ప్రేమలు పుస్తకాలు

110 posts

ప్రేమలు పుస్తకాలు banner
ప్రేమలు పుస్తకాలు

ప్రేమలు పుస్తకాలు

@PremaluBooks

Premalu Pusthakaalu - A Telugu Book Publishing Company. తెలుగు పుస్తక ప్రచురణ సంస్థ.

Katılım Ekim 2025
32 Takip Edilen377 Takipçiler
Sabitlenmiş Tweet
ప్రేమలు పుస్తకాలు
ఒక ఎండాకాలపు మధ్యాహ్నం పుస్తకావిష్కరణ 💙🤗 హైదరాబాద్ బుక్‌ఫెయిర్‌తో పాటు అమెజాన్‌లో కూడా ఈ పుస్తకం దొరుకుతుంది. లింక్ బయోలో ఉంది. Visit our stall at the Hyderabad Bookfair - Stall No. 356 (Premalu Pusthakaalu). @insidemalli
తెలుగు
1
7
100
3.1K
ప్రేమలు పుస్తకాలు retweetledi
V Mallikarjun
V Mallikarjun@insidemalli·
నేను రాసిన పుస్తకాల పేర్లు తెలుసా అనడిగితే అమ్మ ఏమంటున్నదో చూడండి! 😄💙 @PremaluBooks
తెలుగు
1
2
32
746
ప్రేమలు పుస్తకాలు retweetledi
V Mallikarjun
V Mallikarjun@insidemalli·
అతనూ ఆమె కలిసి తిరిగిన కుతుబ్‌షాహీ టూంబ్స్ ఒకసారి చూసొద్దామని.. ఇలా.. 💙 Oka Endakalapu Madhyahnam featuring Qutub Shahi Tombs. 🤗 @PremaluBooks
0
3
22
646
ప్రేమలు పుస్తకాలు retweetledi
V Mallikarjun
V Mallikarjun@insidemalli·
The summer special offer is now live. అమెజాన్లో నేను రాసిన ఐదు పుస్తకాల్లోంచి ఏ రెండు పుస్తకాలు కలిపి కొన్నా 20% డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నాం. ప్రోమో కోడ్ ఏదీ అవసరం లేదు. పేమెంట్ పేజీలో డిస్కౌంట్ వచ్చేస్తుంది. You can purchase from this link: bit.ly/premalubooks @PremaluBooks
V Mallikarjun tweet mediaV Mallikarjun tweet mediaV Mallikarjun tweet mediaV Mallikarjun tweet media
తెలుగు
1
4
20
1.1K
ప్రేమలు పుస్తకాలు retweetledi
V Mallikarjun
V Mallikarjun@insidemalli·
మల్లి ముదిరాడు. ‘నల్లగొండ కథలు’ నుంచి ఇదొక లాంగెస్ట్ జంపు. ఆధునిక అస్తిత్వ వాదాన్ని Stream of Consciousness లో చెప్పే ప్రయత్నం చేసాడు. నగర జీవితపు రిలేషన్షిప్పులు బ్రేకప్సుల నడుమ ప్రేమకోసం అలమటించే ఆత్మల హాహాకారం వినిపించాడు. మొదటి అధ్యాయం నాలుగో చాప్టర్లో రేడియో రొమాన్స్ ఒక కల్ట్ బ్లాస్ట్. అలాగే పుస్తకం ఫినిషింగ్ లైన్ అదిరిపోయింది. కొంచెం బ్రెక్ట్, కొంచం కేమూ, కాస్త ఏలియనేషన్ తెలియాలి. లాస్ట్ చాప్టర్ ‘పెడ్రో పరామో’ని గుర్తు చేసింది. కాన్షియస్ ట్రిబ్యూటా? సబ్ కాన్షియస్ ఇన్ఫ్లూయెన్సా. రెండూ కాక సింప్లి యాదృచ్ఛికమా? ఎండాకాలపు వేడిలా అస్తిత్వవేదన యాసిడ్‌లా కాలుస్తుంది. మల్లి సృష్టించిన 'లింబో', మెటాఫర్స్, అబ్సర్డిటీలు మరీ అంత లోతైనవి కాకపోయినా సామాన్య పాఠకులకి కొంచం సంక్లిష్టమే. 