
Jithendar
114 posts

Jithendar
@Jithendar_PRO
PRO To Animal Husbandry, Dairy development, Fisheries, Sports & Youth Affairs Department, Telangana Government.
Katılım Şubat 2026
83 Takip Edilen12 Takipçiler
Jithendar retweetledi

Review meeting on the distribution of “Fish prasadam” to be held on June 8 at Nampally Exhibition Grounds
జూన్ 8 న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చేపట్టే చేప ప్రసాదం పంపిణీ పై హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ లో ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం…
సమావేశంలో పాల్గొన్న మంత్రులు వాకిటి శ్రీహరి, అజారుద్దీన్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్,జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా,వివిధ విభాగాల జిల్లా అధికారులు
#PonnamPrabhakar #ChapaPrasadam #RevanthReddy #Telangana
తెలుగు
Jithendar retweetledi
Jithendar retweetledi

జూన్ 8 న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చేపట్టే చేప ప్రసాదం పంపిణీ పై హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ లో సమీక్షా సమావేశాం నిర్వహించడం జరిగింది
సమావేశంలో పాల్గొన్న సహచర మంత్రులు వాకిటి శ్రీహరి, అజారుద్దీన్ గార్లు ,రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్,జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా గార్లు ,వివిధ విభాగాల జిల్లా అధికారులు
@TelanganaCMO @INCIndia @INCTelangana @GHMCOnline @Collector_HYD




తెలుగు

హైదరాబాద్
బంజారాహిల్స్ కొమురంభీం భవన్ లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ గురుకులాలు సంక్షేమ హాస్టల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు
ముఖ్య అతిథిగా హాజరైన మంత్రులు పొన్నం ప్రభాకర్,వాకిటి శ్రీహరి..
కార్యక్రమంలో పాల్గొన్న బీసీ సంక్షేమ శాఖ ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు , బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ , బీసీ డెడికేషన్ కమిషన్ చైర్మన్ బి. వెంకటేశ్వర్లు, రాజ్య సభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, బీసీ సంక్షేమ శాఖ సెక్రటరీ బాలమయాదేవి , ఎంజేపి సెక్రటరీ సైదులు, బీసీ కమిషన్ సభ్యులు,బీసీ సంక్షేమ శాఖ అధికారులు
కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి కామెంట్స్..
*“విద్యా దదాతి వినయం, వినయాద్యాతి పాత్రతాం”అంటే విద్య వినయాన్ని ఇస్తుంది, వినయం వ్యక్తిని గొప్పవాడిని చేస్తుందని ప్రతి ఒక్కరూ గ్రహించాలి.*
*విద్య ప్రపంచాన్ని మార్చడమే కాకుండా, బానిసత్వం నుంచి బయటకు తీసుకు వస్తుందని నెల్సన్ మండేలా, మహాత్మా జ్యోతిరావు పూలే లు చెప్పారు .*
*తెలంగాణ రైజింగ్ లో ప్రతి విద్యార్థి భాగం కావాలి.*
విద్య ఎవరి సొత్తు కాదు
సరస్వతి దేవికి రంగు, రూపు తేడా ఉండదు.
విద్యపై మనం చూపే ఏకాగ్రతే మనల్ని ముందుకు నడిపిస్తుంది.
గురుకులాల్లో అన్ని వసతులు కల్పిస్తున్నాం కనుక 100% ఉత్తీర్ణత సాధించాలి.
అన్ని రంగాల్లో బీసీలు ముందుండాలి.
100 సంవత్సరాలుగా చేయని కుల గణన ను ప్రజా ప్రభుత్వం చేసింది.
విద్యలో ఒత్తిడి ఉండొద్దని 25 వేల మంది టీచర్లకు బదిలీలు, ప్రమోషన్లు ఇచ్చాం
అవకాశాన్ని సృష్టించుకున్నవాళ్లే సమర్ధులు అవుతారు.
రాజకీయాలు అనగానే ఒక ధోరణి ని విడనాడాలి.
భవిష్యత్ లో అసెంబ్లీ, పార్లమెంటుకు ఎన్నికై చట్టాలు చేయాలి.
రాజకీయ నాయకులు చేసే చట్టాలు దేశ భవిష్యత్తును మారుస్తున్నాయి.
సీఎం రేవంత్ రెడ్డి విద్యారంగం విప్లవాత్మకంగా మార్పులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారు.
ప్రజా ప్రభుత్వం విద్యార్ధుల కోసం ఇస్తున్న ప్రాధాన్యతను గుర్తించి, విద్యార్ధులు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి.



