Ajay 리트윗함

ప్రాణం కంటే ఏదీ మిన్న కాదు.. రహ్-వీర్ లుగా మారి ప్రాణదాతలుగా నిలవండి!
రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు భయపడి వెనకడుగు వేయకండి. గోల్డెన్ అవర్ లో మీరు చేసే చిన్న సాయం ఒక నిండు ప్రాణాన్ని కాపాడుతుంది.
మీలోని మానవత్వాన్ని అభినందిస్తూ కేంద్ర ప్రభుత్వం రహ్-వీర్ పథకాన్ని ప్రవేశపెట్టింది.
ఈ పథకం ద్వారా బాధితులను సకాలంలో ఆస్పత్రికి చేర్చి ప్రాణాలు కాపాడిన వారికి రూ. 25,000 నగదు బహుమతితో పాటు ప్రశంసా పత్రం అందజేస్తారు.
అంతేకాకుండా, జాతీయ స్థాయిలో ఎంపికైన ఉత్తమ సేవకులకు రూ. 1,00,000 నగదు పురస్కారం లభిస్తుంది.
చాలామందికి ఉండే పోలీసు కేసులు, కోర్టుల భయాన్ని పోగొడుతూ చట్టం మీకు పూర్తి రక్షణ కల్పిస్తోంది.
సాయం చేసిన వారిని వివరాలు చెప్పమని ఎవరూ ఒత్తిడి చేయరు, కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు.
ప్రమాదం జరిగినప్పుడు ఫోన్లతో వీడియోలు తీస్తూ సమయాన్ని వృథా చేయకండి. వెంటనే స్పందించి బాధితులను ఆస్పత్రికి చేర్చి ప్రాణదాతలుగా నిలవండి.
తెలంగాణ ప్రభుత్వ ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా అరైవ్ అలైవ్ కార్యక్రమం ద్వారా రోడ్డు భద్రతపై మేము నిరంతరం అవగాహన కల్పిస్తున్నాం.
మనమందరం కలిసి రహదారి మరణాలు లేని సమాజాన్ని నిర్మిద్దాం.
#RahVeer #RoadSafety #GoodSamaritan #SaveLives #GoldenHour #RoadSafetyAwareness #VCSajjanar #HyderabadPolice #ArriveAlive #Telangana
తెలుగు











