thiru777

8.5K posts

thiru777 banner
thiru777

thiru777

@thiru7773

IT professional and interesting politics, cricket 🏏 ,Kriya Yogi, a sacred yogic practice aimed at self-realization.

Katılım Ağustos 2019
437 Takip Edilen626 Takipçiler
thiru777
thiru777@thiru7773·
అహంకారం,కోరికలు, భయాలు ప్రాణంలోని అస్థిరత వల్ల ఉద్భవిస్తాయి.ప్రాణాయామంతో ప్రాణం శుద్ధమైతే ఇవి క్రమంగా నశిస్తాయి. మనస్సు నిర్మలమై ఆత్మ స్వరూపం స్పష్టమవుతుంది.సమాధిలో తాను,ధ్యానం అనే భేదం ఉండదు.ఆ స్థితి అవాక్యమైన ఆనందం. గురువు మార్గంలో సహనంతో సాధన చేస్తే సంపూర్ణ శాంతి లభిస్తుంది.🙏
thiru777 tweet media
తెలుగు
0
0
4
55
thiru777
thiru777@thiru7773·
బుద్ధి, మనస్సు, వాక్కు, ప్రాణం అన్నీ ఒకదానితో ఒకటి లంకెవేసుకున్నాయి. ప్రాణాయామం ద్వారా ప్రాణం స్థిరమైతే, ఆలోచనలు తగ్గుతాయి; మనస్సు స్థిరమై, ఆత్మ జ్ఞానంలో లీనమవుతుంది. ఆ జ్ఞానాత్మను ఇంకా ఉన్నతమైన మహత్తులో, చివరకు శాంతాత్మలో లయింపజేస్తూ కడవరకూ సమాధి స్థిరపడుతుంది.🙏
thiru777 tweet media
తెలుగు
0
0
3
50
thiru777
thiru777@thiru7773·
క్రియా సాధనలో అనేక రూపాలు, దృశ్యాలు కనిపించవచ్చు; అవి మనస్సును మళ్లించే ప్రమాదం ఉంది. కాబట్టి గురువు చెప్పిన పద్ధతులు మాత్రమే పాటించాలి. సాధన కొనసాగినప్పుడు క్రమంగా పరావస్థ, ధారణ, ధ్యానం, సమాధి అందరికీ సహజంగా లభిస్తాయి.🙏
thiru777 tweet media
తెలుగు
0
3
6
68
thiru777
thiru777@thiru7773·
క్రియా యోగంలో మూలాధారం నుండి పైకి చక్రాలు వచ్చే ప్రాణాన్ని ఒక్కసారిగా లాగడం కాదు; క్రమంగా, సున్నితంగా పెంపొందించాలి. చాలా వేగంగా ప్రాణాన్ని లాగితే శరీరానికి నష్టం కలుగుతుంది. చక్రాల్లో శక్తి ప్రవహించాలంటే, మనస్సు కూడా వాటిని స్పర్శించాలి కాబట్టి క్రమపద్ధతి అవసరం.🙏
thiru777 tweet media
తెలుగు
0
0
3
46
thiru777
thiru777@thiru7773·
మనస్సును క్రమంగా స్థిరపరిచి, అది ఇతర విషయాలు ఆలోచించకుండా ఆత్మ మీదే నిలిపే స్థితినే “ఆత్మ-సంస్థ” అంటారు. మనస్సు ఆత్మలో స్థిరమైతే, అది తానే సర్వ విఘ్నాలూ వదిలిపెట్టి శాంతిలో ఉంటుంది. ఇదే యోగం సాధించడానికి ముఖ్యమైన మార్గం.🙏
thiru777 tweet media
తెలుగు
0
0
3
42
thiru777
thiru777@thiru7773·
మనస్సు ఇంద్రియాల వెంట పోకుండా జీవించడం యోగికి ప్రధాన కర్తవ్యం. ఇది వినడం ద్వారానే కాదు; శుభ–అశుభ తేడా తెలుసుకుని, మనస్సును ఆధ్యాత్మిక మార్గంలో మళ్లించి, ఏకాగ్రతతో సాధన చేయాలి. ప్రాణమే మనస్సు-ఇంద్రియాల కదిలీకరణ; ప్రాణ నియంత్రణ ద్వారా వాటిని శాంతింపజేయడం సులభం.🙏
thiru777 tweet media
తెలుగు
0
0
4
74
thiru777
thiru777@thiru7773·
