thiru777

8.5K posts

thiru777 banner
thiru777

thiru777

@thiru7773

IT professional and interesting politics, cricket 🏏 ,Kriya Yogi, a sacred yogic practice aimed at self-realization.

เข้าร่วม Ağustos 2019
437 กำลังติดตาม626 ผู้ติดตาม
thiru777
thiru777@thiru7773·
శ్రీ శేషశై సునికేతన దివ్య మూర్తే నారాయణాచ్యుతహరే నళినాయతాక్ష లీలా కటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీ వేంకటేశ మమ దేహి కరావలంబమ్ ఆదిశేషునిపై శయనించే దివ్య స్వరూపుడా, నారాయణా, కమల నేత్రుడా, నీ కటాక్షంతో లోకాలను కాపాడేవాడా, ఓ వేంకటేశా! నాకు నీ చేయి అందించి రక్షించు 🙏
తెలుగు
0
1
2
50
thiru777
thiru777@thiru7773·
కొంత విజయం సాధించినప్పుడు మనస్సు దానిలోనే మునిగిపోతుంది. అప్పుడు మరింత శుద్ధి, పురోగతి వైపు అడుగు వేయాలనే ఆసక్తి తగ్గిపోతుంది. కీర్తి, ప్రశంసలు వస్తే వాటిపై లోభం పెరిగి ముందుకు సాగడం ఆగిపోతుంది. ఈ సున్నితమైన అడ్డంకిని దైవానుగ్రహం మరియు సంపూర్ణ వైరాగ్యంతో మాత్రమే దాటవచ్చు.🙏
thiru777 tweet media
తెలుగు
0
0
2
41
thiru777
thiru777@thiru7773·
మనస్సు ఏ విషయంపై మమకారం పెంచుకుంటే వదలడం కష్టం. ప్రాణాయామం అలవాటు ఉన్నవారు కొద్దిసేపు చేసినా మనస్సును కాపాడుకోగలరు. ఎక్కువ తినడం, ఎక్కువ నిద్ర, అనిశ్చితి సమాధికి అడ్డంకులు. ఇవి అలసటను పెంచుతాయి. కాబట్టి ఇంద్రియాసక్తులను తగ్గించి, మనస్సును మళ్లీ మళ్లీ ఆత్మలో నిలపడం అవసరం.🙏
thiru777 tweet media
తెలుగు
1
0
1
29
thiru777
thiru777@thiru7773·
కేవలం ఆలోచనలతో లేదా బలవంతపు నియంత్రణతో వీటిని ఆపడం కష్టం. అందుకే అలజడి లేదా నిద్రమత్తు ఉన్నప్పుడు ప్రాణాయామం, యోగ క్రియలు చేయాలి. ఇది పామును తలపై కొట్టినట్టు—వాసనల ప్రభావం తగ్గి, మనస్సు ప్రశాంతంగా స్థిరపడుతుంది.🙏
thiru777 tweet media
తెలుగు
0
2
2
41
thiru777
thiru777@thiru7773·
పాత సంస్కారాల వల్ల కోరికలు మళ్లీ మళ్లీ వస్తుంటాయి. ఆరిపోయే అగ్ని మీద చిన్న గాలి ఊదితే మళ్లీ అంటుకున్నట్టు, మనలో దాగి ఉన్న వాసనలు కూడా మేల్కొంటాయి. శ్వాసలో ప్రవహించే ప్రాణం ఈ వాసనలను కదిలించి కోరికలను పెంచుతుంది, అందుకే మనస్సు అశాంతిగా మారుతుంది.🙏
thiru777 tweet media
తెలుగు
0
1
1
25
thiru777
thiru777@thiru7773·
అహంకారం,కోరికలు, భయాలు ప్రాణంలోని అస్థిరత వల్ల ఉద్భవిస్తాయి.ప్రాణాయామంతో ప్రాణం శుద్ధమైతే ఇవి క్రమంగా నశిస్తాయి. మనస్సు నిర్మలమై ఆత్మ స్వరూపం స్పష్టమవుతుంది.సమాధిలో తాను,ధ్యానం అనే భేదం ఉండదు.ఆ స్థితి అవాక్యమైన ఆనందం. గురువు మార్గంలో సహనంతో సాధన చేస్తే సంపూర్ణ శాంతి లభిస్తుంది.🙏
thiru777 tweet media
తెలుగు
0
0
4
62
thiru777
thiru777@thiru7773·
