంపించాలని అధికారులతో అన్నారు. ఈ-ఆఫీసులో స్కాన్ చేసి భద్రపరచడమే కాకుండా వివిధ విభాగాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఈ ఆఫీసులో పొందుపరచడం జరుగుతుందని, సంబంధించిన అధికారి ఎవరైనా వారి విభాగపు ఫైల్స్ ఈ-ఆఫీసులో సరిచూసుకునే వెసులుబాటు ఉండడంతో పరిపాలన సులభతరం అవుతుందని అన్నారు. తొలుతగా ప్రధాన కార్యాలయంలో అన్ని కార్యకలాపాలను ఈ-ఆఫీస్ లో నిర్వహిస్తామని.. విడతల వారీగా అన్నీ డివిజన్ లలో ఈ విధానాన్ని అమలు చేస్తామని ఎండీ వివరించారు. ఈ-ఆఫీస్ అమలు ముఖ్య ఉద్దేశాలు -------------------------------- 1. ఫైల్ చలనం.. వ్యవస్థ డిజిటలైజేషన్: సాంప్రదాయ మాన్యువల్ ఫైల్ చలనం విధానాన్ని పూర్తిగా డిజిటల్ గా నిర్వహిస్తారు. అన్ని ఫైళ్లు ఈ-ఆఫీస్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఎలక్ట్రానిక్ రూపంలో సృష్టించబడుతూ, ప్రాసెస్ చేయబడి, పంపబడుతూ, భద్రపరచబడతాయి. దీంతో భౌతిక ఫైళ్లపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. 2. పేపర్ వినియోగం తగ్గింపు: డిజిటల్ డాక్యుమెంటేషన్, ఈ-నోటింగ్ మరియు డిజిటల్ అనుమతుల ద్వారా పేపర్ వినియోగాన్ని గణనీయంగా తగ్గించడమే లక్ష్యం. ఇది పర్యావరణ పరిరక్షణకు తోడ్పడటమే కాకుండా వ్యయ నియంత్రణకు దోహదపడుతుంది. 3. వేగవంతమైన అనుమతులు.. నిర్ణయాలు: ఎలక్ట్రానిక్ ఫైల్ రూటింగ్, ఆటోమేటెడ్ వర్క్‌ఫ్లో ద్వారా ఫైళ్లు ఆలస్యం లేకుండా వేగంగా ప్రాసెస్ చేయబడతాయి. అధికారులు తమ కార్యాలయ వ్యవస్థల ద్వారా ఫైళ్లను సమీక్షించి, ఆమోదం ఇవ్వగలరు. దీంతో నిర్ణయాల ప్రక్రియ వేగవంతమవుతుంది. 4. ఫైళ్ల రియల్-టైమ్ ట్రాకింగ్: ప్రతి దశలో ఫైళ్ల స్థితిని రియల్-టైమ్‌లో పర్యవేక్షించవచ్చు. ఫైల్ ఎక్కడ పెండింగ్‌లో ఉందో, ఎవరితో ఉందో, ఎంత కాలంగా ఉందో స్పష్టంగా తెలుసుకోవచ్చు. దీని ద్వారా ఆలస్యాలు తగ్గుతాయి. 5. పారదర్శకత, ఆడిట్ సౌలభ్యం: కొత్త ఫైల్ సృష్టి, నోటింగ్, ఫార్వార్డింగ్, ఆమోదం లేదా మార్పులు వంటి ప్రతి చర్య డిజిటల్ టైమ్‌స్టాంప్, వినియోగదారుడి వివరాలతో రికార్డు చేయబడుతుంది. ఇది పూర్తి ఆడిట్ ట్రైల్‌ను నిర్ధారించి బాధ్యతాయుత పరిపాలనకు దోహదం చేస్తుంది. 6. కార్యాలయ విధానాల ప్రమాణీకరణ: ఈ-ఆఫీస్ ప్లాట్‌ఫామ్ ద్వారా అన్ని విభాగాల్లో ఒకే విధమైన ప్రమాణిత విధానాలు అమలవుతాయి. ఫైల్ నిర్వహణలో ఏకరీతి విధానం పాటించవచ్చు. విభాగానికి లభించే ముఖ్య ప్రయోజనాలు: ------------------- O కార్యనిర్వహణ సామర్థ్యం పెరుగుతుంది. O ఫైళ్ల ప్రాసెసింగ్ సమయం తగ్గుతుంది. O రికార్డు నిర్వహణ మెరుగుపడుతుంది. O భద్రమైన డిజిటల్ నిల్వతో పాటు ఆవరమైనప్పుడు సులభంగా తనిఖీ చేసుకునే అవకాశం. O విభాగాల మధ్య సమన్వయం మెరుగుపడుతుంది. ఈ-ఆఫీస్ వ్యవస్థ అమలు పారదర్శక, సమర్థవంతమైన, సాంకేతిక ఆధారిత పరిపాలన పట్ల కట్టుబాటుకు నిదర్శనం. ఈ కార్యక్రమంలో పర్సనల్ డైరెక్టర్ మహమ్మద్ అబ్దుల్ ఖాదర్, రెవెన్యూ సీజీఎం కిరణ్ కుమార్ లతో పాటు రెవిన్యూ, ఐటీ విభాగపు అధికారులు పాల్గొన్నారు.
HMWSSB tweet mediaHMWSSB tweet mediaHMWSSB tweet media
తెలుగు
2
6
40
3.8K
Ashok Reddy Korem retweetledi
HMWSSB
HMWSSB@HMWSSBOnline·
మెహదీపట్నం, లంగర్ హౌస్, టోలిచౌకి ప్రాంతాల్లో పర్యటించిన జలమండలి ఎండీ అశోక్ రెడ్డి.. ==================== కొనసాగుతున్న జలమండలి.. బస్తీ బాట..! "జలమండలి.. బస్తీ బాట..!" కార్యక్రమం భాగంగా గోల్కొండ జోన్ పరిధిలోని నానల్ నగర్ చౌరస్తా వద్ద సీవరేజ్ మరమ్మత్తు పనులను ఎండీ అశోక్ రెడ్డి పరిశీలించారు. ఈ ప్రాంతంలో హోటళ్లు, వాణిజ్య సముదాయాలు ఘనపదార్థాలు సీవరేజ్ లైన్లలో వదలడంతో మ్యాన్ హోళ్ళు తరచూ పొంగడం జరుగుతుంది. దానివల్ల ట్రాఫిక్ ఆటంకం ఏర్పడుతుంది. ఎప్పటికప్పుడు డీ-సిల్టింగ్ పనులు చేపట్టినా.. శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా గుర్తించలేకపోయారు. ఈ నేపథ్యంలో జలమండలి ఎండీ అశోక్ రెడ్డి మంగళవారం ఆ ప్రాంతాన్ని సందర్శించి.. నానల్ నగర్ నుంచి మెహిదీపట్నం వైపుగా ఉన్న మ్యాన్ హోళ్ళను అధికారులతో కలిసి పరిశీలించారు. ఫుట్ పాత్ అనుకుని ఉన్న మాన్ హోళ్లలోకి అక్కడక్కడ చెట్ల వేర్లు చేరి సమస్య పెంచిందని గుర్తించారు. దీంతో తాత్కలిత చర్యగా చెట్ల వేర్లను తొలగించి ధ్వంసమైన మ్యాన్ హోళ్ళను పునర్నిర్మాణం చేయాలని సూచించారు. అలాగే శాశ్వత పరిష్కరానికి ఈ ప్రాంతాల్లోని సీవరేజ్ లైన్లను సమీపంలోని జోన్-3 ట్రంక్ మెయిన్ కు మళ్ళించడానికి.. ప్రాజెక్టు అధికారులతో సమన్వయం చేస్తూ సీవరేజ్ నెట్‌వర్క్ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే, సమీపంలోని హోటళ్లకు సిల్ట్ ఛాంబర్ నిర్మాణానికి నోటీసులు జారీ చేయాలని సూచించారు. అనంతరం లంగర్ హౌజ్, అంబేద్కర్ నగర్ లో తాగునీటి సరఫరాపై స్థానికులతో మాట్లాడిన ఎండీ.. ప్రశాంత్ నగర్ లో కలుషిత నీటి ఫిర్యాదు పరిష్కార పనులను అధికారులతో సమీక్షించారు. జోన్-3 పనుల పరిశీలన... కోర్ సిటీలో మురుగునీటి వ్యవస్థ ఆధునీకరణకోసం చేపట్టిన జోన్-3 సీవరేజ్ నెట్వర్క్ ప్రాజెక్ట్ పురోగతిలో ఉన్న పనులను, లంగర్ హౌజ్, టోలీ చౌకి ప్రాంతంలో పరిశీలించారు. లక్ష్మీనగర్ నాలా, ప్రశాంత్ నగర్, హుడా పార్క్ వద్ద నిర్మాణదశలో ఉన్న పనులను టన్నెలింగ్ పనులను పరిశీలించిన ఎండీ.. వీటితోపాటు జీహెచ్ఎంసీ రెయిన్ వాటర్ డ్రయిన్ సైతం ఏకకాలంలో నిర్మించేలాగా జీహెచ్ఎంసీ అధికారులతో మాట్లాడాలని అధికారులకు సూచించారు. పనులు ముగిసిన వెంటనే ఎప్పటికప్పుడు రోడ్డు పునర్నిర్మాణం పనులు చేపట్టాలని, నివాస ప్రాంతాల్లో చేపడుతున్న టన్నెలింగ్ పనులలో సరైన రక్షణ చర్యలు చేపట్టాలని, తగు రీతిలో బారికేటింగ్ ఏర్పాటు చేయాలని చెప్పారు. అనంతరం లక్ష్మీ నగర్ నాలా వద్ద జలమండలి ఐఎన్ డీని సందర్శించారు. ఐఎన్ డీ ప్రాంగణంలో చెత్తాచెదారం తొలగించి శుభ్రంగా ఉండేలాగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇక్కడినుంచి అంబర్ పేట్ వరకు వెళ్ళే ఎన్ఎస్ మెయిన్ సీవరేజ్ పైపు లైనును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఆపరేషన్ వినోద్ భార్గవ, సీజీఎం ప్రభు, జిఎంలు శ్రీను నాయక్, ఎస్ కుమార్, ఓఅండ్ఎం, ప్రాజెక్టు అధికారులు పాల్గొన్నారు.
HMWSSB tweet mediaHMWSSB tweet mediaHMWSSB tweet mediaHMWSSB tweet media
తెలుగు
1
2
16
1.8K
Ashok Reddy Korem
Ashok Reddy Korem@ashok_korem·
The circular economy is no longer optional…. It is a mandate for sustainable growth.
Ashok Reddy Korem tweet media
English
0
4
16
2.4K
Ashok Reddy Korem retweetledi
HMWSSB
HMWSSB@HMWSSBOnline·
పలు ప్రాంతాల్లో పర్యటించిన జెఎండీ మయాంక్ మిట్టల్ ======================== జలమండలి జెఎండీ మయాంక్ మిట్టల్ జలమండలి.. బస్తీ బాట.. భాగంగా ఓఅండ్ డివిజన్ నం. 29, పీర్జాదిగూడ సెక్షన్‌లో పరిధిలోని పర్యటించి పీర్జాజాదిగూడలో ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ సోలార్ ఎలక్ట్రో క్లోరినేటర్‌ను పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశంలో మెట్రో కస్టమర్ కేర్‌కు వచ్చిన వివిధ ఫిర్యాదులు, కలుషిత నీటి సరఫరా, ట్యాంకర్ల డిమాండ్, నీటి లీకేజీలు మొదలైన అంశాలపై సమగ్రంగా సమీక్షించి, వాటిని గడువులోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
HMWSSB tweet mediaHMWSSB tweet media
తెలుగు
2
4
16
1.9K
Ashok Reddy Korem retweetledi
HMWSSB
HMWSSB@HMWSSBOnline·
మల్కాజిగిరి రీజియన్ ఈడీ పంకజ పర్యటన.. ==================== మల్కాజిగిరి రీజియన్ ఈడీ పంకజ అధికారులతో నాగోలు సర్కిల్ పరిధిలో బస్తీ బాట కార్యక్రమంలో పాల్గొన్నారు. దీర్ఘకాలిక కలుషితం నీటి సరఫరా కాలుష్య ఫిర్యాదుల మరమ్మత్తు పనులు పరిశీలించారు. నీటి సరఫరాను పరిశీలించి, సరఫరా సమయంలో తాగునీటి నాణ్యత తనిఖీ చేశారు. ఒక గృహంలో లో-ప్రెజర్, నాణ్యతను పరిశీలించారు. వినియోగదారుడి సంప్ సరైన రీతిలో నిర్వహించకపోవడంతో మురికి పేరుకుపోయినట్లు గమనించి, వెంటనే సంప్ శుభ్రపరచాలని సూచించారు. అదేవిధంగా, వాణిజ్య ప్రాంగణాల తనిఖీ నిర్వహించగా ఒక వాణిజ్య సంస్థ గృహ వినియోగ టారిఫ్ కింద నమోదు చేయబడినట్లు గుర్తించి, సంబంధిత కనెక్షన్‌ను తగిన వాణిజ్య కేటగిరీకి మార్పు చేసి, వర్తించే జరిమానా విధించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం బండ్లగూడ గ్రామం, జీఎస్‌ఐ వార్డులో ప్రభావితం చేస్తున్న కలుషిత నీటి సరఫరా నివారణ పనులను పరిశీలించారు. వివేకానంద నగర్, మన్‌సూరాబాద్ వార్డులో సైతం పర్యటించి సీవరేజ్ పైప్‌లైన్ నిర్మాణం పనులను పరిశీలించారు. హైదరాబాద్ రీజియన్ ఈడీ సామ్రాట్ అశోక్ పర్యటన.. -------------------- హైదరాబాద్ రీజియన్ ఈడీ సామ్రాట్ అశోక్ డివిజన్ 16, 8 పరిధిలో బస్తీ బాట కార్యక్రమంలో భాగంగా విస్తృత స్థాయిలో పర్యటించి సరఫరా సమయాల్లో నీటి నమూనాలు పరీక్షించారు. అదేవిధంగా మస్జిద్-ఎ-అలి రషీద్ జెహ్మీ వద్ద సీవరేజ్ ఓవర్‌ఫ్లో సమస్యలను పరిశీలించి, తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం డివిజన్–8 పరిధిలోని నీటి సరఫరా వ్యవస్థపై సమీక్షించి, బాలాపూర్ రిజర్వాయర్ ద్వారా సరఫరా అయ్యే పంపిణీ వ్యవస్థ, సరఫరా షెడ్యూల్, ప్రెజర్ నిర్వహణ, ఫిర్యాదుల పరిష్కార విధానాలపై చర్చించారు. అలాగే మసీదులకు ట్యాంకర్ ద్వారా అందిస్తున్న నీటి సరఫరా స్థితిగతులపై కూడా సమీక్షించారు. సైబరాబాదాద్ రీజియన్ ఈడి సంతోష్ పర్యటన.. ----------------------- సైబరాబాదాద్ రీజియన్ ఈడి సంతోష్ జలమండలి బస్తీ బాట కార్యక్రమంలో భాగంగా అధికారులతో పాటు పలు ప్రాంతాలను సందర్శించి పనుల పురోగతి.. సేవల స్థితిగతులను సమీక్షించారు. సెక్రటేరియట్ ఎంప్లాయీస్ కాలనీ నీటి సరఫరా, సీవరేజ్ వ్యవస్థను పరిశీలించి, మణికొండ ప్రెషర్ ఫిల్టర్లు, ట్యాంకర్ ఫిల్లింగ్ స్టేషన్, ట్యాంకర్‌లకు నీటి సరఫరా విధానాన్ని తనిఖీ చేసారు. అనంతరం హఫీజ్‌పేట్ లోని ముల్లకట్టువ వద్ద ఉన్న ఎస్‌టిపికి సంబందించిన సీవరేజ్ ట్రంక్ లైన్ వేయు పనులను పరిశీలించారు. అలాగే కేపీహెచ్‌బీ ఫేజ్–IV ట్యాంకర్ ఫిల్లింగ్ స్టేషన్ లో ట్యాంకర్ సరఫరా ఏర్పాట్లు, నిర్వహణపై అధికారులతో సమీక్షించారు.