“నేను ఇది చేస్తాను” అనే అహంకారాన్ని పూర్తిగా, శాశ్వతంగా విడిచిపెట్టి, మనస్సు మరియు ఇంద్రియాలను సమంగా నియంత్రించాలి. అనేక కోరికలతో కూడిన సంకల్పాలు యోగ సాధనకు అడ్డంకులు అవుతాయి. ఇంద్రియాలు మనస్సు ఆధీనంలో ఉండాలి; లేకపోతే అవి విషయాసక్తి వైపు మనిషిని బలవంతంగా లాగుతాయి.🙏
thiru777 tweet media
తెలుగు
0
1
9
100
thiru777
thiru777@thiru7773·
యోగా అనేది కేవలం ఆసనాల సాధన మాత్రమే కాదు; అది మనస్సును, ఇంద్రియాలను, జీవనశైలిని శుద్ధి చేసి, అంతరంగాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లే పవిత్ర మార్గం. మనసు అదుపులో ఉన్నప్పుడు సాధన సులభమవుతుంది; ఇంద్రియాలు కట్టుబడినప్పుడు ఆత్మశాంతి సుసాధ్యం అవుతుంది.🙏
thiru777 tweet media
తెలుగు
0
1
6
53
thiru777
thiru777@thiru7773·
ప్రాణం స్వభావంగా శాంతమైనది. సాధనతో మనస్సు కూడా ప్రశాంతంగా మారుతుంది; అదే బ్రహ్మ స్వరూపం. చంచల ప్రాణం స్థిరమైతే అది ఆత్మ స్థితి. ఆత్మ, పరమాత్మ ఒకటే. శరీరం, ఇంద్రియాల వల్ల అది తెలియక దుఃఖం వస్తుంది. దుఃఖం పోయి నప్పుడు ఆత్మసాక్షాత్కారం మొదలవుతుంది.🙏
thiru777 tweet media
తెలుగు
0
0
4
61
thiru777
thiru777@thiru7773·
ఈ జ్ఞానం క్రియాత్మక జ్ఞానం. యోగ స్థితి సాధించడం కష్టం, కానీ అందులో స్థిరపడితే లోతైన శాంతి లభిస్తుంది. మనస్సు దృఢంగా, విరక్తితో ఉండాలి. దృఢ ప్రయత్నం, చిత్త శుద్ధి అవసరం. గురువు, దేవుడిపై విశ్వాసంతో నిరంతరం సాధన చేస్తే, ఫలితం ఆలస్యమైనా ఖచ్చితంగా లభిస్తుంది. మధ్యలో ఆగకూడదు.🙏
thiru777 tweet media
తెలుగు
0
2
7
159
thiru777
thiru777@thiru7773·
యోగం అంటే జీవాత్మ పరమాత్మతో ఏకత్వం. ఈ స్థితిలో దుఃఖం మాత్రమే కాదు, సుఖం కూడా అధిగమిస్తాయి. యోగి ఎప్పుడూ ప్రశాంతంగా, స్థిరంగా ఉంటాడు. కర్మలు యోగానికి మెట్టు లాంటివి. గురువు బోధనతో నమ్మకంగా సాధన చేస్తే, ఫలితం ఆలస్యమైనా ఖచ్చితంగా లభిస్తుంది. నిరుత్సాహం లేకుండా కొనసాగాలి.🙏
thiru777 tweet media
తెలుగు
0
1
8
73
thiru777
thiru777@thiru7773·
సుఖం, దుఃఖం ఇంద్రియాల ద్వారా వస్తాయి. మన భావాలు శాంతిస్తే మనస్సు ఆత్మతో ఏకం అవుతుంది, అప్పుడు బాధ అనిపించదు. చిత్తం నిలిచిన స్థితిలో అపార ఆనందం ఉంటుంది; భౌతిక సుఖం చిన్నదైపోతుంది. దీనిని యోగి ఎప్పుడూ విడిచిపెట్టడు. అప్పుడు అన్నిటిలో ఒకటిని దర్శిస్తాడు. ఓం తత్ సత్ 🙏
thiru777 tweet media
తెలుగు
0
1
3
64
thiru777
thiru777@thiru7773·
అత్యున్నత లాభం అంటే దానికంటే మించినది లేదని అనిపించే స్థితి. అదే పరమ సంతృప్తి. ఈ స్థితిని పొందిన మహనీయుల మాటలను శాస్త్రాలు నమ్మమంటాయి. ఈ ఆనందం ఎప్పటికీ తగ్గదు.ఎంత దుఃఖం వచ్చినా కదలదు. ఇది స్థిరమైతే యోగి కోరికలు, సంకల్పాలు లేకుండా ప్రశాంతంగా జీవిస్తూ, అందరినీ సరిగ్గా అర్థం..🙏
thiru777 tweet media
తెలుగు
1
4
40
410
thiru777
thiru777@thiru7773·
