N Chandrababu Naidu

13.5K posts

N Chandrababu Naidu banner
N Chandrababu Naidu

N Chandrababu Naidu

@ncbn

Chief Minister of Andhra Pradesh | Member of Legislative Assembly, Kuppam | President, Telugu Desam Party

Amaravati, Andhra Pradesh เข้าร่วม Ekim 2009
12 กำลังติดตาม5.2M ผู้ติดตาม
N Chandrababu Naidu
రాష్ట్ర ప్రభుత్వం తరఫున పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించాం. ఉగాది పచ్చడి స్వీకరించి, పంచాంగ శ్రవణం ఆలకించాను. రాష్ట్రానికి అంతా మంచి జరగాలని కోరుకున్నా. మన సంస్కృతి, సంప్రదాయాలు కాపాడేలా నిర్వహించిన కార్యక్రమంలో అందరికీ స్వయంగా ఉగాది పురస్కారాలు అందించాను. ఆయా రంగాల్లో ప్రముఖులను గౌరవించుకున్నాం. #Ugadi2026
N Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet media
తెలుగు
8
81
550
6.9K
N Chandrababu Naidu
#APJobCalender2026 జాబ్ ఫస్ట్ అనేది కూటమి ప్రభుత్వ విధానం. అధికారంలోకి వచ్చిన 21 నెలల్లో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 6 లక్షల పైచిలుకు ఉద్యోగ, ఉపాధి కల్పన జరిగింది. పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనతో ఈ ఏడాది ప్రైవేటు రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన జరగనుంది. ఈ క్రమంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖ‌ల్లో 10,060 ఉద్యోగాల భర్తీ చేయబోతున్నాం. మే 15 నుంచి అక్టోబర్ 15 వరకు వీటికి సంబంధించిన నోటిపికేషన్లు రిలీజ్ చేస్తాం. ఉద్యోగార్థులు సన్నద్దతతో, ప్రతిభతో అవకాశాలను అందిపుచ్చుకోమని కోరుతున్నాను.
N Chandrababu Naidu tweet media
తెలుగు
164
793
1.8K
15.4K
N Chandrababu Naidu
షడ్రుచుల సమ్మేళనం, పరవశింపచేసే వసంతకాల ఆగమనం, అన్నింటినీ మించిన ఆనందం, భావి జీవితంపై ఆశ రేకెత్తించే శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా తెలుగు ప్రజలందరికి శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం మీ అందరి జీవితాల్లో కొత్త వెలుగు తేవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగాలని, మీ ఆశలు, ఆకాంక్షలు తీరి, జీవన సాఫల్య ప్రయోజనాలు సిద్ధించాలని కోరుకుంటున్నాను. పేదరికం లేని సమ సమాజ నిర్మాణం కోసం మనం తలపెట్టిన పీ4 తో బాటు, వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అందరూ అందిపుచ్చుకుని పురోగమించాలి. ‘స్వర్ణాంధ్ర విజన్ 2047’ విజయవంతంగా ముందుకు సాగాలి.
N Chandrababu Naidu tweet media
తెలుగు
99
382
3.1K
31.5K
N Chandrababu Naidu
Ahead of Ugadi and Eid, Andhra Pradesh celebrated a festival of inclusion and empowerment today. We have launched #DivyangaShakti, a scheme that offers free bus travel to specially abled individuals, empowering them with improved mobility and access to public transport. I accompanied some of the beneficiaries on the inaugural journey, and our conversations continued over lunch. The scheme aims to improve mobility and access to public transport for specially abled citizens, covering over 12.76 lakh beneficiaries and their attendants. I thank all my people, especially the beneficiaries who turned up to celebrate the occasion with us today. With this, Andhra Pradesh has embarked on a journey towards becoming a more inclusive and empowered society.
N Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet media
English
121
1.1K
3K
22.7K
N Chandrababu Naidu
తోడబుట్టిన తమ్ముడు, మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను. చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గ ప్రజల్లో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న వ్యక్తిత్వం రామ్మూర్తి నాయుడు సొంతం. భౌతికంగా మాకు దూరమైనా... మా మనసుల్లో మరిచిపోలేని జ్ఞాపకంగా ఎప్పటికి ఉంటాడు.
N Chandrababu Naidu tweet media
తెలుగు
32
262
3.3K
97K
N Chandrababu Naidu
A boost to Mulapeta Port development, powered by our double engine ki sarkaar! Delighted that the Ministry of Commerce & Industry has approved the transfer of 385.24 acres of salt land at Naupada Salt Factory to the Andhra Pradesh Maritime Board. This will significantly support the port’s development, with a focus on strengthening connectivity for efficient operations. I thank Hon’ble Prime Minister Shri Narendra Modi Ji for this important step towards Andhra Pradesh’s infrastructure empowerment. Mulapeta Port is now poised to emerge as a key hub in line with his vision of ports as engines of prosperity and progress, contributing to a Viksit Bharat. I also thank Hon’ble Union Minister Shri Piyush Goyal Ji for his continued support. @narendramodi @PiyushGoyal
English
17
126
769
21.4K
N Chandrababu Naidu
By serving humanity and uplifting those who need it most, we move closer to a world better than we found. In this regard, Akshaya Patra has been diligently serving society, especially children, through its meal programmes as a partner in initiatives such as PM POSHAN and Anna Canteens in Andhra Pradesh, which serve people from all walks of life. I congratulate the organisation on its remarkable milestone of 25 years and for achieving the 5 billion meals milestone at Rashtrapati Bhavan in the august presence of our Hon’ble President Smt. Droupadi Murmu Ji. I wish them continued success as they nourish the nation’s future, contributing to a Suposhit, Sushikshit and Viksit Bharat. @AkshayaPatra @rashtrapatibhvn
President of India@rashtrapatibhvn

