Krishna Murali

2.5K posts

Krishna Murali banner
Krishna Murali

Krishna Murali

@directedbykrish

For me, cinema is bread and happiness 😊 budding filmmaker 🎥 సినిమా అంటే బాధ్యతతో తీసేది 🤗

films Sumali Ağustos 2012
42 Sinusundan12.2K Mga Tagasunod
Krishna Murali
Krishna Murali@directedbykrish·
Greatest Of All Time "STEVEN SPIELBERG" sir.. స్పీల్ బర్గ్ సర్ కోసమే కెమెరా పుట్టిందేమో??!!🐐🐐🐐 ఫోన్ బూత్ నుండి జూమ్ అవుట్ తో షాట్ అయిపోయింది అనుకున్నా 🥱 అవ్వలేదు..... కార్ ని ఫాలో చేస్తారు లేదంటే కార్ పార్కింగ్ చేసాక కట్ చేస్తారు అనుకున్నా!!! అవ్వలేదు....😲 పేపర్ చదివే వ్యక్తి దగ్గర తప్పకుండా కట్ చేస్తారు ఆప్షన్ లేదని అనుకున్నా!!! 🥵🥵 అక్కడనుండి టిల్ట్ అప్ చేసి అక్కడ కట్ చేశారు.... #Munich ఒక మాస్టర్ పీస్ 🎥 📽️
తెలుగు
1
6
58
5.1K
Krishna Murali
Krishna Murali@directedbykrish·
నీ సినిమాని హిట్ చేసే సత్తా "కథ" తర్వాత "ఎడిటర్" కి మాత్రమే ఉంది...... ఫుటేజ్ వచ్చాకా ఎడిటర్ కి చూపించడం కాదు!!! సీన్ ఎలా తీయాలి అనుకుంటున్నావు అనేది కూడా ముందే ఎడిటర్ కి చెప్తే, కథలో తనని కూడా కూర్చోబెట్టుకుంటే, ప్రతీ చిన్న విషయం తనకి చెప్తూ ఉంటే, ఇలాంటి అద్భుతాలు వస్తాయి..... "గౌతమ్ మీనన్" సర్ పరిచయం చేసిన ఎడిటర్ "ఆంథోనీ". రిలీజ్ అయినప్పటి నుండి ఇప్పటి వరకూ ఎన్నిసార్లు చూసినా గొప్ప అనుభూతిని ఇచ్చే "ఎడిటింగ్" 🔥🔥🔥
తెలుగు
1
5
61
9.6K
Krishna Murali
Krishna Murali@directedbykrish·
THE "RAM GOPAL VARMA" PICTURE 📽️🎥 నీ అభిమాన దర్శకుడికి 1000 కోట్ల సినిమా, పదివేల కోట్ల సినిమా ఉండొచ్చు....ఈ విధంగా దర్శకత్వం వహించే సన్నివేశం మాత్రం ఉండదు ♾️♾️♾️♾️♾️♾️♾️♾️♾️ భికూ అసిస్టెంట్ టేబుల్ మీద రోటీ పెట్టిన తరువాత షాట్ కట్ చేస్తావని అనుకున్నా??? చేయలేదు.... "భికూ మాత్రే" తన గురించి చెప్తున్నప్పుడు షాట్ కట్ చేస్తావని అనుకున్నా??? చేయలేదు..... "చావుకి నేను భయపడను" అని సత్య చెప్తున్నప్పుడు షాట్ కట్ చేస్తావని అనుకున్నా?? చేయలేదు.... కనీసం ఒక్క క్లోజ్ అప్ అయినా పెడతావని