V Mallikarjun

14.1K posts

V Mallikarjun banner
V Mallikarjun

V Mallikarjun

@insidemalli

Author. #IraniCafe | #KagitamPadavalu | #NallagondaKathalu | #Nanigadu | #OkaEndakalapuMadhyahnam | Team @PremaluBooks

Hyderabad, India. Katılım Mart 2015
611 Takip Edilen8.2K Takipçiler
Sabitlenmiş Tweet
V Mallikarjun
V Mallikarjun@insidemalli·
పోయినేడాది నాన్న చనిపోయినప్పుడు నేనిక్కడ హైదరాబాద్‌లో ఊపిరి సలపని పని వల్ల అమ్మతో మూడు నాలుగు రోజులు కూడా ఉండలేకపోయా. ఆ తరువాతి ఆరు నెలలూ అలాగే గడిచింది. మార్చిలో అజు పబ్లికేషన్స్ నుంచి బయటికొచ్చేసాక కొన్ని నెలలు అమ్మతో ఉందామని ఇంటికెళ్ళిపోయా. అప్పటికి అమ్మ యాభై ఏళ్ళు కలిసి ఉన్న మనిషి వదిలేసి వెళ్ళిన ఖాళీతనంలో బతుకుతోంది. నేనూ అమ్మ కలిసి ఆమెకు నచ్చే సీరియల్స్ చూస్తూ, నచ్చింది చేసుకొని తింటూ ఉన్నాం. నా ఎగ్జిట్ ఏవేవో కాంప్లికేషన్స్‌తో నెలలకు నెలలు సాగుతుంటే, ఏం చెయ్యాలో తోచకుండా ఉన్న రోజుల్లో అమ్మతో ఉన్నానన్న ఆలోచనొక్కటే హాయి. అలాగే ఈ పుస్తకమొకటి రాస్తూ ఉండటం కూడా. నేను ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తుంటే, ఏమాలిచిస్తున్నవురా అని అడిగేది అమ్మ. ఈ పుస్తకం గురించి అని చెప్పేవాడ్ని. ఇప్పుడీ పుస్తకం రాస్తున్న ఆలోచన దూరమవ్వడం కూడా బాధే. నేనిది రాసి ఇలా పుస్తకంగా బయటికి రావడం కంటే రాయడాన్నే ఎక్కువ ఆనందించానేమో అని ఇప్పుడనిపిస్తోంది. గత ఏడాదిన్నరగా నేనూ అమ్మా చాలా చూసొచ్చి ఇప్పుడు అమ్మ చేతుల మీదుగానే ఈ పుస్తకాన్ని ఆవిష్కరించుకోవడం ఒకరకంగా ఇద్దరికీ విజయమే. ఎంతో నిజాయితీగా ఎంతో ఇష్టంగా ఎంతో ప్రేమగా ఈ పుస్తకాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నా. చదివి ఏం చెప్తారోనని ఎదురుచూస్తుంటా. మీకు నా ప్రేమ. 💙 Oka Endakalapu Madhyahnam is all yours now 🤗
V Mallikarjun tweet media
తెలుగు
40
42
413
21.8K
V Mallikarjun
V Mallikarjun@insidemalli·
నేను రాసిన పుస్తకాల పేర్లు తెలుసా అనడిగితే అమ్మ ఏమంటున్నదో చూడండి! 😄💙 @PremaluBooks
తెలుగు
1
2
32
731
V Mallikarjun retweetledi
పవన్ సంతోష్ (Pavan Santhosh)
Our own Singeetam Srinivasa Rao (@RaoSingeetham) has broken Clint Eastwood's record and stands as the world's most elderly active director. Clint Eastwood directed his latest film, Juror #2, starting at the age of 93 years and 1 month, and it was released when he was 94 years and 5 months old. However, Singeetam Srinivasa Rao (born September 21, 1931) is currently directing his ambitious musical fantasy, Sing Geetham, at the age of 94 years and 7 months. With this feat, he surpasses Eastwood to become the oldest active filmmaker in the world currently leading a major production.
పవన్ సంతోష్ (Pavan Santhosh) tweet media
English
10
166
1.6K
60.9K
V Mallikarjun
V Mallikarjun@insidemalli·
అతనూ ఆమె కలిసి తిరిగిన కుతుబ్‌షాహీ టూంబ్స్ ఒకసారి చూసొద్దామని.. ఇలా.. 💙 Oka Endakalapu Madhyahnam featuring Qutub Shahi Tombs. 🤗 @PremaluBooks
0
3
22
645
V Mallikarjun
V Mallikarjun@insidemalli·
@Telangana0902 @sm_gouse ఇంతకుముందు జాబ్ చేసేవాడ్ని. ఇప్పుడు ఫుల్ టైం రైటింగ్, పబ్లిషింగ్. ఫ్రీలాన్సర్ గా కూడా పనిచేస్తుంటా 🤗
తెలుగు
1
0
2
18
Telanganite
Telanganite@Telangana0902·
@insidemalli @sm_gouse అన్నా.. సందర్భం కాబట్టీ అడుగుతున్న out of curiosity - what do you do for living?? Job చేస్తున్నవా or any business??
1
0
1
25
V Mallikarjun
V Mallikarjun@insidemalli·
నాకు మేడే అంటే నాన్నే. ఎప్పుడెప్పుడు మేడే వస్తది, ఎప్పుడెప్పుడు ఎర్రంగి తొడగాలి అని చూసేటోడు. పని తప్ప ఇంకొకటి తెల్వని మనిషి. ఊకే కూసుంటే ఏమొస్తది అనేటోడు. కార్మిక శక్తిని నిండా నింపుకున్న మనిషి. పుట్టినరోజు తెల్వదు గానీ, మేడే అంటే ఆయనకు పుట్టినరోజే.
V Mallikarjun@insidemalli