President Droupadi Murmu graced an event to commemorate the five billion meals of Akshaya Patra Foundation at Rashtrapati Bhavan Cultural Centre. The President said that a safe and bright future for our children is not solely the government's responsibility, but a shared responsibility of all of us. Children are the architects of the nation's bright future. The nutritious food they receive today is an investment in our nation's human capital.

English
17
106
710
12.3K
N Chandrababu Naidu
ముస్లిం సోదరుల గౌరవార్థం ప్రతి రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందు ఇవ్వడాన్ని దశాబ్దాలుగా ఒక సాంప్రదాయంగా పాటిస్తున్నాను. ఈ క్రమంలో నేడు విజయవాడలో ప్రభుత్వం తరపున ఇచ్చిన ఇఫ్తార్ విందులో, ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నాను. మైనారిటీ వర్గ గౌరవానికి, అభివృద్దికి ప్రభుత్వం ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని వారికి హామీ ఇచ్చాను.
N Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet media
తెలుగు
138
310
2.7K
121.4K
N Chandrababu Naidu
హిందూపురం నియోజకవర్గ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో స్థానిక శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ, ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో హిందూపురంలో భారీ మెగా జాబ్ మేళా నిర్వహించడం అభినందనీయం. జాబ్ మేళాకు వచ్చిన 5323 మందిలో 1903 మంది ఉద్యోగాలకు ఎంపికకావడం సంతోషకరం. వారందరికీ శుభాకాంక్షలు. మరో 868 మంది అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి తర్వాతి దశల ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని తెలిసింది. ఈ జాబ్ మేళాలో పాల్గొన్న 110 సంస్థలకు కృతజ్ఞతాభినందనలు.
N Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet media
తెలుగు
22
109
627
12.6K
N Chandrababu Naidu
అమరజీవి పొట్టి శ్రీరాములు 125 వ జయంతి సందర్భంగా అమరావతిలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతో సంతోషానిస్తోంది. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 58 రోజుల నిరాహారదీక్షకు చిహ్నంగా 58 అడుగుల విగ్రహాన్ని '#అమరజీవిత్యాగశిల్పం' పేరుతో ఏర్పాటు చేయడం మంచి పరిణామం. అమరజీవి త్యాగశిల్పం అంటే ఆయన త్యాగానికి గుర్తు... గుర్తింపు. ఈ విగ్రహాన్ని సందర్శించిన ప్రతి ఒక్కరికీ ఆయన త్యాగ స్ఫూర్తి గుర్తుకు వస్తుంది. తెలుగు రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగాన్ని తెలుగు జాతి కలకాలం గుర్తు పెట్టుకోవాలి. #StatueOfSacrifice
N Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet media
తెలుగు
202
1.6K
4.5K
29.6K
N Chandrababu Naidu
అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఆయనకు ఘననివాళి అర్పిస్తున్నాను. ఆ మహనీయుని త్యాగం ఈనాటికీ మనకు స్పూర్తి. మహాత్మ గాంధీజీ అడుగుజాడల్లో నడచి దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో పాలుపంచుకున్న ఆయన జీవితంలో ఎన్నో పోరాటాలు చేశారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం, ముఖ్యంగా తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం సాధించడం కోసం పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగం చేశారు. ఆ అమరజీవిని స్మరించుకుంటూ ఘననివాళి అర్పిద్దాం!
N Chandrababu Naidu tweet media
తెలుగు
39
195
1.2K
13.5K
N Chandrababu Naidu
సంస్కృతీ, సాంప్రదాయాలను పాటిస్తూ, మన ఆచారాలను గౌరవిస్తూ నిర్వహించిన మా మనవడు దేవాన్ష్ ధోతీ వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషాన్ని కలిగించింది. బంధుమిత్రుల ఆశీస్సులతో దేవాన్ష్ నూతన వస్త్ర బహూకరణ కార్యక్రమం సంప్రదాయ బద్దంగా జరిగింది. దేవాన్ష్ సంపూర్ణ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని… అందరి ఆశీస్సులు, ప్రేమాభిమానాలు ఇలాగే చిరకాలం దేవాన్ష్ కు అండగా ఉండాలని కోరుకుంటున్నాను. మనవడి వేడుకలో పాల్గొనడం నాకు గొప్ప జ్ఞాపకంగా ఎప్పటికి నిలిచి ఉంటుంది.
N Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet media
తెలుగు
76
376
3.8K
53.6K
N Chandrababu Naidu
జనసేన పార్టీ 13 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ అధ్యక్షులు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ గారికి శుభాకాంక్షలు. రాష్ట్ర అభివృద్ధిలో, తెలుగు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో జనసేన పోషిస్తున్న పాత్ర అభినందనీయం. ప్రజలకు అండగా నిలుస్తూ వారి భవిష్యత్ కోసం పనిచేస్తున్న జనసైనికులకు, వీరమహిళలకు, నేతలకు శుభాభినందనలు. @PawanKalyan @JanaSenaParty
N Chandrababu Naidu tweet media
తెలుగు
151
4.6K
22.3K
270.6K
N Chandrababu Naidu
#AnnadathaSukhibhava3 #FarmersFriendlyGovt ఆరుగాలం కష్టపడే అన్నదాతలే మన దేశానికి బలం. రైతు సంక్షేమాన్ని ప్రధమ ప్రాధాన్యంగా తీసుకుని ‘అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్’ పథకాన్ని అమలు చేస్తున్నాం. నేడు 3వ విడతగా 46.85 లక్షల మంది రైతులకు ఒక్కొక్కరికి రూ.6,000 చొప్పున రూ.2,670 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశాం. 2025 ఆగస్టు 2న రూ.3,174 కోట్లు, నవంబర్ 19న రూ.3,135 కోట్లు, నేడు విడుదల చేసిన రూ.2,670 కోట్లు కలిపి మొత్తం రూ.8,985 కోట్లు రైతులకు అందించాం. రైతన్నలకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుంది.
N Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet media
తెలుగు
35
156
1.1K
21.7K