Nagaiah Pusapati

446 posts

Nagaiah Pusapati banner
Nagaiah Pusapati

Nagaiah Pusapati

@Secy2Chairman

Hyderabad Beigetreten Kasım 2021
99 Folgt1.1K Follower
Nagaiah Pusapati
Nagaiah Pusapati@Secy2Chairman·
@ Kalabhavan
Nagaiah Pusapati tweet media
हिन्दी
0
0
0
49
Nagaiah Pusapati
Nagaiah Pusapati@Secy2Chairman·
With MD sir on 11-9-25 @ Kalabhavan
Nagaiah Pusapati tweet media
English
0
0
0
42
Nagaiah Pusapati retweetet
TGSRTC
TGSRTC@TGSRTCHQ·
ఆర్టీసీ కుటుంబ స‌భ్యులంద‌రికీ న‌మ‌స్కారం!! క్షేత్ర‌స్థాయిలో మీరంతా నిబద్దత, అంకితభావం, క్ర‌మ‌శిక్ష‌ణ‌తో సమర్థవంతంగా విధులు నిర్వ‌ర్తించ‌డం వ‌ల్లే టీజీఎస్ఆర్టీసీ అభివృద్ధి ప‌థంలో ప‌య‌నిస్తోంది. మీరు స‌మిష్టి కృషితో ప‌నిచేస్తూ బ‌స్సుల్లో ప్ర‌తి రోజు 60 ల‌క్ష‌ల మంది ప్ర‌యాణికుల‌ను క్షేమంగా గ‌మ్య‌స్థానాల‌కు చేర‌వేస్తున్నారు. ఆర్టీసీ సంస్థ‌ను అన్ని తామై ముందుకు నడిపిస్తోన్న ఉద్యోగుల సంక్షేమం విష‌యంలో యాజ‌మాన్యం ఏమాత్రం రాజీప‌డ‌టం లేదు. సంస్థ‌కు వ‌చ్చే ప్ర‌తి రూపాయిని మీ సంక్షేమం కోసం వెచ్చించ‌డం జ‌రుగుతోంది. మీ అంద‌రికీ తెలుసు.. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న కూడా.. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న 2017 పీఆర్సీని 21 శాతం ఫిట్ మెంట్ తో 2024 మే నెలలో యాజ‌మాన్యం అందించింది. పెండింగ్‌లో ఉన్న 10 డీఏలను 2019 నుంచి దశలవారీగా విడుదల చేసింది. ఆర్పీఎస్-2013 బాండ్లకు సంబంధించిన రూ.280 కోట్లను చెల్లించింది. గత మూడున్నరేళ్లుగా విధిగా ప్రతి నెల 1వ తేదినే వేతనాలను ఇస్తోంది. పీఎఫ్‌, సీసీఎస్ రికవరీ మొత్తాలను ప్రతి నెల క్రమతప్పకుండా చెల్లిస్తూ బ‌కాయిల‌ను క్ర‌మేణా యాజమాన్యం త‌గ్గిస్తోంది. టీజీఎస్ఆర్టీసీ ఆర్థిక ప‌రిస్థితి మీకు తెలియంది కాదు. ఆర్థిక క‌ష్టాల్లోనూ ఉద్యోగుల సంక్షేమానికే మొద‌టి ప్రాధాన్య‌త‌ను సంస్థ ఇస్తోంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటూ అభివృద్ది ప‌థంలో ప‌య‌నిస్తోన్న సంస్థ‌కు, ఉద్యోగుల‌కు స‌మ్మె అనేది తీర‌ని న‌ష్టం క‌లిగిస్తుంది. ఆర్టీసీ బాగుంటేనే మ‌న‌మంతా సంతోషంగా ఉంటాం. స‌మ్మె అనేది స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం కాదు. 2019లో జ‌రిగిన స‌మ్మె వ‌ల్ల సంస్థ తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేయ‌బ‌డింది. బాధాకరమైన విషయం ఏంటంటే.. ఆ సమ్మె వల్ల ఆర్టీసీ 39 మంది ఉద్యోగులను కొల్పోయింది. సమ్మె తర్వాత వ‌చ్చిన క‌రోనా వ‌ల్ల ఆర్టీసీ మ‌నుగ‌డే ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. మీ స‌మిష్టి కృషి వ‌ల్ల అన్ని సంక్షోభాల‌ను ఎదుర్కొని.. ప్ర‌జ‌ల మ‌న్న‌న‌లు చూరగొంటున్న ఇలాంటి ప‌రిస్థితుల్లో స‌మ్మె అనేది శ్రేయ‌స్క‌రం కాదు. ఒక్క‌సారి ప్ర‌జ‌లు అసంతృప్తికి గురైతే కొంత‌కాలంగా సంస్థ బాగు, ఉద్యోగుల సంక్షేమం కోసం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌న్నీ నిర్వీర్యం అయిపోతాయి. ఇవ‌న్నీ సంస్థ మ‌నుగ‌డ‌కు ప్ర‌తికూల అంశాలుగా మారే ప్ర‌మాదం ఉంది. రాష్ట్ర ప్ర‌భుత్వ స‌హ‌కారంతో ఉద్యోగుల స‌మస్యల పరిష్కారానికి యాజ‌మాన్యం కట్టుబడి ఉంది. ఈ అంశం గురించి గౌర‌వ సీఎం రేవంత్ రెడ్డి గారు, ర‌వాణా మంత్రి శ్రీ పొన్నం ప్ర‌భాక‌ర్ గారు ఇప్ప‌టికే స్ప‌ష్ట‌త ఇచ్చారు. స‌మ్మె వల్ల సంస్థ ప్ర‌గ‌తితో పాటు ఉద్యోగుల‌కు న‌ష్టం వాటిల్లుతుంది. త‌ల్లి లాంటి ఆర్టీసీని కాపాడుకునేందుకు స‌మ్మె ఆలోచ‌న‌ను విర‌మించుకోవాల‌ని ఆర్టీసీ సిబ్బందికి యాజ‌మాన్యం విజ్ఞ‌ప్తి చేస్తోంది. ఒక వర్గం తమ మనుగడ కోసం చెప్పే మాట‌ల‌కు