置顶推文
ɾąցհąѵ
31.6K posts


"తూర్పు వెళ్లే రైలు(1979)" - ఒక కాలం నాటి పల్లెటూరి ప్రేమకథ
"తూర్పు వెళ్లే రైలు"... పేరు వినగానే ఏదో కవితాత్మకమైన అనుభూతి కలుగుతుంది. చిన్నప్పటి నుంచి ఈ సినిమా పేరు చాలాసార్లు విన్నప్పటికీ, చూడటం మాత్రం ఇటీవలే జరిగింది.
దర్శకుడు భారతీరాజా గారి మరణానంతరం ఆయన చిత్రాల గురించి చదువుతుండగా, ఈ సినిమా ఆయన రూపొందించిన తమిళ చిత్రం "కిళక్కు పోగుం రైల్" కు తెలుగు రూపాంతరమని తెలిసింది. ఆ వివరాలు ఆసక్తిని కలిగించడంతో ఈ చిత్రాన్ని చూడటం జరిగింది.
భారతీరాజా దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం "కిళక్కు పోగుం రైల్(1978)" లో సుధాకర్, రాధిక కథానాయకులుగా పరిచయమయ్యారు. ఆ చిత్రం ఘనవిజయం సాధించి ఏడాదికి పైగా ప్రదర్శించబడింది. అనంతరం దానిని తెలుగులో బాపు దర్శకత్వంలో పునర్నిర్మించారు. ఈ చిత్రం ద్వారా మోహన్, జ్యోతి తెలుగు తెరకు పరిచయమయ్యారు. తమిళ మాతృకకు ఇళయరాజా సంగీతం అందించగా, తెలుగు చిత్రానికి ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యం సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. తమిళ చిత్రంలో తెలుగు నటుడు కథానాయకుడిగా నటిస్తే, తెలుగు చిత్రంలో తమిళ నటుడు కథానాయకుడిగా నటించడం విశేషం.
కథ విషయానికి వస్తే...
అలివేలు (జ్యోతి) చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయి తన అక్క, బావల వద్ద పెరుగుతుంది. ఆమె బావ (రాళ్లపల్లి)కి అలివేలుపై దురాశ ఉంటుంది. అదే ఊరిలో రామకోటి (మోహన్) అనే యువకుడు ఉంటాడు. మంగలి కుటుంబానికి చెందిన అతడు కవితలు రాసుకుంటూ, తనలో తాను జీవించే స్వభావం కలవాడు. కులవివక్ష కారణంగా గ్రామస్థుల చేత తరచూ అవమానాలను ఎదుర్కొంటూ ఉంటాడు.
అలాంటి పరిస్థితుల్లో అలివేలు, రామకోటి ఒకరినొకరు ప్రేమించుకుంటారు. అయితే గ్రామంలోని కట్టుబాట్లు, మూఢనమ్మకాలు, కులవ్యవస్థ వారి ప్రేమకు అడ్డుగోడలుగా నిలుస్తాయి. ప్రేమ కోసం వారు సమాజానికే ఎదురు నిలవాల్సి వస్తుంది. విడిపోవాల్సిన పరిస్థితులనూ ఎదుర్కొంటారు. చివరికి వారి ప్రేమ గెలిచిందా లేదా అన్నదే మిగిలిన కథ.
ఇది పూర్తిగా నేల వాసనతో నిండిన పల్లెటూరి ప్రేమకథ. బాపు దర్శకత్వంలో ఈ చిత్రం రావడం కొంత ఆశ్చర్యమే. సాధారణంగా బాపు చిత్రాల్లో కనిపించే కళాత్మక ఫ్రేములు, చిత్రకళాత్మక అందాలు ఇందులో పెద్దగా కనిపించవు. తెరపై కనిపించేది అలంకరించిన గ్రామం కాదు; సహజమైన పల్లెటూరు. కొన్ని ఆచారాలు, సంప్రదాయాలు, మూఢనమ్మకాలు చూస్తుంటే తమిళ గ్రామీణ సంస్కృతి ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది.
తెలుగులో ఈ చిత్రం ఎంత మేర విజయవంతమైందో తెలియదు. అయితే నేటి ప్రేక్షకుడికి ఇది గొప్ప వినోదాన్ని అందించే చిత్రం కాదు. కాలాతీతంగా నిలిచిపోయే గొప్ప చిత్రంగా కూడా చెప్పలేం. అయినప్పటికీ, ఒక కాలం నాటి గ్రామీణ జీవన విధానాన్ని, ఆ సమాజపు విలువలను, ప్రేమకు ఎదురైన అవరోధాలను ప్రతిబింబించిన చిత్రంగా మాత్రం గుర్తుండిపోతుంది.
ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యం సంగీతం అందించిన ఈ చిత్రంలోని కొన్ని పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా "చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ" పాట విశేష ప్రజాదరణ పొందింది.
భారతీరాజా గారు డెబ్బైయవ దశకంలో రూపొందించిన గ్రామీణ ప్రేమకథను బాపు తెలుగు ప్రేక్షకులకు ఎలా అందించారో తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే, ఒకసారి "తూర్పు వెళ్లే రైలు" చిత్రాన్ని చూడవచ్చు.
#RaghavMuzix
#RaghavPix