HMWSSB tweet mediaHMWSSB tweet mediaHMWSSB tweet media
తెలుగు
2
2
4
940
Ashok Reddy Korem retweetledi
HMWSSB
HMWSSB@HMWSSBOnline·
చిత్రపురి ఎస్టీపీని సందర్శించిన ఎండీ ====================== ఖాజాగూడ చెరువు దిగువ ప్రాంతం, మణికొండ మరియు చిత్రపురి కాలనీ ప్రాంతాల నుండి ఉత్పత్తి అయ్యే మురుగును శుద్ధి చేయుటకు చిత్రపురి హిల్స్ సమీపంలో 30 ఎంఎల్డీ సామర్థ్యంతో నిర్మితం అవుతున్న చిత్రపురి మురుగు నీటి శుద్ధి కేంద్రాన్ని ఎండీ అశోక్ రెడ్డి సంద‌ర్శించారు. ఈ సందర్బంగా ఎండీ మాట్లాడుతూ.. శుద్ధి చేసిన నీటి పునర్వినియోగం కోసం వినియోగదారుల డిమాండ్ అంచనా వేయాలని సూచించారు. డిజైన్‌లో శుద్ధి చేసిన నీటి సరఫరాకు యూనిట్‌ను తప్పనిసరిగా చేర్చాలని, శుద్ధి చేసిన నీటి నిల్వ కోసం అవసరమైన మౌలిక సదుపాయాలు, అనగా ట్రీటెడ్ వాటర్ సంప్ ఏర్పాటు చేయాలని చెప్పారు. చిత్రపురి కాలనీ మరియు పరిసర ప్రాంతాలలో గార్డెనింగ్, నిర్మాణ కార్యకలాపాలు, ఫ్లషింగ్, ల్యాండ్‌స్కేపింగ్ తదితర అవసరాల కోసం ట్యాంకర్ ద్వారా శుద్ధి చేసిన శుద్ధి జలాన్ని సరఫరా చేయడానికి ప్రత్యేక ట్యాంకర్ ఫిల్లింగ్ పాయింట్ ఏర్పాటు చేయాలని సూచించారు.
HMWSSB tweet mediaHMWSSB tweet media
తెలుగు
5
5
26
2.8K
Ashok Reddy Korem retweetledi
HMWSSB
HMWSSB@HMWSSBOnline·
మూసీలోకి మురుగు చేరకుండా కట్టడి ======================= # మూసీ ప్రక్షాళన.. పునరుజ్జీవనం కోసం ఎస్టీపీ ప్రాజెక్టు # ఎస్టీపీల సివిల్ పనులల్లో వేగం పెంచాలి # కొత్త ఎస్టీపీల పనులు సందర్శించిన జలమండలి ఎండీ అశోక్ రెడ్డి హైదరాబాద్ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు కాలుష్య రహితంగా మార్చేందుకు మూసీ ప్రక్షాళన.. పునరుజ్జీవనం కోసం నిర్మాణ తలపెట్టిన మురుగు నీటి శుద్ధి కేంద్రాల ప్రారంభ పనులల్లో వేగం పెంచాలని ఎండీ అశోక్ రెడ్డి ఆదేశించారు. నూతనంగా అమృత్- 2.0 ప‌థ‌కంలో భాగంగా నిర్మించే 39 ఎస్టీపీల ప్రాజెక్టు లో భాగంగా నిర్మిస్తున్న నార్సింగిలో నిర్మిస్తున్న 34.5 ఎమ్మెల్డీల సామర్థ్యం కలిగిన ఎస్టీపీ పనులను బుధవారం ఆయ‌న ప‌రిశీలించారు. ప్యాకేజ్‌-1లో భాగంగా నార్సింగిలో నిర్మిస్తున్న ఎస్టీపీ ప‌నుల పురోగ‌తిని ఆయ‌న అధికారులు, నిర్మాణ సంస్థ ప్ర‌తినిధుల‌ను అడిగి తెలుసుకున్నారు. మూసీ పరిసర ప్రాంతాలను పరిశీలించిన ఎండీ.. ఎస్టీపీ నిర్మాణం జ‌రుగుతున్న స‌మయంలో ప‌క్క‌నే ఉన్న మూసీకి ఎలాంటి న‌ష్టం లేకుండా చూడాల‌ని సూచించారు. స‌మీప కాల‌నీల నుంచి మూసీలోకి మురుగు చేరే పాయింట్ల‌ను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. ఈ మురుగు మూసీలో చేరకుండా, నది ఇరువైపు ఉన్న పైపు లైన్లను అనుసంధానం చేసి కొత్తగా నిర్మిస్తున్న ఎస్టీపీలోకి మళ్లించాల‌ని ఆదేశించారు. అలాగే ఎస్టీపీ క్యాచ్ మెంట్ ప్రాంతాలైన కోకాపేట, నార్సింగిలతో పాటు ఎగువన, సమీప ప్రాంతాల్లో ఉత్పన్నం అయ్యే మురుగును కొత్తగా నిర్మిస్తున్న ఎస్టీపీలోకి మళ్లించడానికి ఆయా ప్రాంతాల్లో సీవరేజ్ ట్రంక్ మెయిన్స్, సబ్ మెయిన్స్ నిర్మాణం కోసం ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ఈ మ‌ళ్లింపు ప‌నుల కోసం జీహెచ్ఎంసీ, నీటిపారుదల శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనులు పూర్తి చేయాలన్నారు. అలాగే ఎస్టీపీ పనులు నిరంతం పాటు జ‌రిగేలా చూడాల‌ని ఆయ‌న ఆదేశించారు. ఇందుకు త‌గ్గ‌ట్లుగా కార్మికులు, యంత్రాలు, నిర్మాణ సామాగ్రిని స‌మ‌కూర్చుకోవాల‌ని ఆయ‌న‌ సూచించారు. నిర్మాణం జ‌రుగుతున్న ప్రాంతంలో త‌గు ర‌క్ష‌ణ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పేర్కొన్నారు. నిర్ణీత స‌మ‌యంలో ప‌నులు 100 శాతం పూర్తి చేసి ఈ ఏడాది చివ‌రి క‌ల్లా ఎస్టీపీల నిర్మాణం పూర్తి చేసే ల‌క్ష్యంతో వేగంగా ప‌నులు జ‌ర‌పాల‌ని సూచించారు. ఎస్టీపీల నిర్మాణంలో ర‌క్ష‌ణ చ‌ర్య‌లు క‌చ్చితంగా పాటించేలా చూడాల‌ని ఆదేశించారు. కార్మికులు త‌ప్ప‌నిస‌రిగా ర‌క్ష‌ణ ప‌రిక‌రాలు ఉప‌యోగించాల‌న్నారు. నిర్మాణాలు జ‌రుగుతున్న ప్రాంగ‌ణాల చుట్టూ బారీకేడ్లు ఏర్పాటుచేయాల‌ని సూచించారు. ఈ కార్యక్రమంలో జలమండలి ప్రాజెక్ట్ డైరెక్టర్ టీవీ శ్రీధర్, సీజీఎంలు పద్మజ, వాస సత్యనారాయణ, జీఎం, నిర్మాణ సంస్థల ప్రతినిధులు, సైట్ ఇంజనీర్లు పాల్గొన్నారు. ఓఆర్ఆర్ పరిధిలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొషన్ ప్రాంతాల్లో ప్రభుత్వం అమృత్- 2.0 పథకంలో భాగంగా రూ.3,849.10 కోట్ల వ్యయంతో మురుగు శుద్ధి కేంద్రాల నిర్మాణానికి పనులు ప్రారంభించింది.
