

Prasad bobbili
13.8K posts















ఒక యాడ్..సెన్సేషన్ న్యూస్ కావడం ఎప్పుడైనా చూశారా? ఇదిగోండి.. ఇప్పుడైంది..ఇదీ నారా లోకేష్ సృష్టించిన నయా ట్రెండ్ సోషల్ మీడియా ప్రపంచంలో విభిన్నత ఉన్న ఒక వీడియో వైరల్ అవుతుంది. కొత్తదనం, విషయం ఉంటే ఒక పోస్ట్ ట్రెండింగ్‌లోకి వస్తుంది. ఒక లుక్, ఒక ఎక్స్ ప్రెషన్, క్యాండిడ్ షూట్ లో బయటకొస్తే వైరల్ అవుతుంది. న్యూస్ వార్తగా మారుతుంది. న్యూసెన్స్ అయితే ట్రోల్ అవుతుంది. ఇలా ఒక్కో దానికి ఒక్కో మార్గం ఉంటుంది. ఇవేవీ లేకపోతే.. మన వస్తువు గురించో, మన సంస్థ గురించో, మన సేవల గురించో, మనం సాధించిన ఫలితాల గురించో ప్రచారం చేయాలంటే డబ్బు వెచ్చిస్తే ప్రకటనలు ఇవ్వగలం. అరుదైన ప్రకటనలు-ఆకట్టుకునే కాన్సెప్ట్, నవ్వించే గుణం ఉన్నవి అయితే తప్పించి పేపర్లో అయితే పేజీ తిప్పేస్తాం. టీవీలో అయితే చానల్ మార్చేస్తాం. యూట్యూబ్‌లో అయితే స్కిప్ కొడతాం. చేతికి ఎవరైనా ప్రకటన పాంప్లెట్ ఇస్తే వాళ్లు వెళ్లక ముందే చదవకుండా కింద పడేస్తాం. ఇదీ ప్రస్తుతం ప్రకటనల తీరు.. కానీ ఒక్క ప్రకటన...ఒకే ఒక్క యాడ్..సెన్సేషన్ అయ్యింది. యాడ్ వైరల్ అయి ట్రెండింగ్ న్యూస్ అయ్యింది. ఆ ప్రకటన గురించే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఒకటే చర్చ. ఆ యాడ్ వెబ్ సైట్లకు ప్రధాన వార్త, న్యూస్ సైట్లకు ఆసక్తికరమైన అంశంగా, రీల్స్, బైట్స్, షార్ట్స్ తో ఇంటర్నెట్‌ని షేక్ చేస్తోంది. అదే ``సగర్వంగా నిల`బడి`` పేరుతో అన్ని ప్రధాన పత్రికలకు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల విద్యార్థులు టెన్త్‌లో సాధించిన అత్యుత్తమ మార్కులు, వారి స్కూలు, ఊరు పేర్లతో ఇచ్చిన ప్రకటన. తొలిసారి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల గురించి వచ్చిన ప్రకటనగా, రాజకీయాలు సోకని ప్రకటనగా, నిజాయితీగా వేసిన ప్రకటనగా మన్ననలు అందుకుంటూ... తెలుగు రాష్ట్రాల ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాకి ప్రధానమైన న్యూస్ అయ్యింది. ఇన్ ఫ్లుయెన్సర్లు దీనిపై షార్ట్స్, రీల్స్, ఇన్ స్టా పోస్టులు వేస్తున్నారు. బీబీసీ తెలుగు, ముచ్చట, దిశ వంటి చాలా వెబ్ సైట్లలో ఈ ప్రకటనపై చాలా ఆసక్తికరమైన కథనాలు వచ్చాయి. విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ బాపట్లలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగులో కార్పొరేటు వాళ్ల కంటే మిన్నగా మన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఫలితాలు సాధిస్తారు, దీనిని మేము యాడ్ ఇస్తామంటూ నెలల క్రితం ప్రకటించారు. చెప్పినట్టే టెన్త్ ఫలితాల్లో ఉత్తీర్ణతాశాతం మెరుగుపడి, ప్రభుత్వ విద్యార్థులు సత్తా చాటడంతో అన్ని పత్రికలకు ప్రకటనలు ఇచ్చారు. ఇందులో మంత్రిగా తన పేరుకానీ, ఫోటో కానీ, కూటమి ప్రభుత్వం పెద్దల ఫోటోలు కానీ లేవు. విద్యాశాఖ ఉన్నతాధికారుల ఫోటోలూ వేయలేదు. మార్కులు సాధించిన విద్యార్థుల ఫోటోలు మాత్రమే వేసి...ఈ యాడ్ సెన్సేషన్ న్యూస్ అయ్యే నయా ట్రెండ్ సృష్టించింది ముమ్మాటికీ విద్యాశాఖ మంత్రి @naralokesh ..

క్రికెట్ గ్యాలరీలో క్యాచ్ పట్టడానికి లోకేశ్ వెళ్తున్నారా? అవును... కాకపోతే అది మీ ఊహకు అందని క్యాచ్! వైసీపీకి ఎందుకు అంత మతిపోతోంది? లోకేశ్ మ్యాచ్ చూస్తే విమర్శ.. కొలంబో వెళ్తే హంగామా. "మంత్రికి ఆటలేంటి?" అని పనిగట్టుకుని గోల. మీరు అక్కడ గ్యాలరీలో కేవలం చప్పట్లు చూశారు — కానీ లోకేశ్ అక్కడ ఆదిత్య మిట్టల్‌తో రాష్ట్ర భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నారు! ఆర్సెల్లార్‌మిట్టల్-నిప్పన్ స్టీల్ పెండింగ్ సమస్యలు క్లియర్ చేస్తున్నారు. రిజల్ట్ ఏంటో తెలుసా? మీటింగ్ జరిగిన 3 నెలలు తిరక్కముందే — నక్కపల్లిలో దేశంలోనే అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన! ఇది యాదృచ్ఛికం కాదు.. పక్కా 'క్రికెట్ డిప్లోమసీ'. సచిన్ ఎందుకు వచ్చారు? క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ ఆంధ్రా యూనివర్శిటీకి వచ్చారు.. పైసా తీసుకోకుండా! ఎందుకు? సచిన్ తన కుటుంబ శుభకార్యాలకు పిలిచేంత స్నేహం అది! ఆ సాన్నిహిత్యం ఎక్కడ మొదలైంది? ఐపీఎల్ గ్యాలరీలో, టీమ్ ఇండియా మ్యాచ్‌ల సందడిలో! తేడా గమనించండి: వైసీపీ కళ్లకి: అది "టైం వేస్ట్". రాష్ట్రానికి: అది "ఇంటర్నేషనల్ బ్రాండ్ ప్రమోషన్". విమర్శకులకు ఒక్కటే మాట — మీరు గ్యాలరీలో బంతి ఇచ్చే క్యాచ్ చూశారు.. లోకేశ్ గ్యాలరీలోనే 'పెట్టుబడుల' క్యాచ్ పట్టారు! మీకు అర్థమయ్యే క్యాచ్ బౌండరీ దగ్గర ఉంటుంది.. లోకేశ్ పట్టే క్యాచ్ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఉంటుంది! మీరు విమర్శలు చేస్తూనే ఉండండి — @naralokesh ఏపీ కోసం సిక్సర్లు కొడుతూనే ఉంటారు! #NaraLokesh




