District Collector, Vizianagaram

1.2K posts

District Collector, Vizianagaram banner
District Collector, Vizianagaram

District Collector, Vizianagaram

@cdmvzm

Official Handle of Collector and District Magistrate, Vizianagaram. S.Ramsundar Reddy, I.A.S.

Collectorate, Vizianagaram Katılım Aralık 2024
0 Takip Edilen244 Takipçiler
District Collector, Vizianagaram
మన వివరాలు - దేశ భవిష్యత్తుకు మార్గాలు. సరైన సమాచారం ఇవ్వండి… బలమైన దేశాన్ని నిర్మించండి జనగణనలో భాగస్వామ్యం - అభివృద్ధికి సహకారం ప్రభుత్వ ప్రణాళికల రూపకల్పనకు గణాంకాలు కీలకం. జనగణనలో సరైన వివరాలు అందించి సమాన అభివృద్ధికి సహకరించండి సమగ్ర డేటా సేకరణతో సమాన అభివృద్ధి జనగణనలో భాగస్వాములు అవ్వండి
తెలుగు
0
1
4
39
District Collector, Vizianagaram
జిల్లాలో మే 3వ తేదీన నిర్వహించనున్న నీట్-యుజి 2026 ప్రవేశ పరీక్షకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. పరీక్షా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన ఆయన, జిల్లాలోని 6 పరీక్షా కేంద్రాల్లో మధ్యాహ్నం 2.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు పరీక్ష జరుగుతుందని, మొత్తం 1,824 మంది విద్యార్థులు హాజరవుతున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పరీక్షా నిబంధనల దృష్ట్యా అభ్యర్థులు ఎటువంటి ఇబ్బందులకు గురికాకుండా ఉండాలంటే, పరీక్ష ప్రారంభ సమయానికి కనీసం ఒక గంట ముందే, అంటే మధ్యాహ్నం 1.00 గంటకల్లా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని స్పష్టం చేశారు. నిర్ణీత సమయం దాటిన తర్వాత కేంద్రంలోనికి అనుమతించరని ఆయన స్పష్టం చేశారు. అభ్యర్థుల సౌకర్యార్థం కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామని, సందేహాలు ఉన్నవారు 08922-236947 నెంబరుకు ఉదయం 10.00 నుండి సాయంత్రం 5.00 గంటల మధ్య సంప్రదించవచ్చని సూచించారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాసేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన ఆదేశించారు.
District Collector, Vizianagaram tweet media
తెలుగు
1
0
6
53
District Collector, Vizianagaram
మే 1 నుంచి నేషనల్ సెన్సస్ ప్రారంభం ప్రతి ఇంటికి ఎన్యూమరేటర్లు వస్తున్నారు ఈ నెలలో ఇంటి వివరాలు – వచ్చే సంవత్సరం వ్యక్తిగత వివరాలు మీ సమాచారం పూర్తిగా గోప్యంగా ఉంటుంది RTI క్రిందకి కూడా రాదు సెన్సస్‌లో పాల్గొనడం ప్రతి ఒక్కరి బాధ్యత సహకరించండి – దేశ అభివృద్ధికి తోడ్పడండి
తెలుగు
0
0
5
39
District Collector, Vizianagaram
జిల్లాలో కిశోర బాలబాలికల సమగ్ర అభివృద్ధి, శక్తివంతీకరణ లక్ష్యంగా రూపొందించిన “కిశోరి వికాసం సమ్మర్ క్యాంపెయిన్ 2026” కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ రూపొందించిన కార్యక్రమ పోస్టర్‌ను ఆయన తమ ఛాంబర్లో ఆవిష్కరించారు. జిల్లా వ్యాప్తంగా మే 1 నుండి జూన్ 9 వరకు ఈ క్యాంపెయిన్ కొనసాగుతుందని కలెక్టర్ తెలిపారు. ప్రత్యేకంగా రూపొందించిన సమ్మర్ క్యాలెండర్ ప్రకారం కిశోర ప్రాయంలో ఉన్న పిల్లలకు జీవన నైపుణ్యాలు, స్వీయ అవగాహన, ఆరోగ్య మేళాలు, అనీమియా నివారణ, లైంగిక పునరుత్పత్తి ఆరోగ్యం, హెచ్ఐవి/ఎయిడ్స్ వంటి అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు వివరించారు. ముఖ్యంగా పోక్సో , బాల్య వివాహాల నిరోధక చట్టం , గృహ హింస నిరోధక చట్టం, విద్యా హక్కు చట్టం వంటి చట్టాలపై శిక్షణ ఇవ్వడంతో పాటు ఆర్థిక నిర్వహణ, శారీరక వ్యాయామం, కెరీర్ గైడెన్స్‌పై అవగాహన కల్పిస్తారని పేర్కొన్నారు. ​ప్రస్తుత కాలంలో పిల్లలకు అత్యంత అవసరమైన సైబర్ భద్రత, మత్తు పదార్థాల దుష్ప్రభావాలు, బాల్య వివాహాల నిరోధంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. మహిళా శిశు సంక్షేమ, విద్యా, ఆరోగ్య, పోలీస్ శాఖలతో పాటు స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేసి ఈ క్యాంపెయిన్‌ను విజయవంతం చేయాలని సూచించారు.