'బ్రెహ్టియన్ డిస్టెన్సింగ్'లో చూడగలగాలి. 'ఒక ఎండాకాలపు మధ్యాహ్నం' ఈజ్ నాట్ ఎవరీ రీడర్స్ కప్ ఆఫ్ టీ. మల్లి ముదిరాడు గానీ ఇంకాస్త లేతదనం మిగిల్చుకున్నాడు. - ఆర్. సామల *** సాహిత్యాన్నీ సినిమానీ ఎంతో ప్రేమించే రచయిత రమేశ్ సామల అన్న రాసిన రివ్యూ ఇది. Truly blessed. 🙏🏼 'ఒక ఎండాకాలపు మధ్యాహ్నం' నవల చదివి నాలుగు ప్రేమ మాటలు చెప్తున్న అందరికీ ప్రేమ 💙🤗 The books is available on Amazon and all major book shops: amzn.in/d/0hDBMhT9 @PremaluBooks
V Mallikarjun tweet media
తెలుగు
1
2
15
799
ప్రేమలు పుస్తకాలు retweetledi
V Mallikarjun
V Mallikarjun@insidemalli·
"మీ పుస్తకం ఒక ఎండాకాలపు మధ్యాహ్నం చదివేశాను. నాకు కొన్ని ప్రశ్నలున్నాయి, అడగొచ్చా?" అని ఇన్‌స్టాలో మెసేజ్ చేశారు తమశ్వి (@ thatsalliwrite) అనే పాఠకురాలు. "ఓ, తప్పకుండా!" అన్నాన్నేను, ఏవో రెండు ప్రశ్నలు అడుగుతారులే అని. ఆవిడ ఇలా ఏకంగా పది ప్రశ్నలు అడిగారు. నేను ఆ పదింటికీ సమాధానాలు ఇచ్చాను గానీ, ఇక్కడైతే ఆవిడ అనుమతి తీసుకొని ఆ ప్రశ్నలు మాత్రమే పోస్ట్ చేస్తున్నా, పుస్తకం చదివిన మీకేమైనా సమాధానాలు దొరుకుతాయేమో చూడండి! (ఎప్పుడో నా సమాధానాలూ పోస్ట్ చేస్తా.) BTW did you read #OEM? Order your copy from Amazon: bit.ly/OEMbook
V Mallikarjun tweet mediaV Mallikarjun tweet mediaV Mallikarjun tweet mediaV Mallikarjun tweet media
తెలుగు
6
3
17
1.8K
ప్రేమలు పుస్తకాలు retweetledi
V Mallikarjun
V Mallikarjun@insidemalli·
మన @PremaluBooks కి ఒక యూట్యూబ్ చానల్ ఉంటే బాగుంటుందని మొదలుపెట్టాం. ఇందులో మన బుక్ ఈవెంట్స్, డిస్కషన్స్, నా వర్క్‌షాప్ వీడియోలు - ఇలాంటివి పోస్ట్ చేస్తాం. Channel link: @premalupusthakaalu" target="_blank" rel="nofollow noopener">youtube.com/@premalupustha
V Mallikarjun tweet media
తెలుగు
3
7
28
946
ప్రేమలు పుస్తకాలు
