Krishna Murali

2.6K posts

Krishna Murali banner
Krishna Murali

Krishna Murali

@directedbykrish

For me, cinema is bread and happiness 😊 budding filmmaker 🎥 సినిమా అంటే బాధ్యతతో తీసేది 🤗

films Katılım Ağustos 2012
48 Takip Edilen12.5K Takipçiler
Krishna Murali
Krishna Murali@directedbykrish·
పెన్ను, పేపర్ పట్టుకుని ఏకాగ్రతతో "RGV" సర్ సినిమాలు చూస్తూ నోట్ చేసుకుంటే సినిమా ఎలా తీయాలో తెలుస్తుంది.... "స్టడీ కెమెరాతో శ్రీదేవి గారిని ఫాలో చేస్తూ, రోడ్ మీదకి రాగానే కెమెరాని ఆపరేటర్ ను క్రేన్ మీదకి ఎక్కించి లాంగ్ టేక్ తీయడం అది కూడా ఆ రోజుల్లో 🥹🙏👏 12వ నిముషం వరకూ ఒక్క డైలాగ్ ఉండదు, 35వ నిముషం వరకూ హీరో ఎంట్రీ ఉండదు, 56వ నిముషంలో ఒకరి పేర్లు ఒకరు తెలుసుకుంటారు 🙌🙌🙌 చెప్పుకుంటూ పోతే "క్షణ క్షణం సినిమాలో బోలెడు ఉన్నాయి". సినిమాని నేర్పిస్తున్నందుకు @RGVzoomin 🧠🧠🧠
తెలుగు
0
1
21
747
Krishna Murali
Krishna Murali@directedbykrish·
కీరవాణి గారి దృష్టిలో ఆయనకి ఆస్కార్ వచ్చిన మొదటి సినిమా, నిజానికి ఆస్కార్ కంటే ఎక్కువ ఆనందించేలా చేసిన సినిమా..... ఒక పియానో, ఒక వేణువు, ఒక వయోలిన్ తో నిశ్శబ్దంలో నుండి సృష్టించిన సంగీత ఝరి 🎹 🪈 🎻
తెలుగు
1
21
330
22.2K
Krishna Murali
Krishna Murali@directedbykrish·
నాకు ముగ్గురు అమ్మలు..... ఒకరు నన్ను కన్నతల్లి, ఇంకొకరు నన్ను మోస్తున్న భారతమాత, మరొకరు "సుబ్బులక్ష్మి" అమ్మ : అబ్దుల్ కలాం గారు 🐐🐐🐐 నుదుటన పెద్ద బొట్టు, దాని కిందన చిన్న కుంకుమ, జుట్టు ముడి వేసుకుని వెనుక కాంతిలా ఉండే మల్లెపూలు, రెండు ముక్కు పుడకలు.... "అమ్మ కంటే సౌందర్యాన్ని, అమ్మ కంటే అందమైన సింగర్ ను ఎక్కడా చూడలేదు నేను"🙏🙏🙏 భారతరత్న శ్రీ #సుబ్బులక్ష్మి అమ్మ
తెలుగు
3
38
214
6.3K
Krishna Murali
Krishna Murali@directedbykrish·
పద్మంలో కూర్చున్న బ్రహ్మ చేత పొగడబడే రాముడికి 🪷, మహావిష్ణువుకు ఇంకో రూపం అయినటువంటి రాముడికి 🏹, శివుడిని పూజించే జనకమహారాజుకి అల్లుడైన రాముడికి, శివధనస్సుని విరిచిన రాముడికి🏹 లంకని దహించిన రాముడికి 🔥, శరణుకోరి వచ్చిన విభీషణుడిని దగ్గరకి తీసుకున్న రాముడికి 🫂, వెంకటగిరి కొండమీద కొలువైన వెంకటేశ్వర స్వామి అయిన రాముడికి, సాధువులు పండితులతో నిత్యం కీర్తించబడే రాముడికి నమస్కరిస్తూ ..... రాసిన #అన్నమయ్య గారికి, పాడిన #సుబ్బులక్ష్మి అమ్మ గారికి స్మరించుకుంటూ.....