అనుకున్నాను కానీ నిరాశే మిగిలింది.... కట్ చేయకుండా సన్నివేశాన్ని తీసినందుకు ఆశ్చర్యంలో ఉండగా "సత్య ఎడమ చేతితో తింటున్నట్టు చేసావ్"🥹🥹🥹 భికూ తినేముందు ఈగలు తోలుకుంటున్నట్టు చేతితో సైగ చేసేలా చేసావ్ 😘😘😘 అసలు కెమెరా ఎక్కడ పెట్టావో??? ఎలా తీసావో ఇప్పటికీ అర్థం కాలేదు 🙏🙏🙏 వెనుక ఉన్న ఖైదీలు నిజంగా జైలులో ఉన్నట్టుగా "ఒకరి తరువాత ఒకరు భయంతో ఉండేట్టు కంపోజ్ చేసావ్".... మీకో దండం సర్🙌🙌🙌 @RGVzoomin
తెలుగు
0
13
122
15K
Krishna Murali
Krishna Murali@directedbykrish·
కృష్ణవంశీ గారికి, ఆయన సృష్టించిన "వసుంధర" కి ప్రేమతో 💞🥰😘🤗🙌🙏💕☺️ మేకప్ వేసిన, గొప్ప DOP ని తెచ్చినా స్త్రీని అందంగా ఆహ్లాదంగా చూపించలేం. "స్త్రీ" జాతి మొత్తాన్ని గౌరవించి, ప్రేమించి, ఆరాధిస్తేనే ఇలాంటి విజువల్స్ పడతాయి♀️ తాపంతో స్నానం చేసినప్పుడు ఆవిర్లు వచ్చే వసుంధర, కొబ్బరిచెట్టు వెనుక సూటిగా చూసే వసుంధర, నీలం రంగు చీరలో మురారి ని కవ్వించే వసుంధర, ముఖం మీద గులాబీతో స్పృశించే వసుంధర, పసుపు రంగు జెర్కిన్ లో కోపంతో ఉండే వసుంధర, చింతకాయ తింటూ ఆశ్చర్యపోయే వసుంధర, చివర్లో స్థంభానికి అనుకుని ఏడ్చే వసుంధర అంటే చాలా చాలా ఇష్టం... "స్త్రీని ఎలా చూపించాలో నేర్పించినందుకు" థాంక్స్ @director_kv సర్ 😘😘😘
తెలుగు
0
12
132
6.5K
Krishna Murali
Krishna Murali@directedbykrish·
పొద్దు పొద్దున్నే ఈ సినిమా చూడడం ఎందుకు?? గుండెలు పగిలేలా రోదించడం ఎందుకు??? ఆశ్చర్యాన్ని, సంతోషాన్ని, దుఃఖాన్ని చూపించిన "బాలు" లాంటి నటుడిని పొగడాలా?? మనసులో మాట తెలుసుకుని పది ఫోటోలు ఇచ్చిన "మాధవి" క్యారెక్టర్ ను పొగడాలా?? "కొద్ది పరిచయంతోనే ఒక వ్యక్తి ఇంత దగ్గరైపోతే" అనే మాట రాసిన #జంధ్యాల గారిని పొగడాలా?? డబ్బులు కోసం ఆలోచించకుండా మంచి సినిమా తీసిన "ఏడిద నాగేశ్వరరావు" గారిని పొగడాలా?? నేపథ్య సంగీతాన్ని పాడుకునేలా కంపోజ్ చేసిన #ఇళయరాజా గారిని పొగడాలా?? దీనికి సృష్టికర్త అయినటువంటి శ్రీ #విశ్వనాథ్ గారిని పొగడాలా??? ( కమర్షియల్ మోజులో పడిపోయి సినిమా తన ఉనికిని కోల్పోతుందా?? ఆల్రెడీ కోల్పోయిందా??)