District Collector, Vizianagaram tweet media
తెలుగు
0
2
5
36
District Collector, Vizianagaram
బీసీ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా గారిని జిల్లా కలెక్టర్ మర్యాదపూర్వకంగా స్వాగతించి, ఆయనతో కలిసి ఉమ్మడి జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 🔹 స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలుకు అవసరమైన డేటా సేకరణపై కీలక మార్గదర్శకాలు అందించారు. 🔹 ఏకీకృత కుటుంబ సర్వే (Unified Family Survey)ను ఖచ్చితత్వంతో నిర్వహించి, నాణ్యమైన సమాచారం సేకరించాలని ఆదేశించారు. 🔹 పంచాయతీ రాజ్ మరియు మున్సిపల్ శాఖల ద్వారా బీసీ వర్గాలకు సంబంధించిన డేటా మ్యాపింగ్‌లో ఎలాంటి తారతమ్యాలు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. 🔹 గత ఎన్నికల్లో బీసీ వర్గాల ప్రాతినిధ్యం వివరాలను సమగ్రంగా సేకరించి కమిషన్‌కు అందించాలని తెలిపారు. జిల్లాలో నిర్వహిస్తున్న కుటుంబ సర్వే ప్రగతి, నాణ్యతపై కమిషన్ సంతృప్తి వ్యక్తం చేయడం ఆనందంగా ఉంది. అనంతరం బీసీ సంఘాల ప్రతినిధుల నుంచి వినతులు స్వీకరించి, వారి అభిప్రాయాలను నమోదు చేశారు. జిల్లాలో పారదర్శకంగా, సమగ్రంగా సర్వే నిర్వహణకు కట్టుబడి పనిచేస్తున్నామని తెలిపారు. #Vizianagaram #BCCommission #DistrictAdministration #Collector
District Collector, Vizianagaram tweet mediaDistrict Collector, Vizianagaram tweet mediaDistrict Collector, Vizianagaram tweet mediaDistrict Collector, Vizianagaram tweet media
తెలుగు
0
0
4
33
District Collector, Vizianagaram
తారక రామ తీర్థ సాగరం రిజర్వాయర్ ప్రాజెక్టు పెండింగ్ పనులను పూర్తి చేయుటకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. తారకరామా తీర్థ సాగర రిజర్వాయర్ పనులను గూర్చి రెవిన్యూ, సాగునీటి శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టుకు అవసరమైన 110 కోట్ల రూపాయలకు పరిపాలన అనుమతులు కొరకు ప్రతిపాదనలు పంపించాలని తెలిపారు. ప్రాజెక్టు పనులను తిరిగి ప్రారంభించుటకు, పూర్తి చేయుటకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాజెక్టు ప్రభావిత గ్రామాల ప్రజలతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకోవాలని, సమస్యలు పరిష్కరించుటకు సానుకూలంగా స్పందించాలని సూచించారు.