ఇవ్వాళ వరల్డ్ బుక్ డే! పుస్తకాల గురించి మాట్లాడుకోవడం, పుస్తకాల ప్రేమలో పడిపోవడానికి మించిన ఆనందం ఏముంటుంది ఏ బుక్ లవర్‌కైనా. 🤗 సరే, మీరు ఇప్పుడు చదువుతున్న పుస్తకమేంటి? #WorldBookDay #PremaluPusthakaalu
ప్రేమలు పుస్తకాలు tweet media
తెలుగు
4
9
118
4.1K
ప్రేమలు పుస్తకాలు retweetledi
V Mallikarjun
V Mallikarjun@insidemalli·
"నాకు తెలిసినవాళ్ళు అందరూ చదివేలా చేస్తా - చెప్పి చెప్పి విసిగించి అయినా!" How sweet of OEM readers 💙🤗 Did you get your copy? Order here: amzn.in/d/0bgr3odE
V Mallikarjun tweet media
1
2
4
523
ప్రేమలు పుస్తకాలు retweetledi
V Mallikarjun
V Mallikarjun@insidemalli·
"Thank you for writing Oka Endakalapu Madhyahnam." చదివిన చాలామంది చెప్తున్నారీ మాట. ఎంత సంతోషంగా ఉంటుందో! 💙🤗
V Mallikarjun tweet media
1
1
24
1.5K
ప్రేమలు పుస్తకాలు retweetledi
V Mallikarjun
V Mallikarjun@insidemalli·
నేను నా నవలని మూడు భాగాలుగా చేసి రాసానని, ఈయన మూడు భాగాలుగా తన అభిప్రాయాన్ని ఈ-మెయిల్ చేసారు. 🥺 ఈ పుస్తకానికి పనిచేసిన అందరికీ ప్రత్యేకంగా అప్రిషియేషన్ మెసేజ్ కూడా పంపించారు. How cute of him! గణేష్ గారు, మీకు మా ప్రేమ. 💙🤗 (Very soon, I will make a video on how significant it was to shift the tone and pace in each part of the novel.) ఇంతకీ మీరు పుస్తకం చదివారా? Order your copy here: amzn.in/d/00LJlbSQ @PremaluBooks
V Mallikarjun tweet mediaV Mallikarjun tweet media
తెలుగు
1
2
16
1.4K
ప్రేమలు పుస్తకాలు retweetledi
V Mallikarjun
V Mallikarjun@insidemalli·
'ఒక ఎండాకాలపు మధ్యాహ్నం' పుస్తకం గురించి మాట్లాడదామని.. 💙 Unscripted.. ఏమనిపిస్తే అది మాట్లాడిన. వినండి (చూడండి?) 😊
తెలుగు
1
4
22
1.9K
ప్రేమలు పుస్తకాలు retweetledi
V Mallikarjun
V Mallikarjun@insidemalli·
* Contains major spoilers * ఆంధ్రజ్యోతి సండే మ్యాగజైన్లో 'ఒక ఎండాకాలపు మధ్యాహ్నం' పుస్తక సమీక్ష. ఆంధ్రజ్యోతి దినపత్రికకు, గొరుసు గారికి, రవీంద్ర బాబు గారికి ప్రేమ 💙🤗 #OkaEndakalapuMadhyahnam @PremaluBooks
V Mallikarjun tweet media
తెలుగు
2
4
26
767
ప్రేమలు పుస్తకాలు
The summer special offer is now live. అమెజాన్లో మా ఐదు పుస్తకాల్లోంచి ఏ రెండు పుస్తకాలు కలిపి కొన్నా 20% డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నాం. ప్రోమో కోడ్ ఏదీ అవసరం లేదు. పేమెంట్ పేజీలో డిస్కౌంట్ వచ్చేస్తుంది. You can purchase from this link: bit.ly/premalubooks @insidemalli
