
Srinivas
543 posts


















₹140 తేడాతో నీట్ పరీక్ష లీక్ అయింది. TCS కోట్ చేసిన ₹311కు బదులు, ₹171కు పని చేస్తామన్న EduQuest సంస్థకు నీట్ నిర్వహణ అప్పగించిన నిర్ణయమే లక్షల మంది విద్యార్థుల జీవితాలను తలకిందులు చేసిన పేపర్ లీక్‌కు మూల కారణమైంది. వ్యవస్థ తప్పు చేయలేదు. వ్యవస్థ నిబంధనల ప్రకారమే నడిచింది. అదే సమస్య. అవినీతిని అరికట్టడానికి తీసుకొచ్చిన L1 విధానం . అంటే అతి తక్కువ ధర కోట్ చేసిన సంస్థకు ఆటోమేటిక్‌గా కాంట్రాక్టు దక్కే పారదర్శక నిబంధన పరీక్ష నిర్వహణలో విషంగా మారింది. అవినీతిని తప్పించాలని పెట్టిన నిబంధనే అసమర్థతను లోపలికి రానిచ్చింది. పదేళ్ల అనుభవం, నిరూపితమైన సాంకేతిక సామర్థ్యం ఉన్న TCS ని పక్కన పెట్టారు . నిబంధనకు అనుగుణంగా, పూర్తి పారదర్శకంగా. అతి తక్కువ ధరకు పని తీసుకున్న సంస్థ భద్రతా వ్యవస్థలపై పెట్టుబడి తగ్గించింది. సైబర్ సెక్యూరిటీలో రాజీ పడింది. సిబ్బంది నాణ్యతలో రాజీ పడింది. పర్యవసానం పేపర్ లీక్. ఇది కేవలం EduQuest వైఫల్యం కాదు ఇది సిస్టమ్ వైఫల్యం. కూరగాయలు, సిమెంట్ కొనడానికి పనికొచ్చే L1 సూత్రాన్ని జాతీయ పరీక్షల నిర్వహణకు వర్తింపజేయడం అజ్ఞానమా, నిర్లక్ష్యమా అనే ప్రశ్న సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వమే. “పారదర్శకత పేరిట పెట్టిన నిబంధనే ఘోర వైఫల్యానికి తెర తీసింది.”







🚨 #BREAKING: “No work from home mandate, no import curbs planned” - Indian government.