District Collector, Vizianagaram tweet mediaDistrict Collector, Vizianagaram tweet mediaDistrict Collector, Vizianagaram tweet media
తెలుగు
0
0
2
29
District Collector, Vizianagaram
జిల్లాకు మంజూరైన పరిశ్రమలను వేగంగా పూర్తి చేయుటకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. రెవెన్యూ అధికారులు, పరిశ్రమల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి జిల్లాకు మంజూరైన పరిశ్రమలు, ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయాలని తెలిపారు. MSME ఏర్పాటు, ఫుడ్ పార్క్, వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన MOU లను త్వరగా పూర్తి చేయాలని, రాజాం, చీపురుపల్లిలలో APIIC పార్క్ లు ఏర్పాటుకు భూసేకరణ ప్రక్రియ చేపట్టాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. పరిశ్రమలకు అవసరమగు లాజిస్టిక్స్ ను ఏర్పాటు చేయాలని తెలిపారు.
District Collector, Vizianagaram tweet mediaDistrict Collector, Vizianagaram tweet media
తెలుగు
0
0
4
32
District Collector, Vizianagaram
మిషన్ హార్టి విజన్ కార్యక్రమం ద్వారా ఉద్యాన పంటల సాగుకు జూన్ నెల మొదటి వారం నాటికి 6500 ఎకరాలు భూమి, ప్రణాళిక సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మిషన్ హార్టికల్చర్ విజన్ కార్యక్రమంపై వ్యవసాయ, ఉద్యానవన శాఖ, రెవెన్యూ అధికారులతో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మిషన్ హార్టికల్చర్ విజన్ కార్యక్రమం విజయవంతం చేయుటకు ఇచ్చిన లక్ష్యాలు పూర్తిచేయాలన్నారు. మొదటి దశలో బోరు, కరెంటు కలిగిన రైతులు జూన్ నెలలో మొక్కలు సాగుకు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. రెండవ దశలో బోర్ ఉండి కరెంటు లేని రైతులకు కరెంటు సదుపాయం కల్పించుటకు అవసరమైన ఫారం-3, 1బి దృవపత్రాలు రెండు రోజులలో అందించాలని తహసీల్దార్ లను ఆదేశించారు. గ్రామ వ్యవసాయ సహాయకులు దృవపత్రాలు పొందిన రైతులచే ఏపీ ఈపీడీసీఎల్ వారి టోల్ ఫ్రీ నెంబర్ 1912 ద్వారా దరఖాస్తు చేయించాలన్నారు. దరఖాస్తు అందిన తరువాత వారం రోజులలో విద్యుత్ అధికారులు విద్యుత్ కలెక్షన్ మంజూరు చేస్తారని, 30 రోజులలో విద్యుత్ కలెక్షన్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. కరెంటు ఏర్పాటుకు రుణ సహాయం కావలసిన వారికి డి ఆర్ డి ఎ ద్వారా 48 గంటలలో రుణం మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. విద్యుత్ శాఖ నుండి 900 మంది రైతులు వ్యవసాయ బోరు లకు కనెక్షన్ మంజూరై ఉన్నారని, వాటిని కూడా మిషన్ హార్టి విజన్ కార్యక్రమంలో భాగస్వాములు చేయుటకు కృషి చేయాలని, రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. మిషన్ హార్టి విజన్ లక్ష్యం పదివేల ఎకరాలు పూర్తి చేయుటకు మూడవ దశలో ఆసక్తి కలిగిన రైతులకు అవసరమైన బోరుబావి, విద్యుత్ సదుపాయం కల్పించుటకు చర్యలు తీసుకోవాలని, ఆర్థిక సహాయం కావలసిన రైతులకు రుణాలు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంద్వారా కూరగాయలు సాగు చేసే రైతులకు మార్కెటింగ్ సదుపాయాలు కల్పించుటకు తగిన ప్రణాళిక సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు తెలిపారు.