HMWSSB tweet mediaHMWSSB tweet mediaHMWSSB tweet media
తెలుగు
4
8
44
4.6K
Ashok Reddy Korem retweetledi
HMWSSB
HMWSSB@HMWSSBOnline·
పురోగతిలో ఉన్న ప్రాజెక్టులను సందర్శన ======================== # గోదావరి 2&3, ఎస్టీపీ, నియోపోలీస్ ప్రాజెక్టు పనుల పరిశీలన # బుధవారం సందర్శించిన జలమండలి ఎండీ అశోక్ రెడ్డి జలమండలి ఆధ్వర్యంలో పురోగతిలో ఉన్న ప్రాజెక్టులు గోదావరి 2&3, అమృత్ 2.0 ఎస్టీపీ ప్రాజెక్టు, నియోపోలీస్... నీటి సరఫరా ప్రాజెక్టులను బుధవారం జలమండలి ఎండీ అశోక్ రెడ్డి సందర్శించారు. అందులో బాగంగా మొదటగా ఖానాపూర్ లో గోదావరి 2&3 ప్రాజెక్టుల భాగంగా నిర్మిస్తున్న డబ్ల్యూటీపీ (వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్) నిర్మాణ పనులను పరిశీలించారు. నియోపోలీస్ సమగ్ర మంచినీటి సరఫరా కోసం చేపట్టిన బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, పంపింగ్ స్టేషన్, డబ్ల్యూటీపీ సంబంధించిన భూ కేటాయింపు పై.. హెచ్ఎండీఏ ఉన్నత అధికారులతో కలిసి చర్చించారు. భవిష్యత్తు అవసరాలను దృష్ట్యా నీటి సరఫరా సేవలకై భూ కేటాయింపులో సరైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. అలాగే, హెచ్ఎండీఏ నియో పోలీస్ ప్రాంతంలో అభివృద్ధి చేసిన మంచినీరు పైపులైన్ల, సీవరేజ్ లైన్ల నిర్మాణ వివరాలను లెవల్స్ తో సహా జలమండలికి సమర్పించాలని కోరారు. జలమండలి ఈ ప్రాంతంలో తాగునీరు సరఫరా చేయడానికి రెండు 2.5 మిలియన్ లీటర్లు రిజర్వాయర్లను నిర్మిస్తోంది. ఈ రిజర్వాయర్ల వల్ల ఏయే ప్రాంతాలకు గ్రావిటీ ద్వారా మంచినీరు సరఫరా చేయగలమో అధికారులను అడిగి తెలుసుకున్నారు. నియోపోలీస్ లో భూమిరేటు అత్యధికంగా పలుకుతున్న నేపథ్యంలో రెండు రిజర్వాయర్లను రెండు ఫ్లోర్ల లాగా నిర్మిస్తే మిగిలిన ఖాళీ స్థలం భవిష్యత్తు అవసరాలకు ఉపయోగ పడుతుందని అభిప్రాయపడ్డారు. ఈ విధంగా రిజర్వాయర్ల నిర్మాణానికి టెక్నికల్ గా సాధ్యసాధ్యాలను అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం జంట జలాశయాలలోకి మురుగు చేరకుండా జలమండలి నాలుగు ఎస్టీపీల నిర్మాణం చేపట్టింది. అందులో భాగంగా జన్వాడలో బుల్కాపూర్ నాలా వద్ద నిర్మిస్తున్న 4 ఎమ్మెల్డీల సామర్థ్యం కలిగిన ఎస్టీపీ పనులను పరిశీలించారు. మొదటగా పీటీయూ(ప్రైమరీ ట్రీట్మెంట్ ప్లాంట్) నిర్మాణ పురోగతిని తెలుసుకున్నారు. ఈ ఎస్టీపీకి క్యాచ్ మెంట్ ప్రాంతాల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయా గ్రామాల నుంచి వెలువడే మురుగును ఈ ఎస్టీపీకి తరలించడానికి ట్రంక్ మెయిన్ల నిర్మాణానికి ప్రణాళికను రూపొందించుకోవాలని అధికారులను ఆదేశించారు. దానికోసం హెచ్ఎండీఏ, ఇరిగేషన్, హైడ్రా అధికారులతో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ జాయింట్ కమీషనర్ (సబ్-అర్బన్) ఉపేంద్ర రెడ్డి, జలమండలి ప్రాజెక్ట్ డైరెక్టర్ టీవీ శ్రీధర్, జీఎంలు, హెచ్ఎండీఏ ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు, సైట్ ఇంజనీర్లు పాల్గొన్నారు.
HMWSSB tweet mediaHMWSSB tweet mediaHMWSSB tweet media
తెలుగు
2
3
8
1.3K
Ashok Reddy Korem retweetledi
HMWSSB
HMWSSB@HMWSSBOnline·
జలమండలి.. బస్తీ బాట..! ================= # ప్రజలతో మమేకమవడానికి వినూత్న కార్యక్రమం # శుక్రవారం నుంచి ప్రారంభం.. వారానికి 4 రోజులు # ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశం మేరకు నిర్ణయం జలమండలి బోర్డు పరిధి కోర్‌ అర్బన్‌ రీజయన్‌ వరకు పరిధి పెరగడంతో వాటర్‌.. సీవరేజ్‌ సేవలు మరింత సమర్ధవంతంగా అందించే విధంగా స్థానికంగా నెలకొన్న సమస్యలు గుర్తించి వాటిని అధిగమించడంతో పాటు ప్రజల నుంచి సమస్యలు తెలుసుకునే విధంగా ‘జలమండలి.. బస్తీ బాట’ పేరిట ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశం మేరకు రూపొందించిన ఈ కార్యక్రమంలో మేనేజింగ్‌ డైరెక్టర్‌ నుంచి వార్డు మేనేజర్ల వరకు భాగస్వామ్యులుగా ఉంటారు. వారంలో నాలుగు రోజులు: జల మండలి పరిధిలోని బస్తీ, కాలనీలలో ప్రతి మంగళవారం, బుధవారం, శుక్రవారం, శనివారం ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు మేనేజింగ్‌ డైరెక్టర్‌ నుంచి వార్డు మేనేజర్ల వరకు పర్యటిస్తారు. అనంతరం మధ్యాహ్నం రెండు గంటల నుంచి కార్యాలయంలో యధావిధిగా అందుబాటులో ఉంటారు. క్షేత్ర స్థాయిలో ఎండీ నుంచి వార్డు మేనేజర్ల వరకు పర్యటించి, మంచినీరు, సీవరేజీ సమస్యలు గుర్తించి, ప్రజలతో మాట్లాడి, సమస్యలు తెలుసుకొని, తాత్కాలిక సమస్యలు తక్షణమే పరిష్కారించి, శాశ్వత పరిష్కారం కోసం వార్డుల వారిగా ప్రణాళికలు రూపొందించుకుంటారు. బస్తీలో పర్యటన తీరును పరిశీలించేందుకు జలమండలి మేనేజింగ్‌ డైరెక్టర్, జాయింట్‌ ఎండీ, డైరెక్టర్లు, రీజియన్‌ ఈడీలు, డైరెక్టర్‌ (ఆపరేషన్‌)లు, జోన్‌ సీజీఎం, జనరల్‌ మేనేర్లు, సర్కిల్‌ డీజీఎం వరకు వారి పరిధిలో అకస్మిక తనిఖీలు నిర్వహిస్తారు. సమస్యల పరిష్కరానికి ప్రజలతో మమేకం అవుతారు. క్షేత్రస్థాయి పర్యటనలో ప్రాధాన్యత ఇలా.. సీవరేజీ మ్యాన్‌ హోల్స్, పైప్‌లైన్‌ పరిస్థితి, లీకేజీ, ఓవర్‌ ఫ్లో, డీసిల్టింగ్‌ పరిశీలన.. సత్వర చర్యలు చేపడతారు. వాటర్‌ పైప్‌లైన్, లీకేజీలు, నీటి సరఫరాలో సమయ పాలన, నీటి వృధా, లో-ప్రెషర్, నల్లలకు మోటర్ల బిగింపు, సరఫరా అవుతున్న తాగు నీటి నాణ్యత పరిశీలించి.. సత్వర చర్యలు తీసుకుంటారు. అలాగే