
Gamechanger
5.6K posts

Gamechanger
@Gamechangerr225
Proud to be Indian🇮🇳🇮🇳. #Masters #CinemaFan #Gadgetsfreak #PersonalViews #Hyderabadi #TelanganaBidda

























@Pranav_Dupati I would still recommend nord 6 for its battery and performance.. Boys really don't care much about the camera part unless they r photography lover..










#MostHypedMovies - #Rakshakudu అప్పటివరకు టాలీవుడ్‌లో భారీ హైప్‌తో రిలీజ్ అయిన మూవీస్ ఎన్నో ఉన్నాయి. కానీ ఆ భారీ హైప్ కి బాప్ లాంటి సినిమా నాగార్జున రక్షకుడు . 1996 లో భారీ చిత్రాల నిర్మాత కుంజుమోహన్, రెండు భాషల్లో నాగార్జునతో ఒక మూవీ అనౌన్స్ చేయగానే సౌత్ ఇండియాలో అది హాట్ టాపిక్‌గా మారింది. " దీన్ని హిందీలో ,మలయాళంలో కూడా ఒకేసారి రిలీజ్ చేస్తానని , ఈ మూవీ చేయగల హీరో ఇండియాలో నాగార్జున ఒక్కడే " అంటూ స్టేట్మెంటు ఇచ్చి హైప్ పెంచేశారు . హీరోయిన్‌గా మిస్ యూనివర్స్ సుస్మితా సేన్… ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్. నాగార్జునకు హైయెస్ట్ రెమ్యూనరేషన్ ... సుస్మితా సేన్‌కు 75 లక్షలు ఇచ్చారు. AR రెహ్మాన్ కి కోటి. టోటల్ బడ్జెట్ 12 కోట్లు అని చెప్పగానే చిత్ర పరిశ్రమ అంతా షాక్ అయింది. ఎందుకంటే అప్పట్లో మూడు నాలుగు కోట్లతో స్టార్స్ మూవీస్ కంప్లీట్ అయ్యేవి. అత్యంత భారీగా షూటింగ్ ప్రారంభించి అంతే భారీ సినిమాగా రూపొందింది. నాగార్జున వేరే కమిట్మెంట్స్ వల్ల రిలీజ్ టైమ్ బాగా లేట్ అయింది.1997 కి సంక్రాంతికి , తర్వాత ఆగస్టులో రిలీజ్ చేద్దామన్నా కుదరలేదు. చివరికి అక్టోబర్ 30వ తేదీ రిలీజ్ డేట్ ఇచ్చారు. అప్పటికే సినిమా మీద అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఎందుకంటే శంకర్ రేంజ్ లో సినిమా తీస్తున్నారని ప్రచారం జరిగింది. దాంతో బిజినెస్ నెవెర్ బిఫోర్ రేంజ్ లో జరిగింది . ఆడియో రైట్స్ కోటి 40 లక్షలకు అమ్ముడవడంతో సౌత్ ఇండస్ట్రీ మొత్తం నివ్వెరపోయింది . అప్పటికి హైయెస్ట్ ఆడియో హక్కులు కేవలం 45 లక్షలు మాత్రమే . దానికి తగ్గట్టే పాటలు సూపర్ హిట్ అయ్యాయి. “సోనియా సోనియా” అనే సాంగ్ స్టేట్ అంతా మారుమోగిపోయింది. అప్పట్లో ఒక స్టార్ మూవీ బిజినెస్ 7-8 కోట్లు అంటే హైయెస్ట్ అనుకునే వాళ్లు. కానీ రక్షకుడు ప్రీ రిలీజ్ బిజినెస్ 15 కోట్లు — మైండ్ బ్లోయింగ్ అది . సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రక్షకుడు బిజినెస్ గురించి కొన్ని రోజులు టాపిక్ నడిచింది. నేషనల్ మీడియాలోనూ ఆర్టికల్స్ వచ్చాయి. ఈ సినిమాకు ఇండియా వైడ్ ఇమేజ్ ఉన్న హీరో కావాలి. హిందీ, తమిళ్, తెలుగు లో డిమాండ్ ఉన్న హీరో కావాలి. దానికి నాగార్జున ఒక్కరే నాకు కనబడ్డాడు. He is South Indian Supreme” అని నిర్మాత కుంజుమోహన్ చెప్పడమే కాదు...సౌత్ ఇండియన్ సుప్రీమ్ అని సినిమా టైటిల్స్ లో కూడా వేస్తా అని చెప్పాడు . తర్వాత మోహన్ బాబు హీరోగా నటించిన “కలెక్టర్ గారు” మూవీ ఆడుతున్న థియేటర్లలో రక్షకుడు ట్రైలర్ రిలీజ్ చేశారు. ఒక మూవీ ట్రైలర్‌ను ఇంకో స్టార్ హీరో మూవీ ఆడుతున్న థియేటర్లలో ప్రదర్శించడం అదే ఫస్ట్ టైమ్. ఈ సినిమా క్రేజ్ ఎలా ఉందంటే… కేవలం ట్రైలర్ చూడడానికే జనాలు కలెక్టర్ గారు సినిమాకు ఎగబడ్డారు. టీవీల్లో ట్రైలర్ చూసి నాగ్ ఫ్యాన్స్ పిచ్చెక్కిపోయారు. కార్లు లోయలో పడడం, ట్యాంకర్ పేలిపోవడం, హెలికాప్టర్ పట్టుకుని హీరో వేలాడడం, బైక్ చేసింగ్స్… ఇలా ప్రతిదీ మెంటల్ ఎక్కించేసాయి. నార్మల్ ఆడియన్స్‌లో కూడా రక్షకుడు మీద విపరీతమైన ఆసక్తి పెరిగిపోయింది. సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎంతో ఆత్రంగా ఎదురుచూశారు. అలా 1997 అక్టోబర్ 13న తమిళ్లో “రచ్చగన్”, తెలుగులో “రక్షకుడు”గా రిలీజ్ అయింది. కేరళలో కూడా భారీగా రిలీజ్ అయింది. అప్పటికే “మాస్టర్”, “పెళ్లి చేసుకుందాం” వంటి సూపర్ హిట్స్ ఆడుతుండగా… మరో పక్క బాలకృష్ణ “దేవుడు” కూడా కాంపిటీషన్‌లో ఉంది. అంత హెవీ కాంపిటీషన్‌లో రిలీజ్ అయిన ఈ సినిమాకు రికార్డ్ ఓపెనింగ్స్ వచ్చాయి. నాగ్ ఫ్యాన్స్ హంగామా అయితే నెక్స్ట్ లెవెల్ .అప్పటి ప్రభుత్వం కూడా ఈ సినిమా మీద మాట్లాడటం, టికెట్ రేట్స్ హైక్ ఇవ్వడం విశేషం . కానీ ఫస్ట్ డేనే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది రక్షకుడు. తమిళ్, కేరళలో పర్వాలేదు అనిపించినా… తెలుగులో భారీగా పరాజయం పాలైంది. ఈ సినిమా టైటిల్స్‌లో “South Indian Supreme Nagarjuna” అని కార్డు వేయడం ఒక తెలుగు హీరోకి దక్కిన అరుదైన గౌరవం. ఇంకో విచిత్రం ఏంటంటే… రిలీజ్ అయిన రెండో వారంలోనే సిటీ కేబుల్‌లో రోజుకు రెండు సార్లు వరుసగా 10 రోజులు టెలికాస్ట్ చేశారు. అలానే నెల రోజులలోపే ఈటీవీ, జెమినీ టీవీలలో ఒకే రోజు ప్రదర్శించడం కూడా రేర్ రికార్డ్. #Nagarjuna