District Collector, Vizianagaram tweet mediaDistrict Collector, Vizianagaram tweet media
తెలుగు
0
0
2
26
District Collector, Vizianagaram
జిల్లాలో మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల నివారణకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని, అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. శుక్రవారం ఆన్లైన్ ద్వారా నిర్వహించిన జిల్లా స్థాయి నార్కోటిక్స్ కంట్రోల్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లాలో వీటి నిర్మూలనకు 100 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. జిల్లాలో మత్తు పదార్థాల వినియోగాన్ని, రవాణాను పూర్తిస్థాయిలో నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు కట్టుదిట్టమైన చర్యలను తీసుకోవడంతో పాటు, క్షేత్రస్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. చెక్ పోస్టులలో విస్తృత తనిఖీలు కారణంగా రోడ్డు మార్గంలో గంజాయి రవాణా కొంతవరకు అరికట్టబడిందని, రైలు రవాణాపై దృష్టి పెట్టి, విస్తృత తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. అదేవిధంగా కొన్నిరకాల షెడ్యూల్డ్ డ్రగ్స్ విక్రయ నివారణకు, మందుల షాపులను నిరంతరం తనిఖీ చేయాలని ఆదేశించారు. మత్తు పదార్థాలను వినియోగించే వారిని గుర్తించే ప్రక్రియలో ఉపాధ్యాయులు, అధ్యాపకులు, హాస్టల్ వార్డెన్లు, వైద్యులను భాగస్వాములను చేయాలని చెప్పారు. దీనికోసం విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు అవగాహన సదస్సులను నిర్వహించాలన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్వీ మాధవరెడ్డి మాట్లాడుతూ, విద్యార్థుల ప్రవర్తనపై ఉపాధ్యాయులు నిఘా ఉంచడం ద్వారా, మత్తుపదార్ధాలను వినియోగించే వారిని గుర్తించే అవకాశం ఉందని సూచించారు. విజయనగరం ఏఎస్పీ సౌమ్యలత మాట్లాడుతూ జిల్లాలో డ్రగ్స్ నిర్మూలనకు తీసుకున్న చర్యలను వివరించారు. ఈ ఆన్లైన్ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్ సేధు మాధవన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
District Collector, Vizianagaram tweet media
తెలుగు
0
0
2
29
District Collector, Vizianagaram
జిల్లాలో జలధార క్రింద చేపడుతున్న చెరువు పనులన్నీ జలధార యాప్ లో అప్లోడ్ చేయాలనీ జిల్లా కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ జలధార పనులు, ఉపాధి హామీ పనుల పై టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జలధార –జల హారతి క్రింద జిల్లాలో 4,469 పనులు ప్రస్తుతం జరుగుతున్నాయని, అయితే వాటిలో 736 పనులను మాత్రమే అప్లోడ్ చేసారని, 3 రోజుల నుండి ప్రతి రోజు చెపుతున్నప్పటికీ అప్లోడ్ చేయకపోవడం పై ఎం.పి.డి.ఓ ల పై ఆగ్రహం వ్యక్తం చేసారు. పలువురు ఎం.పి.డి.ఓ లు మాట్లాడుతూ సాంకేతిక సమస్యలు తలెత్తడం వలన అప్లోడ్ కాలేదని, యాప్ లో కొన్ని పనులు కనపడడం లేదని తెలిపారు. ఇరిగేషన్ అధికారులు వీటిని పర్యవేక్షించాలని, సమస్య ఉంటె తన దృష్టికి తేవాలని, ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కారం చూస్తామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఉపాధి హామీ పధకం క్రింద పని దినాలు తగ్గుతున్నాయని వాటికీ గల కారణాల పై కలెక్టర్ ఆరా తీసారు. రెండు రోజులుగా అక్కడక్కడా వర్షాలు పడడం వలన వేతనదారులు పనులకు రాలేకపోతున్నారని, అందుకే పనిదినాలు తగ్గాయని మండల అధికారులు వివరించారు. అలాగే సరాసరి వేతనం పెరిగేల చూడాలని, వేసవిలోనే ఉపాధి పనుల వేగం పెంచాలని, వెనకబడి ఉన్న మండలాలు వేతనాలు, పనిదినాల పై దృష్టి పెట్టాలని ఆదేశించారు.
District Collector, Vizianagaram tweet media
తెలుగు
0
1
3
30
District Collector, Vizianagaram
ఎల్.కోట మండలం గంగుబుడి గ్రామానికి చెందిన ఎలిశెట్టి ఉమా పార్వతి 594 మార్కులు సాధించి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో అగ్రస్థానంలో నిలిచారు. సంతకవిటి మండలం నడసాడ గ్రామానికి చెందిన సాత్విక కూడా 594 మార్కులతో ప్రతిభ చాటారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గంగుబుడి గ్రామంలో ఉమా పార్వతి ఇంటికి వెళ్లి స్వయంగా అభినందించారు. ప్రభుత్వ పాఠశాలలో చదివి ఈ స్థాయి విజయాన్ని సాధించడం గర్వకారణమని, కృషి, పట్టుదల ఉంటే ప్రభుత్వ పాఠశాలల నుంచే అగ్రస్థానాలు సాధించవచ్చని ఈ సందర్బంగా కలెక్టర్ అభినందించారు. ఈ విజయాలు ఇతర విద్యార్థులకు ప్రేరణగా నిలవాలని స్ఫూర్తి నివ్వాలని ఆకాంక్షించారు.