నివాసాల్లో భూగర్బజలాల పెంపు కోసం ఇంకుడు గుంతలు, ఇంజక్షన్‌ బోర్‌వెల్స్‌పై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. డైలీ రిపోర్టు: ప్రతి వార్డు మేనేజర్‌ పర్యటన రోజుకు సంబంధించి గుర్తించిన సమస్యలు, తాత్కాలిక పరిష్కారాలు, శాశ్వత పరిష్కారం కోసం ప్రణాళిక ప్రతిపాధనలు రూపొందించి ఆన్‌లైన్‌ యాప్‌లో సర్కిల్‌ డీజీఎంలకు, సర్కిల్‌ డీజీఎంలు సర్కిల్‌ వారిగా జోన్‌లకు, జోన్‌ నుండి జోన్‌ల వారిగా రీజియన్‌కు, రీజియన్‌ నుంచి కేంద్ర కార్యాలయాన ఆన్‌లైన్‌ నివేదికలు సమర్పిస్తారు. ప్రతి వారం పర్యటనపై శనివారం సమీక్షా సమేవేశం నిర్వహిస్తారు. రేపటినుంచే.. జలమండలి బస్తీ బాట: రేపటి (శుక్రవారం) నుంచి ‘జలమండలి.. బస్తీ బాట’ కార్యక్రమం ప్రారంభింస్తారు. ప్రజల్లో జలమండలిపై మరింత నమ్మకం కలిగించే విధంగా క్రార్యక్రమాన్ని రూపొందించారు.
HMWSSB tweet media
తెలుగు
9
5
22
2.7K
Ashok Reddy Korem retweetledi
HMWSSB
HMWSSB@HMWSSBOnline·
మెరుగైన సేవలకై.. జలమండలి.. బస్తీ బాట..!! ================== # ప్రజలతో మమేకమవడానికి వినూత్న కార్యక్రమం # శేరిలింగంపల్లి వార్డులోని పలు ప్రాంతాల్లో పర్యటించిన అశోక్ రెడ్డి. # ఉదయం 6 గంటలనుంచే అధికారులు బస్తీలలో పర్యటనలు. # ఎస్ఆర్ నగర్ డివిజన్ పరిధిలో పర్యటించిన జెఎండీ మయాంక్ మిట్టల్ # తమ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించిన ఈడీలు, సీజీఎంలు జీఎంలు. జలమండలి పరిధిలో తమ సేవలను సమర్థవంతంగా అందించే విధంగా క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి పరిష్కరించడానికి.. ప్రజలనుంచి నేరుగా సమస్యలు తెలుసుకునే విధంగా 'జలమండలి.. బస్తీ బాట ' అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. అందులో భాగంగా జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఉదయం 6 గంటలకు శేరిలింగంపల్లి వార్డులోని శంకర్ నగర్, హుడా కాలనీ, దీప్తి శ్రీ నగర్, మియాపూర్ ప్రాంతంలో పర్యటించారు. శంకర్ నగర్ లో నీటి సరఫరా సమయంలో పలు ఇండ్లలో తనిఖీలు చేసి నీటి నాణ్యతను పరిశీలించారు. నేరుగా వినియోగదారులతో ముచ్చటించిన జలమండలి ఎండీ సరఫరా సమయాలు, సరిపడా నీరు సరఫరా అవుతున్నాయో, లేదో అడిగి తెలుసుకున్నారు. దానికి వారు అవసరానికి సరిపోతున్నాయని ఎండీ చెప్పారు. మరో ఇంటిని సందర్శించిన ఎండీ తాగునీటితో ప్రాంగణం కడిగి నీటిని వృథా చేయడంతో యజమానిని పిలిచి.. విలువైన నీటిని వృథా చేసినందుకు ఆగ్రహం వ్యక్తం చేసారు. నీటి ప్రాంగణాలు కడగటానికి మాపు లేదా వస్త్రాన్ని వినియోగిస్తే నీటి వృథా ఉండదని హితవు పలికారు. ఇది మళ్ళీ పునరావృత్తం అయితే పెనాల్టీ విధిస్తామని హెచ్చరించారు. తదుపరి.. మరొక ఇంటిలో బోరు నీటిని మొక్కలకు, ప్రాంగణం కడగడం చూసిన ఎండీ ఇంకుడు గుంత నిర్మించేంత ఖాళీ స్థలం ఉండటంతో ప్రాంగణంలోని వృథా నీటిని ఇంకుడు గుంతలోకి మళ్లించుకోవాలని సూచించారు. రూఫ్ వాటర్, వాన నీటిని భూమిలోకి ఇంకించేవిధంగా ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని సూచించారు. అనంతరం హుడా కాలనీలో సీవరేజ్ మ్యాన్ హోల్ డీ-సిల్టింగ్ పనులను పరిశీలించిన ఎండీ.. మాల్ హోల్ లలో వెలువడ్డ వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలని స్థానిక అధికారులను ఆదేశించారు. రోడ్డుకు సమాంతరంగా లేని మ్యాన్ హోళ్ళను, ధ్వంసమైన మ్యాన్ హోళ్ళను గుర్తించి పునర్నిర్మాణం చేయమని సూచించారు. దానికి సంబంధించిన ప్రతిపాదనలను సమర్పించమని చెప్పారు. అనంతరం మియాపూర్ ప్రధాన రహదారిపై సీవరేజ్ చొకేజి అయిన మ్యాన్ హోల్ వద్ద డీ-సిల్టింగ్ పనులను పరిశీలించారు. మాన్ హోల్ చొకేజి కారణాలను ఆరాతీయగా.. ప్రధాన రహదారిపై కొత్త రోడ్డు నిర్మించే సమయంలో సంబందించిన శాఖ మ్యాన్ హోళ్ళను మూసివేశారని, దాంతో సీవరేజ్ లైన్ లో సిల్ట్ చేరి సమస్య తలెత్తిందని.. కొత్త రోడ్డు నిర్మాణంతో మ్యాన్ హోళ్ళ గుర్తింపు కష్టతరంగా మారిందని అధికారులు ఎండీకి వివరించారు. దానికి ఎండీ తాత్కాలికంగా సీవరేజ్ లైన్ ను సమీపంలోని ట్రంక్ మెయిన్ కు మళ్ళించి సమస్యను తగ్గించాలని సూచించారు. శాశ్వత పరిష్కారంగా చొకేజి అయిన లైనుకున్న మ్యాన్ హోళ్ళను గుర్తించడానికి మార్గాలను అన్వేషించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ.. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్టు చెప్పారు. జలమండలి పరిధిలో తాగునీటి, మురుగునీటి సమస్యలు, దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడానికి 'జలమండలి.. బస్తీ బాట' కార్యక్రమాన్ని రూపొందించిందని, ఇందులో భాగంగా ఎండీ నుంచి మేనేజర్ వరకు ప్రతీ మంగళవారం, బుధవారం, శుక్రవారం, శనివారం ఉదయం 7 గంటలనుంచి 10 గంటల వరకు బస్తీలు, కాలనీల్లో పర్యటిస్తూ సమస్యలను తెలుసుకుంటారని చెప్పారు. ఈ పర్యటనలో క్షేత్రస్థాయిలో ప్రజలతో మాట్లాడి.. మంచినీరు, సీవరేజ్ సమస్యలను తెలుసుకొని పరిష్కరిస్తారని చెప్పారు. దీర్ఘకాలిక సమస్య పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించుకుంటారని చెప్పారు. అలాగే, నీటి వృథాను తగ్గించి, భూగర్భ జలాలను పెంచే విధంగా ఇంకుడు గుంతలు నిర్మించుకునే విధంగా అవగాహన కల్పిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆపరేషన్ డైరెక్టర్లు వినోద్ భార్గవ, నారాయణ, శ్రీనివాస రెడ్డి సీజీఎంలు, జీఎంలు ఇతర అధికారులు పాల్గొన్నారు.
