Telangana Congress Sainyam retweetledi

బిగ్ బ్రేకింగ్: కల్వకుంట్ల కుటుంబంలో పెను కల్లోలం
బీఆర్ఎస్ రజతోత్సవ సభలో సంచలన పరిణామం
వరంగల్ జిల్లాలో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రసంగిస్తున్న సమయంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సభను మధ్యలో వదిలి వెళ్లిపోయారు.
ఈ ఘటనను చూసిన కార్యకర్తలు మరియు నాయకులు షాక్‌కు గురయ్యారు.
కేసీఆర్ ప్రసంగిస్తున్న సమయంలో కవిత సభను వీడి వెళ్లడం, కల్వకుంట్ల కుటుంబంలో పెరిగిన భిన్నాభిప్రాయాలకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది.
కవిత లిక్కర్ స్కామ్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
ఈ లిక్కర్ కేసులో కవిత ఐదు నెలల పాటు జైలులో గడపడం,
దీని వల్ల పార్టీ ప్రతిష్ఠకు భంగం కలగడంతో కేసీఆర్ ఈ సభలో కవితకు ప్రాధాన్యత ఇవ్వలేదు.
అంతేకాకుండా, పార్టీలో కూడా ఆమెను దూరం పెట్టినట్లు కనిపిస్తోంది.
గత కొన్ని రోజులుగా కవిత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ, వ్యక్తిగతంగా జిల్లాల పర్యటనలు చేపట్టడం ఈ సంకేతాలను ముందుగానే ఇచ్చింది.
నిన్న జరిగిన రజతోత్సవ సభ ఫ్లెక్సీలలో ఎమ్మెల్సీ కవిత ఫోటోను పెట్టకపోవడం, సభ గురించి కవితకు ఎటువంటి సమాచారం లేదా బాధ్యత ఇవ్వకపోవడం చూస్తే, కేసీఆర్ కవితను దూరం పెడుతున్నట్లు స్పష్టమవుతోంది.
మరికొన్ని రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో షర్మిల తరహాలో కవిత కూడా కొత్త పార్టీ పెట్టి, తన కుటుంబ సభ్యులకు షాక్ ఇస్తుందేమో చూడాలి.
* నోట్: పింక్ కార్యకర్తలు ఈ వార్తను అబద్ధం, ఫేక్ న్యూస్ అని కామెంట్స్ పెట్టే ముందు, దమ్ముంటే ఇదంతా అబద్ధమని నిరూపించండి.
@RaoKavitha @BRSparty

తెలుగు