తెలుగు
Jithendar retweetledi

Nalgonda-Ranga Reddy Districts Milk Producers Mutually Aided Cooperative Union Limited (NARMUL) has entered into a tripartite agreement with the National Dairy Development Board (NDDB) for the development and strengthening of the dairy sector.
As part of the agreement, NDDB will take responsibility for the development of the dairy for a period of 15 years. In the initial phase, NDDB will release Rs.10 crore towards clearing pending dues of dairy farmers.
Officials of the Telangana Dairy Development Department signed the agreement with NDDB representatives in the presence of senior dignitaries.
The programme was attended by Telangana Minister for Animal Husbandry, Dairy Development, Fisheries, Youth Services and Sports @Vakiti_srihari , Government Whip Beerla Ilaiah, Animal Husbandry, Dairy and Fisheries Secretary Ilambarthi, Mother Dairy Chairman Madhusudan Reddy, and @NDDB_Coop officials.


English

తేదీ:12-05-2026
మినిస్టర్స్ క్వార్టర్స్, హైదరాబాద్
నల్లగొండ–రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం లిమిటెడ్ (నార్ముల్), నేషనల్ డెయిరీ డెవలంప్‌మెంట్ బోర్డు(NDDB)తో త్రైపాక్షిక ఒప్పందం కుదర్చుకుంది.
15 ఏళ్లపాటు డెయిరీ అభివృద్ధి చేసే బాధ్యతను NDDB తీసుకోనుంది. ఒప్పందంలో భాగంగా మొదట పాడి రైతుల బకాయిలను చెల్లించేందుకు రూ.10 కోట్ల రూపాయలను చెల్లించనుంది.
NDDB అధికారులతో తెలంగాణ రాష్ట్ర డెయిరీ విభాగం అధికారులు ఒప్పందాలు చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర పశుసంవర్ధక, పాడిపారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, పశుసంవర్ధక, డెయిరీ, ఫిషరీస్ సెక్రటరీ ఇలంబర్తి, మదర్ డెయిరీ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, NDDB అధికారులు పాల్గొన్నారు.


తెలుగు

తేదీ:12-05-2026
మినిస్టర్స్ క్వార్టర్స్, హైదరాబాద్
రాష్ట్ర నూతన డీజీపీగా నియమితులైన సీవీ ఆనంద్ గారు మినిస్టర్స్ క్వార్టర్స్‌లో రాష్ట్ర పశుసంవర్ధక, పాడిపారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.
నూతన డీజీపీగా నియమితులైన సీవీ ఆనంద్‌గారికి మంత్రి వాకిటి శ్రీహరి శుభాకాంక్షలు తెలిపారు.