ప్ర‌భావిత‌మై స‌మ్మెకు వెళ్తే సంస్థ‌తో పాటు ఉద్యోగుల‌కు తీవ్ర న‌ష్టం జ‌రుగుతుంద‌నే విష‌యం మ‌రిచిపోవ‌ద్ద‌ని సూచిస్తోంది. ప్ర‌జ‌ల‌కు ర‌వాణాప‌ర‌మైన ఇబ్బందులు క‌ల‌గ‌కుండా సేవ‌లందిస్తూ.. సంస్థ మేలు కోసం ఆలోచించాల్సిన బాధ్య‌త ప్ర‌తి ఒక్క ఉద్యోగిపై ఉంద‌ని పేర్కొంది. ఎస్మా చట్టం ప్రకారం ఆర్టీసీలో సమ్మెలు నిషేధం. సంస్థ నిబంధనల మేరకు సమ్మె చట్టవ్యతిరేకమైంది. సమ్మె పేరుతో ఉద్యోగులను ఎవరైనా బెదిరించిన, విధులకు ఆటంకం కలిగించిన బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మూడున్నరేళ్లుగా సంస్థ బాగు కోసం యాజమాన్యం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని ఉద్యోగులు స్వాగతించారు. వాటిని విజయవంతం కూడా చేశారు. అభివృద్ధి వైపు అడుగులు వేస్తోన్న సమయంలో సమ్మె పేరుతో చేజేతులా సంస్థ మనుగడకు, ఉద్యోగుల భవిష్యత్ కు ముప్పు వాటిల్లే విధంగా వ్యవహారించవద్దని యాజమాన్యం విజ్ఞప్తి చేస్తోంది. ఉద్యోగుల సంక్షేమం విష‌యంలో యాజ‌మాన్యం ఏమాత్రం రాజీప‌డ‌బోదని మరోసారి స్పష్టం చేస్తోంది. @PROTGSRTC @SajjanarVC @Ponnam_INC @TelanganaCMO
TGSRTC tweet media
తెలుగు
45
80
212
29.8K
Nagaiah Pusapati retweetet
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
▶️కరీంనగర్ బస్ స్టేషన్ లో పుట్టిన చిన్నారికి జీవితకాలం ఉచిత బస్ పాస్ ▶️ప్రకటించిన #TGSRTC యాజమాన్యం ▶️డెలివరీ చేసి మానవత్వం చాటిన ఆర్టీసీ సిబ్బందికి ఘన సన్మానం కరీంనగర్ బస్ స్టేషన్ లో పుట్టిన చిన్నారికి తమ బస్సుల్లో జీవిత కాలం ఉచితంగా ప్రయాణించేలా బస్ పాస్ ను అందిస్తున్నట్లు #TGSRTC యాజమాన్యం ప్రకటించింది. ఆర్టీసీ బస్సులు, బస్ స్టేషన్ లలో పుట్టిన పిల్లలకు జీవిత కాలపు ఉచిత బస్ పాస్ ను ఇవ్వాలని గతంలో యాజమాన్యం తీసుకున్న నిర్ణయం మేరకు.. ఈ ఆడపిల్లకు బర్త్ డే గిప్ట్ గా లైఫ్ టైం ఫ్రీ బస్ పాస్ ను మంజూరు చేస్తున్నట్లు పేర్కొంది. కరీంనగర్ బస్ స్టేషన్ లో పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణికి చీరను అడ్డుకట్టి కాన్పు చేసి మానవత్వం చాటిన తమ సిబ్బందిని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం హైదరాబాద్ బస్ భవన్ లో బుధవారం అభినందించింది. సంస్థ ఉన్నతాధికారులతో కలిసి టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ వారిని ఘనంగా సన్మానించారు. ఈ నెల 16న కూమారి అనే గర్భిణీ, తన భర్తతో కలిసి భద్రాచలం బస్సు కోసం కరీంనగర్ బస్ స్టేషన్ కు వచ్చారు. ఆమెకు బస్ స్టేషన్ లో నొప్పులు ఎక్కువయ్యాయి. ఈ విషయాన్ని గమనించిన ఆర్టీసీ సిబ్బంది వెంటనే 108 కాల్ చేసి సమాచారం ఇచ్చారు. ఈ లోగా నొప్పులు ఎక్కువ కావడంతో.. ఆర్టీసీ మహిళా సిబ్బంది ముందుకు వచ్చారు. చీరలను అడ్డుపెట్టి నార్మల్ డెలివరీ చేయగా ఆడపిల్ల పుట్టింది. అనంతరం అంబులెన్స్ సాయంతో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తల్లిబిడ్డా క్షేమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. సమయస్పూర్తితో వ్యవహారించి.. సకాలంలో కాన్పు చేసిన ఆర్టీసీ సిబ్బంది సైదమ్మ, లావణ్య, స్రవంతి, భవాని, రేణుక, రజనీ కృష్ణ, అంజయ్య సేవలను ఈ సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ మెచ్చుకున్నారు. ఆపద సమయంలో సేవాతర్పరతను ఆర్టీసీ సిబ్బంది చాటుతుండటం గొప్ప విషయమని అన్నారు. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చడంతో పాటు.. వారి ఆపద సమయంలో తాము ఉన్నామని భరోసా కల్పిస్తుండటం అభినందనీయమని ప్రశంసించారు.. ఈ సన్మాన కార్యక్రమంలో సంస్థ సీవోవో డాక్టర్ రవిందర్, జాయింట్ డైరెక్టర్ అపూర్వ రావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, కృష్ణకాంత్, చీఫ్ పర్సనల్ ఆఫీసర్ ఉషారాణి, తదితరులు పాల్గొన్నారు.