బుద్ధి, మనస్సు, వాక్కు, ప్రాణం అన్నీ ఒకదానితో ఒకటి లంకెవేసుకున్నాయి. ప్రాణాయామం ద్వారా ప్రాణం స్థిరమైతే, ఆలోచనలు తగ్గుతాయి; మనస్సు స్థిరమై, ఆత్మ జ్ఞానంలో లీనమవుతుంది. ఆ జ్ఞానాత్మను ఇంకా ఉన్నతమైన మహత్తులో, చివరకు శాంతాత్మలో లయింపజేస్తూ కడవరకూ సమాధి స్థిరపడుతుంది.🙏
thiru777 tweet media
తెలుగు
0
0
3
53
thiru777
thiru777@thiru7773·
క్రియా సాధనలో అనేక రూపాలు, దృశ్యాలు కనిపించవచ్చు; అవి మనస్సును మళ్లించే ప్రమాదం ఉంది. కాబట్టి గురువు చెప్పిన పద్ధతులు మాత్రమే పాటించాలి. సాధన కొనసాగినప్పుడు క్రమంగా పరావస్థ, ధారణ, ధ్యానం, సమాధి అందరికీ సహజంగా లభిస్తాయి.🙏
thiru777 tweet media
తెలుగు
0
3
6
72
thiru777
thiru777@thiru7773·
క్రియా యోగంలో మూలాధారం నుండి పైకి చక్రాలు వచ్చే ప్రాణాన్ని ఒక్కసారిగా లాగడం కాదు; క్రమంగా, సున్నితంగా పెంపొందించాలి. చాలా వేగంగా ప్రాణాన్ని లాగితే శరీరానికి నష్టం కలుగుతుంది. చక్రాల్లో శక్తి ప్రవహించాలంటే, మనస్సు కూడా వాటిని స్పర్శించాలి కాబట్టి క్రమపద్ధతి అవసరం.🙏
thiru777 tweet media
తెలుగు
0
0
3
51
thiru777
thiru777@thiru7773·
మనస్సును క్రమంగా స్థిరపరిచి, అది ఇతర విషయాలు ఆలోచించకుండా ఆత్మ మీదే నిలిపే స్థితినే “ఆత్మ-సంస్థ” అంటారు. మనస్సు ఆత్మలో స్థిరమైతే, అది తానే సర్వ విఘ్నాలూ వదిలిపెట్టి శాంతిలో ఉంటుంది. ఇదే యోగం సాధించడానికి ముఖ్యమైన మార్గం.🙏
thiru777 tweet media
తెలుగు
0
0
3
46
thiru777
thiru777@thiru7773·
మనస్సు ఇంద్రియాల వెంట పోకుండా జీవించడం యోగికి ప్రధాన కర్తవ్యం. ఇది వినడం ద్వారానే కాదు; శుభ–అశుభ తేడా తెలుసుకుని, మనస్సును ఆధ్యాత్మిక మార్గంలో మళ్లించి, ఏకాగ్రతతో సాధన చేయాలి. ప్రాణమే మనస్సు-ఇంద్రియాల కదిలీకరణ; ప్రాణ నియంత్రణ ద్వారా వాటిని శాంతింపజేయడం సులభం.🙏
thiru777 tweet media
తెలుగు
0
0
4
81
thiru777
thiru777@thiru7773·
“నేను ఇది చేస్తాను” అనే అహంకారాన్ని పూర్తిగా, శాశ్వతంగా విడిచిపెట్టి, మనస్సు మరియు ఇంద్రియాలను సమంగా నియంత్రించాలి. అనేక కోరికలతో కూడిన సంకల్పాలు యోగ సాధనకు అడ్డంకులు అవుతాయి. ఇంద్రియాలు మనస్సు ఆధీనంలో ఉండాలి; లేకపోతే అవి విషయాసక్తి వైపు మనిషిని బలవంతంగా లాగుతాయి.🙏
thiru777 tweet media
తెలుగు
0
1
9
104
thiru777
thiru777@thiru7773·
యోగా అనేది కేవలం ఆసనాల సాధన మాత్రమే కాదు; అది మనస్సును, ఇంద్రియాలను, జీవనశైలిని శుద్ధి చేసి, అంతరంగాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లే పవిత్ర మార్గం. మనసు అదుపులో ఉన్నప్పుడు సాధన సులభమవుతుంది; ఇంద్రియాలు కట్టుబడినప్పుడు ఆత్మశాంతి సుసాధ్యం అవుతుంది.🙏
thiru777 tweet media
తెలుగు
0
1
6
58
thiru777
thiru777@thiru7773·