తెలుగు
0
5
63
3.5K
Krishna Murali
Krishna Murali@directedbykrish·
మనసు.... మాటలు కాదుగా??? నీకు బాగా ఇష్టమైన వ్యక్తి నిన్ను వదిలేసి వెళ్తున్నప్పుడు ఏడుస్తావ్ కదా!!! ఆ మసక కళ్ళతో ఉన్నప్పుడు, మళ్ళీ వాళ్ళు ఎదురుగా వచ్చి నిల్చున్నా కూడా నువ్వు చూడలేవు ( నీరు పొంగిన కనులలోనా, నీటి తెరలే అడ్డు నిలిచే) అలాంటప్పుడు నీ మనసు పదే పదే చెప్తూ ఉంటుంది!! ఒకసారి చూసుకో, నువ్వు తప్పు చేస్తున్నావ్, ఆలోచించు అని చెప్తుంది కానీ మనసు దాన్ని అస్సలు ఒప్పుకోదు.... ఎందుకంటే "మనసు....మాటలు కాదుగా"🔥🔥🔥 #వేటూరి గారు కూడా పొంగిపోయారు ఇంత గొప్పగా నేను రాశానా అని....
తెలుగు
0
16
93
3.1K
Krishna Murali
Krishna Murali@directedbykrish·
"మొజార్ట్ ఆఫ్ మద్రాస్ నుండి వచ్చిన ఇంకో క్లాసిక్"🐐 విజువల్స్ లేకపోతే ఇదొక మెలోడీ, విజువల్స్ తో చూస్తే ఒక ఖచ్చితమైన స్పెషల్ సాంగ్ 🔥🔥🔥 ఏదైనా కొత్తది, గొప్పది వచ్చినప్పుడు అన్వయించుకోవడానికి, అలవాటుపడడానికి కాస్తా సమయం పడుతుంది #రహమాన్ సర్ సంగీతం అలాంటిదే, ముందునుండి ఆయన చేస్తున్నది కూడా అలాంటి సంగీతమే కాబట్టి మనమే జ్ఞానాన్ని పెంచుకుని వినాలి 🙏🙏🙏 నీ లక్ష్యం కోసం నువ్వు వెళ్ళే దారిలో కాస్తా ఎంటర్టైన్మెంట్ కూడా ఉండేలా చూసుకో అని కొంచెం ఘాటైన పదాలతో సాహిత్యాన్ని రాసిన @IananthaSriram గారికి, నాకు ఇలాంటి పదాలు కావాలని రాయించుకున్న @BuchiBabuSana గారికి 🤗🤗🤗 ఒకవేళ పాట నచ్చలేదు అని ఎవరైనా అంటే గొడవకి దిగకుండా నవ్వేసి ఊరుకుని వెళ్ళిపొండి.... #Peddi
తెలుగు
8
86
545
21.9K
Krishna Murali
Krishna Murali@directedbykrish·
ఎంత దొడ్డ మనసురా "చిన్నా" నీది 💕😘🥰 నీ పొట్ట కొట్టిన వాడిని శిక్షించకుండా, మీ అమ్మకి దూరం చేసిన వాడి మీద కోపం తెచ్చుకోకుండా, వాడి పాపాన వాడే పోతాడని వదిలేసావు 🙌👏 "అమరావతి కథలు" పుస్తకంలో వాక్యాలను మారిస్తే!! "చదువులేని చిన్నా కంటే, జ్ఞానం లేని కుక్క కంటే ఏమంత గొప్పగా ఎదిగిపోయాం??". క్షమించి వదిలేసేవాడి కంటే గొప్పోడు ఎవడుంటాడు??