ఆత్మానందాన్ని పొందిన తర్వాత, దానికంటే గొప్ప లాభం ఇంకేదీ అనిపించదు. ఎందుకంటే ఆత్మ స్వరూపమే నిజమైన, అంతులేని ఆనందం. ఆ స్థితిలో స్థిరపడినవారికి ఎంతటి పెద్ద కష్టం వచ్చినా అది కష్టంగా అనిపించదు. ఇది సమస్త భౌతిక దుఃఖాల నుండి విముక్తిని కలిగిస్తుంది.🙏
thiru777 tweet media
తెలుగు
3
7
43
478
thiru777
thiru777@thiru7773·
ఈ ఆనందం ఇంద్రియాల ద్వారా కాదు.కానీ ఇంద్రియాలు నిశ్శబ్దంగా ఉండటంతో వ్యక్తపరచలేడు. క్రియలో ఇంకా ఉన్నత స్థితిలో మాటలకు అందని పరమ ఆనందం ప్రవహిస్తుంది.ఒకసారి ఈ అనుభవం కలిగితే, అది మనసులో నిలిచి ప్రపంచమంతా ఆనందంగా అనిపిస్తుంది.ఇవి సంప్రజ్ఞాత సమాధి దశలు;దాని పైన అసంప్రజ్ఞాత సమాధి ఉంది🙏
thiru777 tweet media
తెలుగు
0
1
6
74
thiru777
thiru777@thiru7773·
ప్రాణ ప్రవాహమే మనస్సు, ఇంద్రియాలకు మూలం. అది శాంతిస్తే ఇంద్రియాలు కూడా విశ్రాంతి పొందుతాయి. బయట ప్రపంచం గుర్తు ఉండదు, కానీ లోపల నిరంతర ఆనందం ఉంటుంది.. ఇదే సమాధి. బయట శ్వాస నిశ్చలంగా కనిపించినా, లోపల ప్రాణం సున్నితంగా ప్రవహిస్తూనే ఉంటుంది; అది ఆగితే జీవితం ఉండదు.🙏
thiru777 tweet media
తెలుగు
1
1
10
71
thiru777
thiru777@thiru7773·
అంతులేని ఆనందం అనేది ఇంద్రియాలు లేదా మెదడు ద్వారా అనుభవించేది కాదు. క్రియలో లోతైన స్థితిలో అది ఒక వస్తువులా కనిపించదు.శ్వాస/ప్రాణం మాత్రం మూలాధార నుంచి విశుద్ధ వరకు సున్నితంగా ప్రవహిస్తుంది.ఆ సమయంలో ఇంద్రియాలు శాంతంగా ఉంటాయి,కానీ లోపల చెప్పలేని ఆనందం ఉంటుంది.ఇదే బ్రహ్మానందస్థితి
thiru777 tweet media
తెలుగు
1
2
8
71
thiru777
thiru777@thiru7773·
Warmest birthday wishes to CBN garu.Your leadership, vision, and commitment have made a meaningful impact, and your work continues to shape the path forward. May the year ahead be filled with strength, wisdom, and new achievements. Wishing you continued success and fulfillment.🙏
thiru777 tweet media
English
2
1
12
193
thiru777
thiru777@thiru7773·
అంతరంగపు ఆవిర్భావ జ్యోతిగా అక్షర సృష్టికి ఆదిమ శక్తిగా నిశ్చల ధ్యానపు నాదం నీవే నిత్య సత్యపు నీలిమ వెలుగుగా కర్మ రేఖల కదలికలో నీవే కాల గమనపు కవాటం తెరిచె స్వర పథంలో సౌఖ్యమై నిలిచె అమ్మ తత్వమే ఆత్మ విరామంగా…🙏
thiru777 tweet media
తెలుగు
0
4
11
167
thiru777
thiru777@thiru7773·
క్రియా పరావస్థ మొదలైతే అది క్రమంగా బలపడుతుంది; దీర్ఘ స్థిరాభ్యాసంతో అనుభవ స్థితి వస్తుంది. అనేక ప్రకాశాలు కనిపించినా అవన్నీ ఆత్మ దర్శనమే. “ఇది నేనా?” అనే సందేహాలు తగ్గినప్పుడు స్థిర అవగాహన కలుగుతుంది. ఇవే సంప్రజ్ఞాత సమాధి యొక్క మొదటి, రెండవ దశలు.🙏
thiru777 tweet media
తెలుగు
0
1
4
62