ఖానాపూర్ మున్సిపాలిటీలో అప్రజాస్వామ్యంగా చేసినఎన్నికల వాయిదాపై కలెక్టర్‌కు వినతి..
ఈరోజు ఖానాపూర్ మున్సిపాలిటీలో నిర్వహించాల్సిన చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నికలను అధికార దుర్వినియోగంతో ప్రకటించకుండా ఉద్దేశపూర్వకంగా వాయిదా వేయించడం ప్రజాస్వామ్యానికి విరుద్దం తీవ్రంగా ఖండిస్తూ, దీనికి కారణమైన ఎమ్మెల్యే మరియు సహకరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు రితేష్ రాథోడ్ గారితో కలిసి నిర్మల్ జిల్లా కలెక్టర్ గారికి మరియు కౌన్సిలర్లతో కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగింది..
చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ, కావాలని ఎన్నికలను వాయిదా వేసి ప్రజాస్వామ్య ప్రక్రియను అడ్డుకోవడం దురుద్దేశపూర్వక చర్య ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకున్న అధికారులపై, అలాగే దీనికి కారణమైన ప్రజాప్రతినిధులపై తక్షణ విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం..
అలాగే రేపు ఖానాపూర్ మున్సిపాలిటీలో జరగబోయే చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నికలను ఎలాంటి ఒత్తిళ్లు, బెదిరింపులు, అధికార దుర్వినియోగాలకు తావులేకుండా పారదర్శకంగా మరియు శాంతియుత వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ గారిని కోరడం జరిగింది
#khanapur_constituency
అడుగడగున అడ్డంకులు..
అధికారాన్నీ అడ్డం పెట్టుకొని రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు..
అధికారులను బెదిరించి ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేయించి దౌర్జన్యాలకు పాల్పడుతున్న ఎమ్మెల్యే దానికి సహకరిస్తున్న అధికారులు.
అధికార పార్టీ నాయకుల మరియు అధికారుల వైఖరిని తీవ్రంగా ఖండిస్తూన్నాం..
@BRSparty@KCRBRSPresident@KTRBRS@BRSHarish
తెలంగాణ స్వయం పాలన ఆకాంక్షలకు ఊపిరులూదిన రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు, తెలంగాణ ముద్దుబిడ్డ శ్రీ దొడ్డి కొమురయ్య గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు.
#doddikomurayya@BRSparty@Khanapur006
పాపాల విమోచన కోసం తన ప్రాణాన్ని అర్పించిన యేసుక్రీస్తు త్యాగం మన జీవితాలకు నిత్య మార్గదర్శకం. గుడ్ ఫ్రైడే సందర్భంగా ఆ మహనీయుని బోధనలు మననం చేసుకుందాం.
#Goodfriday@BRSparty@Khanapur006
శ్రీరామ నవమి మీ ఇంట సుఖసంతోషాలు నింపాలని, శ్రీరామచంద్రుని కృపా కటాక్షాలు మీపై ఎప్పుడూ ఉండాలని ప్రార్థిస్తూ...
అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు!
#SriRamanavami#Brsparty#KhanapurConstituency
బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో ఘనంగా నిర్వహించిన శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలలో వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారు, బోథ్ ఎమ్మెల్యే @AnilJadhav_brs గారు మరియు ఇతర ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి పాల్గొని కేటీఆర్ గారికి ఉగాది శుభాకాంక్షలు తెలపడం జరిగింది.
@BRSparty#Khanapurconstituency
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినం ప్రతి ఇంటా ఆనందాలు నింపుతూ, కొత్త ఆశలు, కొత్త విజయాలకు నాంది పలకాలని కోరుకుంటూ…మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు. 🤝🌿
@BRSparty#Khanapurconstituency
ఇంద్రవెల్లి మండల బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు మారుతి పటేల్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొనడం జరిగింది, రంజాన్ మాసం ప్రాముఖ్యతను గుర్తుచేస్తూ శాంతి, సౌహార్దం, సోదరభావం పెంపొందాలని రంజాన్ మాసం మనుషుల మధ్య ప్రేమ, కరుణ, సహనం పెంపొందించే పవిత్ర కాలమని తెలిపారు. సమాజంలో ఐక్యత, పరస్పర గౌరవం పెరిగి అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునివ్వడం జరిగింది.