తెలుగు
1
11
99
5.7K
Krishna Murali
Krishna Murali@directedbykrish·
"మంచు శిఖరం నుండి కింద పడిన రామ్ గోపాల్ వర్మ" అని రాసిన పాత్రికేయులకు, రివ్యూస్ రైటర్స్ కి, బహుశా క్రాఫ్ట్ అర్థం కాలేదు అనుకుంటా...... ఒక మర్డర్ జరుగుతున్నప్పుడు "ఇలాంటి నేపథ్య సంగీతం ఇంతవరకూ ఎవ్వరైనా ఆలోచించారా??" రియాక్షన్స్ ఎలా కట్ చేసారో ఎవడైనా చూసాడా?? ఎడిటింగ్ స్టైల్ ఇప్పటికీ ఎవడికైనా వచ్చా?? చంపేవాడి కోపం ఎంత అవసరమో!!!! చనిపోయేవాడి బాధ కూడా అంతే ముఖ్యం అని క్లోజ్ అప్ షాట్ లు పెట్టే జీనియస్ @RGVzoomin సర్ కి ప్రేమతో
తెలుగు
1
13
137
15.6K
Krishna Murali
Krishna Murali@directedbykrish·
"నిన్ను కాదని నాకు పరివారమేది" అనగలను, "నన్ను కాదని నీకు పరమార్థమేది" అని ఎప్పటికీ అనలేను....... 🫂🥰😘🙌👏♾️ తల్లిదండ్రులు, తోబుట్టువులు, స్నేహితులు, భార్య పిల్లలు అందరూ ఏదో ఒకరోజు వదిలేసి వెళ్ళిపోతారు. చివరివరకూ తోడు ఉండేది భగవంతుడే అని #సీతారామశాస్త్రి గారు అంటూ ఉండేవారు...... దాహంతో ఉన్నటువంటి మనిషికి దప్పిక తీర్చే నల్లని మేఘానివి నువ్వు, నిజానికి ఆ మేఘం మాకు దూరంగా ఉంటుంది, దగ్గరలో ఉన్న మేఘానివి నువ్వే కదా??? "గారవించి దప్పి తీర్చే కాల మేఘమా 🌨️☁️!!!!"
తెలుగు
3
32
266
3.6K
Krishna Murali
Krishna Murali@directedbykrish·
ఇంత అందంగా "థాంక్స్ చెప్పడం మీరు ఎక్కడైనా చూసారా??" మనస్పూర్తిగా థాంక్స్ చెప్పినప్పుడు ముందు మాటలు రావు, గొంతు తడారిపోతుంది, కేవలం నోటి నుండి రాదు... హృదయం లోపలనుండి వస్తూ, గొంతు తడారిపోతూ, వణుకుతూ, బెరుకుగా వస్తుంది అంటే "అచ్చంగా బాలు, మాధవికి చెప్పినట్టు" 💕 "సరే!!! ఇక నేను వెళ్తాను" అని మాధవి గారు ఎంత అందంగా తల ఆడించారు 🥹🥹🥹 #విశ్వనాథ్ గారు చితక్కొట్టారు.... కృష్ణ పరమాత్ముడు మురళిని ఊదినట్టుగా #ఇళయరాజా సర్ వేణువు చేసే శబ్ధం 🎶🎵
తెలుగు
3
19
170
6.2K
Krishna Murali
Krishna Murali@directedbykrish·
సీరా ( చీరా), సొక్కా ( షర్ట్), సిక్కడిపోవాలో ( ముడిపడిపోవాలి) 🔥🔥🔥 మా ఉత్తరాంధ్ర పల్లెటూరి రొమాన్స్ లో మాస్ ఇలాగే ఉంటుంది 🙌🙌🙌 THE A.R.RAHMAN sir's MUSIC 🎷🎸🎻🥁 శంకర్ సర్ సినిమాలు, మణిరత్నం సర్ సినిమాల స్థాయిలో ఏ మాత్రం తగ్గకుండా కంపోజ్ చేసిన సంగీతం..... ఇకనుండి @BuchiBabuSana సినిమాకి కొట్టినట్టు కొట్టండి అని #రహమాన్ సర్ ను మిగతా దర్శకులు అడగాలి.... మా ఉత్తరాంధ్ర యాసను పట్టుకున్న @IananthaSriram గారికి 😘😘😘 స్టార్టింగ్ ఇన్స్ట్రుమెంటేషన్ "మణిరత్నం సర్ విలన్ సినిమాని గుర్తుకుతెచ్చింది"..... #PeddiStorm #peddi