తెలుగు

మంత్రి వాకిటి శ్రీహరి గారి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముదిరాజ్ సంఘం నేతలు
డా.బీఆర్.అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర పశుసంవర్ధక, పాడిపారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రివర్యులు గౌరవ శ్రీ వాకిటి శ్రీహరి ఆధ్వర్యంలో తెలంగాణ ముదిరాజ్ కో-ఆపరేటివ్ సోసైటీస్ కార్పొరేషన్ చైర్మన్ బొర్ర జ్ఞానేశ్వర్ ముదిరాజ్, డీసీసీ అధ్యక్షులు సంజీవ ముదిరాజ్, రోహిత్ ముదిరాజ్, పిట్ల మోహన్ ముదిరాజ్, బీసీ జర్నలిస్టుల ఫోరం నేత బలరాం ముదిరాజ్, రావుల రాజశేఖర్ ముదిరాజ్, పుట్టి రాజు ముదిరాజ్, బండారు మోహన్ ముదిరాజ్, ఓయూ జేఏసీ నేత సంతోష్ ముదిరాజ్, ఆగం పాండు ముదిరాజ్ తదితరులు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవ శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డిగారిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ముదిరాజులకు సంబంధించిన పలు సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ముదిరాజ్ సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు.
కులగణన నివేదిక ప్రభుత్వ వెల్లడించిన నేపథ్యంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముదిరాజులను బీసీ-డీ నుంచి ఏ కు మార్చాలని ముఖ్యమంత్రిని ముదిరాజ్ సంఘం నేతలు కోరారు. అందుకు స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి బీసీ డీ నుంచి ఏకు మార్చేందుకు ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై ప్రక్రియ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ముదిరాజుల సమస్యలపై బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరిలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సరైన నిర్ణయం తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. కోర్టుల ద్వారా ఎలాంటి అడ్డంకులు రాకుండా నిర్ణయం ఉండాలని సూచించారు.
అదేవిధంగా కోకపేటలో ముదిరాజ్ భవనానికి సంబంధించిన నిధుల కేటాయింపులపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వినతిపత్రం ఇచ్చారు. ముదిరాజ్ భవన్ కు సంబంధించి నిధులు, ట్రస్ట్ ఏర్పాటు వంటి అంశాలపై కూడా అధికారులు ముదిరాజ్ సంఘాల నేతల అభిప్రాయాలను తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు.
ముదిరాజ్ సమస్యలపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మంత్రి వాకిటి శ్రీహరి, బొర్ర జ్ఞానేశ్వర్, ముదిరాజ్ సంఘం నేతలు ప్రత్యేక ధన్యవాదాములు తెలిపారు. ముదిరాజులమంతా ఐక్యమై సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని మంత్రి వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు.
కులగణనలో ముదిరాజ్ జనాభా అధికంగా ఉందని వెల్లడించిన రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారికి ముదిరాజులు రుణపడి ఉంటారని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. ప్రభుత్వం వెల్లడించిన నివేదిక ఆధారంగా ముదిరాజుల అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి స్పష్టం చేశారు.
ముదిరాజుల సమస్యల పరిష్కారం కోసం కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, ఈటెల రాజేందర్ ముదిరాజ్, బండ ప్రకాశ్ ముదిరాజ్, బొర్ర జ్ఞానేశ్వర్ ముదిరాజ్, నీలం మధు ముదిరాజ్ లు ఐక్యంగా ముందుకు సాగుతామని మంత్రి వాకిటి శ్రీహరి వెల్లడించారు. అందరం కలిసి మరోసారి ముఖ్యమంత్రిని కలిసి ముదిరాజ్ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని మంత్రి వాకిటి శ్రీహరి వివరించారు.



తెలుగు

రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ పుట్టినరోజు సందర్భంగా మినిస్టర్స్ క్వార్టర్స్ లోని ఆయనను ప్రత్యేకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపాను.
ప్రజా సేవను ధ్యేయంగా తీసుకుని బీసీల సంక్షేమం, రవాణా శాఖ అభివృద్ధి కోసం పొన్నం ప్రభాకర్ గారు చేస్తున్న కృషి అభినందనీయం.
ప్రజల సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడూ ముందుండే నాయకుడిగా పొన్నం ప్రభాకర్ గారు ప్రత్యేక గుర్తింపు పొందారు.
పొన్నం ప్రభాకర్ గారికి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలి .
ప్రజాసేవలో మరింత ఉన్నత స్థానాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నాను.
@Ponnam_INC


తెలుగు
Jithendar retweetledi

ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రయాణిస్తున్న కాన్వాయ్ సాధారణ ట్రాఫిక్‌లోనే ప్రయాణించింది. ఢిల్లీ నుంచి హైదరాబాద్ తిరిగి వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి గారు విమానాశ్రయం నుంచి తన నివాసం వరకు వాహనంలో సాధారణ ట్రాఫిక్‌లోనే ప్రయాణించారు.
🔸ముఖ్యమంత్రి గారి కాన్వాయ్ కోసం నగరంలో వాహనాలను నిలిపివేయడం చేయొద్దని పోలీసు ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. రోడ్లపై ప్రజలకు ఇబ్బందులు కలిగించే చర్యలు పూర్తిగా నివారించాలని చెప్పారు.
🔸ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్ తిరిగి వచ్చిన సందర్భంగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇంటి వరకు సాధారణ వాహన శ్రేణిలోనే ముఖ్యమంత్రి గారి కాన్వాయ్ వెళ్లింది. ఎక్కడ కూడా వాహనాలను నిలిపివేయకుండా ట్రాఫిక్ పోలీసులు సింగిల్ లైన్‌లో వాహనాలను అనుమతించారు.
#CMRevanthReddy #HyderabadTraffic #NoTrafficDiversion #HyderabadCityPolice #CMConvoy
తెలుగు