తెలుగు
38
57
424
35.6K
Nagaiah Pusapati retweetet
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
తెలంగాణ ఉద్య‌మంలో ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర చిరస్మరణీయం. సంస్థ ఉద్యోగుల‌ ఉద్య‌మ స్ఫూర్తి, అంకితభావం, కృషి, చిత్త‌శుద్ధి, త్యాగం ప్రత్యేక రాష్ట్ర సాధనలో కీలకంగా నిలిచాయి. ‘బ‌స్ కా పయ్యా న‌హీ చ‌లేగా!’ అన్న ఒకే ఒక్క నినాదంతో ఆర్టీసీ చేప‌ట్టిన స‌మ్మె ఉద్య‌మానికి ఊపిరిలూదింది. స‌క‌ల జ‌నుల స‌మ్మె విజ‌య‌వంతం కావటంలో ఆర్టీసీ త‌న‌దైన‌ చెర‌గ‌ని ముద్ర‌ను వేసి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావానికి బాట వేసింది. ఆర్టీసీ ఉద్యోగుల ప్ర‌త్యేక‌త‌ను చరిత్రలో నిలిపిన‌ వివిధ కార్య‌క్ర‌మాలు రాష్ట్ర సాధనలో చారిత్రక ఘట్టాలుగా నిలిచిపోయాయి; ఫ‌లిత‌మే - మ‌న నవ తెలంగాణ! దేశంలో నేడు అగ్రగామి ప్రజా రవాణా సంస్థగా రూపొందటంలో అంతర్గత శక్తి, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తియే! 👇 andhrajyothy.com/2024/editorial… @PROTGSRTC @TGSRTCHQ
V.C. Sajjanar, IPS tweet media
తెలుగు
37
46
201
16.4K
Nagaiah Pusapati retweetet
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ నాన్ ఏసీ బస్సులు వచ్చేశాయ్!! తెలంగాణ ఆర్టీసీ తొలిసారిగా ఎలక్ట్రిక్ గ్రీన్ మెట్రో ఎక్స్ ప్రెస్ నాన్ ఏసీ బస్సులను వాడకంలోకి తెచ్చింది. మహాలక్ష్మి పథకం వర్తించే ఈ బస్సులను డిప్యూటీ సీఎం శ్రీ భట్టి విక్రమార్క మల్లు గారు, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, రహదారులు, భవనాల శాఖ మంత్రి శ్రీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి గారు ఇవాళ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో @tsrtchq ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు, ఇతర ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. @Bhatti_Mallu @PonnamLoksabha @KomatireddyKVR @PROTSRTC
V.C. Sajjanar, IPS tweet mediaV.C. Sajjanar, IPS tweet mediaV.C. Sajjanar, IPS tweet mediaV.C. Sajjanar, IPS tweet media
తెలుగు
7
28
145
15.1K
Nagaiah Pusapati retweetet
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
➡️ వేతన సవరణతో ఆర్టీసీ ఉద్యోగుల బాధ్యత మరింత పెరిగింది ➡️ భవిష్యత్‌ లోనూ రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలి ➡️ ఉద్యోగులకు టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్‌ దిశానిర్ధేశం ➡️ మిగతా పెండింగ్ సమస్యలను ప్రభుత్వ సహకారంతో పరిష్కరిస్తామని హామీ ➡️ 21 శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించిన నేపథ్యంలో ఉద్యోగులతో వర్చ్‌వల్‌గా ముఖాముఖి తమ ఉద్యోగులకు 21 శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్‌ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారికి, రవాణా శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్‌ గారికి #TSRTC ఎండీ వీసీ సజ్జనర్‌, ఐపీఎస్‌ గారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. గత మూడు నెలలుగా ఆర్టీసీ ఉద్యోగుల వేతన సవరణ కోసం ఉన్నతాధికారులు కసరత్తు చేశారని, ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తోన్న పీఆర్సీ క‌ల సాక‌రమైన ఈ సందర్భం చారిత్రత్మాకమని అభివ‌ర్ణించారు. 