తెలుగు

@ShavaliSreenu ప్రజలు వేసిన వోట్లు, ఫలితాల రూపంలో వస్తున్నాయి అంటారా?
ఎన్నికల వ్యవస్థ కూడా హైజాక్ అయ్యింది అనిపిస్తుంది.
తెలుగు

@ThisIsRagh In 2029 people will answer through their vote mandate then they all listen
English

E20 పెట్రోల్ వల్ల ఇబ్బందులు పడుతున్న వాహన యజమానుల గోడును వినేవారు కనిపించడం లేదు. కోర్టులు, మీడియా, ప్రభుత్వ వ్యవస్థలు, ఎవ్వరూ పట్టించుకోలేదు.
సాధారణ ప్రజలపై భారం మోపుతూ, వాళ్ళకి నష్టం చేసేది బలవంతంగా అంటగడుతూ, కొద్దిమంది ప్రయోజనాలకే పెద్దపీట వేసే వ్యవస్థకు ఇది మరో ఉదాహరణగా కనిపిస్తోంది.
(Nobody seems willing to listen to the concerns of vehicle owners affected by E20 petrol, not the courts, not the media, nor any other institution.
It feels like yet another consequence of an ecosystem designed to burden ordinary citizens while benefiting a select few.)
🚨Indian Gems@IndianGems_
After the E20 switch, 56% of owners of older vehicles are now facing serious mileage and fuel efficiency issues: Business Today Survey
తెలుగు

@ThisIsRagh బాలయ్య గారు అల్లూరి సీతారామరాజు లో ఉంటారు... ఏ పాత్ర ఎక్కడో సినిమా చూసి చెప్పండి
తెలుగు

@guttaramgopal సినిమా చూస్తే నాకు అదే అనిపించింది, పెద్దగా ఆడి ఉండదు అని..
తెలుగు

@ThisIsRagh పాటలు బాగా పాపులర్. సినిమా ఒక మోస్తరు గా ఆడింది.
తెలుగు

@ThisIsRagh అర్ధం అయింది... ఆ వయసులో తండ్రి తీసుకెళ్లిన సినిమాలు... అంతే... చాలా క్రమశిక్షణ తో పెంచారు మమ్మల్ని... మధ్యలో అప్పుడప్పుడు శోభన్, కృష్ణంరాజు చూసేవాళ్ళం
తెలుగు

@ThisIsRagh వినిపించేవి నా 11 ఏళ్ల వయసప్పుడు మా నేషనల్ పానాసోనిక్ టేప్ రికార్డర్ లో... మీరు పెట్టిన పాటలు వల్ల నా చిన్ననాటి మా నాన్న గారిని గుర్తు చేశారు... ధన్యవాదములు మీకు 🙏
తెలుగు

@ThisIsRagh అప్పుడు చాలా చిన్న పిల్లాడ్ని అవ్వడం వల్ల థియేటర్ కి ఇలాంటి సినిమాలు వెళ్ళలేదు... కానీ 1986 లో మౌనరాగం తర్వాత మోహన్ గురించి ఈ సినిమా చూసాను... కాని చాన్నాళ్ళు మోహన్ కు మౌనరాగం మొదటి సినిమా తెలుగు లో అనుకునేవాడిని...
అద్భుతమైన సినిమా 👌 ముఖ్యంగా ఆ లొకేషన్ చిత్రికరణ 👌👏 భారతీరాజా
తెలుగు

@VMurali41880337 Yes, India reached that level. From elections to court verdicts everything has been hijacked.
English

@ThisIsRagh It happens only when the entire system has been hijacked by the ruling party.
English


@ThisIsRagh అలా పందాలు కాసే వాళ్ళం సినిమాలో ఎన్నిసార్లు అన్నది చెప్పమని మా స్నేహితులు లో 😂
తెలుగు

@ThisIsRagh youtu.be/ixKKrb_R6wc?si…
ఈ పాట పూర్తిగా చూసి ఎన్ని సార్లు వచ్చిందో చెప్పండి 😜

YouTube
తెలుగు

@ThisIsRagh ఈ పాటలో దోసకాయ అన్నట్టు శ్రీదేవి వంకాయ (ఊత పదం) అంటుంది ఓ సినిమాలో
ఏ సినిమానో తెలుసా మీకు 😂
తెలుగు

What is the meaning of “bad words” 😎😅
✿ Dhriti 𓈒 ⭒ ݁ ׅ🦋 ᵈᵠ ᵍⁱʳˡ 🦋@AniDhriti
What r youuu perfect at...😻😸😚🥳
English