ఊహ తెలిసినప్పట్నించి పని తప్ప ఇంకొకటి తెల్వని మనిషి. మొన్న ఆపరేషన్ అయి జెర నిమ్మలం కాంగనే - "పనికి పోత ఏంది?" అని అడిగిండు. మా నాన్న. మే 1 వచ్చిందంటే ఎర్రంగి తొడగాల్సిందేనంటడు. ❤️

తెలుగు
4
8
155
4.2K
V Mallikarjun
V Mallikarjun@insidemalli·
@santhoo9 ఆ పిల్లవాడు పవన్ సంతోష్ అయ్యాడు 🤗
తెలుగు
0
0
3
231
పవన్ సంతోష్ (Pavan Santhosh)
చందమామ స్థానం అన్నిటికన్నా టాప్. వెనుక బాలమిత్ర, బాలజ్యోతి, బుజ్జాయి, బొమ్మరిల్లు వగైరా సవాలక్ష ఉండేవి 90s లో. ఒక్కోసారి నెలకి నాలుగైదు పత్రికలు కొనిపెట్టేదాక మా తాతయ్య గారికి మనశ్శాంతి ఉండనిచ్చేవాడిని కాదు.
పుస్తక సంచారి@abidsbooks

అప్పట్లో చందమామకు పోటీ అనుకుంటా ఈ బాలమిత్ర.

తెలుగు
8
6
66
2.1K
V Mallikarjun retweetledi
Rajesh Manne
Rajesh Manne@rajeshmanne1·
Upcoming film makers కి సింగీతం గారు చెప్పిన గొప్ప సలహా 👌 Have your convictions !!
19
374
2.9K
115.3K
V Mallikarjun
V Mallikarjun@insidemalli·
@vizagobelix అన్నయ్యా, పుట్టినరోజు శుభాకాంక్షలు. 💙 ముందైతే ఆ పుస్తకం రాసెయ్యండి. ఎన్నికల సమయానికి మళ్లీ బిజీ అయిపోతారు 😊
V Mallikarjun@insidemalli

@vizagobelix పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్యా. పుస్తకం రాయడం మొదలుపెట్టారా లేదా! 🤗