2017 వేతన సవరణలో భాగంగా 21 శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించిన నేపథ్యంలో హైదరాబాద్‌ బస్‌ భవన్‌ నుంచి క్షేత్రస్థాయి సిబ్బందితో టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్‌, ఐపీఎస్‌ గారు వర్చువల్‌గా ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ సిబ్బంది సంక్షేమానికి యాజమాన్యం పెద్ద పీటవేస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం, రవాణా శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్‌ గారి సహకారంతో పెండింగ్‌ లో ఉన్న ప్రతి అంశాన్ని సంస్థ పరిష్కరిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. "వేతన సవరణతో ఆర్టీసీ ఉద్యోగుల బాధ్యత మరింతగా పెరిగింది. ప్రజా రవాణా వ్యవస్థను ప్రజల్లోకి తీసుకెళ్లి.. వారికి మెరుగైన, నాణ్యమైన సేవలందించేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలి. భవిష్యత్‌ లోనూ రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి.. జాతీయ స్థాయిలో సంస్థకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలి. ప్రభుత్వం సంస్థపై పెట్టుకున్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిబద్దత, అంకితభావం, క్రమ శిక్షణతో విధులు నిర్వర్తించాలి." అని ఆర్టీసీ ఉద్యోగులకు ఎండీ వీసీ సజ్జనర్‌, ఐపీఎస్‌ దిశానిర్ధేశం చేశారు. టీఎస్‌ఆర్టీసీ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న‌ప్ప‌టికీ.. సిబ్బంది సంక్షేమ విష‌యంలో  యాజమాన్యం ఏమాత్రం రాజీ ప‌డ‌టం లేద‌ని, రెండున్న‌ర ఏళ్లుగా అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టామని గుర్తు చేశారు. "గతంలో కోవిడ్ ప్రభావం, డిజిల్‌ భారం సంస్థపై పడింది. ఉద్యోగులకు సమయానికి వేతనాలు చెల్లించపోవడంతో.. వారిలో తీవ్రమైన నిరాశ, నిస్పృహ, అభద్రతాభావం ఉండేది. రుణాలిచ్చేందుకు బ్యాంకులు ముందుకు వచ్చేవి కావు. ఉద్యోగుల్లో ఉన్న నిస్పృహ పొగొట్టి వారికి మనోనిబ్బరం కలిగిస్తే దాదాపు 50 శాతం కష్టాలను అధిగమించవచ్చని య నమ్మి.. బ్యాంకుల సహకారంతో అక్టోబర్‌ 2022 నుంచి ఒక్కటో తేదిన జీతాలు అందేలా సంస్థ చర్యలు చేపట్టింది." అని అన్నారు.  సిబ్బందికి ఇప్ప‌టివ‌ర‌కు 9 డీఏల‌ను సంస్థ చెల్లించిందని, అన్ని కేట‌గిరీల‌లో ప‌దోన్న‌తులు కూడా కల్పించిందని తెలిపారు. ఉద్యోగుల‌కు మెరుగైన ఆరోగ్య వైద్య‌ సేవ‌ల్ని అందించేందుకు  తార్నాకలోని టీఎస్ఆర్టీసీ ఆసుపత్రిని కార్పొరేట్ త‌ర‌హాలో ఆధునీక‌రించామన్నారు. 50 వేల మంది ఉద్యోగులకు గ్రాండ్‌ హెల్త్‌ ఛాలెంజ్‌ పేరుతో వైద్యపరీక్షలు నిర్వహించామని, దీని వల్ల గుండెసంబంధిత వ్యాధులతో బాధపడుతున్న 300 మందిని ప్రాణాప్రాయం నుంచి కాపాడామని వివరించారు. ఆర్థిక ప్ర‌యోజ‌నాన్ని చేకూర్చే పెండింగ్‌ లో ఉన్న రూ.280 కోట్ల బాండ్ల మొత్తాన్ని ప్రభుత్వ సహకారంతో చెల్లిస్తున్న‌ట్లు చెప్పారు. మ‌హాల‌క్ష్మి పథకాన్ని 48 గంట‌ల్లోనే అమ‌లులోకి తీసుకువచ్చి.. మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణం స‌జావుగా సాగుతుండ‌టంలో సిబ్బంది కృషి ఎనలేనిదన్నారు. 90 రోజులుగా 25 కోట్ల మంది మహిళలను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చారని తెలిపారు. మేడారం లాంటి జాతరలను విజయవంతం చేశారని గుర్తుచేశారు. సిబ్బంది సమిష్టి కృషితో పనిచేయడం వల్లే జాతీయ స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఐదు నేషనల్ పబ్లిక్ బస్ ట్రాన్స్‌ పోర్టు ఎక్స్‌లెన్స్‌ అవార్డులను సంస్థ సాధించగలిగిందన్నారు. "బకాయిల నుంచి బయటపడాలంటే ఇంకా రెట్టించిన సామర్థ్యంతో పనిచేయాలి. ఆక్యూపెన్సీ రేషియో తగ్గకుండా బస్సులను నడపాలి. ఏ ఒక్క ప్రయాణికుడు అసౌకర్యానికి గురికాకుండా చూడాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉంది. మీ అందరికీ యాజమాన్యం