తెలుగు
2
190
1.5K
63.3K
Krishna Murali
Krishna Murali@directedbykrish·
70 ఏళ్ల నటుడు ఎక్సర్సైజ్ చేస్తుంటే?? 25 ఏళ్లకే పొట్ట ఉన్నవాళ్ళు ఆయన్ని విమర్శిస్తున్నారు.... హీరో, దర్శకుడు సోదరభావంతో కలిసి ఉంటే?? లేకితనంతో వాళ్ల మీద జోక్స్ వేసి విమర్శిస్తున్నారు.... టాలెంట్ ను చూడకుండా పొట్టిగా ఉన్నాడని ఇంకో హీరోని విమర్శిస్తున్నారు.... ఎండ కాస్తే కాళ్ళు బయట పెట్టనివాడు కూడా ఎండలో చెమటతో వేల పరుగులు చేసిన క్రికెటర్ ను విమర్శిస్తున్నారు..... ఒక్క సంగీత వాయిద్యం చేతితో స్పృశించని వాడు కూడా ఆస్కార్ అవార్డ్ తీసుకున్న సంగీత దర్శకుడిని విమర్శిస్తున్నారు.... "విమర్శించడం తప్ప ప్రశంసించడం మానవజాతి మర్చిపోతుందా?? మర్చిపోయిందా??".... "ఈ ప్రపంచంలో అవసరం అయిన దానికంటే ఎక్కువ విమర్శకులు ఉన్నారు, వీలైతే ప్రశంసించే వాళ్ళ జాబితాలో ఉండడానికి ప్రయత్నించు...ఎందుకంటే వాళ్ళు చాలా తక్కువమంది ఉన్నారు".
తెలుగు
15
59
440
25.4K
Krishna Murali
Krishna Murali@directedbykrish·
ఒక సాయంత్రం వేళ, గోదావరి నదిలో ప్రయాణిస్తున్న పడవ, పాపి కొండలు దాటుకుని వెళ్తున్నప్పుడు, హీరోయిన్ సీత గోరింటాకు పెట్టుకుని హీరో రాముడికి చూపించాలి అనుకుంటుంది. ఇక్కడ ఒక పాట రాయండి సర్!!! "ఎర్ర జాబిలి చేయి గిల్లి రాముడేడని అడుగుతుంటే" ఇది సరిపోతుందా అని నవ్వేసి ఊరుకున్న #వేటూరి గారు 💕 ( అరచేతి మీద గోరింటాకుని ఎర్ర జాబిలి అని రాసేంత శక్తి ఒక మనిషికి ఎలా వస్తుంది అసలు??) "ఆ చుక్కలన్నీ నీకు ఇచ్చేస్తా" అని చెప్పిన సునీత గారి డబ్బింగ్ 😘😘😘 #గోదావరి చూస్తే శరీరం తో పాటుగా మనస్సు కూడా చల్లబడిపోతుంది.
తెలుగు
2
21
176
5.2K
Krishna Murali
Krishna Murali@directedbykrish·
కొన్ని యుద్ధాలు ఒంటరిగానే చేయాలని, నీకు తెలిసిన పద్దతిలోనే చేయాలని చెప్పిన #విశ్వనాథ్ గారు.... తన శాస్త్రీయ నృత్యాన్ని అవమానించారని బాలు తాగేసి పడిపోలేదు, ఆత్మహత్య చేసుకోలేదు, కోపాన్ని వేరేవాళ్ల మీద చూపించలేదు, ఆ బాధని మర్చిపోవడానికి డ్రగ్స్ తీసుకోలేదు, స్పెషల్ సాంగ్ పేరుతో కుప్పిగంతులు వేయలేదు.... తనకి తెలిసిన నృత్యాన్ని దేవుడి సమక్షంలో ప్రదర్శించి అందులోనే స్వాంతన వెతుక్కున్నాడు మళ్ళీ తన పనిలో నిమగ్నమయ్యాడు.... "క్యారెక్టర్ ఆర్క్ అంటే ఇదే కదా??? కాదని ఎవరైనా అనగలమా??