తెలుగు
7
25
210
6.5K
Krishna Murali
Krishna Murali@directedbykrish·
ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద అత్యుత్తమైన అందమైన స్త్రీ : సత్యజిత్ రే గారు...... Rare breed of actor : విశ్వనాథ్ గారు..... ప్రేయసి అంటే "మాధవి" గారు, కూతురు అంటే "మాధవి" గారు, తల్లి అంటే "మాధవి" గారు, మొత్తంగా స్త్రీ అంటే #సాగరసంగమం లో "మాధవి" గారిలా ఉండాలనిపిస్తుంది🛐🛐🛐 ప్రేమని, విరహాన్ని, బాధని, ఏడుస్తున్నప్పుడు కూడా అందంగా కనిపించే నా మాధవి గారికి ( జయప్రద గారికి) పుట్టిన రోజు శుభాకాంక్షలు.... నా #విశ్వనాథ్ గారి హీరోయిన్ #జయప్రద గారు....
తెలుగు
1
45
407
24.6K
Krishna Murali
Krishna Murali@directedbykrish·
"రెండు నిముషాలు సెట్ అంతా ఎంత నిశ్శబ్దంగా ఉందో తలుచుకుంటేనే భలే సంతోషంగా ఉంది" 🎥📽️😌 భావోద్వేగమైన సన్నివేశం జరుగుతున్నప్పుడు కట్ చెప్పాల్సిన అవసరం లేదు....నచ్చినట్టుగా మాట్లాడుకోండి అని కెమెరా రోల్ చేసి వదిలేసిన RGV 🥹🥹🥹 చివర్లో "కమల్" పేరు ఎత్తినప్పుడు "మురళీ" రియాక్షన్ కోసం మాత్రమే షాట్ కట్ చేశారు. ఇలా కంపోజ్ చేయడానికి దర్శకుడికి జ్ఞానం ఉండాలి, నటుల దగ్గర కసి ఉండాలి, నిబద్ధతతో చేయాలి..... మన దగ్గర ఇంతసేపు నటించే యాక్టర్స్ 1% మాత్రమే, ఊరికే షాట్ కట్ చేసేసి అందులో ఉన్న ఎమోషన్ ను చంపేసే దర్శకులు 99%..... జోలపాటలా #రహమాన్ సర్ నేపథ్య సంగీతం 🎶 🎵 ( నా పేరు వినాలనిపించి తెలుగు వెర్షన్ పెట్టాను)
తెలుగు
0
17
144
11.2K
Krishna Murali
Krishna Murali@directedbykrish·
అంతవరకూ నువ్వు చూడని క్రాఫ్ట్ ను చూపించేదే నిజమైన "కల్ట్ సినిమా".....కల్ట్ సినిమా కి అర్ధం, పరమార్థం అన్నీ #Rangeela ప్రతీ ఫ్రేమ్ లో క్రాఫ్ట్ కనిపించాలి, ప్రతీ రియాక్షన్ విలువైనదే, ప్రతీ ఎక్స్ప్రెషన్ కి పిచ్చెక్కిపోవాలి, "మిన్నీ" చిన్నపిల్లలా గెంతులు వేసుకుంటూ రోడ్ మీద వెళ్లినప్పుడు వచ్చిన నేపథ్య సంగీతం క్రాఫ్ట్ కి పరాకాష్ఠ. ఇంట్లో వాళ్ళ రియాక్షన్స్ క్యాప్చర్ చేసి ఎడిట్ చేసిన విధానానికి 😘😘😘 the RAM GOPAL VARMA film, the AR RAHMAN musical @RGVzoomin @arrahman ( ఇంకోసారి ఏ సినిమాని అయినా "కల్ట్" అనేముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి,ఎందుకంటే ఆ మాటకి చాలా విలువ ఉంది)
తెలుగు
1
10
121
7.1K
Krishna Murali
Krishna Murali@directedbykrish·