తెలుగు
1
2
2
296
ప్రేమలు పుస్తకాలు retweetledi
tvk అనంతపురం అర్బన్ ఇంచార్జ్
My view పుస్తకం -నా అభిప్రాయం పుస్తకం పేరు - ఒక ఎండాకాలపు మధ్యాహ్నం రచయిత - వి మల్లికార్జున్. @insidemalli ప్రచురణ - ప్రేమలు పుస్తకాలు @PremaluBooks #teluguwriters #telugu #telugunovels #teluguliterature
tvk అనంతపురం అర్బన్ ఇంచార్జ్ tweet mediatvk అనంతపురం అర్బన్ ఇంచార్జ్ tweet mediatvk అనంతపురం అర్బన్ ఇంచార్జ్ tweet mediatvk అనంతపురం అర్బన్ ఇంచార్జ్ tweet media
తెలుగు
0
2
12
487
ప్రేమలు పుస్తకాలు retweetledi
V Mallikarjun
V Mallikarjun@insidemalli·
Why you should read Oka Endakalapu Madhyahnam అని ఒక పోస్ట్ చేశాం గుర్తుందా? అప్పుడు why you shouldn't read అని కూడా వెయ్యాలి కదా! @telugucollectv వారు గత మూడు నెలల్లో ఏం చదివామో తల్చుకుంటూ నిర్వహించిన లైవ్‌లో కొత్త సాయికుమార్ చెప్పిన ఈ అభిప్రాయం సరిగ్గా సరిపోతుంది అనిపించింది. నిజమే, ఈ పుస్తకం డిప్రెసివ్‌గా ఉందని కొంతమంది చెబుతూ ఉన్నారు కాబట్టి, అలాంటి పుస్తకాలను ఇష్టపడనివారు ఈ పుస్తకానికి దూరంగా ఉండొచ్చేమో. #OkaEndakalapuMadhyahnam #OEM #PremaluPusthakaalu @PremaluBooks
తెలుగు
1
1
5
197
ప్రేమలు పుస్తకాలు retweetledi
V Mallikarjun
V Mallikarjun@insidemalli·
'ఒక ఎండాకాలపు మధ్యాహ్నం' నవల బయటికొచ్చి అప్పుడే మూడు నెలలైంది. ఇప్పుడెలాగూ ఎండాకాలం కూడా వచ్చేసింది కాబట్టి ఇంకా పుస్తకం చదవకపోయి ఉంటే ఇదే సరైన కాలం. 🙈 నాకెంతో ఇష్టమైన కవి వసీరా గారు ఈ పుస్తకం చదివి రాసిన రివ్యూ ఇక్కడ పోస్ట్ చేస్తున్నా - *** ఎండాకాలపు వెన్నెల సెగలు చీకటి పొగలు తాపం కోపం పశ్చాత్తాపం గతాను గతాల భాష్పవిలాపం.. ఒక మిథ్యాకాలం మోహపు సెగలు కక్కే ఎండలో.. రెండు బండల మధ్య దూర్చిన తల.. ముందుకు పోలేక వెనక్కి రాలేకా, అసలు అవతల దారుందో లేదో తెలియక.. ఒక తీపి అనుభవానికి చేదుకలల మీద మెరిసే ఒక ఎండాకాలపు మధ్యాహ్న ముహూర్తం కోసం అన్వేషణ.. ఒకానొక ఎండాకాలం మధ్యాహ్నం నిశ్శబ్దంలో దేనికోసం ఏడ్చాడో ఏమి మూటగట్టాడో. ఏ ఆకులు రాలే కాలం చూస్తూ రంగుల లోయలోకి ఏమి విసిరాడో. ఈ మల్లికార్జున్‌తో ఇదే గొడవ. మొదటి