
Suneel NTR🐯🐉🦚
14.5K posts

Suneel NTR🐯🐉🦚
@SiddamSune
@tarak9999 ❤️🥰🥰😍 🔥NTR 🔥 తరువాతే ఎవడు ఐనా...🏌️🏌️





HIS REIGN… HIS SOIL… JUNE 11, 2027… IT IS…. #NTRNeel


Many happy returns of the day to the Honourable Chief Minister of Andhra Pradesh, Sri @NCBN Mavayya garu. Wishing you continued good health, happiness, and the strength to lead and serve our people with the same dedication and vision. May your leadership continue to inspire progress, prosperity, and pride for the state.


#MostHypedMovies - #Jhonny ఊహకు కూడా అందని క్రేజ్ ఇది 🔥🔥🔥 సుస్వాగతం తొలిప్రేమ తమ్ముడు బద్రి ఖుషి...ఒకదాన్ని మించి ఒకటి.... హిట్టు, బ్లాక్ బస్టర్ , కల్ట్ క్లాసిక్ , ఆల్ టైం హిట్ . ఫాన్స్, డై హార్డ్ ఫాన్స్, కల్ట్ ఫాన్స్ ..ఇలా సినిమా సినిమాకి పవన్ కళ్యాణ్ రేంజ్ పెరిగిపోతూనే ఉంది . ఆంధ్ర యూత్ మొత్తం పవన్ నామ స్మరణ చేస్తున్న టైం అది . ఇక పవన్ కి ప్లాప్ అనేదే లేదు అని ఇండస్ట్రీ జనాలు ఫిక్స్ అయిపోయిన సందర్భం . ఖుషి సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ ఎలాంటి సినిమా తీస్తాడని అటు ఇండస్ట్రీతో పాటు ఫాన్స్ , సాధారణ ప్రేక్షకులలో కూడా విపరీతమైన ఆసక్తి ఉండేది. వెంకటేష్ తో పవన్ డైరెక్షన్ లో ఒక సినిమా ఉంటుందని , బాలీవుడ్ డైరెక్టర్ పవన్ డేట్స్ కోసం ట్రై చేస్తున్నాడని ..రకరకాల రూమర్స్ వచ్చాయి. అయితే 2001 సంవత్సరం ముగిసిన పవన్ కళ్యాణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అనేది ప్రకటించలేదు. సంవత్సరానికి ఒక్క సినిమా చేస్తున్న పవన్ నుండి ఫాన్స్ కూడా అంత తొందరగా కొత్త సినిమా అప్ డేట్ ఎక్సపెక్ట్ చేయలేదు . మొత్తానికి 2002 మార్చ్ లో పవన్ కళ్యాణ్ మరియు రేణు దేశాయి హీరో హీరోయిన్లుగా మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో గీత ఆర్ట్స్ బ్యానర్ లో సినిమా ఉండబోతుందని నిర్మాత అల్లు అరవింద్ ఒక ప్రకటన విడుదల చేశారు. అప్పటిదాకా ప్రతి సినిమాలో మార్షల్ ఆర్ట్స్ ,వెరైటీ ఫైట్స్ డిజైన్ చేస్తున్న పవన్ ..ఇప్పుడు ఏకంగా మార్షల్ ఆర్ట్స్ మీదే సినిమా అనేసరికి అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని అంటాయి. పైగా డైరెక్టర్ కూడా పవనే . టైటిల్ జానీ . ఏదో అద్భుతం జరగబోతుంది అంటూ మీడియాలో వార్తలు . దానికి తగ్గట్టు సంవత్సరం గ్యాప్ తీసుకొని తన ఆహార్యాన్ని పూర్తిగా మార్చుకున్నాడు పవన్. హెయిర్ స్టైల్ మార్చేసి సన్నగా మారిపోయాడు . యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ను సంపాదించుకున్న ఆయన మేక్ఓవర్ ఫాన్స్ కి పెద్ద షాక్ . అలాగే సినిమా కోసం లాస్ యంజెల్స్ వెళ్లి కర్రలతో చేసే ఎస్క్రిమా అనే మార్షల్ ఆర్ట్స్ ను , ఐక్యడో అనే విద్యని జపాన్ కు వెళ్లి నేర్చుకొని వచ్చారు. వీటితో పాటు హాలీవుడ్ నటులు కూడా నటిస్తున్నారని మీడియాలో గాసిప్స్ . రమణ గోగుల మ్యూజిక్ డైరెక్టర్ . బద్రి తర్వాత పవన్ రేణు దేశాయ్ కలిసి చేసిన రెండో సినిమా . ఈ సినిమాలో కేవలం హీరోయిన్ గా నటించడమే కాకుండా కాస్ట్యూమ్ డిజైనర్ గా కూడా వర్క్ చేశారు ఆవిడ . చోటాకే నాయుడు , శ్యాం పలావ్ ..