RGV సర్ కంటే ఎక్కువసార్లు సత్యని చూసాను, మ్యూట్ లో పెట్టుకుని ఒకసారి చూసాను, ఎడిటింగ్ నేర్చుకున్నది కూడా ఈ సినిమాతోనే : సందీప్ రెడ్డి వంగా 🐐🐐🐐 "విద్య" కూర్చున్నాక కెమెరా మూమెంట్ స్టార్ట్ చేసినందుకు ఒక ముద్దు 😘 ఇద్దరు మాములు మనుషులు మాములుగా మాట్లాడుకునే సంభాషణలు ఉంచినందుకు ఇంకో ముద్దు😘 అంతవరకూ మాములుగా ఉన్న సత్య "హ్యాపీ బర్త్ డే చెప్పగానే మ్యూజిక్ మొదలుపెట్టినందుకు మరో ముద్దు 😘 అన్నిటికంటే 35 రోజుల్లో ఇలాంటి నిజమైన కల్ట్ సినిమాని ఇచ్చినందుకు వేల వేల ముద్దులు 😘😘😘😘 సంతోషంతో కళ్ల వెంబడి నీళ్లు వచ్చేంతగా సినిమా ఇచ్చినందుకు @RGVzoomin 🫂🛐💞
తెలుగు
3
47
453
48.3K
Krishna Murali
Krishna Murali@directedbykrish·
"జర్నలిజం ముసుగులో సాడిజం చూపిస్తున్న 99.99% వెబ్సైట్లు" 👎👎👎 హీరోయిన్ శరీరం మీద ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయని అడిగే బ్రోకర్ వెధవ ఒకడు, డబ్బులు తీసుకుని నెగిటివ్ రివ్యూ రాసే దరిద్రుడు ఒకడు, సినిమాకి సంబంధించిన విషయాలు లీక్ చేసే దౌర్భాగ్యుడు ఒకడు, పక్క రాష్ట్రం హీరోని అవమానపరిచే ఒక స్త్రీ మూర్తి, సెట్లోకి రానివ్వలేదని విషం కక్కుతున్న లుచ్చా ఒకడు, సినిమా చూడకుండానే, రిలీజ్ అవ్వకుండానే రివ్యూ ఇచ్చే బేవర్స్ ఒకడు.... ( అసలు అన్నమే తింటారా?? అశుద్ధం తింటారా మీరు??) సినిమా మీద బ్రతుకుతూ, రాబందుల్లా పిక్కని తినేసి, ఇలాంటి పనులు చేసే మీరు!!!! ఇంట్లో మీ పిల్లలకి భార్యకి ఏం మంచి బుద్ధులు చెప్తారు?? ఒక్కరోజైనా నిజమైన "జర్నలిస్ట్" గా బ్రతకండి
తెలుగు
11
78
376
22.1K
Krishna Murali
Krishna Murali@directedbykrish·
Celebrating RAM GOPAL VARMA 😘🥰🤗🙌 నిజమైన హింస చంపడం కంటే భయపెట్టడంలోనే ఉంటుంది, హింస జరిగే ముందు వచ్చే డ్రామాలో నిజమైన క్రూరత్వం దాగి ఉంటుంది...... బహుశా ఇది రెండో టేక్ అనుకుంటా!!! "సుశాంత్ సింగ్ ప్యాంట్ అప్పటికే నల్లగా అయిపోయింది"😌 ఒక్క సెకండ్ కూడా కన్ను ఆర్పకుండా సత్య చూస్తూనే ఉంటాడు, తన వెనుక కెమెరా పెట్టినప్పుడు కూడా రెండుసార్లు తప్పక కనురెప్పలు కొట్టుకున్నాయి" డియర్ @RGVzoomin సర్ సినిమాతో ఓదార్చుతున్నందుకు, ప్రేరణ ఇస్తున్నందుకు 🛐🛐🛐
తెలుగు
0
20
248
22.2K
Krishna Murali
Krishna Murali@directedbykrish·
ఒకవేళ ఈ షాట్ ఒక్క టేక్ లో అవ్వకపోతే??? మళ్ళీ ఇంకో విండో గ్లాస్ 🪟 ఫిక్స్ చేయాలి, సమయం వృథా, డబ్బులు వృథా అని ఆలోచిస్తున్న నేను 🥹🥹🥹 నా కథలు PAN INDIA స్థాయిలో చెప్పాలి, అందుకనే హైదరాబాద్ వదిలేసి ముంబయి వెళ్ళాను, సత్య లాంటి కథల్ని అక్కడ మాత్రమే చెప్పగలను : RGV 🔥 ఈ సీన్ ఇప్పుడు తీస్తే?? జీప్ లో ఉన్నవాళ్ళ క్లోజ్ అప్ తీస్తారు, రూన సాగర క్లోజ్ అప్ తీస్తారు, POV షాట్స్ పెడతారు, గ్లాస్ పగిలిన ఇన్సర్ట్ పెడతారు, OTS పెట్టే అవకాశం కూడా ఉంది..... @RGVzoomin అవేం చేయకుండా ఒక్క షాట్ ఎమోషన్ చూపించారు......