తరపున పూర్తి మద్దతు, సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది. మీ కష్టనష్టాలు, సాధకబాధకాలు ఎంప్లాయ్ వెల్ఫేర్ బోర్డు సభ్యుల దృష్టికి తీసుకురావచ్చు. వాటిని ఎప్పటికప్పడు యాజమాన్యం పరిష్కరిస్తుంది." అని సజ్జనర్‌ అన్నారు. సంస్థ మీద నమ్మకం, విశ్వాసంతో తీసుకువచ్చిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేశారని, ఇప్పుడు అదే నమ్మకాన్ని కొనసాగిస్తూ ఆదర్శమైన పబ్లిక్‌ రంగ సంస్థగా టీఎస్‌ఆర్టీసీని తీర్చిదిద్దేందుకు సిబ్బంది అంతా తోడ్పాడుతారనే గట్టి విశ్వాసం తనకుందని ఆయన అన్నారు. @TSRTCHQ @revanth_anumula
V.C. Sajjanar, IPS tweet mediaV.C. Sajjanar, IPS tweet media
తెలుగు
18
35
201
13.2K
Nagaiah Pusapati retweetet
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
టీఎస్ఆర్టీసీ ఉద్యోగుల శ్రమకు తగిన  గుర్తింపు దక్కింది. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో 2017కి సంబంధించిన పే స్కేల్ పై 21 శాతం పిట్ మెంట్ ను TSRTC యాజమాన్యం ప్రకటించింది. ఈ పిట్ మెంట్ 2017 ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తుంది. పెంచిన  పిట్ మెంట్ ప్రకారం కొత్త వేతనాలు ఈ ఏడాది  జూన్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. 53, 071 మంది ఉద్యోగులకు లబ్ది చేకూరనుంది. ఆర్టీసీ శ్రమను గుర్తించి వేతన సవరణకు అనుమతించిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారికి #TSRTC కుటుంబం తరపున ప్రత్యేక ధన్యవాదాలు.  ఈ వేతన సవరణలో ప్రత్యేక  చొరవ తీసుకున్న రవాణా శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. @revanth_anumula @PonnamLoksabha @Bhatti_Mallu @TSRTCHQ @PROTSRTC
V.C. Sajjanar, IPS tweet mediaV.C. Sajjanar, IPS tweet media
తెలుగు
42
39
302
25.8K
Nagaiah Pusapati retweetet
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
ప్రజా రవాణా వ్యవస్థలో డ్రైవరన్నలది క్రియాశీల పాత్ర. వారి సేఫ్ డ్రైవింగ్ వల్లే టీఎస్ఆర్టీసీ పయ్యాలు సాఫీగా నడుస్తున్నాయి. నిత్యం లక్షలాది మంది ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి. నిబద్ధత, క్రమ శిక్షణతో పాటు ఓపిక, సహనంతో విధులు నిర్వర్తిస్తూ.. #TSRTC ని దేశానికే రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతున్న డ్రైవరన్నలకు.. డ్రైవర్స్ డే శుభాకాంక్షలు. డ్రైవర్స్ డే సందర్బంగా #TSRTC ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 97 డిపోల పరిధిలో ఉన్న డ్రైవ్లర్లను ఘనంగా సన్మానిస్తోంది. @TSRTCHQ @PROTSRTC #DriversDay
తెలుగు
44
78
504
22.2K
Nagaiah Pusapati retweetet
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
#Telangana వ్యాప్తంగా ఉన్న డిపోల్లో అప్రెంటిస్ శిక్షణ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి #TSRTC దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బీఏ, బీకాం, బీబీఏ, బీసీఏ పట్టభద్రులైన నాన్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన అభ్యర్థులు ఈ అప్రెంటిస్ కు అర్హులు. పూర్తి వివరాలకి టీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్ సైట్ tsrtc.telangana.gov.in ని సంప్రదించగలరు. @TSRTCHQ @PROTSRTC @PonnamLoksabha
V.C. Sajjanar, IPS tweet media
తెలుగు
24
81
274
35.8K
Nagaiah Pusapati retweetet
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