ఇద్దరు కెమెరా మ్యాన్స్ . షూటింగ్ స్టార్ట్ అయిన దగ్గరనుండి రోజుకొక న్యూస్...ఫాన్స్ లో నరాలు తెగే సస్పెన్స్ సినిమా ఎప్పుడొస్తుందా అని ? పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో రెండు పాటల్ని కూడా పాడారు. ఇక ఫైట్స్ అయితే న భూతో . ఆ స్టిల్స్ , అప్పుడప్పుడు రిలీజ్ చేసే పోస్టర్స్ ....ఫాన్స్ కి పిచ్చి పట్టించేశాయి . ఇలా అనేక విశేషాలతో 2002 డిసెంబర్ నాటికి షూటింగ్ పూర్తి చేసుకున్న జానీ 2003మార్చ్ లో రిలీజ్ కు సిద్ధమైంది. కానీ అప్పుడు ఇండియా వరల్డ్ కప్ ఫైనల్ దిశగా దూసుకుపోతుంది. దాంతో మూవీని ఏప్రిల్ కి వాయిదా వేశారు . మార్చ్ 23 ఫైనల్ జరగగా మార్చ్ 24న ఆడియో రిలీజ్ చేశారు. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ లో కొత్త చరిత్ర లిఖించింది జానీ . ఇరవై కోట్ల బిజినెస్ చేసి సౌత్ లోనే వన్ అఫ్ ది టాప్ ప్రీ రిలీజ్ బిజినెస్ మూవీ అయింది . బాహుబలి కోసం ఎదురుచూసినట్టు జనాలు ఈ మూవీ కోసం ఆసక్తిగా వెయిట్ చేసారు . అలానే సినిమాలో పవన్ ధరించిన కాస్ట్యూమ్స్ కి ఫుల్ డిమాండ్ ఏర్పడింది . జానీ కర్చీప్స్ , జాన్ బనియన్స్ అంటూ మార్కెట్ లో కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది . అలా తెలుగు సినీ చరిత్రలోనే మొట్టమొదటిసారి 250 ప్రింట్స్ తో 2003 ఏప్రిల్ 25న అత్యంత భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది జానీ . అప్పటికే నరాలు తెగే ఉత్కంఠతో వేచి చూస్తున్న పవన్ ఫాన్స్ ఉదయం నిద్రలేవగానే థియేటర్స్ దగ్గర పడిగాపులు కాయసాగారు . స్టేట్ అంతా జానీ మానియా . ఎక్కడ చూసినా , ఎవర్ని కదిలించినా జానీ గురించే చర్చ. ఏ ఇద్దరు మాట్లాడుకున్నా " జానీ ఎలా ఉంది, పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ఈరోజే గా " ఇవే మాటలు . అయితే సినిమాకెళ్లిన ఫాన్స్ డీలా పడిపోయారు . ఒక్కసారిగా పవన్ నుండి అంత నావెల్టీ ఎవ్వరూ ఎక్సపెక్ట్ చేయలేదు. పైగా స్క్రీన్ ప్లే కన్ఫ్యూజింగ్ గా ఉండటంతో ఏమీ అర్ధం కాలేదు .దీంతో మూవీ ఫ్లాప్ అయింది. అప్పటిదాకా ప్లాప్ చూడని పవన్ ఫాన్స్ ఈ పరాజయాన్ని అస్సలు తట్టుకోలేకపోయారు . చాలా పర్సనల్ గా తీసుకున్నారు .కొంతమంది అయితే తిండి మానేసి బాధపడ్డారు కూడా. సినిమా ఫ్లాప్ అయినా జానీని ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శించారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ స్టంట్స్ మేకింగ్ ను బాలీవుడ్ ప్రముఖులు సైతం మెచ్చుకున్నారు. అప్పటికి కొత్తగా ట్రై చేసి ఫెయిల్ అయ్యాడు పవన్ . ఒకవేళ ఇది హిట్ అయుంటే ఇంకా తన నుండి ఎన్నో ప్రయోగాలు చూసేవాళ్ళం . #PawanKalyan

A global force shaping the now, Mega Power Star Ram Charan (@AlwaysRamCharan) is one of the defining faces of Indian cinema today. We celebrate his journey with our latest cover, where the actor steps into a version of himself like never seen before.