District Collector, Vizianagaram tweet mediaDistrict Collector, Vizianagaram tweet mediaDistrict Collector, Vizianagaram tweet mediaDistrict Collector, Vizianagaram tweet media
తెలుగు
0
1
8
43
District Collector, Vizianagaram
జిల్లా కలెక్టర్ గంట్యాడ మండలం నరవ గ్రామంలో పింఛన్లను లబ్ధిదారులకు స్వయంగా అందజేశారు. ప్రభుత్వం అందిస్తున్న సామాజిక భద్రతా పింఛన్లు అర్హులందరికీ సమయానికి చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లాలో మొత్తం 2,68,642 మంది లబ్ధిదారులకు రూ.114.92 కోట్ల పింఛన్లు పంపిణీ జరుగుతోందన్నారు. పారదర్శకంగా, వేగంగా పింఛన్ల పంపిణీ కొనసాగుతోందని తెలిపారు. #Pensions #Vizianagaram #AndhraPradesh #WelfareSchemes
District Collector, Vizianagaram tweet mediaDistrict Collector, Vizianagaram tweet mediaDistrict Collector, Vizianagaram tweet mediaDistrict Collector, Vizianagaram tweet media
తెలుగు
0
0
5
42
District Collector, Vizianagaram
భారత ప్రభుత్వం ఆదేశాల మేరకు నిర్వహించబడుతున్న జనగణన – 2027 కార్యక్రమంలో భాగంగా ఫీల్డ్ ఎన్యూమరేషన్ (House Listing Operation – Phase-1) మే 1 శుక్రవారం నుండి మే 30 వరకు జిల్లాలో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. మే 1 శుక్రవారం నుండి మే 30 వరకు ఎన్యూమరేటర్లు ప్రతి ఇంటిని సందర్శించి కుటుంబ వివరాలను సేకరిస్తారని తెలిపారు. ప్రజలు తమ నివాసాల్లో అందుబాటులో ఉండి, సరైన సమాచారాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే స్వీయ గణన పూర్తి చేసిన వారు తమ రిఫరెన్స్ ఐడి (SE ID) ను ఎన్యూమరేటర్‌కు చూపాలని సూచించారు. అవసరమైతే వివరాలు సవరించి తుది నమోదు చేస్తారని తెలిపారు. సెన్సస్ యాక్ట్ , 1948 ప్రకారం: సెక్షన్ 8: సరైన సమాచారం ఇవ్వడం ప్రతి పౌరుని బాధ్యత సెక్షన్ 9: జనగణన అధికారులకు గృహంలో ప్రవేశానికి అనుమతి ఇవ్వాలి గృహాలపై గుర్తులు/సంఖ్యలు వేయడానికి సహకరించాలి సెక్షన్ 10: ఫారమ్‌ను సరిగ్గా పూరించి అందించాలి. సెక్షన్ 11 ప్రకారం తప్పుడు సమాచారం ఇవ్వడం, సహకరించకపోవడం లేదా అడ్డుకోవడం వంటి చర్యలకు చట్టపరమైన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు. ప్రజలు అందించే సమాచారం పూర్తిగా గొప్యంగా ఉంచబడుతుందని, జనగణన కార్యక్రమం కొరకు మాత్రమే వినియోగించబడుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. జనగణన–2027 విజయవంతం కావాలంటే ప్రతి పౌరుడు సహకరించి సరైన వివరాలు అందించాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. సందేహాల నివృత్తి కొరకు జనగణన కంట్రోల్ రూమ్ జిల్లా కలెక్టర్ కార్యాలయం, విజయనగరం 📞 08922-236947, 9000641751, 6300851185
District Collector, Vizianagaram tweet media
తెలుగు
0
1
4
70
District Collector, Vizianagaram