తమ ఉద్యోగులకు ప్రమాద బీమా పెంపుపై యూబీఐతో #TSRTC ఒక ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం.. రూ.40 లక్షల నుంచి రూ. ఒక కోటికి ప్రమాద బీమా పెరిగింది. హైదరాబాద్ లోని బస్ భవన్ లో శనివారం ప్రమాద బీమా పెంపుపై టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్, యూబీఐ సీజీఎం అండ్ జోనల్ హెడ్ భాస్కర్ రావులు ఈ మేరకు ఒప్పందం చేసుకున్నారు. రోడ్డు ప్రమాదాల్లో అకాల మరణం చెందిన, శాశ్వతంగా దివ్యాంగులైన సిబ్బందికి ఈ ప్రమాద బీమా వర్తించనుంది. యూబీఐ సూప‌ర్ శాల‌రీ సేవింగ్ అకౌంట్(యూఎస్ఎస్ఏ) కింద రూ.కోటి ప్రమాద బీమాను అందించనున్నారు. రూపే కార్డు ద్వారా మరో రూ.12 లక్షల వరకు బీమా వర్తిస్తుంది. ఎలాంటి ప్రీమియం చెల్లించకుండానే మొత్తంగా రూ.1.12 కోట్ల వరకు ప్రమాద బీమాను యూబీఐ సహకారంతో బాధిత కుటుంబాలకు సంస్థ అందించనుంది. ఫిబ్రవరి 1 వ తేది నుంచి ఈ ప్రమాద బీమా అమల్లోకి వస్తుంది. ఈ సందర్భంగా సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ గారు మాట్లాడుతూ.. ఎలాంటి ప్రీమియం చెల్లింపు లేకుండా రూ.1.12 కోట్ల వరకు ప్రమాద బీమాను పెంచడం శుభపరిణామన్నారు. రోడ్డు ప్రమాదాల్లో అకాల మరణం చెందిన, శాశ్వతంగా దివ్యాంగులైన సిబ్బంది కుటుంబాలకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రమాద బీమాను పెంచాలని కోరగానే అంగీకరించిన యూబీఐ ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రమాద బీమా పెంపు అంశాన్ని రవాణా శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారు స్వాగతించారని, ఇది సిబ్బందికి ఎంతో మేలు చేకూరుస్తుందని అభిప్రాయపడ్డారని చెప్పారు. యూబీఐ సూప‌ర్ శాల‌రీ సేవింగ్ అకౌంట్ కింద రోడ్డు ప్రమాదాల్లో మరణించిన 12 మంది సిబ్బంది కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.40 లక్షల చొప్పున అందజేశామని తెలిపారు. గతంలో శాలరీ శ్లాబులతో ప్రమాద బీమా ఇచ్చేవారని, ఈ కొత్త ఒప్పందంలో శాలరీ శ్లాబులతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క సిబ్బందికి రూ.ఒక కోటి ప్రమాద బీమా వర్తిస్తుందని తెలిపారు. రూపే కార్డు ఉంటే మరో రూ.12 లక్షల బీమా అందుతుందని వివరించారు. సిబ్బంది, ఉద్యోగుల శాల‌రీ అకౌంట్స్‌ను రెండేళ్ల క్రితం యూబీఐకి టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం మార్చిందని, ఈ ఖాతా ద్వారా ఉచిత ప్ర‌మాద బీమా సౌక‌ర్యం ఉందని చెప్పారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయే కుటుంబ స‌భ్యుల‌కు సంస్థ అండ‌గా నిలుస్తోందని, వారు ఆత్మ స్థైర్యం, ధైర్యం కోల్పోకుండా ఉండేందుకు బాధిత కుటుంబానికి ఈ ఉచిత ప్ర‌మాద బీమా ఆసరాగా నిలుస్తుందన్నారు. ఉద్యోగుల సంక్షేమానికి సంస్థ అధిక‌ ప్రాధాన్య‌త‌నిస్తున్న‌ట్లు గుర్తు చేశారు. యూబీఐ ఉచిత ప్రమాద బీమాపై సిబ్బందికి అవగాహన కల్పించాలని, యూఎస్ఎస్ఏ ఖాతాలో ఉందో.. లేదో చెక్ చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ రూపే సెలక్ట్ కార్డును తీసుకుని, దానితో లావాదేవీలు చేసుకోవాలని, అప్పుడే రూ.12 లక్షల ప్రమాద బీమాను పొందగలుగుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ సీవోవో డాక్టర్‌ వి.రవిందర్‌, ఈడీలు ఎస్‌.కృష్ణకాంత్‌, పీవీ మునిశేఖర్, వినోద్ కుమార్, వెంకటేశ్వర్లు, ఫైనాన్స్ అడ్వజర్ విజయ పుష్ఫ, సీపీఎం ఉషాదేవి, యూబీఐ జనరల్ మేనేజర్ కృష్ణన్, డిప్యూటీ జోనల్ హెడ్ లు రవి కుమార్, అర్వింద్ కుమార్, సికింద్రాబాద్ రీజినల్ హెడ్ అరుణ్ కుమార్ తో పాటు టీఎస్ఆర్టీసీ హెచ్ వోడీలు, తదిత‌ర అధికారులు పాల్గొన్నారు. @TSRTCHQ @PROTSRTC @PonnamLoksabha @UnionBankTweets
V.C. Sajjanar, IPS tweet mediaV.C. Sajjanar, IPS tweet media
తెలుగు
12
22
158
26.9K
Nagaiah Pusapati retweetet