తెలుగు
3
13
106
4.3K
Krishna Murali
Krishna Murali@directedbykrish·
శాస్త్రి గారు చాలా రొమాన్స్ రాసేశారు, అందులో నా వరకూ ఉత్కృష్టమైన రచన అంటే ఇదే చెప్తాను🐐🐐🐐 బాగా పక్వానికి వచ్చిన పండు లాంటి నీ యవ్వనాన్ని కాసింత శ్రద్ధగా చూసుకోనివ్వు ( తేరిపార చూడనీ దోర ఈడుని 🥰) నీ కౌగిలింతలో వచ్చే వేడి, నేను కట్టుకున్న చీరని దాటి ఇంకా ముందుకు వెళ్లనీ ( చీర చూరు దాటనీ వేడి ఊహని 🔥) నువ్వేం చేయలేవు అన్నట్టుగా నన్ను చూస్తూ వెక్కిరిస్తున్న నీ అందాలు అన్నీటిని కొల్లగొట్టుకునే అవకాశం ఇవ్వు ( వెక్కిరించు వన్నెలన్నీ కొల్లగొట్టుకోని 🥹🥹) నాకున్న సిగ్గుని, భయాన్ని, హద్దులను నీ కంటి చూపులతో పోయేలా చేయొచ్చు కదా?? ( కళ్ళ తోటి కత్తిరించు కన్నే కంచెలన్నీ 😘) తుమ్మెద కి ఆయన రాసిన పదం సారంగ 🐝 🐝 🐝 మహాసముద్రం లాంటి ఈ వయసుని నేను ఒక్కదాన్ని ఈద లేకపోతున్నాను నీ సహాయం కావాలి ( ఈదలేను యవ్వనం ఆదరించవా 👏👏) ప్రవహిస్తున్న నది లాంటి నీ యవ్వనాన్ని, అందాలని, ఉత్సాహాన్ని ఇష్టానుసారంగా ఆస్వాదించే అవకాశాన్ని ఇవ్వు ( గంగ పొంగు సంబరాల రంగు తేలనీవా 😘😘😘) అసలు ఇంత భావుకత తెలుగు సినిమా పాటలో రెండు చరణాల్లో ఇంత ఉధృతంగా ఉన్నది ఇదొక్కటే అనిపించింది. చితక్కొట్టారు సర్ #సీతారామశాస్త్రి గారు
తెలుగు
6
30
230
10.5K
Krishna Murali
Krishna Murali@directedbykrish·
a KISS to SITARAMA SASTRI garu 😘😘😘 "రామ్ గోపాల్ వర్మ" గారి లాంటి రాతి హృదయాన్ని కరిగించిన శాస్త్రి గారికి మాములు మనుషులని తన పాటతో మార్చేయడం చాలా సులభమైన పని..... ఆయన వెళ్ళిపోయే కొన్నిరోజుల ముందు, ఒరేయ్ మురళి!!!అన్నం తినేముందు #సీతారామశాస్త్రి గారు, #సీతారామశాస్త్రి గారు, #సీతారామశాస్త్రి గారు అని మూడుసార్లు తలుచుకుని ఈరోజు భోజనం చెయ్ అని చెప్పిన మా వంశీ సర్ కి 💕 మిగతా దర్శకులకి పాట మాత్రమే లోటు @RGVzoomin గారికి, మా వంశీ సర్ కి మనిషి లేని లోటు.... అది ఎప్పటికీ పోదు. సీతారామశాస్త్రి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు
తెలుగు
3
70
402
14.1K
Krishna Murali
Krishna Murali@directedbykrish·
