విలేఖరి కొడుకు - GT
24.9K posts

విలేఖరి కొడుకు - GT
@singlehandganii
01 Sep 24 నుండి నాటిన మొక్కలు🌱🌱- 12(కొబ్బరి,ఉసిరిక-2,దానిమ్మ,జామ-2,పనస,రేగు-2)
Anakapalli Katılım Nisan 2013
741 Takip Edilen6.5K Takipçiler
విలేఖరి కొడుకు - GT retweetledi


With the blessings of Lord Shiva, we are blessed with a baby boy this Monday. 🙏🏻🕉️🧿🧿🧿
#OmNamahShivaya
English

వామనుడు మూడు అడుగుల నేలని పొంది బ్రహ్మాండమంతా నిండిపోతున్న ఆ సమయంలో,
సూర్యబింబం క్రమక్రమంగా అతనికి గొడుగుగా, తర్వాత శిరోమణిగా, తర్వాత మకరకుండలంగా, తర్వాత కంఠాభరణంగా, ఆ తర్వాత బంగారు భుజకీర్తిగా, అటు తర్వాత కాంతులీనే -కంకణంగా, అనంతరం మొలలోని గంటగా, ఆపైన మేలైన కాలి అందెగా, చివరకు పాదపీఠంగా ప్రకాశించింది.

తెలుగు

గంగమ్మ తనలో వున్న తేజస్సును తీసుకొనివెళ్ళి హిమవత్పర్వతము పక్కన విడిచి పెట్టేసాక, బంగారుపొదలా అన్నట్టుగా శరవణ పొదలు పుట్టాయి.
అక్కడ ఉన్న తటాకంలోంచి ఒక పిల్లవాడు ఏడవడం ప్రారంభించాడు. వానిని దేవతలు చూశారు. పుట్టిన పిల్లవానికి పాలు ఇవ్వాలి. ఎవరిస్తారు పాలు అని అడిగారు. అపుడు పిల్లవానికి పాలివ్వడానికి కృత్తికలు ముందుకు వచ్చారు.
కృత్తికలు పార్వతీదేవి అంశ. అలా పాలివ్వడానికి వారు దేవతలకు ఒక నిబంధన పెట్టారు. "మాకు మీరందరు కలిసి ఒక వరం ఇవ్వాలి.
ఈ పిల్లవానిని మీరు భవిష్యత్తులో కృత్తికల పుత్రుడు, కార్తికేయుడు అని పిలవాలి. అలా పిలుస్తామంటే మేము వానికి పాలిస్తాం అన్నారు. అందుకు దేవతలు ఒప్పుకున్నారు.
'భవిష్యత్తులో ఈ పిల్లవాడిని కార్తికేయుడు అని పిలుస్తారు. మీకేమీ బెంగలేదు. అందుకని పాలు ఇవ్వండి' అన్నారు. కృత్తికలు వచ్చి పాలు ఇచ్చారు. ఆ పిల్లవాడు ఏకకాలంలో ఆరు ముఖాలతో ఆరుగురు కృత్తికలనుండి స్తన్యాన్ని త్రాగాడు. అందుకని అతడు ఆరు ముఖాలతో 'షడాననుడు', 'షణ్ముఖుడు' అయ్యాడు

తెలుగు

విశ్వామిత్రుడు రామలక్ష్మణులు బయలుదేరుతుంటే సిద్ధాశ్రమంలోవున్న మృగాలన్నీకూడ విశ్వామిత్రునితో వెళ్లిపోతున్నాయట!
అంటే ఏమిటి? బ్రహ్మతేజస్సు కలిగినవాడు వచ్చినా, బ్రహ్మతేజస్సు కలిగినవాడు వెళ్లిపోతున్నా మృగములుకూడా వారిని చూసేసరికి అపారమయిన సంతోషాన్ని పొంది ఆయనతోపాటు వెళ్లిపోదామనుకొంటాయట. ప్రతిక్షణం ప్రతిశ్లోకంలో విశ్వామిత్రుని వైభవం ఏమిటో ప్రకటిస్తూ ఉంటాడు వాల్మీకిమహర్షి

తెలుగు

ఒకనాడు సుందుడు, అగస్త్యమహర్షిమీద పడ్డాడు. పడేటప్పటికి ఆయన పెద్ద హుంకారం చేసి శపించి, ఆ సుందుణ్ణి సంహరించాడు. తన భర్తను సంహరించినందుకు తాటకకి గొప్ప కోపం వచ్చింది.
ఆ కోపంతో ఆమె తన కుమారుడైన మారీచుని తీసికొని అగస్త్యమహర్షిపైకి వెళ్లింది ఆయన్ని సంహరిద్దామని. మారీచుడి దేహం చాలా పెద్దది. పెనం ఎలా వుంటుందో అలా వుంటుంది వాని ముఖం.
అంత అగస్త్యమహర్షి "నీకు వికృతమయిన రూపం వస్తుంది. రాక్షసివి అయిపో!" అని తాటకను శపించాడు. "నువ్వు నామీదకు వచ్చి పడ్డావు కనుక నువ్వు ఈ వేళనుండీ రాక్షసుడవు అయిపోతావు" అని మారీచుని శపించాడు.
బ్రహ్మతేజస్సు కలిగినవారు, మహాజ్ఞానులు అయినవారిజోలికి వెడితే ఎటువంటి పతనము సంభవిస్తుందో ఇక్కడ చూపించారు.

తెలుగు