HMWSSB tweet mediaHMWSSB tweet mediaHMWSSB tweet mediaHMWSSB tweet media
తెలుగు
6
3
10
1.3K
Ashok Reddy Korem retweetledi
HMWSSB
HMWSSB@HMWSSBOnline·
ఎస్ఆర్ నగర్ డివిజన్ పరిధిలో పర్యటించిన జెఎండీ మయాంక్ మిట్టల్ ================== ఎస్ఆర్ నగర్ డివిజన్ పరిధిలో ఫతేనగర్ సెక్షన్ పరిధిలోని కైలాశ్ నగర్ పరిసర ప్రాంతాల్లో తనిఖీ నిర్వహించి పెండింగ్‌లో ఉన్న ఎంసీసీ ఫిర్యాదులపై సమీక్ష నిర్వహించారు. కాలనీల్లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ట్యాంకర్ ఫిల్లింగ్ పాయింట్లను సెక్షన్ కార్యాలయ ప్రాంగణానికి మార్చాలని సూచించారు. అనంతరం ప్రశాంత్ కాలనీలో వచ్చిన మురుగు ఓవర్‌ఫ్లో ఫిర్యాదును పరిశీలించారు. ఫతేనగర్ సెక్షన్ పరిధిలోని కైలాశ్ నగర్‌లో నిర్వహించిన తనిఖీలో, నీటి సరఫరా నాణ్యత, ప్రెషర్,షెడ్యూల్ అమలు సంతృప్తికరంగా ఉన్నట్లు గుర్తించారు.
HMWSSB tweet mediaHMWSSB tweet mediaHMWSSB tweet mediaHMWSSB tweet media
తెలుగు
2
3
19
1.5K
Ashok Reddy Korem retweetledi
HMWSSB
HMWSSB@HMWSSBOnline·
నీటిని పొదుపుగా వాడుకోవ‌డం అందరి బాధ్య‌త‌ ================= # జ‌ల‌మండ‌లి ఎండీ అశోక్ రెడ్డి # కొనసాగుతున్న "జలమండలి.. బస్తీ బాట..!" నీటిని వృథా చేయకుండా, పొదుపుగా వాడుకోవాల్సిన మనందరి బాధ్యత అని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం క్షేత్ర స్థాయిలో నీటి సరఫరా సీవరేజ్ సమస్యలను గుర్తించడానికి జలమండలి చేపట్టిన "జలమండలి.. బస్తీ బాట" కార్యక్రమంలో భాగంగా ఉప్పాలగూడలోని సెక్రటేరియట్ కాలనీ, శ్రీ నగర్ కాలనీ ప్రాంతంలో అధికారులతో కలిసి ఆయన పర్యటించారు. నీటి సరఫరా సమయంలో పలు ఇండ్లను సందర్శించిన ఎండీ నీటి సరఫరాలో సమస్యల కోసం ఆరాతీశారు. క్యూఏటీ సిబ్బందితో కలిసి క్లోరిన్ స్థాయిలు, నీటి ప్రెషర్, నీటి సరఫరా సమయాలపై సమీక్షించారు. అలాగే, సివరెజ్ నెట్ వర్క్ పై కాలనీ వాసులతో చర్చించారు. కాలనీలలో విస్తృతంగా సందర్శించిన జలమండలి ఎండీ కొంతమంది తాగునీటిని వృధా చేస్తున్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ.. నీటిని వృధా చేయకుంటే, పొదుపు చేసినట్టే అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ నీటిని కాపాడుకునేందుకు వారి వంతు ప్రయత్నం చేయాలని అన్నారు. విద్యావంతులు నీటి పొదుపు పట్ల మరింత బాధ్యతగా ఉండాలని, ఇతరులకు అవగాహన కల్పించడంలోనూ ముందుండాలని కోరారు. జలమండలి సుదీర్ఘ ప్రాంతాలనుంచి ఎన్నో వ్యయప్రయాసలకోర్చి నగరవాసుల నీటి అవసరాలను తీర్చడానికి కృష్ణా, గోదావరి నదులనుంచి నీటిని తరలించి, శుద్ధి చేసి నగర ప్రజలకు సరఫరా చేస్తోందని అన్నారు. కావున నీటిని వృథా చేయకూడదని సూచించారు. ఈ సందర్భంగా నీటిని వృధా చేస్తున్న వారిని.. ఇది మళ్ళీ పునరావృత్తం అయితే పెనాల్టీ విధించాలని అధికారులను ఆదేశించారు. నీటిని వృధా చేసే వారిపై ఫిర్యాదు చేయడానికి త్వరలో ప్రత్యేక మొబైల్ యాప్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. ఈ యాప్ ద్వారా నీటిని వృథా చేస్తున్న వారిపై పౌరులు ఎవరైనా ఫోటో అప్లోడ్ చేయడం ద్వారా ఫిర్యాదు చేయవచ్చు అని అన్నారు. అధికారులు పరిశీలించి దానికనుగుణంగా వారికి పెనాల్టీ విధిస్తారని వివరించారు. ఆ ప్రాంతాల్లో భూగర్భజలాల పరిస్థిని, బోరుబావుల స్థితిగతులను స్థానికులను అడిగి తెలుసుకున్న ఎండీ.. ఆ ప్రాంతాల్లో వాటర్ ట్యాంకర్ డిమాండ్, బుకింగ్, డెలివరీ సమయాలపై సమీక్షించారు. జలమండలి ఈడి సంతోష్, ఆపరేషన్ డైరెక్టర్ నారాయణ స్థానిక అధికారులు పాల్గొన్నారు. యధావిధిగా ఈ రోజూ ఉదయం 6 గంటలనుంచే జలమండలి జేఎండీ, ఈడీలు, సిజిఎంలు, జీఎంలు, అధికారులు క్షేత్ర తనిఖీలు నిర్వహిస్తూ తమ తమ పరిధిలో నీటిసరఫరా సివరేజ్ పనులను మెరుగుపరిచేందుకు అధికారులు కృషి చేస్తున్నారు.