రవీంద్ర భారతిలో తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో యువ నాటకోత్సవం
పాల్గొన్న రాష్ట్ర పశు సంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, రాష్ట్ర ఆర్య వైశ్య అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత, తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్ పర్సన్ ఆచార్య అలేఖ్య, నటీనటులు
కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి కామెంట్స్..,
కళలు బతకాలి.. కళలతోనే మార్పు సాధ్యం
బెట్టింగ్ యాప్ ల మాయలో పడి కుటుంబాలు ఆగం కాకుండా రక్షించుకోవాలి.
ప్రవచనాలు చెప్పడం కాదు.. ఆచరించాలి.
మన యువతను కాపాడుకోవడంలో మనమంతా భాగస్వాములు కావాలి
నేటి కుటుంబాల్లో జరుగుతున్న వాస్తవాలను నాటకాలు ప్రతిబింబిస్తాయి.
ఇవాళ్టి సమాజంలో బెట్టింగ్ యాప్ లు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
నాటకాలతో ప్రజలను చైతన్యం సంకల్పం గొప్పది.
టీవీలు, యాప్, సోషల్ మీడియాకు బానిసలు అయ్యారు.
రమ్మీ యాడ్స్ ను నిషేధించాలని రాష్ట్ర మంత్రిమండలి సమావేశాల్లో ప్రస్తావించాను.
రమ్మీ తదితర యాడ్స్ ను నిషేధించాలని ప్రభుత్వంతో మాట్లాడతా.
బెట్టింగ్ యాప్ లపై బాధ్యతతో ప్రతి ఒకరూ నిర్ణయం తీసుకోవాలి.
బానిసత్వంలో ఉన్న యువతను మార్చేందుకు నాటక ప్రదర్శనలు తప్పనిసరి.
మార్పు కోసం ప్రయత్నం చేస్తే సమాజం మారుతుంది.
భారత దేశంలో ఆధ్యాత్మికం ద్వారానే ఆరోగ్య సమాజం నిర్మితమవుతుంది.
పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడి మన దేశ సంస్కృతి విచ్చిన్నం అవుతుంది.



