Anitha Vangalapudi

6.8K posts

Anitha Vangalapudi banner
Anitha Vangalapudi

Anitha Vangalapudi

@Anitha_TDP

Home Minister, Andhra Pradesh || Politburo Member, TDP || President, Telugu Mahila (AP) || MLA - Payakaraopeta | https://t.co/Z8kpHlBiUk

Payakaraopeta,Andhra Pradesh Katılım Ağustos 2015
14 Takip Edilen102.9K Takipçiler
Anitha Vangalapudi
Anitha Vangalapudi@Anitha_TDP·
నా సహచర మంత్రులతో కలిసి ఎన్టీఆర్ భవన్‌లో మహానాడు ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది. నవశకానికి నాంది పలికే తొలి మెట్టుగా #మహానాడు2026 నిలవబోతోంది. “స్త్రీశక్తి” నినాదంతో మహిళా సాధికారతకు మరింత బలం చేకూర్చే దిశగా… యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పనే ధ్యేయంగా ఈ మహానాడు ముందుకు సాగుతుంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్న ప్రభుత్వ దిశను ప్రతిబింబించే వేదికగా మహానాడు నిలుస్తుంది. #Mahanadu2026 #WomenEmpowerment #TDP
తెలుగు
0
2
13
145
Anitha Vangalapudi
Anitha Vangalapudi@Anitha_TDP·
మహానాడు-2026ను పెద్ద ఎత్తున పండుగలా జరుపుకోడానికి తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రమంతటా పసుపు జెండా రెపరెపలాడుతోంది. రేపు టీడీపీ కార్యకర్తలంతా మీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన క్లస్టర్ కు వేల సంఖ్యలో వెళ్లి మహానాడును విజయవంతం చేయండి. #Mahanadu2026 #SthreeShakti #TeluguDesamParty #AndhraPradesh
Anitha Vangalapudi tweet media
తెలుగు
1
6
27
270
Anitha Vangalapudi
Anitha Vangalapudi@Anitha_TDP·
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మహానాయకుడు శ్రీ ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా నిర్వహించే తెలుగు జాతి కీర్తి మహోత్సవమే “మహానాడు”. అంతర్జాతీయ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి పిలుపుమేరకు ఈసారి మహానాడును హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తున్నారు. “స్త్రీ శక్తి” ప్రధాన అంశంగా జరుగుతున్న మహానాడును “నా తెలుగుదేశం - నా బాధ్యత” అనే భావనతో ప్రతి కార్యకర్త, ప్రతి అభిమాని విజయవంతం చేయాలని పార్టీ పిలుపునిస్తోంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు తమ తమ ఇంటి పైభాగంలో పార్టీ జెండాను ఎగరేసి, ఆ జెండాతో సెల్ఫీ తీసుకుని మీ సామాజిక మాధ్యమాల్లో #Mahanadu2026 హ్యాష్‌ట్యాగ్‌తో పంచుకోండి. మహానాడు సంబరాలు ముందుగానే ప్రారంభమయ్యాయని ప్రపంచానికి చాటుదాం. #SthreeShakti #TeluguDesamParty #AndhraPradesh
తెలుగు
1
2
8
224
Anitha Vangalapudi
Anitha Vangalapudi@Anitha_TDP·
మన ఆత్మగౌరవానికి ప్రతీక… మన కార్యకర్తల ఉత్సవం… మహానాడు-2026కు సమయం ఆసన్నమైంది. మే 27 & 28 తేదీల్లో హైబ్రిడ్ రూపంలో నిర్వహించనున్న మహానాడును పాయకరావుపేట నియోజకవర్గంలోని 10 క్లస్టర్లలో ఘనంగా జరుపుకుందాం. తెలుగుదేశం కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని మహానాడును విజయవంతం చేయాలని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రతి క్లస్టర్‌లో పసుపు జెండా రెపరెపలాడాలి… ప్రతి కార్యకర్తలో మహానాడు జోష్ కనిపించాలి! #Mahanadu2026 #TDP #Payakaraopeta