తెలుగు
9
29
337
48.7K
Krishna Murali
Krishna Murali@directedbykrish·
సర్ @filmsyogi ..... అప్పటికి మొబైల్ ఫోన్స్ ఎక్కువ లేవు, వాకీ టాకీలు రాలేదు కానీ క్రేన్ డౌన్ అవుతున్న టైంలో జీప్ ఎంట్రీ, ఫోన్ లిఫ్ట్ చేయడం, గ్లాస్ పగలడం, భయంతో వెనక్కి చూసేసరికి జీప్ ఒక్క సెకండ్ సమయంలో వెళ్ళడం, అంత పెర్ఫెక్ట్ గా?? ఒక్క టేక్ లో!! ఎలా చేశారు?? చూసుకోవడానికి మానిటర్ లు కూడా లేవు, అంత గొప్పగా ఈ షాట్ ఎలా వచ్చింది అసలు??? చాలాసేపు ఆలోచించాను ఎలా తీసారు అని.... @RGVzoomin సర్ ఎలా తీసారో మీరైనా చెప్పండి....
YOGESH KMC@filmsyogi

@directedbykrish Master Craftsman ki Director ki adhey theda

తెలుగు
0
3
26
7.3K
Krishna Murali
Krishna Murali@directedbykrish·
సర్ క్రిస్టోఫర్ ఎడ్వర్డ్ నోలన్ మొదటి సినిమా..... "మొదటి ప్రేమ, మొదటి సినిమా ఎప్పటికీ ప్రత్యేకమే" ....…. తరువాత ఎన్ని హిట్స్ వచ్చినా, ఎంతమంది ప్రేమించిన "మొదటి అనుభూతి ఎప్పటికీ రాదు"😘 🎥 వారాంతంలో మాత్రమే షూటింగ్, ఫ్రెండ్స్ ఇళ్ళు లొకేషన్ లు, కథ ఆయనదే, ఎడిటింగ్ ఆయనే, DOP ఆయనే, డబ్బులు కూడా ఆయనవే..... కెమెరా భుజమున వేసి "నోలన్" కోతకు కదిలే...... ప్రపంచ సినిమా మీద #ChristopherNolan పెట్టిన తొలి సంతకం #Following
తెలుగు
0
10
49
4K
Krishna Murali
Krishna Murali@directedbykrish·
"తేలికగా తీసిపారేసే చాలా విషయాలు RGV గారు స్క్రీన్ ప్లే లో చూపిస్తారు"....... చికెన్ ను వాసన చూస్తూ కూతురికి వడ్డించడం, సెల్ పోన్ మీద పెరుగు పడడం లాంటివి ఇంకో దర్శకుడు ఆలోచిస్తాడు అని కలలో కూడా ఊహించలేం 🐐🐐🐐 "ఒకవైపు సత్య గ్యాంగ్ చంపాలని అనుకుంటున్నప్పుడు, అమోద్ శుక్లా తీరిగ్గా నవ్వుకుంటూ భోజనం చేస్తున్నాడు" 🥵🥵🥵 అప్పటివరకు గ్యాంగ్ మాట్లాడే దగ్గర కెమెరా పెట్టేసి, శుక్లాని చంపాలి అనుకున్నప్పుడు ఇంట్లో చూపించడం కంటే "అందమైన ఎడిటింగ్" ఇంకోటి ఉంటుందా??? #Satya శతాబ్దానికి ఒక సినిమా... థాంక్స్ @RGVzoomin సర్ 📽️🎥🙌💞😘🥰🤗🥹🔥😮🛐🛐🛐
తెలుగు
5
41
372
69.9K
Krishna Murali