తెలుగు
Jithendar retweetledi

Cabinet Decisions
1.విద్యుత్ కొనుగోలు, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ ప్రాజెక్టులలో జరిగిన అక్రమాలపై విచారణకు సంబంధించిన కమిషన్ నివేదికను కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI)కు అప్పగించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
విద్యుత్తు కొనుగోళ్లతో పాటు భద్రాద్రి, యాదాద్రి విద్యుత్తు ప్లాంట్లలో జరిగిన అవకతవకలు, అక్రమాలపై ప్రభుత్వం విచారణ కమిషన్ను ఏర్పాటు చేసింది. 2024 మార్చి 14వ తేదీన కమిషన్స్ ఆఫ్ ఇన్క్వైరీ చట్టం ప్రకారం రిటైర్డ్ జస్టిస్ ఎల్. నరసింహా రెడ్డి అధ్యక్షతన కమిషన్ ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు 2024 జులైలో ఆయన విచారణ నుంచి తప్పుకోవటంతో జస్టిస్ మదన్ బి. లోకూర్‌ను కమిషన్‌గా నియమించారు.
2024 అక్టోబర్లో కమిషన్ మొత్తం 114 పేజీల నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. అనంతరం 2025 జనవరి 4వ తేదీన జరిగిన కేబినేట్ సమావేశంలో ఈ నివేదికపై తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై అడ్వకేట్ జనరల్ అభిప్రాయం తీసుకోవాలని నిర్ణయించింది. నివేదికను పరిశీలించిన అడ్వకేట్ జనరల్ తన సూచనలు, అభిప్రాయాలను తెలియజేశారు.
వాటన్నింటినీ ఈ రోజు కేబినేట్ చర్చించింది. ప్రధానంగా అంతర్రాష్ట్ర అంశాలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఈ కేసులో ఉన్నాయి. అందుకే నిష్పాక్షిక దర్యాప్తు జరిపేందుకు సీబీఐ విచారణ అప్పగించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన తదుపరి ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
2. రాష్ట్రంలో భూముల ధరలను సవరించాలని, కొన్ని ప్రాంతాల్లో వాస్తవ ధరలతో పోలిస్తే భారీగా హెచ్చుతగ్గులున్న భూముల ధరలను క్రమబద్ధీకరించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. మార్కెట్ విలువల రేషనలైజేషన్ చేయడానికి రిజిస్ట్రేషన్ శాఖకు అనుమతి ఇవ్వడం జరిగింది. ఈనెల చివరి వారంలో సవరించిన విలువలు అమల్లోకి వస్తాయి.
వివిధ ప్రాజెక్టులు, అభివృద్ధి పనులు, రోడ్ల విస్తరణలో భూములు కోల్పోతున్న నిర్వాసితులు ఇప్పుడు ప్రభుత్వం చెల్లించే పరిహారం రేట్లపై అసంతృప్తితో ఉన్నారు. ధర పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు అందిస్తున్నారు. దీంతో పాటు వాస్తవంగా మార్కెట్ లో ఉన్న ధరలతో పోలిస్తే ప్రభుత్వం నిర్ణయించిన భూముల ధరలు భారీగా వ్యత్యాసమున్నాయి. అందుకు శాస్త్రీయ పద్ధతి అనుసరించి ఈ ధరలను సవరించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జిల్లాల్లో ఉండే మార్కెట్ విలువల రివిజన్ కమిటీలు అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకుని విలువలను సవరిస్తుంది.
3. హిల్ట్ పాలసీలో దరఖాస్తు చేసుకునే వారికి కూడా ఒక అవకాశం ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. భూముల ధరలు పెరిగేలోపు దరఖాస్తు చేసుకున్న వారికి ముందుగా పది శాతం చెల్లించే వెసులుబాటు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. వారికి ఇప్పుడున్న భూముల ధరలే వర్తిస్తాయి. మిగతా 90 శాతం 90 రోజుల్లో చెల్లించాల్సి ఉంటుంది.
4. నిన్న అకాల వర్షాలతో వివిధ జిల్లాల్లో పంటలు, పంట ఉత్పత్తులకు నష్టం వాటిల్లినట్లు సమాచారం అందింది. వెంటనే ఆయా జిల్లాల ఇంచార్జి మంత్రులు బాధ్యత తీసుకుని వివరాలు తెప్పించుకుని రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు.
5. నల్గొండ-రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సంఘాన్ని నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డుకు అప్పగించే ఎంవోయూకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో నల్గొండ- రంగారెడ్డి మిల్క్ ప్రొడ్యూసర్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ ( NARMAC) కు సంబంధించిన పాలు, పాల ఉత్పత్తులకు సంబంధించి డైరీ ప్లాంట్ నిర్వహణ, ప్రాసెసింగ్, మార్కెటింగ్ ఎన్డీడీబీ నిర్వహిస్తుంది.
6. తెలంగాణలో 9 జిల్లాల్లో 33/11 కేవీ సబ్స్టేషన్ల వద్ద సోలార్ పవర్ జనరేషన్ ప్లాంట్ల ఏర్పాటుకు కేబినేట్ ఆమోదం తెలిపింది. పైలెట్ పద్ధతిన 18 చోట్ల ఈ సోలార్ జనరేషన్ ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది. దాదాపు రూ.66.50 కోట్లతో 19 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులను అమలు చేసేందుకు ఆమోదం తెలిపింది.
7. క్యూర్ పరిధిలోని గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లలో పెండింగ్ లో ఉన్న వివిధ ప్రభుత్వ కార్యాలయాలు పన్నులను క్లియర్ చేరుకునేందుకు వన్ టైమ్ సెటిల్ మెంట్ ( OTS) వెసులుబాటు కల్పించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దాదాపు రూ. 5864 కోట్ల బకాయిలున్నాయి. జరిమానాలు, వడ్డీలన్నీ మినహాయించి వన్ టైమ్ సెటిల్మెంట్ ద్వారా రూ.1686 కోట్లు వస్తాయని అంచనా వేసింది. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల పరిధిలోనే వన్ టైమ్ సెటిల్మెంట్ పై ఈ బకాయిలు వసూలు చేసుకోవాలని మున్సిపల్ శాఖను ఆదేశించింది. హైదరాబాద్ జల మండలికి ఇవ్వాల్సిన నీటి బకాయిలను కూడా సర్దుబాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.
8. ఖమ్మం జిల్లా కామేపల్లి వద్ద బుగ్గవాగు నుంచి లెఫ్ట్ ఫ్లడ్ ఫ్లో కాలువ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఖమ్మం జిల్లాలో మైనర్ ఇరిగేషన్ ట్యాంకులకు నీరు అందించనున్నారు.
9. రాష్ట్రంలోని అన్ని ఐటీఐలు (అడ్వాన్సుడ్ ట్రైనింగ్ సెంటర్లు), పాలిటెక్నిక్లు, టీ శాట్ ను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకువచ్చి, ఒకే గొడుగు కింద ఉంచాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించిన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
10. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్ నగర్లో ఆధునిక కూరగాయల మార్కెట్ కోసం 42 ఎకరాల భూమి కేటాయించేందుకు రాష్ట్ర మంత్రివర్గం తెలిపింది.