ప్రతీ పాటకి ఒక కొత్త జన్మ ఎత్తుతాడు ఈ "దుర్మార్గుడైన సీతారాముడు" : #బాలసుబ్రహ్మణ్యం గారు 😘🥰💕 భావోద్వేగాలు లేవని చెప్పుకునే RGV ని సైతం ఏడిపించిన శాస్త్రి గారికి, "ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియలా" అనే మాట రాసి నా ప్రాణాన్ని తీసేసిన శాస్త్రి గారికి, "మగువ మనసు తెలిసేనా మగ జాతికి" అని రాసి స్త్రీని అర్ధం చేసుకోవడానికి సహాయపడిన శాస్త్రి గారికి, "తనువంతా విరబూసే గాయాలు ఏదో ఒకరోజు పూలమాలలు అవుతాయి" అని చెప్పిన శాస్త్రి గారికి, ఓటమిని ఒప్పుకోవద్దు అని చెప్పిన శాస్త్రి గారికి, మామిడిపండ్లతో పాటుగా వేసవిని ప్రేమించమని చెప్పిన శాస్త్రి గారికి, మిమ్మల్ని కనీ పెంచిన మీ అమ్మగారికి..... మీ పాటలు వినడం కోసమే నన్ను కనింది అనిపించేట్టు చేసిన మా అమ్మగారికి నమస్కరిస్తూ ♾️ ♾️ ♾️ 🙏 🙏 🙏 🐐🐐🐐 మొత్తంగా మీరు రాసినట్టుగా "సాహిత్యం మీద నా పుట్టుక మీతోనే మొదలైంది, మీతోనే పూర్తి అయిపోయింది".... శ్రీ #సీతారామశాస్త్రి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు 😘😘😘
తెలుగు
9
51
408
25.3K
Krishna Murali
Krishna Murali@directedbykrish·
మనలోనే ఉండుంటారు కాబోయే ఘనులంతా!! పైకొస్తే జై కొడతారు అభిమానులై జనమంతా!!! ఈ సినిమాలకి పని చేసిన మిగతా అసిస్టెంట్ లు, అసోసియేట్ లు, దర్శకులు కూడా @imvangasandeep గారు ఇంత పెద్ద దర్శకుడు అవుతాడని అనుకుని ఉండరు కనీసం ఊహించి కూడా ఉండరేమో??? అందరికంటే చివర్లో పేరు వేశారు, ఎవ్వరికీ అందనంత స్థాయికి ఎదిగారు 🥰😘💕
Krishna Murali tweet mediaKrishna Murali tweet media
తెలుగు
4
13
288
65.5K
Krishna Murali
Krishna Murali@directedbykrish·
తెలుగు అక్షరం బూడిద అయిపోవడం నేను చూడలేను, అందుకే "వేటూరి" గారి దహన సంస్కారాలకి వెళ్లలేదు, ఆయన కోసం ఇప్పటికీ ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉంటాను : శేఖర్ కమ్ముల సర్....... ఇప్పుడే వేరే ప్రొడ్యూసర్ లక్ష రూపాయలు ఇచ్చారు, నువ్వు పాతికవేలు ఇవ్వు, ఇంత తక్కువకి రాస్తున్నట్టు బయట ఎవ్వరికీ చెప్పకు #వేటూరి సర్ 🥹🥹🥹 ప్రేమ అంటే నీదేనా?? నాది కాదా?? సరే నువ్వు చేరువైనా, దూరమైనా ఆనందంగా ఉండడానికి ప్రయత్నిస్తాను. "మంచం మీద కదల్లేని పరిస్థితుల్లో సగం సగం ను తిప్పేసి గసం గసం చేసి, గసగసాలుగా మార్చేసి పద ప్రయోగం చేసిన మహానుభావుడు"🙌🙌🙌
తెలుగు
2
30
307
25.3K
Krishna Murali
Krishna Murali@directedbykrish·
మణిరత్నం సర్ ఫ్రేమ్ పెడితే 🙌🥹😘🌹💕🫂 మొదటిసారి కూతురు తనంతట తానుగా అమ్మని ముట్టుకున్నప్పుడు #ఇళయరాజా సర్ ఇచ్చిన సంగీతం 🐐🐐🐐
తెలుగు
4
24
205
18K