#IftarParty@KTRBRS@Khanapur006@BRSparty
ఖానాపూర్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అజ్మీర గోవింద్ నాయక్ గారి అంత్యక్రియల్లో మాజీ మంత్రివర్యులు జోగు రామన్న గారు, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు. మరియు ఇతర ప్రజా ప్రతినిధులు నాయకులతో కలిసి గోవింద్ నాయక్ గారి భౌతిక కాయానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.
@AnilJadhav_brs@JoguRamanna#KhanapurConstituency
Deeply saddened by the demise of former Khanapur constituency MLA Sri Ajmeera Govind Naik Garu. He dedicated his life to the service and development of the people of Khanapur. His contribution to public life will always be remembered.
My heartfelt condolences to his family members, followers, and well-wishers.
May his soul rest in peace. 🙏
@BRSparty@Khanapur006@KCRBRSPresident@KTRBRS@BRSHarish
నిజామాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఖానాపూర్ మండలం సోమర్ పేట్ గ్రామానికి చెందిన అడిదెల శ్రీలత గారు. జన్నారం మండలం కలమడుగు గ్రామానికి చెందిన శ్రీపెల్లి సరోజ గారు. మరియు ఇంద్రవెల్లి మండలానికి చెందిన రాథోడ్ సావిత్రి బాయి గారు. పలు అనారోగ్య కారణాల రీత్యా నిజామాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా వారిని పరామర్శించి మనోధైర్యం కల్పించి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను కోరడం జరిగింది.
#KhanapurConstituency
జన్నారం మండలం బాదంపల్లి గ్రామ వాస్తవ్యులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సిపతి ఆనందం గారు ఇటీవల కాలి శస్త్రచికిత్స చేయించుకుని బాదంపల్లిలోని తమ నివాసంలో విశ్రాంతి తీసుకుంటుండగా, ఈరోజు స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి వారి నివాసానికి వెళ్లి వారిని పరామర్శించడం జరిగింది.
#KhanapurConstituency#BRSParty
ఉట్నూర్ మండలం లింగోజి తండా ఎక్స్ రోడ్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాథోడ్ శ్యామ్ నాయక్ గారి మాతృమూర్తి స్వర్గస్థులవ్వగా ఈ రోజు బోథ్ ఎమ్మెల్యే @AnilJadhav_brs గారితో. కలిసి శ్యామ్ గారిని మరియు వారి కుటుంబసభ్యులను పరామర్శించి, మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేయడం జరిగింది.
#KhanapurConstituency
మాజీ ఆదిలాబాద్ జిల్లా జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ గారి మామా గారి తెర్వి కార్యక్రమం నార్నూర్ మండలంలోని భీంపూర్ గ్రామంలో జరుగగా కార్యక్రమానికి బోథ్ ఎమ్మెల్యే @AnilJadhav_brs గారితో హాజరై పవార్ నుర్సింగ్ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది.
ఈరోజు ఖానాపూర్ నియోజకవర్గంలోని కడెం మండలం దిల్డర్ నగర్ గ్రామ సర్పంచ్ స్టీఫెన్ గారు ప్రమాదవశాత్తూ గాయపడి ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటుండగా వారిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నాను. అలాగే ఇటీవలే స్వర్గస్తులైన దిల్డర్ నగర్ వాస్తవ్యులు సబ్బనవేని రాజన్న గారి కుటుంబ సభ్యులను మరియు ఖానాపూర్ పట్టణానికి చెందిన కొండి గణేష్ గారి మాతృమూర్తి గారు మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలపడం జరిగింది.
#KhanapurConstituency@KTRBRS@BRSparty