ప్రతి నెల 30 న డివిజన్, మండల స్థాయి లో పౌర హక్కుల దినం తప్పనిసరిగా జరపాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. గురువారం కలెక్టరేట్ ఆడిటోరియం లో జిల్లా విజిలెన్సు అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పలువురు సభ్యులు మాట్లాడుతూ మండలాల్లో ఎప్పుడు సివిల్ రైట్స్ డే జరుపుతున్నారో ఎవ్వరికీ తెలియడం లేదని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. కలెక్టర్ స్పందిస్తూ ప్రతి నెల 30 న తప్పక సమావేశం జరపాలని, ప్రజా ప్రతినిధులకు సభ్యలకు ఆహ్వానించాలని, ఆ మినిట్స్ ను జిల్లా ప్రధాన కేంద్రానికి పంపాలని ఆర్.డి.ఓ లు దీని పై ప్రత్యెక శ్రద్ధపెట్టాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశపు వివరాలను పత్రికలూ కూడా ఇవ్వాలని, ప్రజలందరికీ ఇటువంటి సమావేశం నిర్వహిస్తున్న విషయం తెలియాలని అన్నారు. ప్రతి బుధవారం రెవిన్యూ అధికారులతో జరిపే టి.సి లో ఎజెండా గా ఈ అంశాన్ని పెట్ట్టాలని డి.ఆర్.ఓ కు సూచించారు. ఈ సందర్భంగా గత సమావేశపు ఎజెండా ,ఏక్షన్ టేకెన్ పై సమీక్షించారు. అదనపు ఎస్.పి సౌమ్యలత మాట్లాడుతూ ఎస్.సి., ఎస్.టి అట్రోసిటి చట్టం క్రింద డిసెంబర్ 16 నుండి మార్చి 31, 2026 వరకు 15 కేసు లు నమోదయ్యాయని, ఇన్వెస్టిగేషన్ లో 10 కేసు లు ఉన్నాయని, కోర్ట్ లో ట్రయల్ లో 1 కేసు ఉందని, 4 కేసు లను రెఫెర్ చేయడం జరిగిందని తెలిపారు. జిల్లా కలెక్టర్ స్కావెంజేర్స్ చట్టం పై మాట్లాడుతూ ఎక్కడా కూడా మాన్యువల్ స్కావెంజేర్స్ ఉండకుండా చూడాలని మున్సిపల్ కమీషనర్ లకు ఆదేశించారు. ఆర్.డి.ఓ లు ఈ విష పై పర్య వేక్షించాలని సూచించారు.
District Collector, Vizianagaram tweet mediaDistrict Collector, Vizianagaram tweet media
తెలుగు
0
0
4
37
District Collector, Vizianagaram
మే నెల 1 నుండి 30 రోజుల పాటు జరగనున్న ఇంటింటి జనగణన తప్పులు లేకుండా చేయాలనీ జిల్లా కలెక్టర్ తెలిపారు. వేగం కన్నా నాణ్యం గా చేయడం ముఖ్యమని స్పష్టం చేసారు. ఇంటింటి జనగణన పై గురువారం మండల స్థాయి అధికారులతో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. జనగణన లో సేకరించిన వ్యక్తిగత సమాచారం గోప్యంగా ఉంచాలని, ఈ సమాచారం ఆర్.టి.ఐ క్రిందకు రాదనీ తెలిపారు. ఎన్యుమరేటర్లకు అప్పాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వాలని, వారు కిట్, ఐ.డి. కార్డు, జనగణన టోపీ ధరింఛి ఎన్యుమరేషన్ కు వెళ్ళాలని , ఉదయం, సాయంత్రం వెళ్ళాలని, ఏ ఒక్కరూ లెక్కింపు పూర్తయ్యేవరకు సెలవులు పెట్టరాదని తెలిపారు. అధికారులు ప్రతి ఒక్కరూ క్షేత్ర స్థాయి పర్యటనలకు వెళ్లి పర్యవేక్షించాలని, లెక్కింపు కార్యక్రమాన్ని వీడియో తీయాలని తెలిపారు. జిల్లా స్థాయి లో కంట్రోల్ రూమ్ 08922 236947 ఏర్పాటు చేయడం జరిగిందని, అలాగే మండల స్థాయి లో కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలనీ, జనగణన పై విస్తృత ప్రచారం చేయాలనీ సూచించారు. సిగ్నల్ లేని చోట ఆఫ్ లైన్ లో చేసి సిగ్నల్ ఉన్న చోటకు వచ్చి ఆన్లైన్ చేయాలనీ తెలిపారు. జనాభా లెక్కల కార్యక్రమం ఎన్నికల నిర్వహణ లాంటిదేనని, తప్పులు చేసే వారిపై జనగణన చట్టం ప్రకారం క్రమ శిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. స్వీయ జనగణన లో మన జిల్లా రాష్ట్రం లో 2 వ స్థానం లో ఉందని, స్వీయ గణన తో సమానంగా లేదా ఇంకా ఎక్కువ శాతం ఇంటింటి గణన జరిగేల చూడాలని, అంతకన్నా తక్కువ చేయకూడదని స్పష్టం చేసారు. మున్సిపల్ కమీషనర్లు, DDO లు, MPDO లు, తఃసిల్దార్లు సహకరించాలని అన్నారు.