పేజీ చదివారో ఇగ అంతే. చివరిదాకా లాక్కుపోతాడు. ఒక్కోచోట నిదానంగా. ఒక్కో చోట పిల్లగాలిలా హాయిగా. వస్తాదులా ఒక్కోసారి పట్టు బిగిస్తాడు. ఒక్కోసారి వదులు చేస్తాడు. ఒక్కోసారి ఉపకథలతోనో పీడకలలతోనూ మనుషుల లోతుల్లోని గజిబిజి గీతల్లోకి తీసుకెళ్తాడు. అక్కడి అధివాస్తవిక దృశ్యాలతో గాయాల లోతు చెప్తాడు. మధ్యాహ్న దాహాల అంతులేనితనాన్ని విలపిస్తాడు. లోపలి బొమ్మలతో బయటి బొమ్మల్ని ఆడిస్తాడు గమ్మత్తుగా. సీనులూ సంభాషణలూ ఒక దానితో ఒకటి పోటీ పడతాయి. ట్విస్టులు ఇస్తాడు. కానీ అవి మన సినిమాల్లో మాదిరి, అత్యంత అతి నాటకీయంగా ఉండవు. అంత అతిచేసి పాఠకుణ్ణి ఆకట్టుకోవాల్సిన ఖర్మ నాకు లేదనుకుంటాడు. గర్ల్‌ఫ్రెండ్సూ బాయ్‌ఫ్రెండ్సూ రిలేషన్‌షిప్పులూ బ్రేకప్పులూ, బీచ్‌లు, బెడ్ రూమ్‌లు, కాఫీ ఆవిర్లతో కలిసి తిరిగే ఉన్మత్త భావోద్వేగాలు.. జ్ఞాపకాలు.. ఇలా చాలా చాలానే ఎలిమెంట్స్ ఉన్నాయి. కమర్షియల్‌గా ఎంతయినా కుమ్మేసుకోవచ్చు. అర్జున్ రెడ్డినీ, గర్ల్ ఫ్రెండునీ మించిపోవచ్చు. వాళ్లకి మనోవాల్మీకాల్లోకి వెళ్లే దమ్మెక్కడిది? ఇతడు సాహసి. మనో ప్రపంచం లోతుల్లో పరావర్తనాల్లోకి తొంగిచూసే మల్లికార్జున్ తనదైన సొంత ముద్రకి నిబద్ధుడు. అతగాడి టచ్చే వేరు. ఒక్క స్పర్శలోనే మాటలకందని ఆర్తిని ఒంపగలడు. ఒక్క గెశ్చర్లో ఒంటరితనపు వేదనను స్ఫురింపజేయగలడు. ఒంటరితనపు బీభత్సాన్నీ ప్రేమార్తినీ ఒకే దెబ్బకి రెండు పిట్టల్లా పడగొట్టగలడు. మల్లికార్జున్ కలల్నీ మనుషుల్నీ విడదీసి చూడలేడు.. ఈ కలగాపులగంలోనే మనిషిలోపలి విలయాన్ని సూచించగలడు. ‘ఒక ఎండాకాలపు మధ్యాహ్నం’లో పాఠకుడిని ఆకట్టుకునే సామగ్రి అంతా ఉంది. కాకపోతే కేవలం ఆకట్టుకోడానికి కాదు. బొమ్మల లోపలి బొమ్మలు చూపించడానికి. ఒక దృశ్యం ఒక్క గాయాన్ని చెప్పదు. అనేక గాయాల మూట విప్పుతుంది. (అవి తాను చేసినవీ తనకు తాను చేసుకున్నవీ కూడా కావచ్చు). ఆ మూటలోనే ప్రేమలుంటాయి. పుస్తకాలుంటాయి. కాఫీ ఆవిర్లని మించిన కోరికల సెగలుంటాయి. కథలో ట్విస్టులు జస్ట్ అలా రోడ్ కర్వ్‌లా వయ్యారి నడుం ఒంపులా సహజంగా జీవితానికి దగ్గరగా ఉంటాయి. Steamy scenes చదివితే వృద్ధులక్కూడా అయ్యో ఇంకోసారి యవ్వనం రాదా అనిపిస్తుంది. సీన్లు ఎగశ్వాసలతో సెగలు కక్కినా కూడా సహజంగానే ఉంటుంది. చిలిపితనం సీరియస్సై ఇందులోని మనుషులు కళ్లనీళ్లు పెట్టుకుంటారు. ఇట్టే మర్చిపోయి