Krishna Murali@directedbykrish·
చిన్న వయసులో డబ్బులు దొంగతనం చేసి బిస్కెట్లు, చాక్లెట్లు తింటాం "టోటో" మాత్రం "సినిమాకి టికెట్" కొనుక్కునేవాడు....... థియేటర్ ఆపరేటర్ వద్దని చెప్పినా, సినిమాకి వెళ్ళిన ప్రతిసారీ వాళ్ళ అమ్మ కొట్టిన సినిమా చూడడం మనలేదు.... "వాళ్ళ నాన్న చనిపోయాడు అని వాళ్ళ అమ్మ ఏడుస్తుంటే, గోడ మీద ఉన్న పోస్టర్ చూసి చావుని కూడా మర్చిపోయేంతగా సినిమాని ప్రేమించాడు". ఎందుకో నేనింతే లో "రవి"కంటే, #CinemaParadiso లో "టోటో" సినిమాని ఒక్క శాతం ఎక్కువ ప్రేమించాడు అనిపిస్తుంది.... "Films are not only films for me, they are life" : SIR MARTIN SCORSESE
తెలుగు
0
9
87
8.9K
Krishna Murali
Krishna Murali@directedbykrish·
"శతాబ్దాల నుండి!!! నీకంటే ముందు సినిమాలు చేసిన ప్రతీ దర్శకుడు, మొదటి బ్రేక్ వచ్చేంత వరకూ ఎన్నో కష్టాలు అనుభవించారు, అన్నీ మర్చిపోయి పని మీద శ్రద్ధ పెట్టు, ఖచ్చితంగా నీకంటూ ఒకరోజు వస్తుంది........ థాంక్యూ డియర్ "ఆల్ఫ్రెడ్" @filmsyogi సర్ 🫂 🫂 🫂 ఇట్లు : TOTO "జీవితం సినిమాల్లో చూపించినంత ఈజీగా ఉండదు, ఎన్నో రెట్లు కష్టంగా ఉంటుంది" అనే మాటను మీదైన రీతిలో చెప్పినందుకు #CinemaParadiso "చింతకాయల రవి" లాంటి ఇంకో సినిమా తీయాలని కోరుకుంటూ 💞🥰😘
తెలుగు
0
5
44
3.1K
Krishna Murali
Krishna Murali@directedbykrish·
"ఏదైనా సీన్ తీస్తున్నప్పుడు నేను భయపడతాను, అంటే స్కూల్ లో చదివే పిల్లాడు ఎగ్జామ్ రాసినప్పుడు ఉండేంత భయం" : సర్ "స్టీవెన్ స్పీల్ బర్గ్" 🐐🐐🐐 ప్రపంచంలో అత్యుత్తమ ఫిల్మ్ మేకర్ కూడా భయపడతాడు, నిజానికి ఎంత ఎక్కువ భయపడితే అంత మంచి సినిమా తీయగలం. ఈ భయం కారణంగానే మంచి సినిమాలు తీశారు అనిపిస్తుంది.... "ఒక సినిమా హిట్ అయితే నాకంటే గొప్పోడు లేడు అనే దర్శకులు, ఫ్లాప్ అయితే ఆడియెన్స్ ను తిట్టే దర్శకులు, బడ్జెట్ లు ఇష్టం వచ్చినట్టుగా పెంచే దర్శకులు, ఇది కదా నేర్చుకోవాలి అనిపిస్తుంది".... రెండున్నర నిమిషాల లాంగ్ టేక్, భూమి తిరిగినట్టు కెమెరాను తిప్పుతారు ♾️♾️♾️
తెలుగు
0
14
105
9.3K