M Raghava kumar
13.5K posts


త్రేతాయుగ అవతార పురుషుడు దశరథాత్మజుడు
శ్రీ రామచంద్రుణీ తన రూపం లో చూపించిన
#నందమూరి_తారక_రాముడు
ఎన్‌టీఆర్‌ను రాముడిగా, సినిమా దేవుడిగా ఎన్నోసార్లు ఎన్నో పత్రికలు, వ్యాసాలు వర్ణించాయి. తన సుదీర్ఘ సినీ జీవితంలో ఆయన ఎన్నో మరపురాని పాత్రలను పోషించారు. బహుశా ప్రపంచ చలనచిత్ర చరిత్రలో ఏ నటుడు పోషించని విధంగా విభిన్న పాత్రలను ఆయన పోషించారు.
పౌరాణిక సినిమాల విషయానికి వస్తే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. రాముడు ఆయనే, రావణాసురుడు ఆయనే. కృష్ణుడు ఆయనే, దుర్యోధనుడు కూడా ఆయనే.
#JaiAnnaNTR
#NandamuriTarakaRamaRao
#NBK #JoharNTR

తెలుగు

5 కోట్ల మంది ఆంధ్రుల కలలను,కొన్ని వేల మంది అమరావతి రైతుల ఆశలను సజీవంగా ఉంచి,నేడు ఆ అమరావతి బ్రతకటానికి కారణమైన నీకు సన్మానం అనేది చాలా తక్కువ భాయ్,ఇది మా రాజధాని అని గర్వంగా మేము చెప్పుకోవటానికి అమరావతి అనే ప్రాంతాన్ని మిగిల్చిన నీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపున పాదాభివందనాలు షరీఫ్ భాయ్🙏🙏....
తెలుగు

మట్టి సాక్షిగా...అహంకారం ఓడింది,
మౌనం గెలిచింది!
ఆకాశం సాక్షిగా... ఐదేళ్ల కన్నీటి ధారలు,
అడుగు తడబడని అలుపెరగని పోరాటాలు!
త్యాగం అంటే ఏమిటో లోకానికి చాటిన వీరులారా...
మీ గుండె కోతకు రూపం ఇది!
కన్నీటి చారికలు - కరకు లాఠీలు నాడు
కోటి ఆశలతో రాజధాని కోసం ప్రాణప్రదమైన నేలని ఇచ్చారు,
కానీ బదులుగా పొందింది
కన్నీళ్లు, అవమానాలు!
గర్భిణీ అని చూడకుండా రోడ్డుపైకి లాగి కడుపులో తన్నారు,
ముసలి ప్రాణమని తలవకుండా లాఠీలతో పొడిచారు.
అమ్మల జుట్టు పట్టుకుని ఈడ్చినప్పుడు...
ఆకాశం మూగబోయింది, ఆ నేలతల్లి గుండె చెరువైంది!
నిందల గాయాలతో గుండె ధైర్యంతో
"కూకటపల్లి ఆంటీలు" అని హేళన చేసిన లంచ్ వోడ్కాలు,
"స్మార్ట్ వాచీలు" వేసుకున్న పెయిడ్ ఆర్టిస్టులని నోరు పారేసుకున్న లుచ్చా నా కొడుకులు మాటలకు
మీరు కుంగిపోలేదు... నిప్పుకణికల్లా నిలబడ్డారు!
"బేబక్కలు" అని వాగిన అహంకారానికి,
"అవమానాల" చీకటి కోణాలకు,
మీరు చూపిన సమాధానం
1631 రోజుల మౌన పోరాటం!
వందల రోజులు ఎండకు ఎండి, వానకు తడిసి,
రోడ్డు పక్కన మట్టిలో కలిసిన ముద్దను తింటూ...
చింపిన బట్టలతో, పగిలిన శరీరాలతో మీరు చేసిన యుద్ధం,
భారత చరిత్రలో ఎన్నడూ చూడని అపూర్వ ఘట్టం!
నేడు... శిరస్సు వంచి నమస్కరిస్తున్న దేశం!
మీ కన్నీటి త్యాగానికి ఢిల్లీ కోట కదిలింది,
లోక్‌సభ సాక్షిగా అమరావతి 'ఏకైక రాజధాని'గా గర్జించింది!
ఇది మా విజయం కాదు...
అధికార గర్వంపై అణగారిన రైతు సాధించిన చారిత్రక విజయం
అమరావతి మహిళా రైతులారా...
మీరు చిందించిన ప్రతి రక్తపు చుక్కా...
ఒక ఇటుకై నిలిచింది.
మీరు కార్చిన ప్రతి కన్నీటి చుక్కా...
ఒక నదిలా ప్రవహించింది.
తరతరాలు చెప్పుకుంటాయి మీ గాథను.
యుగయుగాలు కీర్తిస్తాయి మీ ధైర్యాన్ని!
మీ త్యాగాలకు సలాం... మీ పోరాటానికి జోహార్!
జై అమరావతి!
తెలుగు