తెలుగు
1
0
5
320
V Mallikarjun
V Mallikarjun@insidemalli·
ఎవరైనా ఉద్యోగ విరమణ పొందుతున్నప్పుడు, "ఇంక మీకు నచ్చినట్టుగా, మీరేమేం చెయ్యాలనుకుంటున్నారో అవి చెయ్యండి. ప్రశాంతంగా ఉండండి," అని శుభాకాంక్షలు తెలియజేస్తాం కదా - అయితే శంకర్ సర్ అప్పటివరకు చేసింది కూడా నచ్చిన పనే కదా! సాక్షిలో ఆయన ఉద్యోగ విరమణ పొందారని తెలిసినప్పుడు, "మీరు ముందుకంటే ఇప్పుడే ఇంక ఎవ్వరికీ దొరకనంత బిజీ అయిపోతారేమో," అన్నాను. ఎందుకంటే ఆయన చెయ్యాలనుకున్న పనులు అన్ని ఉన్నాయి. ఒక ఆర్టిస్ట్‌గా అప్పటివరకు గీసుకున్న బౌండరీలన్నింటినీ పుష్ చేసి ఎంత దూరమైనా ఎగిరేంత ఉత్సాహంలో ఉన్నారాయన. రిటైర్మెంట్ తర్వాత వరుస ఆర్ట్ ఎగ్జిబిషన్లతో దేశమంతా తిరిగేస్తున్నారు. ఆ కోవలోనే ఇదిగో ఇప్పుడీ పుస్తకం - MAHATMA, illustrated. గాంధీజిని తల్చుకోవడమంటే, శంకర్ సర్‌కు ఇష్టంగా ప్రేమగా ఆయన క్యారికేచర్లు గీయడం. ఈ ఆర్ట్ బుక్ నిండా ఉన్న గాంధీ క్యారికేచర్లు ఆయన ఆదర్శాల్నీ జీవితాన్నీ తీసుకొచ్చి మనముందు పెడతాయి. పుస్తకంలోని బొమ్మలనిండా గాంధీ మీద ప్రేమ కనిపిస్తుంది. గాంధీని తల్చుకోవడం అత్యవసరమైన ఈ రోజుల్లోనే ఇలాంటిదొక పుస్తకం రావడం ఇంకా సంతోషం. This is one of the greatest tributes to Mahatma Gandhi. Congratulations on the launch of this book, Shankar sir. Beautifully designed and published by @hydart_gallery Order your copy here: hyd.art/product-page/m…
V Mallikarjun tweet mediaV Mallikarjun tweet mediaV Mallikarjun tweet mediaV Mallikarjun tweet media
తెలుగు
1
6
66
3.7K
V Mallikarjun
V Mallikarjun@insidemalli·
@EliteHumansTelu అవునండీ. ఎవరనుకుంటున్నారు? 😊
తెలుగు
1
0
1
829
sinna bob
sinna bob@EliteHumansTelu·
@insidemalli అన్న మీరు v మల్లికార్జున్ కదా
తెలుగు
1
0
1
882
V Mallikarjun
V Mallikarjun@insidemalli·
ఈఎంఐ లేదు, నెలకి రెండు మూడు లక్షలు ఖర్చు చేస్తున్నవంటే నువ్వు సామాన్యుడివి ఎట్లయితవన్నా?
Srinivas@sriniksv

హౌజ్ ఈ ఎం ఐ /రెంట్ లేకుండా నెలకు 2-3 లచ్చలు ఖర్చులు అవుతున్నాయి .. సామాన్య మానవుడి బతుకుబండి సాగించటం కష్టమే.

తెలుగు
13
8
163
18.1K
V Mallikarjun
V Mallikarjun@insidemalli·
@jaipalpuli "చదువుకునే పిల్లలకు కాస్త కడుపు కాలాలి" అని స్టేట్మెంట్ ఇస్తాడు. ఈయనేమో నెలకి రెండు మూడు లక్షలు ఖర్చు చేస్తాడు 🙏🏼
తెలుగు
2
6
71
4.5K
V Mallikarjun retweetledi
పుస్తక సంచారి
ఈ ఫోటోలో పాప పేరు కావ్య శ్రీ (8 సంవత్సరాలు). ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన లౌడ్య వాగ - స్వాతి దంపతుల కుమార్తె . ఈ నెల 13న తన అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర డాబా మీద ఆడుకుంటూ ఉండగా హైటెన్షన్ విద్యుత్ తీగలు తగిలాయి. పాపకు తీవ్ర గాయాలయ్యాయి. రెండు చేతులు, రెండు కాళ్ళకు సర్జరీలు చేయాల్సి వచ్చింది. రెండు కాళ్లలో ప్లేట్స్ వేశారు. రెండు అరచేతుల్లో కొంత భాగాన్ని తొలగించారు. ఇంకా ప్లాస్టిక్ సర్జరీలు చేయాల్సి ఉంది. వ్యవసాయమే పాప తల్లిదండ్రుల జీవనాధారం. ప్రస్తుతం తను హన్మకొండలోని అమృత చిల్డ్రన్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. ఈ పాప గురించి మా ఫ్రెండ్ చెప్పారు. అప్పటి నుంచి మనసు మనసులో లేదు. ఇప్పటికే మిత్రులందరితో కలిసి కొంత సాయం చేశాం. ఇది సరిపోదు. చాలా చేయాలి. ఇందుకోసం మీరంతా కూడా కలిసి వస్తారని ఈ ట్వీట్ చేస్తున్నాను. అన్యధా భావించకండి. మిత్రులారా మీరు ఎంత పంపగలిగితే అంత. ఇది నా నెంబర్.. 8790520517 ఫోన్ పే, గూగుల్ పే చేయగలరు. పాప ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తాను. 🙏🙏🙏🙏🙏
పుస్తక సంచారి tweet mediaపుస్తక సంచారి tweet mediaపుస్తక సంచారి tweet media
తెలుగు
20
354
302
29.1K
V Mallikarjun
V Mallikarjun@insidemalli·
@ChinniThallii @0xMahi.. అదీ మా చిన్ని రేంజ్. గుర్తుంచుకొని నడుచుకో 😊
తెలుగు
0
0
5
197
V Mallikarjun
V Mallikarjun@insidemalli·
మల్లి ముదిరాడు. ‘నల్లగొండ కథలు’ నుంచి ఇదొక లాంగెస్ట్ జంపు. ఆధునిక అస్తిత్వ వాదాన్ని Stream of Consciousness లో చెప్పే ప్రయత్నం చేసాడు. నగర జీవితపు రిలేషన్షిప్పులు బ్రేకప్సుల నడుమ ప్రేమకోసం అలమటించే ఆత్మల హాహాకారం వినిపించాడు. మొదటి అధ్యాయం నాలుగో చాప్టర్లో రేడియో రొమాన్స్ ఒక కల్ట్ బ్లాస్ట్. అలాగే పుస్తకం ఫినిషింగ్ లైన్ అదిరిపోయింది. కొంచెం బ్రెక్ట్, కొంచం కేమూ, కాస్త ఏలియనేషన్ తెలియాలి. లాస్ట్ చాప్టర్ ‘పెడ్రో పరామో’ని గుర్తు చేసింది. కాన్షియస్ ట్రిబ్యూటా? సబ్ కాన్షియస్ ఇన్ఫ్లూయెన్సా. రెండూ కాక సింప్లి యాదృచ్ఛికమా? ఎండాకాలపు వేడిలా అస్తిత్వవేదన యాసిడ్‌లా కాలుస్తుంది. మల్లి సృష్టించిన 'లింబో', మెటాఫర్స్, అబ్సర్డిటీలు మరీ అంత లోతైనవి కాకపోయినా సామాన్య పాఠకులకి కొంచం సంక్లిష్టమే. 'బ్రెహ్టియన్ డిస్టెన్సింగ్'లో చూడగలగాలి. 'ఒక ఎండాకాలపు మధ్యాహ్నం' ఈజ్ నాట్ ఎవరీ రీడర్స్ కప్ ఆఫ్ టీ. మల్లి ముదిరాడు గానీ ఇంకాస్త లేతదనం మిగిల్చుకున్నాడు. - ఆర్. సామల *** సాహిత్యాన్నీ సినిమానీ ఎంతో ప్రేమించే రచయిత రమేశ్ సామల అన్న రాసిన రివ్యూ ఇది. Truly blessed. 🙏🏼 'ఒక ఎండాకాలపు మధ్యాహ్నం' నవల చదివి నాలుగు ప్రేమ మాటలు చెప్తున్న అందరికీ ప్రేమ 💙🤗 The books is available on Amazon and all major book shops: amzn.in/d/0hDBMhT9 @PremaluBooks
V Mallikarjun tweet media
తెలుగు
1
2
15
799
V Mallikarjun
V Mallikarjun@insidemalli·
@bhavyacharu28 @ramadugugowtham @akhila_author వారు ఎలా అడిగారో అలా పోస్ట్ చేశామండి 🤗
V Mallikarjun@insidemalli