నవ్వుకుంటారు. మరువలేక చావాలనుకుంటారు. చావలేక ఏడుస్తారు. ఏడవలేక నవ్వుతారు. ఒక్కమనిషిలోనే వారికే అనేక ముఖాల అపరిచితులుంటారు. మనుషుల మనోభావాలు ప్రకృతి అందాలతో కలిసి ఉంటాయి. చాలా మామూలు సంభాషణల్లోనే మనుషుల మధ్య సంబంధాలు ముందుకీ వెనక్కీ జరుగుతూ ఉంటాయి. కథని తమతో పాటు ముందుకు తీసుకెళ్తాయి. కేవలం మనుషుల్ని బొమ్మకట్టడంతో ఊరుకోడు. వారి మనుసుల్లోని బొమ్మలాట ఇతగాడి నవల్లో అసలు కథ. పీడకలలు అనేక కథలు చెప్తాయి. ఉపకథలు అసలు కథలో మనుషుల మనోభావాలతో మిళితమైపోతాయి. (1/2)
V Mallikarjun tweet media
తెలుగు
1
4
30
1.9K
ప్రేమలు పుస్తకాలు retweetledi
V Mallikarjun
V Mallikarjun@insidemalli·
'ఒక ఎండాకాలపు మధ్యాహ్నం' నవల బయటికొచ్చి అప్పుడే మూడు నెలలైంది 💙 Dear OEM fans, let's meet for a chai sometime soon 🤗 @PremaluBooks
V Mallikarjun@insidemalli

పోయినేడాది నాన్న చనిపోయినప్పుడు నేనిక్కడ హైదరాబాద్‌లో ఊపిరి సలపని పని వల్ల అమ్మతో మూడు నాలుగు రోజులు కూడా ఉండలేకపోయా. ఆ తరువాతి ఆరు నెలలూ అలాగే గడిచింది. మార్చిలో అజు పబ్లికేషన్స్ నుంచి బయటికొచ్చేసాక కొన్ని నెలలు అమ్మతో ఉందామని ఇంటికెళ్ళిపోయా. అప్పటికి అమ్మ యాభై ఏళ్ళు కలిసి ఉన్న మనిషి వదిలేసి వెళ్ళిన ఖాళీతనంలో బతుకుతోంది. నేనూ అమ్మ కలిసి ఆమెకు నచ్చే సీరియల్స్ చూస్తూ, నచ్చింది చేసుకొని తింటూ ఉన్నాం. నా ఎగ్జిట్ ఏవేవో కాంప్లికేషన్స్‌తో నెలలకు నెలలు సాగుతుంటే, ఏం చెయ్యాలో తోచకుండా ఉన్న రోజుల్లో అమ్మతో ఉన్నానన్న ఆలోచనొక్కటే హాయి. అలాగే ఈ పుస్తకమొకటి రాస్తూ ఉండటం కూడా. నేను ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తుంటే, ఏమాలిచిస్తున్నవురా అని అడిగేది అమ్మ. ఈ పుస్తకం గురించి అని చెప్పేవాడ్ని. ఇప్పుడీ పుస్తకం రాస్తున్న ఆలోచన దూరమవ్వడం కూడా బాధే. నేనిది రాసి ఇలా పుస్తకంగా బయటికి రావడం కంటే రాయడాన్నే ఎక్కువ ఆనందించానేమో అని ఇప్పుడనిపిస్తోంది. గత ఏడాదిన్నరగా నేనూ అమ్మా చాలా చూసొచ్చి ఇప్పుడు అమ్మ చేతుల మీదుగానే ఈ పుస్తకాన్ని ఆవిష్కరించుకోవడం ఒకరకంగా ఇద్దరికీ విజయమే. ఎంతో నిజాయితీగా ఎంతో ఇష్టంగా ఎంతో ప్రేమగా ఈ పుస్తకాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నా. చదివి ఏం చెప్తారోనని ఎదురుచూస్తుంటా. మీకు నా ప్రేమ. 💙 Oka Endakalapu Madhyahnam is all yours now 🤗

0
1
18
861