యద్దనపూడి సులోచనారాణి
(2ఏప్రిల్ 1950-మే18,2018)
తెలుగు సాహిత్యంలో పాఠకులను గణనీయంగా పెంచినా, విమర్శకుల ప్రశంసలు పొందని రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి.. దాదాపు ఎనభై నవలలు రాసినా
ఆవిడ పేరు చెప్పగానే గుర్తుకొచ్చేవి జీవన తరంగాలు, సెక్రటరీ, మీనా,పార్థు,ఆరాధన, కీర్తి కిరీటాలు మరికొన్ని నవలలే..
ఆవిడ స్త్రీ పాత్రలను చాలా ధైర్యంగా,ఆత్మవిశ్వాసం తో ఉండేటట్లు చిత్రించారు..1964లో సెక్రటరీ నవల ఆంధ్రజ్యోతి లో వచ్చేనాటికి ఆవిడకు పాతికేళ్లు కూడా లేవు.. ఇంగ్లీషులో వచ్చిన mills &boon రొమాంటిక్ నవలల్ని కాపీ కొట్టారని తెలుగులో ఉన్న మన మార్క్సిస్టు మేధావులు చాలా ప్రచారం చేశారు.ఇది వాస్తవానికి బహుదూరం..రచయిత్రి డా.సి.మృణాళిని అన్నట్లు సులోచనారాణి గారి రచనల్లో కొంత Jane Austin , Margaret Mitchell ఛాయలు కనిపిస్తాయేమో.
ఎక్కడో కృష్ణా జిల్లా కాజ లో ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఆవిడకు ఆంగ్ల సాహిత్యం తో పరిచయం ఉందంటే నమ్మశక్యం కాదు.. ఆరోజుల్లో మనవాళ్ళు మహా చదివితే మాక్సిం గోర్కీ mother, టాల్ స్టాయ్ తెలుగు అనువాదాలు చదివేవారు..
అదికూడా ఇంట్లో కమ్యూనిస్టు వాతావరణం ఉంటే.
తెలుగు వచనంలో ఇద్దరే ఇద్దరు తమ శైలితో అజేయంగా నిలిచారు.ఒకరు చలం అయితే రెండోవారు సులోచనారాణి..
ఆమధ్య ఒక పబ్లిషర్ ను విజయవాడలో కలిసినప్పుడు ఒక్కమాట చెప్పారు.. తెలుగు లో రెండే పుస్తకాలు ప్రతిసంవత్సరం రీప్రింట్ అవుతాయిట.ఒకటి యద్దనపూడి సులోచనారాణి "సెక్రటరీ" రెండవది శ్రీ శ్రీ మహాప్రస్థానం..ఆ విధంగా ఆవిడ ఇప్పటికీ పబ్లిషర్లకు కల్పతరువు
నేను రేడియో లో పనిచేసే కాలంలో ఆవిడతో రేడియో లో మాట్లాడించాలని చాలా ప్రయత్నాలు చేశాను.ఆవిడకు ఒక స్వచ్ఛంద సంస్థ ఉండేది.వారెప్పుడూ ఆ సంస్థ పనుల్లో బిజీగా ఉండేవారు.2017వ సంవత్సరం డిసెంబర్ 2న తురగా జానకీ రాణి పురస్కారం వారికి ప్రదానం చేశారు.నవ్య సంపాదకులు ఏ.యన్.జగన్నాధశర్మ గారు ముఖ్య అతిథి. ఆరోజున మళ్ళీ వారిని బతిమాలాను మీరోకసారి రేడియో కి రండి అంటూ.. అమెరికా కు వెళ్తున్నాను..వచ్చాక ఈసారి తప్పకుండా వస్తానయ్యా అన్నారు..నాకూ అప్పుడు నమ్మకం కుదిరింది ఆవిడ వస్తారని.ఆ తర్వాత మే 18న ఆవిడ శాశ్వతంగా పై లోకాలకు వెళ్లిపోయారు..అది బాధ కలిగించే విషయం అనుకోండి..
తెలుగు పత్రికలు ముమ్మరంగా వచ్చే కాలంలో
స్త్రీ పురుష తేడాలేకుండా పాఠక అభిమానులను సంపాదించుకున్న ఒకే ఒక్క రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి.. అన్నపూర్ణ పిక్చర్స్ వారు తీసిన హిట్ సినిమాల్లో కథను జనరంజకంగా తీర్చి దిద్దటంలో ఆవిడది కీలకపాత్ర.నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు గారికి ఆవిడ పట్ల అపారమైన నమ్మకం ఉండేది.. అందరికీ ఆయన జడ్జిమెంట్ పై గౌరవం ఉంటే ఆయనకు సులోచనారాణి గారిపై గురి..
దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఆవిడ రచనలంటే ఇష్టం, గౌరవం.. అతడు లో హీరో పాత్రకు పార్థు పేరు పెట్టారు.. మీనా సినిమాని "అ.ఆ." గా మళ్ళీ తీశారు..
నిజానికి సాహిత్య లోకం ఆవిడ రచనల పట్ల అంత గౌరవం చూపకపోయినా, కాలక్షేప సాహిత్యం గా కొట్టి పారేసినా ఆకాశవాణి మిత్రుడు డా.నాగసూరి వేణుగోపాల్ వారి రచనలపై పలువురిచే అద్భుతమైన వ్యాసాలు రాయించి ఆవిడకు నివాళిగా ఒక పుస్తకం తెచ్చారు.. మరోసారి ఆ పుస్తకం పరిచయం చేస్తాను..
తెలుగులో ఒకతరం పాఠకులను ఉర్రూతలూగించిన రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి గారికి నమస్సుమాంజలి 🙏🙏🙏
#యద్దనపూడిసులోచనారాణి


Rajendra Nagar, India 🇮🇳 తెలుగు





















