Kotha Prabhakar Reddy
4.3K posts

Kotha Prabhakar Reddy
@KPR_BRS
MLA From Dubbak Constituency | Former Member Of Parliament Medak | BRS Party Siddipet Dist President
Katılım Eylül 2018
15 Takip Edilen9.6K Takipçiler

‘కేసీఆర్ రావాలి.. రేవంత్‌రెడ్డి పోవాలి’ అనే నినాదంతో జగిత్యాల జైత్రయాత్ర.
మోసకారి కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడుదాం. లక్షలాదిగా కదలివద్దాం..
ఈ నెల 20న జగిత్యాలలో జరగబోయే సభను విజయవంతం చేద్దాం.
@BRSparty

తెలుగు

భారత్-పాకిస్థాన్ విభజనతో తెలంగాణ ఏర్పాటును పోల్చడం తెలంగాణ ప్రజల 60 ఏళ్ల పోరాటాన్ని అవమానించడమే @Tejasvi_Surya.
దేశ విభజన మత ప్రాతిపదికన జరిగింది, కానీ తెలంగాణ రాష్ట్రం 'నీళ్లు, నిధులు, నియామకాలు' అనే ప్రజాస్వామ్య హక్కుల కోసం ఏర్పడింది.
తెలంగాణ బిల్లు పార్లమెంటులో రాజ్యాంగబద్ధంగా ఆమోదించబడింది. అత్యున్నత సభలో తీసుకున్న నిర్ణయాన్ని "దురదృష్టకరం" అని మాట్లాడటం అంటే భారత ప్రజాస్వామ్య వ్యవస్థను, రాజ్యాంగాన్ని కించపరచడమే.
రాష్ట్రం విడిపోయిన తర్వాత కెసిఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ దేశానికే అన్నపూర్ణగా మారింది. తలసరి ఆదాయంలో, ఐటీ ఎగుమతుల్లో, వ్యవసాయ రంగంలో తెలంగాణ నేడు దేశంలోనే అగ్రగామిగా ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు జరగని అభివృద్ధి, స్వరాష్ట్రంలో కేవలం పదేళ్లలోనే సాధ్యమైందని గణాంకాలు చెబుతున్నాయి.
1997లో కాకినాడ తీర్మానంలో "ఒక ఓటు - రెండు రాష్ట్రాలు" అని నినదించింది ఇదే బీజేపీ కాదా? అప్పుడు రాజకీయ లబ్ధి కోసం మద్దతు తెలిపి, ఇప్పుడు పార్లమెంటులో తెలంగాణ ఏర్పాటును తప్పుపట్టడం మీ ద్వంద్వ నీతికి నిదర్శనం.
తెలుగు
Kotha Prabhakar Reddy retweetledi
Kotha Prabhakar Reddy retweetledi

కేసీఆర్ గారి పేరు వింటేనే కాంగ్రెస్ వెన్నులో వణుకు పుడుతోంది!
20న జగిత్యాలలో కేసీఆర్ గారి భారీ సభను చూసి వణుకుపుట్టి, అదే రోజు మేడిగడ్డ డ్రామాకు తెరలేపారు.. పాలనలో వైఫల్యాలు, హామీల అమలులో మోసాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ కుతంత్రాలు.
కేవలం డైవర్షన్ రాజకీయాలతో పబ్బం గడుపుతున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలే తగిన బుద్ధి చెప్పడం ఖాయం!
#CongressFailedTelangana #RevanthDiversionPolitics