@ramadugugowtham @akhila_author కొందరు అప్పటికి ఏ భాషలో ఆలోచిస్తారో అలాగే అడిగేస్తారనుకుంటా అన్నా. తమశ్వి గారు కవయిత్రి, మంచి తెలుగు రాస్తారు 🤗

తెలుగు
2
0
1
31
V Mallikarjun
V Mallikarjun@insidemalli·
"మీ పుస్తకం ఒక ఎండాకాలపు మధ్యాహ్నం చదివేశాను. నాకు కొన్ని ప్రశ్నలున్నాయి, అడగొచ్చా?" అని ఇన్‌స్టాలో మెసేజ్ చేశారు తమశ్వి (@ thatsalliwrite) అనే పాఠకురాలు. "ఓ, తప్పకుండా!" అన్నాన్నేను, ఏవో రెండు ప్రశ్నలు అడుగుతారులే అని. ఆవిడ ఇలా ఏకంగా పది ప్రశ్నలు అడిగారు. నేను ఆ పదింటికీ సమాధానాలు ఇచ్చాను గానీ, ఇక్కడైతే ఆవిడ అనుమతి తీసుకొని ఆ ప్రశ్నలు మాత్రమే పోస్ట్ చేస్తున్నా, పుస్తకం చదివిన మీకేమైనా సమాధానాలు దొరుకుతాయేమో చూడండి! (ఎప్పుడో నా సమాధానాలూ పోస్ట్ చేస్తా.) BTW did you read #OEM? Order your copy from Amazon: bit.ly/OEMbook
V Mallikarjun tweet mediaV Mallikarjun tweet mediaV Mallikarjun tweet mediaV Mallikarjun tweet media
తెలుగు
6
3
17
1.8K
V Mallikarjun
V Mallikarjun@insidemalli·
@ramadugugowtham @akhila_author కొందరు అప్పటికి ఏ భాషలో ఆలోచిస్తారో అలాగే అడిగేస్తారనుకుంటా అన్నా. తమశ్వి గారు కవయిత్రి, మంచి తెలుగు రాస్తారు 🤗
తెలుగు
1
0
0
69