తెలుగు
Jithendar retweetledi

Thank you to my brothers and sisters in Keralam for a truly decisive mandate.
Congratulations to every UDF leader and worker for a hard-fought, well-run campaign.
As I said before, Keralam has the talent, Keralam has the potential and now Keralam has a UDF government with a vision to harness both.
I look forward to seeing my Keralam family soon ♥️
English


తేదీ:01-05-2026
మహబూబ్‌నగర్
మహబూబ్‌నగర్‌లో యువజన సర్వీసులు, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక, 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా మెగా జాబ్ మేళా
పాల్గొన్న మంత్రి వాకిటి శ్రీహరి, శాసనమండలి చీఫ్ విప్ పి మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మధుసూదన్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ ఎండీ సోనిబాలదేవి, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు
జాబ్ మేళాకు విశేష స్పందన
జాబ్‌మేళాలో మంత్రి వాకిటి శ్రీహరి కామెంట్స్..
ఇప్పటివరకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 24,608 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా, 3, 500 ఉద్యోగాలు ఇవ్వాలనే సంకల్పంతో ఉన్నాం
ప్రభుత్వం నిర్వహించే ఈ జాబ్‌మేళా వెంటనే ఇంటర్వ్యూ పూర్తి చేసుకొని జాబ్ ఆర్డర్లు తీసుకునేవాళ్లు ఉన్నారు.
మీరు ఎన్నుకున్న ఈ ప్రజాప్రభుత్వం మీకోసం అహర్నిశలు పనిచేస్తుంది.
యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమేగాక, యువత స్వశక్తితో నిలబడేలా ఈ ప్రభుత్వం కృషి చేస్తోంది.
విద్యారంగాన్ని పటిష్టం చేసి, ఉద్యోగాల కల్పన చేయాలనే ఆలోచన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉంది.
ఉద్యోగాల కల్పనతోపాటు మా ప్రభుత్వానికి విద్యపై కూడా చిత్తశుద్ధి ఉంది.
ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుకునే విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే ఆలోచనతో కాస్మోటిక్స్ చార్జీలను భారీగా పెంచాం.
10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చేయలేని పనులను చేసి చూపించాం
దాదాపు 25 వేల మంది టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వడమేగాక బదిలీలు కూడా చేశాం
విద్యా, ఉద్యోగాల్లో విన్నూత మార్పు తీసుకురావాలనే సంకల్పంతో సీఎం ముందుకు పోతున్నారు.
యువజన సర్వీసులు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాబ్ మేళాను యువత వినియోగించుకోవాలి.
గతంలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయకుండా ఈ ప్రాంతాన్ని ఎడారిగా మార్చింది.
అందుకే నల్లమల్ల బిడ్డగా మన ముఖ్యమంత్రి వ్యవసాయం, విద్యారంగం అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు.


తెలుగు

కార్మిక, కర్షకులకు మేడే శుభాకాంక్షలు తెలిపిన మంత్రి వాకిటి శ్రీహరి
ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రతి కార్మికుడికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మన దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో కార్మికుల కష్టం, నిబద్ధత, అంకితభావం అపారమైనది. వారి చెమట చుక్కలతోనే దేశ అభివృద్ధి సాధ్యమవుతోంది.
తెలంగాణ ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. కార్మికుల భద్రత, ఆరోగ్యం, జీవన ప్రమాణాలను మెరుగుపరచడం కోసం కృషి కొనసాగుతోంది. అసంఘటిత రంగ కార్మికులకు కూడా సామాజిక భద్రత కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నాం.
కార్మికుల హక్కులను కాపాడుతూ, వారికి గౌరవప్రదమైన జీవితం కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత. కార్మికుల కృషిని గౌరవిస్తూ, వారి సంక్షేమం కోసం మనమందరం కలిసికట్టుగా పనిచేద్దాం. మేడే స్పూర్తితో సమానత్వం, న్యాయం, కార్మికుల సంక్షేమం మరింత కృషి చేద్దామని పిలుపునిస్తున్నాను.

తెలుగు