Anitha Vangalapudi tweet media
తెలుగు
0
2
31
441
Anitha Vangalapudi
Anitha Vangalapudi@Anitha_TDP·
ఆడబిడ్డలకు సమాన హక్కులు, సమాన అవకాశాలు ఇవ్వడమే తెలుగుదేశం సిద్ధాంతం - శ్రీ నందమూరి తారక రామారావు గారు #Mahanadu2026 #SthreeShakti #TeluguDesamParty #AndhraPradesh
Anitha Vangalapudi tweet media
తెలుగు
0
5
25
446
Anitha Vangalapudi
Anitha Vangalapudi@Anitha_TDP·
తెలుగుదేశం సైనికులారా రండి! డిజిటల్ మరియు ప్రత్యక్షంగా క్లస్టర్ స్థాయిలో జరిగే ఈ ప్రత్యేక మహానాడు-2026లో ఉత్సాహంగా పాల్గొందాం. ఈ ప్రత్యేకమైన మహానాడును మరింత ప్రత్యేకంగా ప్రతి క్లస్టర్లోనూ పండుగలా జరుపుకుందాం. #Mahanadu2026 #SthreeShakti #TeluguDesamParty #AndhraPradesh
Anitha Vangalapudi tweet media
తెలుగు
0
8
59
873
Anitha Vangalapudi
Anitha Vangalapudi@Anitha_TDP·
గ్రేహౌండ్స్ దళం అప్రమత్తత, సన్నద్ధత, పోరాట సామర్థ్యాన్ని ఈరోజు సమీక్షించాను. ప్రస్తుతం ప్రశాంత పరిస్థితులు ఉన్నప్పటికీ, మావోయిస్టు కార్యకలాపాలపై ఎలాంటి అలసత్వానికి తావులేదని స్పష్టం చేశాను. అత్యాధునిక శిక్షణా సదుపాయాలు, ప్రపంచ స్థాయి కమాండో ట్రైనింగ్ మౌలిక వసతులు, అఖిల భారత కమాండో పోటీల్లో మన గ్రేహౌండ్స్ సాధించిన విజయాలు ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణం. దేశ భద్రత కోసం అంకితభావంతో సేవలందిస్తున్న ప్రతి అధికారి, కమాండోకు నా అభినందనలు. 🇮🇳 #Greyhounds #AndhraPradeshPolice #AntiMaoistOperations #InternalSecurity #NationalSecurity #APPolice
Anitha Vangalapudi tweet mediaAnitha Vangalapudi tweet mediaAnitha Vangalapudi tweet mediaAnitha Vangalapudi tweet media
తెలుగు
8
21
143
3K
Anitha Vangalapudi
Anitha Vangalapudi@Anitha_TDP·
"ఆత్మవిశ్వసం కలిగి, ప్రజలకు సేవ చేయగల నమ్మకం ఉన్నవాడే నిజమైన నాయకుడు" - శ్రీ నందమూరి తారక రామారావు గారు మే 27 & 28 తేదీల్లో హైబ్రిడ్‌ పద్ధతిలో మహానాడు. మహానాడును విజయవంతం చేద్దాం… తెలుగుదేశం సత్తాను ప్రపంచానికి చాటుదాం! #Mahanadu2026 #TDP #CountdownToMahanadu
Anitha Vangalapudi tweet media
తెలుగు
1
15
73
927
Anitha Vangalapudi
Anitha Vangalapudi@Anitha_TDP·
నక్కపల్లిలో మహానాడు పోస్టర్ల ఆవిష్కరణతో పాయకరావుపేట నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొంది. టీడీపీ కుటుంబ సభ్యుల ఆత్మీయ కలయికైన మహానాడు, అభివృద్ధి సంకల్పాలకు మరో నాంది. ప్రజల ఆశీస్సులతో పాయకరావుపేటను అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకెళ్తాం. #Mahanadu2026 #TDP #Payakaraopeta #AndhraPradesh
తెలుగు
1
9
55
700
Anitha Vangalapudi
Anitha Vangalapudi@Anitha_TDP·
విశాఖపట్నం మర్రిపాలెంలోని రైల్వే కళ్యాణ మండపంలో జరిగిన వివాహ వేడుకకు హాజరయ్యాను. పాయకరావుపేట నియోజకవర్గ ముస్లిం నాయకులు, అనకాపల్లి జిల్లా టిడిపి ముస్లిం మైనార్టీ సెక్రటరీ షేక్ అహ్మద్ (బాబ్జి) గారి కుమారుడు ఇక్బాల్ మరియు రుఖయ్య నూతన దంపతులను ఆశీర్వదించి, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించాను.