HMWSSB tweet mediaHMWSSB tweet media
తెలుగు
3
4
15
1.2K
Ashok Reddy Korem retweetledi
HMWSSB
HMWSSB@HMWSSBOnline·
మ‌ర‌మ్మ‌తుల పనులను పరిశీలించిన జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ============== # యుద్ధ ప్రాతిప‌దిక‌న ప‌నులు చేప‌ట్టిన అధికారులు.. # పనులు సత్వరమే పూర్తి చేయాలని సూచన # ప్రభావిత ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు ఆదేశం ఈ తెల్లవారు జామున మణికొండ వద్ద ద్వంసం అయిన 1200 ఎంఎం డయా పిఎస్ సి గ్రావిటీ మెయిన్ పైప్ లైన్ అత్యవసర మరమ్మతుల పనులను జలమండలి ఎండీ అశోక్ రెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ జరుగుతున్న పనుల పురోగతిని అధికారులతో చర్చించారు. జలమండలి చేపట్టే మరమ్మతులు పైపు లైన్ విస్తరణ పనులు పూర్తయిన వెంటనే.. రోడ్డు మరమ్మతు పనులు నిర్వహించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మరమ్మతుల పనులపై తాజా పరిస్థితి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆపరేషన్స్‌ అండ్ మెయింటెనెన్స్‌, ట్రాన్స్‌మిషన్‌ అధికారులు సమన్వయంతో పనులు చేపట్టాలన్నారు. లీకేజీ వల్ల నీటి సరఫరాలో అంతరాయం కలిగిన ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగడకుండా ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయాలని సూచించారు. సాధ్యమైనంత తొందరగా పనులు పూర్తి చేసి నీటి సరఫరాను పునరుద్ధరించాలని ఆదేశించారు. ఖానాపూర్ నుండి బోజగుట్ట వరకు వెళ్లే 1200 మిమీ డయా గల పిఎస్ సి గ్రావిటీ మెయిన్ పైప్‌లైన్ ఈ రోజు తెల్లవారుజామున 2:40 గంటలకు మణికొండలోని నాగులమ్మ దేవాలయం సమీపంలో పగిలినట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే మరింత నీటి వృధా జరగకుండా ఉండేందుకు సింగపూర్ మరియు ఖానాపూర్ నుండి నీటి సరఫరాను ఉదయం 3:00 గంటలకు తక్షణమే నిలిపివేశారు. మరమ్మత్తు పనులను అత్యవసర ప్రాతిపదికన చేపట్టి, ఉదయం 7:00 గంటలకు పునరుద్ధరణ పనులు ప్రారంభించారు. దెబ్బతిన్న పైప్ భాగాన్ని 1150 మి.మీ. వ్యాసం గల ఎమ్ఎస్ బ్యారెల్స్‌ను అమర్చడం ద్వారా మార్పిడి చేస్తున్నారు. ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయి.. మరమ్మతులు ఈ రోజు సాయంత్రం 7:00 గంటలలోపు పూర్తయ్యే అవకాశం ఉంది. మరమ్మత్తు పనులు పూర్తయ్యిన అనంతరం నీటి సరఫరాను దశలవారీగా పునరుద్ధరించబడుతుంది. ప్రభావిత ప్రాంతాలు: గండిపేట్, కొకాపేట్, నార్సింగి, మంచిరేవుల, పుప్పాలగూడ, ఖానాపూర్, మణికొండ, షేక్‌పేట్ రిజర్వాయర్ కమాండ్ పరిధిలోని కొన్ని ప్రాంతాలు.. బోజగుట్ట రిజర్వాయర్ కమాండ్ పరిధిలోని ప్రాంతాలలో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడింది.
HMWSSB tweet mediaHMWSSB tweet mediaHMWSSB tweet media
తెలుగు
5
6
41
4.3K
Ashok Reddy Korem retweetledi
HMWSSB
HMWSSB@HMWSSBOnline·
హైటెక్ సిటీ ట్రాఫిక్ కష్టాల విముక్తికి యాక్షన్ ప్లాన్- దుర్గం చెరువు పరిరక్షణకు చర్యలు =================== # సైబరాబాద్ మున్సిపల్ కమీషనర్, జలమండలి ఎండీ, జెడ్సి, ట్రాఫిక్ ఏసీపీ,డీసీపీ తో కలిసి పర్యటన #లెమన్ ట్రీ హెటల్ నుంచి శిల్పారామం వరకు పనుల పరిశీలన #దుర్గం చెరువు ఎస్టీపీకి మళ్లించడానికి సేవరేజ్ పైపులైన్ నిర్మాణం త్వరలో పూర్తి # ముఖ్యమంత్రి ఆదేశాలతో వివిధ శాఖల అధికారుల జాయింట్ ఇన్ స్పెక్షన్ ప్రతి నిత్యం లక్షా ముప్పై మందిపైగా పయనించే మాదాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇక్కట్లు తొలగించేందుకు 5 శాఖల ఆధ్వర్యంలో సంయుక్త కార్యాచరణ. ఇక్కడి ప్రాంత నివాసులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ జామ్ సమస్యను పరిష్కరించేందుకు జలమండలి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, పోలీసు, ఇరిగేషన్, విద్యుత్ శాఖలు, టీజీఐఐసీ దీన్ని చేపట్టారు. ఈ మేరకు ట్రిడెంట్ హెటల్ నుంచి శిల్పారామం వరకు ఉన్న కిలోమీటర్ వరకు రోడ్డు విస్తరణ పనుల పురోగతిని అధికారులు పరిశీలించారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతాన్ని సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన, జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, ట్రాఫిక్ డీసీపీ, ఏసీపీ, మున్సిపల్ జోనల్ కమిషనర్ హేమంత్ కలిసి పర్యటించారు. లెమన్ ట్రీ హోటల్ నుంచి ట్రిడెంట్ హోటల్ వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టనున్న నేపథ్యంలో.. అక్కడున్న ఎయిర్ వాల్వ్ లను, ఎలెక్ట్రిక్ పోల్స్ సమీపానికి తరలించడానికి అధికారులతో చర్చించారు. అక్కడ్నుంచి హైటెక్ సిటీ నుంచి మెడికవర్ ఆసుపత్రి వరకు చెప్పాల్సిన రోడ్డు విస్తరణ పనులను చర్చించారు. వాటిని సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులను కోరారు. ఒక్కసారి ఇక్కడి పనులు పూర్తయితే.. మాదాపూర్, మైండ్ స్పేస్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇక్కట్లు కొంత వరకు తొలగిపోతాయి. దుర్గం చెరువు పరిరక్షణకు చర్యలు: -------------------------------- దుర్గం చెరువు పరిరక్షణకు ప్రభుత్వం సిద్ధమైంది. చెరువులో మురుగు నీరు చేరి అది కలుషితం కాకుండా తగిన చర్యలు చేపట్టనుంది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు.. చెరువు పరిసరాలను జలమండలిఎండీ అశోక్ రెడ్డి, ఈడీ సంతోష్, మున్సిపల్, హెచ్ఎండీఏ, లేక్స్, రెవెన్యూ, ఇరిగేషన్ విభాగాల అధికారులు పరిశీలించారు. చెరువులో మురుగు నీరు చేరకుండా తగిన చర్యలు చేపట్టడానికి జాయింట్ ఇన్ స్పెక్షన్ నిర్వహించారు. రహేజా మైండ్ స్పేస్ ప్రాంతాల్లో భ‌వ‌న నిర్మాణ‌, గార్డెనింగ్, ల్యాండ్ స్కేపింగ్ అవసరాల కోసం ఎస్టీపీలో శుద్ధి చేసిన నీటినే వాడుకోవాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఆదేశించారు. మాదాపూర్, సైలెంట్ వాలీ ప్రాంతాలు, క్యాచ్ మెంట్ ఏరియాలో ఉత్పన్నమవుతున్న మురుగునీటిని.. జలమండలి దుర్గం చెరువులో నిర్మించిన రెండు ఎస్టీపీల (5 & 7 ఎమ్మెల్డీలు) ద్వారా శుద్ధి చేస్తున్నారు. దుర్గం చెరువు భూగర్భ నీటి మట్టం పెరిగేందుకు, చెరువు హైడ్రాలజీ కాపాడేందుకు ఎస్టీపీల్లో శుద్ధి చేసిన నీటిని చెరువులోకి వదిలి పెడుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి అధికంగా వచ్చే మురుగు నీరు చెరువులో కలవకుండా 1000 ఎంఎం డయా పైపులైన్ ను మాదాపూర్ పెట్రోల్ బంక్ నుంచి మాదాపూర్ ఐ&డి వరకు ఉన్న పనులు ప్రస్తుతం పురోగతిలో ఉన్నాయి. పైపులైన్ నిర్మాణం పూర్తయితే లేక్ పార్కులో జరుగుతున్న సీవరేజ్ ఓవర్ ఫ్లో కూడా తగ్గనుంది. వర్షాకాలంలో వచ్చే వరద నీరు చెరువులో కలవకుండా వాటర్ డ్రైయిన్ సైతం పూర్తి చేయనుంది. చెరువు భూగర్భ జలాల స్థాయిలను కాపాడేందుకుఎస్టీపీలో శుద్ధి చేసిన నీటిని పార్కులో నిర్వహణ పనులకు, చెట్లు పెంచేందుకు ఉపయోగించాలని సూచించారు. రహేజా మైండ్ స్పేస్ ప్రాంతాల్లో భ‌వ‌న నిర్మాణ‌, పార్కు, ల్యాండ్ స్కేప్ నిర్వహణకు ఇతర అవసరాలకు త‌ప్ప‌నిస‌రిగా వంద శాతం రీసైకిల్ వాటర్ నే వినియోగించాలని ఎండీ అశోక్ రెడ్డి ఆదేశించారు. అందుకోసం దుర్గం చెరువు ఎస్టీపీ నుంచి ప్రత్యేక పైపు లైన్ ను నిర్మించాల‌ని ఆదేశించారు. దుర్గం చెరువు ఎస్టీపీ నుంచి ట్రీటెడ్ వాట‌ర్ తరలించి వాడుకునేలాగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జలమండలి ఎస్టీపీ ప్రాజెక్టు సీజీఎంలు పద్మజ, వాస సత్యనారాయణ, మున్సిపల్, ఇరిగేషన్ ఈఈ, టీజీఐఐసీ ఎస్సీ, సీఈ, ఇతర తదితర విభాగాల అధికారులు పాల్గొన్నారు.