తెలుగు

రాష్ట్రంలో మైనింగ్ దోపిడీ అడ్డూఅదుపు లేకుండా సాగుతోంది. మైనింగ్ మాఫియా చేతుల్లో తెలంగాణ ఖజానా బందీ అయ్యిందా అనే అనుమానం కలుగుతుంది.
2022–23లో రూ.7,705 కోట్లుగా ఉన్న మైనింగ్ ఆదాయం, ఈనాడు రూ.3,998 కోట్లకు ఎలా పడిపోయింది? 40% ఆదాయం ఎవరి జేబుల్లోకి వెళ్తోంది?
లీజుదారులు ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. పర్మిట్ ఉన్న దానికంటే రెట్టింపు స్థాయిలో ఖనిజాలను వెలికితీస్తున్నారు. తవ్విన పరిమాణాన్ని రికార్డుల్లో తక్కువగా చూపిస్తూ, ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీని ఎగవేస్తున్నారు.
ఒకే ఒక్క ట్రాన్సిట్ పాస్ లేదా వే-బిల్లును ఉపయోగించి రోజంతా వందల సంఖ్యలో వాహనాలతో అక్రమ రవాణా సాగిస్తుంటే విజులన్సు డిపార్ట్మెంట్ ఎం చేస్తుంది.
జీవో 111ను ఉల్లంగిస్తూ కొండలను అనుమతి లేని జిలిటిన్ స్టిక్స్‌ను వాడుతూ జనావాసాల మధ్యే గుట్టలను పేల్చేస్తున్నారు. ఇది పర్యావరణానికే కాకుండా స్థానిక ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారింది.
శంషాబాద్ పరిధిలోనే 20 అక్రమ RMC ప్లాంట్లు దర్జాగా నడుస్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదు. మీకు ఏమైనా వాటా వస్తుందా..లేక నెలవారీ మామూళ్లు అందుతున్నాయా..?
రాష్ట్రానికి తలమానికంగా ఉన్న బొగ్గు, ఇనుము, సున్నపు రాయి, బ్లాక్ గ్రానైట్, మార్బుల్, మాంగనీస్ వంటి ఖనిజ సంపద దోపిడీకి గురవుతోంది. ఆదాయం పెరగాల్సిన చోట గణనీయంగా తగ్గడం అనేది క్షేత్రస్థాయిలో జరుగుతున్న దోపిడీకి నిదర్శనం.
తెలంగాణ సంపదను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. @revanth_anumula గారు, వేల కోట్ల రూపాయల ప్రజల సొమ్ము పక్కదారి పడుతుంటే యంత్రాంగం ఎందుకు మౌనంగా ఉంది? అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుని, ప్రభుత్వ ఖజానాను కాపాడాలని @BRSparty తరుపున డిమాండ్ చేస్తున్నాం.
@TelanganaCMO
తెలుగు
Kotha Prabhakar Reddy retweetledi

దుబ్బాక నియోజకవర్గంలో డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గారి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో దళితులకు అందించిన దళిత బంధు, కార్పొరేషన్ రుణాలు, దళిత విద్యార్థులకు రావలసిన పెండింగ్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని ప్రస్తుత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము.
దుబ్బాక నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న కాలువల పనులను త్వరగా పూర్తి చేసి, రైతులకు సకాలంలో నీరు అందించాలి. ఆ కాలువలకు అన్నింటికీ అంబేద్కర్ గారి పేరును నామకరణం చేస్తాము. ఆయన స్ఫూర్తితో కాలువల నీటి ద్వారా దుబ్బాక పచ్చగా మారుతుంది.
- దుబ్బాక ఎమ్మెల్యే @KPR_BRS గారు..
తెలుగు

దుబ్బాక నియోజకవర్గంలో డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గారి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో దళితులకు అందించిన దళిత బంధు, కార్పొరేషన్ రుణాలు, దళిత విద్యార్థులకు రావలసిన పెండింగ్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని ప్రస్తుత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము.
దుబ్బాక నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న కాలువల పనులను త్వరగా పూర్తి చేసి, రైతులకు సకాలంలో నీరు అందించాలి. ఆ కాలువలకు అన్నింటికీ అంబేద్కర్ గారి పేరును నామకరణం చేస్తాము. ఆయన స్పూర్తితో కాలువల నీటి ద్వారా దుబ్బాక పచ్చగా మారుతుంది.
తెలుగు

చేగుంట మండలంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా
భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా చేగుంట మండల పరిధిలోని బోనాల కొండాపూర్, ఇబ్రహీంపూర్, చేగుంట గ్రామాలలో ఘనంగా నివాళులర్పణ కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, యువత, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారు సమాజంలో సమానత్వం, న్యాయం కోసం చేసిన పోరాటం దేశానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. ఆయన ఆలోచనలు ప్రతి ఒక్కరికీ ఆదర్శమని, ముఖ్యంగా యువత అంబేద్కర్ గారి బాటలో నడిచి సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమం అనంతరం అంబేద్కర్ యువజన సంఘం ప్రతినిధులు స్థానిక అభివృద్ధి అంశాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ ప్రాంతంలో చిన్న పార్క్ ఏర్పాటు చేయడం, యువత కోసం షటిల్ కోర్టు మరియు జిమ్ నిర్మాణం చేపట్టాలని వారు కోరారు.
ఈ విషయంపై స్పందించిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, “ప్రజల కోరిక మేరకు ఈ ప్రాంతంలోని ఖాళీ స్థలంలో చిన్న పార్క్ ఏర్పాటు చేయడంతో పాటు, యువత కోసం షటిల్ కోర్టు మరియు జిమ్ నిర్మాణం చేపడతామని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా హామీ ఇస్తున్నాను” అని తెలిపారు.
అదేవిధంగా ప్రాంత అభివృద్ధి కోసం ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతోందని, ప్రజల సహకారంతో మరిన్ని అభివృద్ధి పనులు వేగవంతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు..