Anitha Vangalapudi tweet mediaAnitha Vangalapudi tweet mediaAnitha Vangalapudi tweet media
తెలుగు
0
7
117
2.8K
Anitha Vangalapudi
Anitha Vangalapudi@Anitha_TDP·
నక్కపల్లిలో మహానాడు పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది. టిడిపి కుటుంబ సభ్యులు జరుపుకునే పెద్ద పండుగ మహానాడు. మే 27 & 28 తేదీల్లో హైబ్రిడ్ విధానంలో రాష్ట్రవ్యాప్తంగా 1,840 క్లస్టర్లలో మహానాడు నిర్వహిస్తున్నాం. పాయకరావుపేట నియోజకవర్గంలోని 10 ప్రాంతాల్లో కూడా మహానాడు కార్యక్రమాలు ఘనంగా జరగనున్నాయి. రెండోసారి నన్ను పొలిట్ బ్యూరో సభ్యురాలిగా ఎంపిక చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నాపై నమ్మకం ఉంచిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారికీ, శ్రీ @naralokesh గారికీ ప్రత్యేక ధన్యవాదాలు. పాయకరావుపేట నియోజకవర్గం వేగంగా అభివృద్ధి చెందుతోంది. స్టీల్ ప్లాంట్, రెవెన్యూ డివిజన్, కోర్టు మంజూరు వంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రాంత ప్రజలకు మరింత ఉపయోగపడటంతో పాటు, నియోజకవర్గ అభివృద్ధికి కొత్త దిశను చూపిస్తున్నాయి. #Mahanadu2026 #TDP #Payakaraopeta #AndhraPradesh
Anitha Vangalapudi tweet mediaAnitha Vangalapudi tweet mediaAnitha Vangalapudi tweet mediaAnitha Vangalapudi tweet media
తెలుగు
0
12
76
1.3K
Anitha Vangalapudi
Anitha Vangalapudi@Anitha_TDP·
పాయకరావుపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన 30 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశాను. ఎస్.రాయవరం మండలం పెద గుమ్ములూరులో రుద్ర లక్ష్మి, సాయి శంకర్ కుటుంబాలను స్వయంగా ఇంటికి వెళ్లి పరామర్శించి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి సారథ్యంలో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమమే పరమావధిగా పని చేస్తోంది. అనారోగ్యం మరియు అత్యవసర పరిస్థితుల్లో ఉన్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అండగా నిలిచి సహాయం అందిస్తోంది. #CMReliefFund #Payakaraopeta #NaraChandrababuNaidu #AndhraPradesh
Anitha Vangalapudi tweet mediaAnitha Vangalapudi tweet mediaAnitha Vangalapudi tweet mediaAnitha Vangalapudi tweet media
తెలుగు
1
12
68
1K
Anitha Vangalapudi
Anitha Vangalapudi@Anitha_TDP·
మే 27 & 28 తేదీల్లో హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహించనున్న మహానాడుకు సంబంధించి పాయకరావుపేట నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్న 4 మండలాల పరిధిలోని 10 క్లస్టర్ల ఏర్పాట్లను పరిశీలించాను. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించడంతో పాటు, మహానాడును విజయవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించాను. #Mahanadu2026 #Payakaraopeta #TDP
Anitha Vangalapudi tweet mediaAnitha Vangalapudi tweet mediaAnitha Vangalapudi tweet mediaAnitha Vangalapudi tweet media
తెలుగు
0
12
99
1.5K
Anitha Vangalapudi
Anitha Vangalapudi@Anitha_TDP·
మహాకవి వేటూరి సుందరరామమూర్తి గారి సంస్మరణ సభలో వారి సతీమణి శ్రీమతి సీతా మహాలక్ష్మి గారిని కలుసుకోవడం హృదయాన్ని తాకిన అనుభూతి. వేటూరి గారి పదాలకు ఎంత మాధుర్యం ఉంటుందో… సీతా మహాలక్ష్మి గారి మాటల్లో అంత ప్రశాంతత కనిపించింది. వేటూరి గారికి అంతటి పేరు, ప్రజల ప్రేమ రావడం వెనుక ఆమె అందించిన అండ, ఆత్మీయత, సహనం కూడా ఒక గొప్ప కారణమని పెద్దలు చెప్పడం నిజమే అనిపించింది. ఆమె ఆశీర్వాదాలు తీసుకుని కొంతసేపు ఆత్మీయంగా మాట్లాడడం ఎంతో ప్రత్యేకంగా అనిపించింది. వేటూరి గారిని స్మరించుకోవడం కూడా ఒక అదృష్టం… అలాంటి మహానుభావుడి జీవన ప్రయాణంలో తోడుగా నిలిచిన ఆమెను కలుసుకోవడం మరింత విలువైన క్షణంగా మిగిలిపోతుంది. #Veturi #Visakhapatnam
