
పాణ్యం నియోజకవర్గం కల్లూరు మండలం బస్తిపాడు గ్రామం, సర్వే నం. 382లోని గ్రామకంఠం భూమిపై మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి గారు చేసిన ఆరోపణలు నిరాధారమని మండల నాయకులు స్పష్టం చేశారు.
ఈరోజు సాయంత్రం మండల సీనియర్ నాయకులు, గ్రామ పెద్దలతో కలిసి స్థలాన్ని పరిశీలించగా, ఆ భూమిని టిడిపి నాయకులు కబ్జా చేశారన్న ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని తేలింది.
అదేవిధంగా గతంలో వైసీపీ మండల అధ్యక్షుడిగా ఉన్న కురువ ఈశ్వరయ్య కుటుంబానికి చెందిన వ్యక్తులే ఆ గ్రామకంఠం భూమిని ఆక్రమిస్తూ టెంకాయ చెట్లు నాటినట్లు స్థానికులు వెల్లడించారు.
గ్రామానికి ఉపయోగపడే భూమిని కాపాడేందుకు ప్రయత్నించిన టిడిపి నాయకులపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని మండల నాయకులు హెచ్చరించారు.
నిజాలను వక్రీకరించి రాజకీయ లాభాల కోసం బురదజల్లడం మానుకోవాలని స్పష్టం చేశారు.
#ycpfakebrathuku
#Panyam




తెలుగు














