District Collector, Vizianagaram tweet media
తెలుగు
0
0
4
37
District Collector, Vizianagaram
10వ తరగతి ఫలితాల్లో రాష్ట్రం లో మన జిల్లా 3వ స్థానం లో నిలిచినందుకు డి.ఈ. ఓ మాణిక్యం నాయుడు గారిని జిల్లా కలెక్టర్ అభినందించారు. జిల్లాలో 91.08% పాస్ అయ్యారని, గత ఏడాది ఫలితాల్లో జిల్లా 7వ స్థానంలో ఉండగా ఈ ఏడాది 3వ స్థానం లో నిలిచిందని, 60 ప్రభుత్వ పాఠశాలల్లో శత శాతం ఫలితాలు సాధించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. జిల్లా అధికారులు ప్రత్యేకాధికారులుగా వ్యవహరించి, 100 రోజుల ప్రణాళికను పక్కాగా అమలు చేసినందున ఉత్తమ ఫలితాలను సాధించగలిగామని, జిల్లా అధికారులను కూడా కలెక్టర్ అభినందించారు. ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థుల ఫోటోలు, పాఠశాలల ఫోటోలను ఫ్లెక్సీ వేసి కలెక్టరేట్ వద్ద డిస్ప్లే చేయాలని, తల్లి దండ్రులు ప్రభుత్వ పాఠశాలల పై దృష్టి పెట్టేలా చూడాలని డి.ఈ.ఓ కు సూచించారు.
District Collector, Vizianagaram tweet mediaDistrict Collector, Vizianagaram tweet media
తెలుగు
0
0
5
40
District Collector, Vizianagaram
రేపటినుంచి ప్రారంభం కానున్న ఇంటింటి జనగణన ప్రక్రియకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని జిల్లా కలెక్టర్ చెప్పారు. అమరావతి నుంచి రాష్ట్ర జనగణన నోడల్ అధికారి రావత్, స్టేట్ సెన్సస్ ఆపరేషన్స్ డైరెక్టర్ నివాస్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల వారీగా జనగణన సన్నద్ధతను పరిశీలించారు. ఈ వీసీలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియలో జిల్లా ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నట్లు చెప్పారు. మనం నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రతి ఛార్జ్ ఆఫీసర్ మరియు ఎన్యూమరేటర్ బాధ్యతగా పనిచేస్తున్నారని తెలిపారు. స్వీయ గణనకు ఈరోజు కూడా అవకాశం ఉందని, క్షేత్ర స్థాయిలో ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నామని వివరించారు. ఇంటింటి గణన ప్రక్రియ మరింత పారదర్శకంగా సాగేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. ఎన్యూమరేటర్లందరికీ ఇప్పటికే తగిన శిక్షణ ఇచ్చామని, ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించామని తెలిపారు. రేపటినుంచి ప్రారంభం కానున్న జనగణనలో రాబోయే మూడు రోజులు అత్యంత కీలకమని కలెక్టర్ పేర్కొన్నారు. నియోజకవర్గాల వారీగా గణన ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తామని ఈ సందర్భంగా కలెక్టర్ వెల్లడించారు.
