
Krishna Chandar 🚩
19.4K posts

Krishna Chandar 🚩
@KK_Chandu







శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాటిచ్చారు… కొత్త స్కూలు నిర్మించారు… •పెదపాడు పాఠశాలకు కొత్త భవనం •అడవితల్లి బాట ప్రారంభోత్సవంలో ఇచ్చిన మాట నిలుపుకొన్న ఉపముఖ్యమంత్రివర్యులు •రూ. 17.50 లక్షలతో భవన నిర్మాణం అడవితల్లి బాటకు శ్రీకారం చుట్టిన శ్రీ @PawanKalyan గారు, ఆ కార్యక్రమానికి శంకుస్థాపన చేసిన పెదపాడు గ్రామ విద్యార్ధుల కోసం నూతన పాఠశాల భవన నిర్మాణానికి ఇచ్చిన హామీ కార్యరూపం దాల్చింది. రూ. 17.50 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన నూతన భవనంతో ఆ గ్రామ విద్యార్ధులు, ప్రజలకు ఇచ్చిన మాట నిలుపుకొన్నారు. గత ఏడాది ఏప్రిల్ 7వ తేదీ డోలీ రహిత గిరిజన గ్రామాలు లక్ష్యంగా అరకు నియోజకవర్గం, డుంబ్రిగూడ మండలం, పెదపాడు గ్రామంలో అడవితల్లి బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చాపరాయి నుంచి పెదపాడు వరకు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఆ గ్రామంలో మౌలిక వసతులపై ఆరా తీశారు. పెదపాడులో ఉన్న ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనం స్థానంలో కొత్తది నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు చక్కటి భవనాన్ని నిర్మించారు. ఈ పాఠశాల భవనం, త్వరలో మొదలయ్యే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకి అందుబాటులోకి రానుంది.








గౌరవ ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారు ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ లోని ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి నివాసానికి వెళ్లారు. శ్రీ నరేంద్ర మోదీ గారికి శ్రీ పవన్ కళ్యాణ్ గారి కుటుంబం హార్ధిక స్వాగతం పలికింది. ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారిని పరామర్శించారు. సుమారు 20 నిమిషాల సేపు శ్రీ నరేంద్ర మోదీ గారు అక్కడ ఉన్నారు. స్వయంగా వచ్చి పరామర్శించినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ధన్యవాదాలు తెలియజేశారు.


Went to the residence of Andhra Pradesh Deputy Chief Minister, Shri Pawan Kalyan Garu and met him as well as his family. Enquired about Pawan Kalyan Garu’s well being and wished him good health. @PawanKalyan

