తెలుగు

దుబ్బాకలో డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా
డా. బి.ఆర్. అంబేడ్కర్ గారి గారి 135వ జయంతి సందర్భంగా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని దుబ్బాక, లచ్చపేట్, చేర్వపూర్ గ్రామాలలో ఘనంగా నివాళి కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, ఎస్సీ, ఎస్టీ కమిషన్ బక్కి వెంకటయ్య గారు పాల్గొని డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ, భారత రాజ్యాంగ శిల్పి అంబేద్కర్ గారు సమానత్వం, సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహానుభావులని పేర్కొన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు.
యువత అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టి సమాజ అభివృద్ధికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.




తెలుగు

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో, సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామానికి చెందిన రూపి అలియాస్ రంగబోయిన భాగ్య మరణం చాలా బాధాకరం.
పేద ప్రజలు, ఆదివాసుల కోసం అజ్ఞాతంలోకి వెళ్లి ఎన్నో పోరాటాలు చేసి, చివరకు ఎన్‌కౌంటర్‌లో అమరురాలైన ఆమె మరణం పేద ప్రజలకు, ఆదివాసులకు మాత్రమే కాకుండా దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు, ధర్మారం గ్రామ ప్రజలకు కూడా తీవ్రమైన లోటు.
పేద ప్రజల కోసం పోరాటం చేస్తున్న వారిని డెడ్ లైన్ పెట్టి మరి ఎన్‌కౌంటర్ల పేరిట కాల్చి చంపడం దారుణం. చర్చలకు సిద్ధంగా ఉన్న వారిని కూడా వదలకుండా హతమార్చడం బాధాకరం. మానవ కోణంలో ఆలోచించి, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించి, వారిని జనజీవన స్రవంతిలో కలిసేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను.
నిన్న ఎన్‌కౌంటర్‌లో మరణించిన రూపి అలియాస్ రంగబోయిన భాగ్య గారికి జోహార్లు తెలుపుతూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
తెలుగు
Kotha Prabhakar Reddy retweetledi

సమానత్వానికి ప్రతీక… రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళి
డా. బి.ఆర్. అంబేడ్కర్ గారి 135వ జయంతి సందర్భంగా దుబ్బాక నియోజకవర్గంలో ఘనంగా నివాళులర్పణ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.
దుబ్బాక శాసనసభ్యులు @KPR_BRS గారు, ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య గారితో కలిసి అంబేడ్కర్ గారి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అక్బర్‌పేట్ భూంపల్లి మండలంలోని పోతారెడ్డి పేట, నగరం ఎక్స్ రోడ్, అక్బర్‌పేట్, రామేశ్వరం పల్లి, చిట్టాపూర్ గ్రామాల్లో ఈ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ...
- భారత రాజ్యాంగం ద్వారా ప్రతి పౌరుడికి సమాన హక్కులు అందించిన మహనీయుడు డా. బి.ఆర్. అంబేడ్కర్ గారు అని కొనియాడారు.
- సమానత్వం, న్యాయం, స్వాభిమానం కోసం ఆయన చూపిన మార్గంలోనే మనం ముందుకు సాగాలి అని పిలుపునిచ్చారు.




తెలుగు

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో, సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామానికి చెందిన రూపి అలియాస్ రంగబోయిన భాగ్య మృతి చెందిన విషయం తీవ్ర విషాదకరం.
ఈ నేపథ్యంలో ఈరోజు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య గారు కలిసి మృతురాలు రంగబోయిన భాగ్య కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి బాధను పంచుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ
జరిగిన ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబానికి ఏ విధమైన కష్టాలు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.
అలాగే కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.



తెలుగు

సమానత్వానికి ప్రతీక… రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళి
డా. బి.ఆర్. అంబేడ్కర్ గారి 135వ జయంతి సందర్భంగా దుబ్బాక నియోజకవర్గంలో ఘనంగా నివాళులర్పణ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.
దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య గారితో కలిసి అంబేడ్కర్ గారి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అక్బర్‌పేట్ భూంపల్లి మండలంలోని పోతారెడ్డి పేట, నగరం ఎక్స్ రోడ్, అక్బర్‌పేట్, రామేశ్వరం పల్లి, చిట్టాపూర్ గ్రామాల్లో ఈ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ...
భారత రాజ్యాంగం ద్వారా ప్రతి పౌరుడికి సమాన హక్కులు అందించిన మహనీయుడు డా. బి.ఆర్. అంబేడ్కర్ గారు అని కొనియాడారు.
సమానత్వం, న్యాయం, స్వాభిమానం కోసం ఆయన చూపిన మార్గంలోనే మనం ముందుకు సాగాలి అని పిలుపునిచ్చారు..
1/2




తెలుగు