District Collector, Vizianagaram tweet mediaDistrict Collector, Vizianagaram tweet mediaDistrict Collector, Vizianagaram tweet media
తెలుగు
0
0
5
38
District Collector, Vizianagaram
జిల్లా కలెక్టర్ గజపతినగరంలోని అన్న క్యాంటీన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్యాంటీన్ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి, పరిశుభ్రత పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. క్యాంటీన్ నిర్వహణ తీరును పర్యవేక్షించిన కలెక్టర్, అక్కడ అందుతున్న భోజన నాణ్యతపై ప్రత్యేకంగా ఆరా తీశారు. పేదలకు నాణ్యమైన, రుచికరమైన భోజనాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, నిర్వహణలో ఎక్కడా రాజీ పడకూడదని అధికారులకు మరియు నిర్వాహకులకు దిశానిర్దేశం చేశారు. నిరంతరం క్యాంటీన్ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, నిబంధనల ప్రకారం నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఆయన ఆదేశించారు.
District Collector, Vizianagaram tweet mediaDistrict Collector, Vizianagaram tweet mediaDistrict Collector, Vizianagaram tweet mediaDistrict Collector, Vizianagaram tweet media
తెలుగు
0
1
6
48
District Collector, Vizianagaram
స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (PHC) జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించి, రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ముందుగా హాజరు పట్టికను తనిఖీ చేసిన కలెక్టర్, సిబ్బంది సమయపాలన పాటించాలని ఆదేశించారు. అనంతరం మందుల నిల్వలు, ల్యాబ్ సౌకర్యాలు మరియు వార్డుల్లోని పారిశుధ్య పరిస్థితులను స్వయంగా పర్యవేక్షించారు. ​రోగులతో ముఖాముఖి మాట్లాడిన కలెక్టర్, వారికి అందుతున్న చికిత్స మరియు సిబ్బంది తీరుపై ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఇందులో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆసుపత్రి ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని మరియు అత్యవసర మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూడాలని వైద్యాధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట పలువురు రెవెన్యూ మరియు ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.
District Collector, Vizianagaram tweet mediaDistrict Collector, Vizianagaram tweet mediaDistrict Collector, Vizianagaram tweet mediaDistrict Collector, Vizianagaram tweet media
తెలుగు
0
0
3
29
District Collector, Vizianagaram
జలధార - జల హారతి కింద గుర్తించిన చెరువుల పనులన్నీ వెంటనే ప్రారంభం కావాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. గ్రామాల్లో ఇప్పటికే గుర్తించిన అన్ని చెరువు పనులకు ఆమోదం పొందాలని అన్నారు. బుధవారం చీపురుపల్లి , బొబ్బిలి డివిజన్ల కు చెందిన అధికారులతో జలధార పనుల పై కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పనుల ప్రారంభానికి ముందు అన్ని గ్రామాల్లో భూగర్భ జలాల పరిస్థితిని నమోదు చేసి నివేదికను పంపాలని గ్రౌండ్ వాటర్ డి డి కి సూచించారు. ప్రారంభానికి ముందు ఉన్న భూగర్భ జలాల స్థితి, పనులు పూర్తైన తర్వాత పెరిగిన భూగర్భ జలాల స్థితిని గుర్తించడం ద్వారా ఏ మేరకు పెరిగిందో తెలుసుకునేందుకు ఉపకరిస్తుందని అన్నారు. ప్రారంభించిన పనులకు ఫోటోలు తీయడం, అప్లోడ్ చేయడం జరగాలన్నారు. చెరువులన్నిటినీ సందర్శించి జియో కోఆర్డినేషన్ చేయాలని, ప్రతి పనికి ఫోటో తీసి, ఆ ఫోటో కు ఒక ఐ.డి ను ఇచ్చి చెరువు పేరును కూడా రాసి ఫైల్ సేవ్ చేయాలన్నారు. గ్రామం వారీగా ఎన్ని పనులను గుర్తించారు, ఎన్ని పనులకు ఆమోదం లభించింది, ఎన్ని పనులు ప్రారంభం అయినవి వివరాలను వెంటనే పంపాలని ఆదేశించారు. అలాగే పని వారీగా, మండల వారీగా డైలీ ప్రోగ్రెస్ రిపోర్ట్ పంపాలని డ్వామా పి. డి శారదా దేవికి సూచించారు.
District Collector, Vizianagaram tweet media
తెలుగు
0
0
2
27