పాలు తోడుపెట్టడానికి ఎప్పుడూ తియ్యటి పెరుగు కోసం వెతుక్కంటాము, ఎందుకంటే పాత్ర నిండా తియ్యటి పాలున్నా, ఒక చిన్న చెంచాడు పుల్లటి పెరుగు పాలన్నిటినీ పుల్లగా చేస్తుంది. జీవితం కూడా అంతే, మనం ముత్యపు చిప్పలా ఉంటే తప్ప, ఎటువంటి సాంగత్యం లో ఉంటామో అలాగే మారుతాము. బయటి నుండి ఒక ఇసుక రేణువు ముత్యపు చిప్పలోకి ప్రవేశించినప్పుడు, అది దాని లోపలి భాగానికి చికాకు కలిగిస్తూ ఉంటుంది, ఆ చికాకు నుండి తప్పించుకోవడానికి ముత్యపు చిప్ప ఒక రక్షణ కవచాన్ని సృష్టిస్తుంది, దాని నుండే ముత్యం ఏర్పడుతుంది. ఈ ప్రక్రియలో ముత్యపు చిప్ప కలుషితం కాకుండా, తనను తాను రక్షించు కుంటుంది.
@JogulambaV Congratulations!!! It is a wonderful journey
It is amazing to focus and implement an idea and firmly stay with it for such a long time is a kind of commitment and a devotion in itself. Many more years …
@JogulambaV రోజంతా శ్రమించి ఒకరి నడిగి ఒకరనడిగి తెలుసుకుని గురువులను పెద్దలను గౌరవిస్తూ బతికిన ఆ గౌరవమైన రోజులకి ఈ రోజులకు పోలికా అండి? 100 అడుగుల భావిలోంచి నీళ్ళు తోడాం సైకల్ మీద రోజూ 20 కిమీ తొక్కాం అది కదా వైభవం అమ్మ వండిన అన్నం నాన్న తిట్టిన తిట్లు అదికదా ఐశ్వర్యం
ఒక రకంగా చూస్తే ఆ రోజుల్లో ఇన్ని సదుపాయాలు లేవు, అన్నీ కష్టపడే నేర్చుకున్నాము… చదువు కేవలం పుస్తకాలు, క్లాస్ లో పాఠాల నుండే నేర్చుకోవాలి, గూగుల్ కాదు కద, కనీసం కాల్కులేటర్ కూడా ఉండేది కాదు. వంట చేయాలంటే అన్నీ దంచుకోవడం, రుబ్బుకోవడం, బట్టలు ఉతుక్కోవడం, గ్యాస్ ఖర్చెక్కువ పైగా అయిపోతుందేమో అని సగం బొగ్గుల పొయ్యి లేదా కట్టెల పొయ్యి మీద వండడం. డ్రైవింగ్ నేర్చుకోవాలంటే, అంబాసిడర్ లాంటి కార్లుండేవి, ఆటోమాటిక్ గియర్లు లేవు, కారులో ఏసీల్లేవు, దారి కనుక్కోవాలంటే గూగుల్ కూడా లేదు. కంప్యూటర్ లేని ఆఫీసు, మొబైల్ లేని బిజినెస్సు, ఏ పనైనా విషయ పరిజ్ఞానం లేకుండా చేసే అవకాశం లేదు, మెదడుకి శరీరానికి పనెక్కువ ఉండేది.
For necessary action escalated to the concerned official @Drmsolapur
We regret the experience you had. Please share your (PNR/UTS No.) and mobile no. preferably via DM to enable us to take immediate action. You may also raise your concern directly on railmadad.indianrailways.gov.in or dial 139 for speedy redressal.
x.com/messages/compo…
@IndianRailUsers@indianrailway__@RailMinIndia
Today dt. 24 September 2025 Pune-Hyderabad Shatabdi 12025 / SHATABDI started at 6:00 AM it may reach by 11:30 + /- 2 hours meaning 19-20 hours in a diverted route. Simply this diversion could have been informed at starting point.
@JogulambaV మూలంలోకి చూస్తే ప్రధానంగా అసూయ రాగ ద్వేషాలు భ్రమ స్వార్ధం.
సమానహక్కులే కాని సమానభాధ్యతలు లేవు.
కొంత అఞానం కొంత అహంకారం మిగతాది జరుగుబాటు.
ఎలాబడితే అలా ఎడా పెడా చెలమళీ చెల్లినంత కాలం
ఆ పద్యం లో లాగా
“ చెల్లియో చెల్లకో … “
వందలాది మనస్తత్వాలు, వేలాది నాటకాలతో కూడిన ఈ ప్రపంచం గురించి ఆలోచిస్తే అప్పుడప్పుడు కాస్త అలసటగా అనిపిస్తుంది. కొందరు విమర్శను తమ జన్మహక్కు గా భావించి, వారు ఎన్నడూ జీవించని జీవితాల గురించి మాట్లాడుతూ ఉంటారు, ఎన్నడూ ఎదుర్కోని పోరాటాలపై సలహాలు ఇస్తూ ఉంటారు, ఎన్నడూ నడవని మార్గాలపై మార్గనిర్దేశం చేస్తూ ఉంటారు.