ప్రాణం స్వభావంగా శాంతమైనది. సాధనతో మనస్సు కూడా ప్రశాంతంగా మారుతుంది; అదే బ్రహ్మ స్వరూపం. చంచల ప్రాణం స్థిరమైతే అది ఆత్మ స్థితి. ఆత్మ, పరమాత్మ ఒకటే. శరీరం, ఇంద్రియాల వల్ల అది తెలియక దుఃఖం వస్తుంది. దుఃఖం పోయి నప్పుడు ఆత్మసాక్షాత్కారం మొదలవుతుంది.🙏
thiru777 tweet media
తెలుగు
0
0
4
66
thiru777
thiru777@thiru7773·
ఈ జ్ఞానం క్రియాత్మక జ్ఞానం. యోగ స్థితి సాధించడం కష్టం, కానీ అందులో స్థిరపడితే లోతైన శాంతి లభిస్తుంది. మనస్సు దృఢంగా, విరక్తితో ఉండాలి. దృఢ ప్రయత్నం, చిత్త శుద్ధి అవసరం. గురువు, దేవుడిపై విశ్వాసంతో నిరంతరం సాధన చేస్తే, ఫలితం ఆలస్యమైనా ఖచ్చితంగా లభిస్తుంది. మధ్యలో ఆగకూడదు.🙏
thiru777 tweet media
తెలుగు
0
2
7
163
thiru777
thiru777@thiru7773·
యోగం అంటే జీవాత్మ పరమాత్మతో ఏకత్వం. ఈ స్థితిలో దుఃఖం మాత్రమే కాదు, సుఖం కూడా అధిగమిస్తాయి. యోగి ఎప్పుడూ ప్రశాంతంగా, స్థిరంగా ఉంటాడు. కర్మలు యోగానికి మెట్టు లాంటివి. గురువు బోధనతో నమ్మకంగా సాధన చేస్తే, ఫలితం ఆలస్యమైనా ఖచ్చితంగా లభిస్తుంది. నిరుత్సాహం లేకుండా కొనసాగాలి.🙏
thiru777 tweet media
తెలుగు
0
1
8
76
thiru777
thiru777@thiru7773·
సుఖం, దుఃఖం ఇంద్రియాల ద్వారా వస్తాయి. మన భావాలు శాంతిస్తే మనస్సు ఆత్మతో ఏకం అవుతుంది, అప్పుడు బాధ అనిపించదు. చిత్తం నిలిచిన స్థితిలో అపార ఆనందం ఉంటుంది; భౌతిక సుఖం చిన్నదైపోతుంది. దీనిని యోగి ఎప్పుడూ విడిచిపెట్టడు. అప్పుడు అన్నిటిలో ఒకటిని దర్శిస్తాడు. ఓం తత్ సత్ 🙏
thiru777 tweet media
తెలుగు
0
1
3
67
thiru777
thiru777@thiru7773·
అత్యున్నత లాభం అంటే దానికంటే మించినది లేదని అనిపించే స్థితి. అదే పరమ సంతృప్తి. ఈ స్థితిని పొందిన మహనీయుల మాటలను శాస్త్రాలు నమ్మమంటాయి. ఈ ఆనందం ఎప్పటికీ తగ్గదు.ఎంత దుఃఖం వచ్చినా కదలదు. ఇది స్థిరమైతే యోగి కోరికలు, సంకల్పాలు లేకుండా ప్రశాంతంగా జీవిస్తూ, అందరినీ సరిగ్గా అర్థం..🙏
thiru777 tweet media
తెలుగు
1
4
40
412
thiru777
thiru777@thiru7773·
ఆత్మానందాన్ని పొందిన తర్వాత, దానికంటే గొప్ప లాభం ఇంకేదీ అనిపించదు. ఎందుకంటే ఆత్మ స్వరూపమే నిజమైన, అంతులేని ఆనందం. ఆ స్థితిలో స్థిరపడినవారికి ఎంతటి పెద్ద కష్టం వచ్చినా అది కష్టంగా అనిపించదు. ఇది సమస్త భౌతిక దుఃఖాల నుండి విముక్తిని కలిగిస్తుంది.🙏
thiru777 tweet media
తెలుగు
3
7
43
480
thiru777
thiru777@thiru7773·
ఈ ఆనందం ఇంద్రియాల ద్వారా కాదు.కానీ ఇంద్రియాలు నిశ్శబ్దంగా ఉండటంతో వ్యక్తపరచలేడు. క్రియలో ఇంకా ఉన్నత స్థితిలో మాటలకు అందని పరమ ఆనందం ప్రవహిస్తుంది.ఒకసారి ఈ అనుభవం కలిగితే, అది మనసులో నిలిచి ప్రపంచమంతా ఆనందంగా అనిపిస్తుంది.ఇవి సంప్రజ్ఞాత సమాధి దశలు;దాని పైన అసంప్రజ్ఞాత సమాధి ఉంది🙏
thiru777 tweet media
తెలుగు
0
1
6
77