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
సంక్రాంతికి ఉప్పల్‌ క్రాస్‌ రోడ్డు నుంచి సొంతూళ్లకు వెళ్లే వారికి ముఖ్య గమనిక! ఉప్పల్‌ క్రాస్‌ రోడ్డు నుంచి భువనగిరి-యాదగిరిగుట్ట, మోత్కూర్‌/తొర్రూర్‌ వైపునకు వెళ్లే బస్సుల ఆపే స్థలాలను #TSRTC మార్చడం జరిగింది. హన్మకొండ వైపునకు వెళ్లే బస్సులు యథావిధి స్థానంలో ఆగుతుండగా.. యాదగిరిగుట్ట, తొర్రూర్‌ బస్టాప్‌లను లిటిల్‌ ప్లవర్‌ స్కూల్ సమీపంలోకి సంస్థ మార్చింది. ఒక్కో బస్టాఫ్‌ ను 300 మీటర్లతో గ్యాప్‌తో ఏర్పాటు చేసింది. మహాలక్ష్మి పథకం నేపథ్యంలో మహిళల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది. కావున, ఈ సంక్రాంతికి రెగ్యులర్‌, స్పెషల్‌ బస్సులన్నీ ఉప్పల్‌ క్రాస్‌ రోడ్డు సమీపంలోని ఈ బస్టాప్‌ల నుంచే బయలుదేరుతాయి. ప్రయాణికులందరూ ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని టీఎస్‌ఆర్టీసీ కోరుతోంది. @TSRTCHQ @PROTSRTC #Sankranti #Sankranthi2024
తెలుగు
24
64
267
24.4K
Nagaiah Pusapati retweetet
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
మహిళా ప్రయాణికులకు విజ్ఞప్తి! "మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకం" వినియోగించుకోవాలంటే ఒరిజినల్‌ గుర్తింపు కార్డు తప్పనిసరి. గుర్తింపు కార్డులో ప్రయాణికురాలి ఫొటో, అడ్రస్ స్పష్టంగా కనిపించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే ఏ ఒరిజినల్‌ గుర్తింపు కార్డైన ఈ స్కీంకు వర్తిస్తుంది. పాన్‌ కార్డులో అడ్రస్ లేనందునా అది ఉచిత ప్రయాణానికి చెల్లుబాటు కాదు. ఒరిజినల్‌ గుర్తింపు కార్డులు చూపించాలని పదే పదే చెబుతున్నా.. ఇప్పటికి కొంత మంది స్మార్ట్‌ ఫోన్లలో, ఫొటో కాపీలు, కలర్‌ జిరాక్స్ లు చూపిస్తున్నారని #TSRTC యాజమాన్యం దృష్టికి వచ్చింది. దీనివల్ల సిబ్బంది ఇబ్బందులకు గురవడంతో పాటు ప్రయాణ సమయం కూడా పెరుగుతోంది. ఫలితంగా ఇతర ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. మహిళా ప్రయాణికులందరూ ఒరిజనల్‌ గుర్తింపు కార్డును చూపించి జీరో టికెట్‌ ను తీసుకోవాలని కోరుతున్నాం. ఒరిజినల్‌ గుర్తింపు కార్డు లేకుంటే కచ్చితంగా డబ్బు చెల్లించి టికెట్‌ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మహాలక్ష్మి పథకం తెలంగాణ ప్రాంత మహిళలకే వర్తిస్తుంది. ఇతర రాష్ట్రాల మహిళలు చార్జీ చెల్లించి విధిగా టికెట్‌ తీసుకుని సహకరించాలి. 'ఎలాగూ ఉచితమే కదా. జీరో టికెట్‌ ఎందుకు తీసుకోవడం' అని కొందరు సిబ్బందితో వాదనకు దిగుతున్నారు. ఇది సరికాదు. జీరో టికెట్ల జారీ ఆధారంగానే ఆ డబ్బును #TSRTC కి ప్రభుత్వం రీయింబర్స్‌ చేస్తుంది. జీరో టికెట్‌ లేకుండా ప్రయాణిస్తే.. సంస్థకు నష్టం చేసిన వాళ్లవుతారు. కావున ప్రతి మహిళా కూడా జీరో టికెట్‌ను తీసుకోవాలి. ఒక వేళ టికెట్‌ తీసుకోకుండా ప్రయాణిస్తే.. అది చెకింగ్ లో గుర్తిస్తే సిబ్బంది ఉద్యోగం ప్రమాదంలో పడుతుంది. అలాగే సదరు వ్యక్తికి రూ.500 జరిమానా విధించే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ విధిగా టికెట్‌ తీసుకుని సహకరించాలని కోరుతున్నాం. @TSRTCHQ @PROTSRTC @TV9Telugu @eenadulivenews @V6News @bigtvtelugu @abntelugutv @sakshinews
V.C. Sajjanar, IPS tweet media
తెలుగు
105
81
409
52.7K
Nagaiah Pusapati retweetet
Office of V.C. Sajjanar, IPS
Office of V.C. Sajjanar, IPS@SajjanarOffice·
స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే. స్త్రీల విముక్తి కోసం అహర్నిశలు శ్రమించిన నాయకి, గొప్ప రచయిత్రి. ఆమె దేశంలో తొలి ఆదర్శ ఉపాధ్యాయిని. ఇవాళ సావిత్రిబాయి పూలే జయంతి సందర్బంగా వారికి ఘన నివాళి. Remembering Savitribai Phule on her birth anniversary, a figure of courage and advocacy for female education. #SavitriBaiPhuleJayanti