Anitha Vangalapudi tweet mediaAnitha Vangalapudi tweet mediaAnitha Vangalapudi tweet mediaAnitha Vangalapudi tweet media
తెలుగు
4
22
187
2.6K
Anitha Vangalapudi
Anitha Vangalapudi@Anitha_TDP·
విశాఖపట్నంలోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఆత్రేయ స్మారక కళా పీఠం ఆధ్వర్యంలో నిర్వహించిన మహాకవి వేటూరి సుందరరామమూర్తి గారి 16వ సంస్మరణ సభలో పాల్గొనడం ఎంతో సంతోషకరం. 6000+ పాటలతో తెలుగు భాషను సుసంపన్నం చేసిన మహానుభావుడు వేటూరి గారు. ఈ సందర్భంగా వేటూరి గారి పాటల పుస్తకాలను సభాపతి శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారితో కలిసి ఆవిష్కరించడం జరిగింది. #Veturi #Visakhapatnam
Anitha Vangalapudi tweet mediaAnitha Vangalapudi tweet mediaAnitha Vangalapudi tweet media
తెలుగు
0
21
201
4.5K
Anitha Vangalapudi
Anitha Vangalapudi@Anitha_TDP·
రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. రాష్ట్రంలో ఇతర జిల్లాలతో పాటు కడప జిల్లాలో కూడా రాపిడ్ డ్రగ్ స్క్రీనింగ్ టెస్ట్ కిట్ల ద్వారా ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తూ మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడటం, సమాజాన్ని సురక్షితంగా ఉంచటం ప్రభుత్వ బాధ్యత. ఈ దిశగా చొరవ తీసుకుని పనిచేస్తున్న @Kadapa_Police సిబ్బందిని అభినందిస్తున్నాను. డ్రగ్స్‌పై రాజీపడేది లేదు. యువత భవిష్యత్తు కోసం ఈ పోరాటం కొనసాగుతుంది. #AndhraPradesh #APPolice #DrugFreeAP #SayNoToDrugs
Anitha Vangalapudi tweet media
తెలుగు
0
12
50
924
Anitha Vangalapudi
Anitha Vangalapudi@Anitha_TDP·
ఎండలు ఎంత తీవ్రంగా ఉన్నా… ప్రజల భద్రత కోసం ట్రాఫిక్ పోలీసులు గంటల తరబడి రోడ్లపై విధులు నిర్వహిస్తున్నారు. 42–46°C ఉష్ణోగ్రతల మధ్య కష్టపడుతున్న ట్రాఫిక్ సిబ్బంది ఆరోగ్యం, భద్రత పట్ల ప్రభుత్వం మరియు పోలీస్ శాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాయి. ట్రాఫిక్ సిబ్బంది సంక్షేమం కోసం ప్రత్యేక నిధులు కేటాయించి, రాష్ట్రవ్యాప్తంగా 3,192 మంది ట్రాఫిక్ సిబ్బందికి UV గాగుల్స్, వైట్ క్యాప్స్, ORS ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్, ఫేస్ మాస్కులు అందించే ప్రత్యేక చర్యలు చేపట్టాం. ప్రజల కోసం ఎండనకా, వాననకా సేవ చేస్తున్న ప్రతి పోలీసు సిబ్బందికీ ప్రభుత్వం అండగా ఉంటుంది. 🚦👮 #AndhraPradesh #APPolice #TrafficPolice #PoliceWelfare #Heatwave
Anitha Vangalapudi tweet media
తెలుగు
16
31
241
7.8K
Anitha Vangalapudi
Anitha Vangalapudi@Anitha_TDP·
జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ చేస్తున్న రైతు మునగాల ద్వారకానాథ్ రెడ్డి, తాను అనుసరిస్తున్న పద్ధతులను మంత్రి లోకేష్‌కు వివరించారు. తమ పొలంలోనే సహజ ఎరువులు, 32 రకాల జీవ వైవిధ్య గింజల తయారీ చేపట్టినట్లు తెలిపారు. పురుగుమందులు, రసాయన ఎరువులు ఇప్పుడు తమకు అవసరం లేదన్నారు. ఒక్క ఆవుతోనే 20 ఎకరాల వరకు సేంద్రియ సాగు చేపట్టవచ్చని వివరించారు. #NaraLokesh #AndhraPradesh
తెలుగు
2
17
150
2K
Anitha Vangalapudi
Anitha Vangalapudi@Anitha_TDP·
"సేవ చేయడమే నిజమైన రాజకీయం" - శ్రీ నందమూరి తారక రామారావు గారు మే 27 & 28 తేదీల్లో హైబ్రిడ్‌ పద్ధతిలో మహానాడు. #Mahanadu2026 #TDP #CountdownToMahanadu
Anitha Vangalapudi tweet media
తెలుగు
0
15
64
807