యుఎస్ కోరుకునేది యుద్ధమే అయితే, అది టారిఫ్ వార్ అయినా, ట్రేడ్ వార్ అయినా లేదా మరేదైనా యుద్ధం అయినా, మేము చివరి వరకు పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాము… అమెరికా లోని చైనీస్ రాయబార కార్యాలయం.
కార్లకు ఫాన్సీ నెంబర్లు, టోటల్ 9 వంటి వాటికి పిచ్చి మామూలుగా లేదు. నేనైతే రెజిస్ట్రేషన్ కి వెళ్ళి ఆ రోజు ఫ్రీ గా ఉందెదో తీసేసుకుంటాను.. ఇలాంటివి మీరు నమ్ముతారా??? 😊.
@JogulambaV చాలా మంది ఉన్నారు అదే ప్రాబ్లం. చిన్నప్పుడు శోబన్బాబు కొద్దిగా పెరిగినాక కృష్ణ కాలేజీ కి వస్తూనే రజనీకాంత్ చిరంజీవి కమలహాసన్
వివాహం అయునాక నాగార్జున షారూక్ అమీర్ ఖాన్ పవన్ కళ్యాణ్ మహేష్
45 దాటినాక అమితాబ్ నజరుద్దీన్షా నానాపాటేకర్
అభిమానం ఒకచోట నిలవలా
NTR ANR dressing లోఉన్న
నా టీన్స్ నుండి నాకు ఎంతో నచ్చిన హీరోయిన్ రేఖ. చెప్పాలంటే, నా బట్టల ఎంపిక కానీ, నేను మేకప్ చేసుకునే విధానం కానీ, తన సినిమాలు, ఫోటోలు చూసే నేర్చుకున్నాను. అప్పటికీ ఇప్పటికీ అదే స్టైల్ కంటిన్యూ అవుతుంది.
అలా మీరు అభిమానించి, అనుసరించే స్టైల్ ఐకాన్ ఎవరైనా ఉన్నారా?
@JogulambaV మనస్సు తో చేసే సాధనకు శరీరంతో చేసే తీర్ధ యాత్ర ప్రాక్టికల్ లాంటిది. 40 కోట్ల లో నేను ఒక మనిషిని అని తెలుసు కోవటమే మహాకుంభ పర్వం. అక్కడి ఎలాంటి శక్తి లేకుండా ఇంత మంది వ్యయప్రయాసలు చేసి వెళ్ళ లేరు. అదే అనుభవాన్ని రోజూ అనుభవించగలిగితే అది ఇానసాధన. సాధనలో అనేకమార్గాలు అవకాశాలు🙏
అందరు పాపాలు కడుక్కోవడానికి కుభమేళా కి వెళ్ళరు. పాపాలలో మనకు తెలిసి చేసినవి, తెలియకుండా చేసినవి ఉంటాయి.
నేను ఏ తీర్థ యాత్రకు వెళ్ళినా, ఆధ్యాత్మిక మార్గంలో నా ప్రయాణం ఇంకాస్త సుగమం కావాలనీ, ఈ పుట్టుక, చావుల నుండి విముక్తి పొందాలనే తపన తో నే వెళ్తాను, ఎందుకంటే…
ఇది మానవ జన్మకు మాత్రం సాధ్యం.
అరిషడ్వర్గాలనే, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు మనస్సు యొక్క ఆరు శత్రువులు. వీటిని అదుపులో పెట్టుకోవాలంటే సాధన అవసరం. పెట్టుకోకపోతే మనిషి పతనం ఖాయం. ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తున్నప్పుడు తెలియక చేసే తప్పుల గురించి అవగాహన పెరుగుతుంది.
నేను పన్నెండు జ్యోతిర్లింగాలకు వెళ్ళినప్పుడు కూడా ఏడు జన్మల పాపాలు పోతాయి అన్నారు, కానీ ఇంటికి వచ్చి “ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం” చదివితే “ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః, సప్తజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి” అని ఉంది. అంటే రోజూ ఉదయం, సాయంత్రం ఈ స్తోత్రం చదివితే చాలు, ఏడు జన్మల పాపాలు నశిస్తాయని అర్ధం. క్రమశిక్షణ తో సాధన చేయగలిగితే, అదే శ్రేష్టం, కానీ ఎంతమంది చేయగలరు?