HMWSSB tweet mediaHMWSSB tweet mediaHMWSSB tweet mediaHMWSSB tweet media
తెలుగు
5
12
88
11.4K
Ashok Reddy Korem retweetledi
HMWSSB
HMWSSB@HMWSSBOnline·
తీరనున్న ఎస్పీఆర్ హిల్స్ ప్రాంత ప్రజల ఇక్కట్లు..! ========================== # రాత్రి సమయాల్లో సరఫరా నివారించడానికి ప్రత్యేక ప్రణాళిక # రెండున్నర కోట్లతో కొత్త ఫ్రీడర్ మెయిన్ నిర్మాణం # ఉగాది నాటికి పైప్ లైన్ పనులు పూర్తి చేయాలని ఆదేశం # మంగళవారం క్షేత్ర స్థాయిలో పనులు పరిశీలించిన జలమండలి ఎండీ అశోక్ రెడ్డి.. బోరబండ, రహ్మత్ నగర్ లోని పలు కాలనీల్లో రాత్రి సమయంలో నీటి సరఫరా వల్ల ప్రజలు ఎదుర్కుంటున్న ఇబ్బందులను పరిష్కరించడానికి రెండున్నర కోట్లతో ఫీడర్ మెయిన్ పైప్ లైన్ నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఎస్పీఆర్ హిల్స్ లో నిర్మిస్తున్న పైపులైను నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల పురోగతిని అడిగి తెలుసుకున్న ఏండీ.. పైప్ లైన్ నిర్మాణ పనులలో వేగం పెంచి ఉగాది నాటికి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. అవసరం అయితే కార్మికుల సంఖ్య పెంచి, మరిన్ని గ్యాంగులను సమకూర్చుకోవాలని సూచించారు. ఈ సందర్బంగా ఎండీ అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. ఎస్పిఆర్ హిల్స్ ప్రాంతంలో నీటి నిల్వ సామర్థ్యం లేకపోవడంతో కొన్ని ప్రాంతాల్లో మూడు రోజులకు ఒకసారి నీటి సరఫరా చేయడంతో ప్రజలు ఇబ్బంది పడేవారని అన్నారు. దీంతోపాటు మరికొన్ని బస్తీల్లో రాత్రి సమయంలోనూ మంచినీటి సరఫరా చేయడం.. లో ప్రెషర్ లాంటి సమస్యలు ఉండేవని చెప్పారు. గత సవంత్సరంలో బోరబండ, రహమత్ నగర్ డివిజన్ లలోని 52 బస్తీల్లోని, పలు కాలనీల నీటి సమస్యను తీర్చడానికి ప్రభుత్వం దాదాపు రూ. 5.7 కోట్ల వ్యయంతో 3 మిలియన్ లీటర్ల రిజర్వాయర్ ను నిర్మాణం చేపట్టి పూర్తి చేసిందని చెప్పారు. రికార్డ్ స్థాయిలో ఏడాదిన్నరలో నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ రిజర్వాయర్ గత సంవత్సరం మే లో రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖా మంత్రి, హైదరాబాద్ ఇంచార్జి మినిస్టర్ శ్రీ పొన్నం ప్రభాకర్ ప్రారంభించారని వివరించారు. అలాగే ఈ రిజర్వాయర్ నిర్మాణం వల్ల బోరబండ, రహమత్ నగర్ డివిజన్లోని 52 బస్తీల్లోని ప్రజలకు ప్రత్యామ్నాయ రోజులలో ఉదయం 4.00 గంటల నుండి రాత్రి 11.00 గంటల వరకు నీటి సరఫరా అందిస్తున్నామని ఎండీ చెప్పారు. అయితే ఈ రిజర్వాయర్ పరిధిలో అన్ని ప్రాంతాలకు రోజు విడిచి రోజు నీటి సరఫరా చేయడంతో పాటు రాత్రి సమయంలో కాకుండా ఉదయం నుండి సాయంత్రం సమయాల్లో సరఫరా చేసే వీలుగా ఎస్పీఆర్ హిల్స్ రిజర్వాయర్ నుండి బ్రహ్మశంకర్ నగర్ దేవాలయం వరకు 450 మిమీ డయా ఎంఎస్ వాటర్ పైప్ లైన్.. అలాగే బ్రహ్మశంకర్ నగర్ దేవాలయం నుండి కార్మిక నగర్ ఆటో స్టాండ్ వరకు 300 మిమీ డయా ఎంఎస్ డీఐ వాటర్ పైప్ లైన్ నిర్మాణం చేపడున్నామని చెప్పారు. దీంతో పాటు ఈ పైప్ లైన్ నిర్మాణం పూర్తయితే కార్మిక నగర్, బ్రహ్మశంకర్ నగర్ ప్రాంతాలలో రాత్రి వేళల నీటి సరఫరాను నివారించడమే కాకుండా నీటి సరఫరా సైతం మెరుగవుతుందని వివరించారు. అలాగే నగరంలో రాత్రి సమయంలో నీటి సరఫరా అయ్యే ప్రాంతాలను గుర్తించి నివేదికలను సమర్పించాలని అధికారులను ఆదేశించారు. సమయానుసారంగా అన్నీ ప్రాంతాల్లో ఉదయం నుంచి సాయంత్రం సమయాల్లో నీటి సరఫరా చేసే విధంగా ప్రణాళికలును రూపొందించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీజీఎం ప్రభు, జీఎంలతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
HMWSSB tweet mediaHMWSSB tweet media
తెలుగు
2
4
14
2.2K