Office of V.C. Sajjanar, IPS tweet media
తెలుగు
2
32
130
6.1K
Nagaiah Pusapati retweetet
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
#Hyderabad మహాత్మా గాంధీ బస్ స్టేషన్ లో ఘనంగా #NewYear2024 వేడుకలు. ప్రయాణికులతో కలిసి కేక్ కట్ చేసిన TSRTC (@TSRTCHQ) ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు(@SajjanarVC). #NewYear #HappyNewYear2024
తెలుగు
8
55
215
12.9K
Nagaiah Pusapati retweetet
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలందించేందుకు అత్యాధునిక హంగులతో అందుబాటులోకి తెచ్చిన కొత్త ఎక్స్ ప్రెస్, లహరి స్లీపర్ కమ్ సీటర్, రాజధాని ఏసీ బస్సుల ప్రారంభోత్సవం హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్ లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద శనివారం ఘనంగా జరిగింది. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయ లక్ష్మి గారు, హైదరాబాద్ సీపీ శ్రీనివాస రెడ్డి గారు, రవాణా శాఖ కమిషనర్ జ్యోతి బుద్దా ప్రకాశ్ గారు, టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారితో కలిసి రవాణా శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారు కొత్త బస్సులను జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం కొత్త బస్సులో కలిసి వారంతా ప్రయాణించారు.  @PonnamLoksabha @PROTSRTC @TSRTCHQ @HiHyderabad @CPHydCity @hydcitypolice
V.C. Sajjanar, IPS tweet mediaV.C. Sajjanar, IPS tweet mediaV.C. Sajjanar, IPS tweet mediaV.C. Sajjanar, IPS tweet media
తెలుగు
20
60
375
21.4K
Nagaiah Pusapati retweetet
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
#TSRTC నూతన చైర్మన్ గా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఎమ్మెల్యే గారు బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ లోని సంస్థ అధికారిక కార్యాలయం బస్ భవన్ లోని తన ఛాంబర్ లో ఆదివారం ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గారికి సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు(@SajjanarVC), ఇతర ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలియజేసి.. సన్మానించారు. బాధ్యతల స్వీకరణ అనంతరం చైర్మన్ ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారు మాట్లాడుతూ.. అనుభవుజ్ఞులైన ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారి నేతృత్వంలో టీఎస్ఆర్టీసీ అన్ని విభాగాల్లో ముందుకు దూసుకుపోతోందని అన్నారు. తనపై నమ్మకంతో ప్రభుత్వం ఈ బాధ్యతను అప్పగించిందని, తన శక్తి మేరకు సంస్థ వృద్ధికి పాటుపడతానని పేర్కొన్నారు. సంస్థ ఉద్యోగులతో తాను ఒకరిగా సమిష్టిగా పని చేసి.. టీఎస్ఆర్టీసీ లాభాల బాటవైపునకు తీసుకెళ్తామని వివరించారు. టీఎస్ఆర్టీసీ చైర్మన్ గా తనను నియమించిన సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో) డాక్టర్ వి. రవిందర్, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, కృష్ణకాంత్, పురుషోత్తం, వెంకటేశ్వర్లు, వినోద్ కుమార్ తోపాటు చైర్మన్ యాదగిరి రెడ్డి గారి కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. @TSRTCHQ @PROTSRTC @puvvada_ajay
V.C. Sajjanar, IPS tweet mediaV.C. Sajjanar, IPS tweet mediaV.C. Sajjanar, IPS tweet mediaV.C. Sajjanar, IPS tweet media
తెలుగు
47
44
441
49.2K